New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎదుట నిలిచింది చూడు – 4

ఎదుట నిలిచింది చూడు – 4

లోపల అందంగా మడతపెట్టి ఉంచిన ఒక చీర కనిపించింది. దన్విక క్షణం పాటు ఆ చీరనే చూస్తూ ఉండిపోయింది.ముదురు గులాబీ రంగులో బంగారు జరీ అంచుతో మెరిసిపోతున్న ఆ చీర చూడటానికి ఎంతో అందంగా ఉంది. 

 

దానితో పాటు సరిపోయే బ్లౌజ్, కొన్ని అవసరమైన అలంకరణ వస్తువులు కూడా చక్కగా అమర్చి ఉన్నాయి. 

 

ఆ చీరను చూసిన దన్విక ఆశ్చర్యంగా అగస్త్య వైపు తిరిగింది. ఇది ఇది ఎవరి కోసం సర్ అని అడిగింది. ఆమె ప్రశ్న విన్న అగస్త్య ముఖంలో ఎలాంటి మార్పు కనిపించలేదు….

 

నీ కోసమే,ఇంకెవరి కోసం అనుకున్నావు అని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. నా కోసమా అంటూ దన్విక మరోసారి ఆశ్చర్యంగా అడిగింది. అవును ఈ ఇంట్లో అందరూ నిన్ను నా భార్యగా చూడబోతున్నారు. 

 

అలాంటప్పుడు నువ్వు ఇలా సాధారణ దుస్తుల్లో వాళ్ల ముందుకు వెళ్లడం బాగుండదు. అందుకే నీ కోసం చీర తెప్పించాను.

 

 వెళ్లి ఫ్రెష్ అయి ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు అని చెప్పాడు. దాన్విక ఆ చీరను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue