New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
తనువులు కలిసిన శుభవేళ – 2

తనువులు కలిసిన శుభవేళ – 2

మరుసటి రోజు ఉదయం శ్రీరామ్ కన్నా ముందే మెలుకువ వచ్చిన మైథిలీ కి… శ్రీ రామ్ మత్తుగా తన వైపు తిరిగి పడుకోవడం చూసి బాధగా…”నువ్వు చేసిన దానికి చేస్తున్న దానికి కచ్చితంగా ఏదొక రోజు రిగ్రేట్ ఫీల్ అవుతావ్ రామ్..కానీ అప్పుడు నేను మాత్రం నేను నీతో ఉండను…నువ్వు నిజాలు తెలుసుకునే వరకే నీతో ఉంటాను…!!”….అని అనుకుంటూ….

 

 

శ్రీరామ్ వైపు చూసి..”ఒక ఆడపిల్ల గా నాకు నిన్న నువ్వు చేసిన దానికి మనసు చచ్చిపోయింది…అంత హీనంగా ఎలా ఆలోచించావ్ రామ్…!!”అని అనుకుని అక్కడి నుండి లెగిసి చీర నీ సరిగ్గా కట్టుకుని…జుట్టు సరిజేసుకుని బయటకి వెళ్తుంది…

 

రూమ్ డోర్ చప్పుడు వినపడి..హాల్ లో ఉన్న ఆవిడ కూతురి నీ చూసి పైకి వెళ్తే… మైథిలీ ఆవిడ వైపు చూసేసరికి…

 

 

మాధవి గారు కూతురి గడ్డం మీద చెయ్యి వేసి..”అమ్మ..!!”అని అనేలోపు…మైథిలీ మాత్రం కోపంగా తన తల్లి తో కూడా మాట్లాడక పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకి వస్తుంది…

 

కోడల్ని చూసిన “జానకి గారు” మాట్లాడుతూ…”గుడ్ మార్నింగ్ రా!!”అని అంటే…మైథిలీ చిన్నగా నవ్వుతుంది బదులుగా…

