మరి ఒకసారి అన్నయ్యతో మాట్లాడానా?? అంటుంది మౌనిక
వద్దే ఆల్రెడీ వాడు ఏడుస్తూనే ఉన్నాడు ప్రాజెక్టు చేతికొచ్చినప్పటినుంచి నా కాళ్లు మొక్కేది ఒకటే తక్కువ
ఇంకా ఇప్పుడు నేను ఆఫీస్ లో ఈ వర్క్ చేయను అంటే.. వాడు గ్యారెంటీగా సూసైడ్ చేసుకుంటాడు
అని నవ్వుతుంది ప్రాప్తి ఏడవలేక…
మొత్తానికి మా అన్నయ్య గురించి బాగా తెలిసిందన్నమాట అంటూ నవ్వింది మౌనిక…
అంతలో అసిస్టెంట్ వచ్చి మేడం అగస్త్య సార్ మీకు కాఫీ తీసుకురమ్మన్నాడు అని చెప్తాడు…
ఓకే అని చూశావా??అంటుంది ఫోన్లో
ఆ…చూడలేదు కానీ వింటున్న… కాస్త ఓపిక పట్టు నా వర్క్ అయిపోగానే
నేనువచ్చి అతని చూసుకుంటాను కానీ… ఏ మాట కా మాట చెప్పుకోవాలి నువ్వు బాగా నచ్చినట్టు ఉన్నావే..??.
ఏ మోని నాకు పాప ఉందే కోపంగా అంటుంది ప్రాప్తి
ఆ…ఉంటే నిన్ను చూస్తే అలా అనిపిస్తుందా…??ఆ ఫిగర్ ఏంటే??తల్లి….నువ్వు ఒక పాపకి తల్లివంటే నేనే నమ్మను!! అతనిలా అనుకుంటాడు??
అతనికి తెలుసు నాకు పాప ఉందని అరుస్తుంది ప్రాప్తి
అయినా సరే అతడు నీకే అట్రాక్ట్ అవుతున్నాడేమో? అందుకే నీనుంచి ఫోకస్ తగ్గడానికి ఇలా ఇరిటేట్ చేస్తున్నాడేమో?? తన మనసు మార్చుకోవడానికి