ఇప్పుడు ఉదయం 7 గంటలు, అనన్య రూమ్ లోనే ఉంది, బయటకు రాలేదు, అమ్మ, నాన్న కూడా వాళ్ళ రూమ్ లోనే ఉన్నారు భయంగా, ముగ్గురూ విడివిడిగా, రుద్ర కావాలనే విడదీసాడు.
అనన్యకి కోపం, బాధ, “నా వల్ల అమ్మ, నాన్న కూడా జైలులో ఉన్నట్టు ఉన్నారు, నా వల్లే, నేను ఈ రాక్షసుడి దగ్గరికి రాకపోయి ఉంటే” అని ఏడుస్తోంది.
కింద హాల్ లో రుద్ర కూర్చుని ఉన్నాడు, కామ్ గా ఉన్నాడు మొహంలో ఏం ఎక్స్లేప్రెషన్ లేదు, కానీ లోపల బాధ, “అనన్య నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను కాపాడాను, కానీ తను హేట్ చేస్తోంది” అనుకుంటున్నాడు.
రాజు వచ్చి “అన్నా, అనన్య గారు తినలేదు, ఉదయం నుంచి, అమ్మ, నాన్న కూడా తినలేదు” అన్నాడు.