కారులో కూర్చున్న సహస్ర కిటికీ బయట చూస్తూ ఉంది.ఆమె ముఖంలో ఎప్పటిలా భయం లేదు.ఆమె చేతిలో కాన్ఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి.మనసులో ఒక కొత్త కల ఉంది.ఆ కలని నమ్మేలా చేసిన ఒక మనిషి ఉన్నాడు..ఆ ప్రశ్నకి సమాధానం వెతకడం మొదలుపెట్టింది….. సమాధానం మరి ఎప్పటికీ తెలుసుకుంటుందో ఏంటో???
నెక్స్ట్ డే….
ఉదయం….
సహస్ర కాలేజ్‌కి రావడానికి ముందే కాన్ఫరెన్స్‌కి సంబంధించిన పుస్తకాలు, నోట్స్ అన్నీ బ్యాగ్‌లో సర్దుకుంది. మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ, “ఈరోజు అసలు భయపడకూడదు.” అని తనకి తానే చెప్పుకుంది. తర్వాత చిన్నగా నవ్వుకుని, “మాస్టారు ఏం అంటారో చూద్దాం.” అని అనుకుంది. అలా అనుకున్న వెంటనే ఆమె పెదవులపై తెలియకుండానే నవ్వు వచ్చింది.
కాలేజ్‌కి వచ్చిన సహస్ర నేరుగా సెమినార్ హాల్‌కి వెళ్లింది. అప్పటికే అక్కడ మిగతా స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సహస్రని చూసిన నిహారిక, “ఏంటే…. ఈరోజు చాలా సీరియస్‌గా ఉన్నావ్?” అని అడిగింది. దానికి సహస్ర, “ప్రిపేర్ అవుతున్నాను.” అంది. “అంతగా?” అని నిహారిక అడగడంతో, “అవును.” అని చెప్పింది….
నిహారిక ఆమె వైపు చూసి నవ్వుతూ, “అర్థమైంది.” అనడంతో సహస్ర కనుబొమ్మలు పైకెత్తి, “ఏం అర్థమైంది?” అని అడిగింది. “ఏవండోయ్ మాస్టారు మెచ్చుకోవాలి కదా.” అని నిహారిక అనగానే సహస్ర, “నువ్వు మారవు.” అని చెప్పి నవ్వుకుంది.