ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 4
పూర్తిగా కనిపించేలా సెట్ చేసుకున్నాడు… ముఖ్యంగా ప్రాప్తి సీట్ తను ఏంచేస్తున్నా చూడడానికి
ఈ నిఖిల్ గాని పెళ్లి నాచావుకు వచ్చింది ఈ మూడు నెలలు చాలు అగస్త్య నాప్రాణాలు తీయడానికి… అనుకుంటూ పనిలో పడింది ప్రాప్తి.
ఆరోజు బాగానే గడిచింది అనిపించింది అగస్త్య మళ్ళీ తన ముందుకురాలేదు.
ఈ రోజులాగే గడిచి ఈ మూడు నెలలు త్వరగా గడిచిపోతే బాగుండును అనుకుంటూ అగస్త్య ఛాంబర్ కి వెళ్ళింది
ఇంటికి వెళ్లడానికి పర్మిషన్ తీసుకోవడానికి కానీ లక్కీగా అగస్త్య అక్కడ లేడు చెప్పి బయటపడి ఫ్లాట్ కి చేరింది ప్రాప్తి.
కవితమ్మ పాప పడుకుందా??అంటూ లోపలికి వచ్చింది ప్రాప్తి
లేదమ్మా… అల్లరి చేస్తుంది రూమ్ లోకి పెట్టాను బొమ్మలు వేసి అంది…
సరే నేను ఫ్రెష్ వస్తాను రూమ్ లోకి వెళ్ళగానే వెనకనుంచి కాళ్ళను చుట్టేసింది
మా…మీ అంటూ….
బంగారం ఎన్నిసార్లు చెప్పాలి మామి ఫ్రెష్ అయ్యేవరకు….రావద్దు అని ఎత్తుకొని ముద్దులు పెట్టింది…
మామి “కాత్తమి…చాకి ఇచ్చేలే….”అంటుంది సన ముద్దు ముద్దుగా
ఏంటి??? కవితమ్మ నీకు చాక్లెట్ ఇవ్వలేదా…??
అమ్మ్……… అంది సన…
మరి చాక్లెట్ తింటే నీకు కోఫ్ వస్తుంది కదా?? అందుకే ఇవ్వలేదు… అంటుంది
చూశారా రాగానే నాపైన కంప్లైంట్ చేస్తుంది మీ కూతురు అంటుంది కవితమ్మ
దానికి నవ్వుతుంది ప్రాప్తి కవితమ్మకి ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యివస్తుంది…
కవితమ్మ చేసిన ఫుడ్ పాపకి తినిపించి తను తిని కాసేపు పాపతో ఆడుకుంటుంది ప్రాప్తి
ఈ లోపల కవితమ్మ తిని తన పనిచేసుకుని పాపని తీసుకుని పడుకోబెడుతుంది
తన వర్క్ చూసుకుంటూ టైం 8:40 అవ్వడంతో పాపని తీసుకుని బెడ్ పై వాలింది ప్రాప్తి…
రోజంతా బాగానే ఉంటుంది కానీ పడుకునే టైం లోనే గతమంతా…కళ్ళముందు మెదిలి కష్టంకన్నీళ్ళ రూపంలో
బయటికివచ్చి తలకడను తడిపేస్తుంది ఇది రోజు జరిగేది కానీ ఇవాళ… మనసుకి చాలా బాధగా ఉంది…
ఒకప్పటి తనప్రేమ మళ్ళీ కళ్ళ ముందు కనిపించి బాధను పెంచేస్తుంది అనుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకుంది ప్రాప్తి.
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
హాయ్…ఆంటీ గుడ్ మార్నింగ్…. హని ఎక్కడ…?? అడిగాడు సుధీర్…
జిమ్ లో ఉన్నాడు నాన్న అంటుంది విజయ..
ఓకే అంటూ పైకి వెళ్తున్న సుదీర్ ని ఆపి వాడికి నువ్వైనా చెప్పొచ్చు కదా?? నాన్న పెళ్లి చేసుకోమని అంటుంది విజయ
అయ్యో….ఆంటీ వాడికి ఆ మాట చెప్పి చెప్పి నాకు బట్టతలవచ్చేలా ఉంది కానీ వాడుమాత్రం వినట్లేదు..
చివరికి నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటానని కండిషన్ కూడా పెట్టాను
దాంతో ఎప్పటి బ్రహ్మచారిగానే ఉండిపోతావు అంటూ తిరిగి వార్నింగ్ ఇస్తున్నాడు…ఇప్పుడేంచేయాలో?? తెలియట్లేదు!! అన్నాడు సుధీర్…
ఇదంతా ఆ మహాతల్లి వల్ల వచ్చింది దయ్యంలా దాపురించింది మావాడు జీవితంలోకి…
పెళ్లి టైంకు పారిపోయి… తనైతే బాగానే సెటిల్ అయింది కానీ మావాడు మాత్రం అలాగే మిగిలిపోయాడు అంటూ ఏడుస్తుంది విజయ…
ఆంటీ ప్లీజ్ ఏడవకండి ఎప్పుడు ఒకేరోజులు ఉండవు వాడీలో మార్పురావచ్చు కొంచెం టైం తీసుకుందాం అన్నాడు
ఇంకేం టైం నాన్న ఒకటా రెండు ఆరుసంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా ఎన్నేళ్లు వెయిట్ చేయాలి నాన్న అంటుంది….
అప్పుడే రఘురాం వచ్చి ఏమైంది?? ఎందుకు?? ఏడుస్తున్నావు?? విజయ అని అడుగుతాడు తను సైలెంట్ గా ఉండేసరికి
సుధీర్ విషయం చెప్పగానే…. త్వరలోనే వాడికి పెళ్లి జరుగుతుంది నువ్వు బాధపడకు అని నచ్చజెప్పి…
సుధీర్ తో కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడుతాడు ఆ తర్వాత సుధీర్ అగస్త్యను కలవడానికి వెళ్తాడు….
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
ఆరోజు అందరికంటే ముందుగానే ఆఫీస్ కి చేరింది ప్రాప్తి… కొంతమంది ఎంప్లాయిస్ వచ్చారు మరి కొంతమంది వస్తూ కనిపించారు…
ఈ లోపు ప్రాజెక్టు వర్క్ ఎలా వచ్చింది అని మరోసారి ప్రోగ్రెస్ చూసుకుంటుంది.
అప్పుడే సుధీర్ అగస్త్య మాట్లాడుకుంటూ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇస్తారు
సీఈఓ గారిని చూడగానే స్టాప్ మొత్తం అలర్ట్ అయి గుడ్ మార్నింగ్ చెప్తారు
కానీ ప్రాప్తి మాత్రం వర్కులో బిజీ అయి అగస్త్య వచ్చింది చూసుకోదు…
కాసేపు అలాగే చూస్తూ నిలబడతాడు తన పక్కన సుధీర్ కూడా “వామ్మో ఇలా జరిగిందేంటి?? అంటూ ప్రాప్తి వైపు చూస్తూ ఉంటాడు
నెక్స్ట్ ఏం జరుగుతుందో తనకి తెలుసు కాబట్టి ఒక 30 సెకండ్స్ అలాగే చూస్తాడు అగస్త్య కానీ ప్రాప్తి చూసుకోదు
స్టాప్ మొత్తం ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటారు అప్పుడు గట్టిగా అంటాడు….అగస్త్య
“డు యు వర్క్ ప్లీజ్….. అని అగస్త్య గొంతు వినగానే చుట్టుకున్న వెనక్కి తిరిగి అగస్త్య ని చూసి షాక్ అయి లేచి నిల్చుంది సా……..రీ అంటూ…..
అందరినీ చూస్తూ మళ్లీ సారీ అనబోయి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది.. కంగారుపడుతూ ప్రాప్తి.
అంత డీప్ గా ఏం అబ్సర్వ్ చేస్తున్నారు?? సిస్టంలో అని అడుగుతాడు అగస్త్య…
అది….నిన్నటి వరకు జరిగిన ప్రాజెక్టు వర్క్ అంటుంది మెల్లిగా
నిన్న.. వెళ్లేటప్పుడు ప్రోగ్రెస్ చూడలేదా ??అని అడుగుతాడు
చూసాను సార్ బట్ మరొకసారి అనగానే…..
ఓహో……ఎవరో చేసిన వర్క్ అబ్జర్వ్ చేయడానికి 2 టైమ్స్ తీసుకుంటారా?? అంత లేజి మేనేజరా….?? మీరు…..??
