New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీలి చిత్రం మాటు – 5

నీలి చిత్రం మాటు – 5

 

 

 

 

 

 

 

నేను రేపే అత్తయ్యకి మామయ్యకి కాల్ చేసి మాట్లాడతాను, మా పేరెంట్స్ ని కూడా రమ్మంటాను. ఇంతకుమించి ఇక నావల్ల కాదు అని బయట నుంచి అదే పనిగా అరుస్తుంది రమ్య.

 

 

 

బాత్ ఫినిష్ చేసుకొని నడుము వరకు టవల్ చుట్టుకుని బయటకు వచ్చిన ప్రదిప్ ని అలా చూడడమే కోపంగా పక్కకు తిరిగి వేళ్ళు పీకేసుకుంటుంది రమ్య. 

 

 

ప్రదీప్ ని అలా చూసిన, తను కొంచెం ప్రేమగా మాట్లాడిన ఎక్కడ తన కోపం కరిగిపోయి తిరిగి నార్మల్  అయిపోతానని భయం రమ్యకి. 

 

 

ఎందుకంటే ప్రదీప్ చాలా బాగుంటాడు. 5.10″ హైట్ తో ఎర్రగా ఉంటాడు, సిల్కీ హెయిర్. ఈ జనరేషన్ అబ్బాయిలు లా స్టైల్ మెయింటెన్ చేయకపోయినా, పద్ధతిగా నీట్ గా ఉంటాడు.

 

డైలీ మార్నింగ్ వన్ అవర్ జాగింగ్ కి వెళ్లే ప్రదీప్ హెల్తి ఫుడ్ హ్యాబిట్స్ తో, చాలా ఆరోగ్యంగా పొట్ట గిట్ట లాంటివి లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా స్ట్రాంగ్ గా కనిపిస్తాడు.

 

రమ్య ఎలా అయితే అందంగా పర్ఫెక్ట్ గా ఉంటుందో, అంతే పర్ఫెక్ట్ గా తన పక్కన బుల్లితెర హీరోలా ఉంటాడు ప్రదీప్.

 

 

ఈరోజు తాడు పేడో తేల్చుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. అందుకే అస్సలు అతన్ని చూడకూడదు అనుకుంటుంది. 

 

ప్రదీప్ ఎం చెప్పిన మెల్ట్ అవ్వకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది రమ్య.

 

 

చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు?? అని అడుగుతూ మీకు దగ్గరగా వచ్చిన ప్రదిప్ తనని తన సైడ్ కి తిప్పుకొని సారీ రా అంటూ గడ్డం పట్టుకున్నాడు. 

 

అంతే ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క చిన్న స్పర్శకి ఇప్పటివరకు అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరి పడ్డ రమ్య మంచు పువ్వులా కరిగిపోయింది. 

 

టవల్ తో ఉన్న ప్రదీప్ నడుము చేతులతో చుట్టేసి అతన్ని గట్టిగా హత్తుకుని నువ్వు ఇలా ఇగ్నోర్ చేస్తుంటే, నాకు చాలా కోపం వస్తుంది. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. 

 

ఎంత వర్క్ ఉంటే మాత్రం నాకు చెప్పకుండా సీక్రెట్స్ మైంటైన్ చేయాల్సిన అవసరం ఏముంది, అడిగితేనేమో పర్సనల్ అంటున్నావు నీకు నాకు మధ్య పర్సనల్ ఏంటి ??

 

ఐ మిస్ యు సో మచ్, ఐ వాంట్ యు అని ఆర్తి నిండిన గొంతుతో తన ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేసింది రమ్య.

 

ఐ నో బేబీ, నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. బట్ ఇంకో 10 డేస్ నన్ను వదిలేయవా ప్లీజ్. నా బంగారం కదు, చాలా అలసటగా ఉంది అని ప్రదీప్ నీరసం నిండిన గొంతుతో బ్రతిమిలాడుతుంటే వెంటనే అతన్ని వదిలేసింది రమ్య.

 

 

ఇంకో 10 డేస్ రా ప్లీజ్..!! అని కోపం ప్లస్ అలక కలిసి ఉన్న రమ్య కళ్ళల్లోకి చూస్తూ రిక్వెస్ట్ చేశాడు ప్రదీప్.

 

టు మంత్స్ ముందు కూడా ఇదే చెప్పావ్ ప్రదీప్ గుర్తుందా నీకు అసలు?? అని చిరాకు పడుతూనే అతనికి నైట్ వెర్ తీసి ఇచ్చి ఆ కోపంతోనే బయటికి వెళ్లిపోయింది రమ్య.

 

 

ప్చ్.. ఇంకో టెన్ డేస్.. 

టెన్ డేస్ అంటే టెన్ డేస్ లో మొత్తం ఫినిష్ చేయాలి. అంతకన్నా లేట్ అయితే రమ్య ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది అని అలసిపోయిన స్ట్రెస్ తోనే డ్రెస్ చేసుకొనేసరికి చిక్కటి మజ్జిగ గ్లాస్ తో వచ్చింది రమ్య.

 

 

 

నువ్వు కూడా తినేసి రా అంటూ మజ్జిగ గ్లాస్ తీసుకున్నాడు ప్రదీప్.

 

రమ్య నుంచి అసలు రెస్పాన్స్ లేదు. నువ్వు తాగి పడుకో, 10 డేస్ తర్వాత ఇది రిపీట్ చేస్తే మాత్రం అసలు ఊరుకోను. నేను మా ఇంటికి వెళ్లి పోతాను నీ గురించి మీ వాళ్లకు చెప్పేస్తాను అని చాలా అంటే చాలా కోపంగా చెప్పి తన పిల్లో తీసుకొని వెళ్లి సోఫాలో పడుకుంది.

 

షాక్ అయినా ప్రదీప్.. అదేంటి రమ్య అక్కడ పడుకున్నావ్ ఒంటరిగా నేను బెడ్ మీద ఎలా పడుకోవాలి?! అని విసుగ్గా అడిగితే ఒంటరిగా ఊరంతా చక్కబెట్టుకొని అర్ధరాత్రి ఇంటికి వచ్చావు. 

 

ఆ మాత్రం ఒంటరిగా మూడు గంటలు నిద్ర పోలేవా?? పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అని అరిచి అటు తిరిగి పడుకుంది రమ్య.

 

మెంటల్ ఇంత కోపం ఏంటే నీకు?? అని ఉసురుమంటూ అంత పెద్ద బెడ్ మీద పిల్లోని హత్తుకొని ఒంటరిగానే పడుకున్నాడు ప్రదీప్.

 

ఒళ్లంతా పులిసిపోయినట్టు ఉన్న ప్రదీప్ అలసటకి క్షణంలోనే నిద్రలోకి జారిపోయాడు. అతని అలసట మీద ప్రదీప్ అసలు గమనించని విషయం రమ్య అతని కోసమే అతనికి ఇష్టమైన కలర్ సారీ కట్టుకొని అతని కోసమే ముస్తాబయిందని..

 

 

ఉదయాన్నే ఎవరో కొట్టినట్టు ఠక్కున లేచి కూర్చున్నాడు ప్రదీప్. బెడ్ రూమ్ అంతా కళ్ళు తిప్పి చూసి మస్తుగా చీకటిగా ఉండడంతో ఇంకా తెల్లవారలేదని అర్థమయ్యి ఫోన్ తీసుకొని టైం చూశాడు. మార్నింగ్ 4: 30 అయ్యింది.

 

 

**************************

 

కామెంట్స్ మస్ట్ బేబీస్…💞

 వర్ణ.