నిజామా స్వర్ణ అని ఆశ్చర్యంగా అడుగుతున్న దేవయాని గారి వైపు గాజు కళ్ళతో చూస్తుంది…
అది అత్తయ్య అంటున్న స్వర్ణ భుజం ఇంద్ర చేతిలో కంది పోతుంటే నొప్పికి తట్టుకోలేని స్వర్ణ నిజమే అత్తయ్య అని తల దించుకుంటుంది
స్వర్ణ మాటతో తన భుజం మీద నుండి చెయ్యి తీసేస్తాడు ఇంద్ర…
అప్పుడు రఘునాథ్ గారు ఆవేశంగా ఒకరినొకరు ఇష్ట పడితే ఇంట్లో చెప్పాలి కానీ ఇలా నలుగురి కళ్ళల్లో పడేలా పేపర్ కి ఎక్కడం ఏంటి కోపంగా ఇంద్ర ని అడిగారు