** అజేయ – 18 **
కానీ ఆ లోపే… కింద ఉన్న ఆ నల్లటి కార్ లైట్లు ఆఫ్ అయి, చీకట్లోకి చాలా సైలెంట్‌గా దూసుకెళ్లిపోయింది..
అది చూడటం తో..రాఘవ్ కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. బయట ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందనే విషయం అతని లాజికల్ మైండ్‌కు అర్థమవుతున్నా, అతని కళ్లలోని భయం లేని నైజం మాత్రం తగ్గలేదు.. అతను గ్లాస్ విండో బ్లైండ్స్ క్లోజ్ చేసి, తన జర్నీకి రెడీ అయ్యాడు..
నెక్స్ట్ డే…
సాయంత్రం ఐదు గంటలు. లండన్ నగరంలో సూర్యాస్తమయం అవుతోంది.. ఆకాశం అంతా ఎరుపు రంగులోకి మారిపోయింది, అది చూడటానికి సరిగ్గా రాఘవ్ కలలో కనిపించే ఆ రక్తపాతం లాగే ఉంది..
రాఘవ్ తన రేంజ్ రోవర్ కార్ ని లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్ వైపు చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడు.. అతని పక్క సీట్లో వన్-వే టికెట్ టు ఇండియా బుకింగ్ కాపీ ఉంది..
అండ్ అలాగే అతని మైండ్ లో ప్రొఫెసర్ విలియమ్స్ చెప్పిన ఆఖరి మాటలు ఎకో అవుతున్నాయి..