 

~~~~~~~~~~~~~~

 

ఇంతలో శ్రీ రామ్ కూడా లెగిసేసరికి…అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తు తెచ్చుకుని ఈవిల్ స్మైల్ చేస్తూ..”మైధు పాప..ఈరోజు నుంచి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్స్!!”అని అనుకుంటూ….

 

 

రూమ్ లో నుండి బయటకి వచ్చి వొళ్ళో విరుచుకుంటూ…”మైథిలీ!!”అని గట్టిగా కేక వేస్తాడు…కిచెన్ లో వాటర్ తాగుతున్న మైథిలీ కంగారుగా గ్లాస్ వదిలేసి మరి బయటకి వస్తే…

 

ఆ అరుపు విన్న జానకి గారు మాట్లాడుతూ…”ఏంట్రా ఏం కావాలి!?”అని అడుగుతారు….

 

రామ్ చిన్నగా నవ్వి…”ఐ నీడ్ మై వైఫ్ మామ్!!”…అని చెప్తే…

 

 

 

మైథిలి కంగారుగా రామ్ దెగ్గరకు వెళ్ళి..”ఏమైంది రామ్!!?”అని అడగబోతుంటే…రామ్ తనని రూమ్ లోకి తీసుకుని వెళ్లి….”ఏంటి…పిలవగానే రావాలా తెలీదా నీకు!?”అని అడుగుతూ…”అయిన రామ్ అంటున్నావ్ ఏంటి…మొగుడిని రెస్పెక్ట్ ఇచ్చి పిలవడం రాదా!?”అని అడుగుతాడు…

 

మైథిలి చిన్నగా తల అడ్డంగా ఊపి..”సారీ..చెప్పండి… ఏం కావాలి!?”అని అడుగుతుంది….

 

 

రామ్ మాట్లాడుతూ…”ఏంటి హోటల్ లో ఉండే వెయిటర్ లాగా ఏం కావాలి!?అని అడుగుతున్నావ్..ఏదైనా కావాలంటేనే నిన్ను పిలవాలా…లేదంటే పిలవకూడదా!?”అని అడుగుతాడు…

 

మైథిలి నోటి మీద చెయ్యి వేసుకుంటూ…”అంటే నా ఉద్దేశం అది కాదు..ఏమైనా కావలేమో!!”అని అంటుంటే….

 

 

రామ్ ఆర్డర్ వేస్తూ..”వెళ్ళి వేడి వేడిగా కాఫీ తీసుకుని రా…అండ్ వన్ మోర్ థింగ్ కాఫీ నువ్వే చేసి తీసుకుని రావాలి!!”అని చెప్పేసరికి…

 

మైథిలి సరే అని తల ఊపుతూ…అక్కడి నుండి వెళ్ళబోతే.. రామ్ చిటిక వేసి..”హలో…నాకు బ్రష్ పేస్ట్ టవల్ సోప్ ఇవన్నీ ఎవరు ఇస్తారు…ఇదేమైనా మా ఇళ్ల ఏంటి!??..అన్ని తీసుకోవడానికి!!?”అని అనేసరికి….

 

మైథిలి తల కొట్టుకుంటూ..కప్ బోర్డు ఓపెన్ చేసి…మొత్తం రామ్ అడిగినవి అన్ని అతనికి పక్కనే బెడ్ మీద పెట్టీ అక్కడి నుండి వెళ్ళబోతే….

 

 

రామ్ మళ్ళీ పిలుస్తూ…”హ్మ్మ్..నీకు తెలుసుగా నాకు అసలే ఓ సి డీ ప్రాబ్లం అని…సో నేను వచ్చేలోపు…రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టు!!”అని అంటూ వాష్రూమ్ లోకి వెళ్తే…

 

మైథిలి రూమ్ కి మూలాన ఉన్న చీపురు తీసుకుని…తుడవడం స్టార్ట్ చేస్తూ…తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది….

 

 

“నౌ ఐ ఇన్వైట్ ఔర్ యూనివర్సిటీ టాపర్…మిస్ మైథిలి కృష్ణ!!”అని అనౌన్స్ చేస్తుంటే…తన హ్యాపీ గా నవ్వుతూ వెళ్ళి ఆ అవార్డు తో పాటు సర్టిఫికెట్ తీసుకుని సక్సెస్ స్పీచ్ ఇచ్చిన రోజులు గుర్తు తెచ్చుకుని…అక్కడ తుడిచి కింద కిచెన్ లోకి వెళ్తుంది..

 

 

కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెట్టడం కోసం పాలు వెచ్చబెడుతూ…

 

“నిజంగా నువ్వు చెప్పింది నిజమేనేమో అమ్మ…!!ఎంత చదువు చదివిన ఎన్ని మార్కులు తెచ్చుకున్న అమ్మాయి జీవితం మాత్రం మారదు!!”అని తనలో తానే అనుకుంటే…

 

 

 

మాధవి గారు బాధగా మైథిలీ భుజం మీద చెయ్యి వేసి…”ఒసేయ్ అలా ఎందుకు అనుకుంటున్నావే…అల్లుడు గారు నీ మీద కోపంగా ఉండి ఉంటారు అంతే…అయిన ఈరోజుల్లో ఎంత మంది అమ్మాయిలు ఉద్యోగాలు చెయ్యట్లేదు!!”అని అంటుంటే…

 

మైథిలి వాళ్ళ అమ్మగారి వైపు తిరిగి దణ్ణం పెడుతూ…”ఇలా చెప్పి నా లో ఉన్న చచ్చిపోయిన ఆశలన్నీ నిద్ర లేపకు…!!”అని అంటూ పాలు కాగడం తో కాఫీ తీసుకుని పైనే రూమ్ లో రామ్ దెగ్గరకు వెళ్తుంది…

 

 

రామ్ డ్రెస్సప్ అయ్యి బయటకి వస్తూ…మైథిలి చేతిలో కాఫీ నీ తీసుకుని ఒక సిప్ వేస్తూ…”ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి… ఈ కాఫీ టేస్ట్ మాత్రం ఎక్కడ రాదే!!”అని అంటాడు…

 

మైథిలి అలానే రామ్ నీ చూస్తే..ఒక్కప్పుడు అలానే తన కాఫీ నీ పొగిడే రామ్ గుర్తు వస్తాడు…ఇంతలో తను ఉన్నది ప్రెసెంట్ లో అని గుర్తు వచ్చి అలానే చూస్తే….

 

 

రామ్ మాట్లాడుతూ…”ఈరోజే మనం బెంగుళూరు వెళ్లబోతున్నాం!!”అని చెప్తాడు…మైథిలి కి ఏం చెప్పాలో తెలియక…సరే అని తల ఊపుతుంది…

 

~~~~~~~~~~~~~~

 

మీకు ఎపిసోడ్ నచ్చితే కామెంట్స్ మరియు రేటింగ్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు బంగారాలు 😍🥰…అలానే మీకు ఈ కథ ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాలని తెలియజేయండి..❤️‍🩹👀