మీరే ఇలా ఉంటే?? స్టాప్ ఎలా ఉంటారు ??ఏంటి?? సుధీర్ ఇది? ఎంత ఆన్ రెస్పాన్సిబుల్ మేనేజర్ తో ఎలా?? హౌ ??అని అడుగుతాడు… అగస్త్య
అందరూ ప్రాప్తినే చూస్తూ ఉంటాను తను కావాలని ఇన్సల్ట్ చేస్తున్నాడని అర్థమే సైలెంట్ గా నిలబడుతుంది
వర్క్…అది ఎలాగో కరెక్ట్ గా చేయలేరు అట్లీస్ట్ బాస్ వచ్చినప్పుడు కనీసం గుడ్ మార్నింగ్ చెప్పాలన్న కామన్….. సెన్స్ కూడా లేదు
దీనిబట్టి నీకేం అర్థమైంది ??సుధీర్ అని అడిగాడు అగస్త్య
నిజంగానే…. నాకు ఏమీ అర్థంకావడంలేదు అని మనసులో అనుకుంటూ ఏంటి?? అన్నట్టు చూస్తాడు సుధీర్
ఇంకా..తెలియట్లేదా?? రికమండేడ్ జాబ్.. బంధువులనో… చుట్టాలనో… మొఖం చూసి బొట్టు పెట్టి..… జాబ్ ఇస్తే ఇలాగే ఉంటుంది అంటూ
చేయాల్సినంత ఇన్సల్ట్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాడు ఆగస్త్య… సైలెంట్ గా ఉండిపోతుంది ప్రాప్తి
తనస్టాప్ అందరూ తనని చూసి భయపడతారు
అలాంటిది వారి ముందే
తనని….ఇన్సల్ట్ చేసేసరికి కాసేపు తలఎక్కడ పెట్టుకోవాలో?? తెలియదు.. ప్రాప్తికి
బట్ అన్నిటికీ ఫేస్ చేయాలి అనుకుంటూ డు యు వర్క్ అంటూ చిన్నగా చెప్పి
కాఫీ కౌంటర్ దగ్గరికి వెళ్తుంది ప్రాప్తి కాఫీ కలుపుకోవడానికి…
టూ మినిట్స్ కి “హాయ్”అని వినిపిస్తుంది కాఫీ కలుపుతూ తిరిగి చూస్తే సుధీర్
హాయ్ అంటుంది ప్రాప్తి కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి అది బలవంతపునవ్వు అని సుధీర్ కి అర్థమైంది.
సారీ ఒక్కోసారి మార్నింగ్ మార్నింగ్ మా వాడికి కాస్త మూడ్ ఆఫ్ గా ఉంటుంది
ఇక్కడే వర్క్ చేస్తారు కదా రేపు రేపు మీకే.. తెలుస్తుంది అంటాడు
ఇట్స్ ఓకే సార్… కాఫీ కలిపి ఇవ్వనా?? అంటుంది థాంక్స్…. ఐ విల్ అంటూ కప్పు తనే కాఫీ కలుపుకుంటాడు సుధీర్
యాక్చువల్లీ మావాడికి లేడీస్ అంటే పడదు..అందుకే ఒక లేడిసెక్రెటరీని కూడాపెట్టుకోలేదు
అన్నిటికి నన్నే వాడతాడు ఒకే శాలరీ ఇచ్చి అంటూ నవ్వుతాడు
దానికి ప్రాప్తి చిన్నగా స్మైల్ చేస్తూ కాపీ సిప్ చేసి “మరి ఇంట్లో మేడం తో ఎలా ఉంటారు??మీ సార్??అని అడుగుతుంది
అగస్త్య కు పెళ్లి అయ్యిందో?లేదో? తెలుసుకోవచ్చు అనుకుంటూ …
ఎక్కడ ప్రాప్తి….ఇప్పటివరకు వాడు పెళ్లి చేసుకుంటే కదా….?? అనగానే ప్రాప్తి మనసంతా చేదుతున్నట్టు అయిపోతుంది
ప్రాప్తి ఫేస్ చూసి సారీ… చాలా ఫ్రీగా మాట్లాడుతున్నానా?? నాకు అలాగే కంఫర్ట్ గా ఉంటుంది ప్రాప్తి గారు అన్నాడు
ఇట్స్ ఒకే సుధీర్ గారు నేనేం అనుకోలేదు అంటుంది
మరి మీరు కూడా సుదీర్ అనొచ్చు కదా?మరి…ఈ గారు గిరూ ఎందుకు??అంటూ కప్పు తీసుకొని పక్కనే ఉన్న స్టూల్ పై కూర్చున్నాడు
ఓకె…సుధీర్ చెప్పండి అంటుంది నవ్వుతూ..
