దశరథ్ పటేల్ కి ఎదురుగా కనిపించిన శౌర్య నవ్వుతూ అతని తలకి గురి పెడుతూ.. “మర్యాదగా కిందకి దిగిరా..” అని అన్నాడు.
అసలు ఇది అంతా ఎక్స్పెక్ట్ చేయని దశరథ్ పటేల్ తేరుకునే సమయం కూడా ఇవ్వకుండా చేస్తున్న పోలీసులని భయంగా చూస్తూ చేతులు రెండు పైకి ఎత్తి నెమ్మదిగా సజ్జ మీద నుంచి కిందకి దిగి వచ్చి నిలబడ్డాడు.
దశరథ్ పటేల్ నోటికి ప్లాస్టర్ వేసి,తల మీద బ్లాక్ కలర్ గుడ్డ కప్పి రెండు చేతులకి సంకెళ్లు వేసి అక్కడ నుంచి లాక్కుపోయాడు శౌర్య అతని వెనక ఉన్న సిబ్బంది సహకారంతో.
పోలీస్ సిబ్బంది మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో మీడియా ఇది అంత కవర్ చేయలేకపోయింది,అసలు మీడియా వస్తే ఇది బయటకి లీక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పలేదు,శౌర్య చెప్పనివ్వలేదు కూడా.