మా వాడికి చాలా సంబంధాలు చూస్తున్నాం కానీ ఒప్పుకోవట్లేదు అన్నాడు
అవునా?? ఎందుకని అలాగా?? అంటుంది నేల చూపులు చూస్తూ ప్రాప్తి
ఒక అమ్మాయినీ ప్రేమించాడంట పెళ్లివరకు కూడా వచ్చింది ఆ టైంలో నేను యుఎస్ లో ఉన్నాను
ఎందుకో??తెలియదు పెళ్లి ఆగిపోయింది దాంతో చాలా హర్ట్ అయ్యాడు అన్నాడు ప్రాప్తిని గమనిస్తూ..
హట్టవ్వడం దేనికి ఆ అమ్మాయికి ఆయన విలువ తెలియక వెళ్లిపోయినట్టుంది….
ఒక మంచిఅమ్మాయిని చూసి పెళ్లిచేసుకొని ఉంటే తగిన జవాబు చెప్పేవాడు కదా…?? అంటుంది ఒక్కో మాట మెల్లిమెల్లిగా…
నేను చాలాసార్లు చెప్పాము అండి కానీ ఎందుకో?? తెలియదు ఆ అమ్మాయిని ఒక మాట కూడా అన్ననివ్వడు….
ఇంకా వాడిమనసులోనే ఉంది కదా? ఆ అమ్మాయి అంటూ మరోసారి డీప్ గా గమనిస్తాడు ప్రాప్తిని
గ్యారెంటీగా ప్రాప్తి కలల్లో వాటర్ వచ్చేసాయి ఫస్ట్ డే ని ఇంతలా ఏడిపించడం ఎందుకు??అనుకుంటూ
ఓకే ప్రాప్తి మళ్లీ మా సింహం గర్జిస్తుంది వెళ్తాను అంటుకప్పు తీసుకొని వెళ్ళిపోతాడు… సుధీర్.
అగస్త్య ఇంకా పెళ్లి చేసుకోలేదా?? నేను చేసిన తప్పుకు అతను కూడా శిక్ష అనుభవిస్తున్నాడా…??
అని ఆలోచనలో ఉండగా TL తనని పిలుస్తాడు ఇక ఇలా ఆలోచిస్తూనే వర్క్ లో పడిపోతుంది ప్రాప్తి.
ఏంట్రా?? మరీ అంత టార్చర్ చేస్తున్నావ్?? ఆ అమ్మాయిని అడిగాడు సుధీర్ కాఫీ కప్పు అందిస్తూ…
ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా పూర్తి సినిమా మిగిలే ఉంది… అయినా నీకెందుకు?? అంత సింపతి… అంటాడు కోపంగా అగస్త్య…
కాదురా ఎంతైనా ఆడపిల్ల ఏడ్చినట్టుగా ఉంది తన ఫేస్.…….పైగా నీగురించి అడిగింది కూడా…
ఆ……హా ఏమడిగింది? నేనుఎలా?బాధపడుతున్నానో? ఎలా నాశనం అవుతున్నానో….??అడిగిందా…?? అన్నాడు అగస్త్య…
చ…చ అలా అడగలేదు నీకు మ్యారేజ్ అయిందా?? అని అడిగింది
ఏ?? ఎందుకు?? అలా చేసుకుంటే ఆ అమ్మాయిని కూడా పారిపోమని ఎంకరేజ్ చేస్తుందా?? అన్నాడు
ఎందుకురా?? అంత నెగటివ్ గా చూస్తావు?? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో……??
నువ్వు నోరు మూసుకో సుధీర్…నా ప్రేమ పెళ్లి మ్యాటర్ జరిగినప్పుడు నువ్వు ఇక్కడలేవు…. నమ్మించి మోసంచేసింది నన్ను…
పైకి ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది అని ఈజీగా నమ్మేస్తాము కానీ
తను అంతా ఇన్నోసెంట్ ఏంకాదు అనుభవంతో చెప్తున్నాను… అన్నాడు అగస్త్య దాంతో సైలెంట్ అయిపోయాడు సుదీర్
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
Swipe left/right or tap the sides to turn pages