నీ ప్రేమకై ❤️…… పరితపించే నేను – 1
దేవాంశ్‌కు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ బలవంతం మీద ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇష్టం లేకుండానే ఆమెతో ప్రయాణం చేశాడు.. సంవత్సరం లోపు ఒక బాబుకు తండ్రి అయ్యాడు…. అతని భార్య డెలివరీ టైమ్ లో చనిపోయింది….
ఆ తర్వాత జాబ్ ట్రాన్స్‌ఫర్ కావడంతో దేవాంశ్ తన కొడుకును ,దేవాంశ్ వాళ్ళ అమ్మను తీసుకుని విజయనగరం సమీపంలోని ఒక చిన్న గ్రామానికి వచ్చాడు.
అక్కడ తన ఇంటి పక్కనే ఉన్న మహేశ్వరిని చూసి దేవాంశ్ ఇష్టపడ్డాడు. ఆ ఇష్టం క్రమంగా ప్రేమగా మారింది. మహేశ్వరి మనసులో కూడా దేవాంశ్‌పై ప్రేమ ఉన్నప్పటికీ, ఆమె భయాలు మరియు కొన్ని ఆలోచనల కారణంగా ఆ ప్రేమను బయటపెట్టలేదు.
దేవాంశ్ మాత్రం తన ప్రేమను ఆమెకు తెలియజేస్తూ, ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మహేశ్వరి మాత్రం తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను, భవిష్యత్తుపై ఉన్న భయాలను దృష్టిలో పెట్టుకుని అతని పెళ్లి ప్రపోజల్ కు ఒప్పుకోలేదు.
మరోవైపు మహేశ్వరి అక్క సరిత భర్త రాజేశ్‌కు మాత్రం మహేశ్వరి మీద కోరిక ఉంది. ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు.
ఆమె అందం చూసి ఎవరో ఒకరు ఆమెను పెళ్లి చేసుకుపోతారనే భయంతో, మహేశ్వరికి పిల్లలు పుట్టే అవకాశం లేదని ఒక తప్పుడు విషయాన్ని ప్రచారం చేసి ఆమెకు పెళ్లి సంబంధాలు రాకుండా చేశాడు.
అయినా మహేశ్వరి తన జీవితాన్ని తనే నిర్ణయించుకోవాలని ప్రయత్నించింది. కానీ రాజేశ్ మాత్రం ఆమెపై ఉన్న కోరికను వదులుకోలేదు. ఆమెను తన కోరికకు లొంగదీసుకోవాలని చూస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్వరి తన మనసులోని ప్రేమను అంగీకరించి దేవాంశ్‌ను పెళ్లి చేసుకుంటుందా? దేవాంశ్ కొడుకుకు తల్లిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందా? లేక రాజేశ్ చేస్తున్న ఒత్తిడికి బలవుతుందా?
మహేశ్వరి జీవితంలో చివరకు ఏం జరుగుతుందో ఈ కథలో తెలుసుకుందాం….!!!!
***********
ఏంటక్కా, రెండో రోజుల నుంచి పక్కింట్లో చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది అని బట్టలు ఆరేస్తూ అడిగింది మహేశ్వరి……..
ఓ… అదా, పక్కింటి వాళ్లు ఇల్లు అమ్మేశారు. ఎవరో
ఆ ఇంటిని కొనేశారు. వాళ్లు రెండో రోజుల క్రితమే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అని చెప్పింది మహేశ్వరి అక్క సరిత.
అవునా? మరి అంతలా ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోరా? అని మహి అడిగింది.
అది కాదే. ఆ పాపకి మదర్ లేదంట. నాన్న ఒక్కడే ఉన్నాడంట. అతను బ్యాంకులో మేనేజర్ అంట. బాబు పుట్టినప్పుడే వాళ్ల మదర్ చనిపోయిందంట. అతను వాళ్ల అమ్మతో కలిసి ఆ బేబీని చూసుకుంటున్నాడట.
ఎంతైనా తల్లి ఉన్నట్టు ఉండదు కదా. అందులోనూ కొత్త ప్లేస్. అందుకే ఆ బాబు అలా ఏడుస్తున్నాడేమో అని సరిత వివరంగా చెప్పింది.
అవునా? అయినా నువ్వే నయం. వాళ్లు ఇక్కడికి షిఫ్ట్ అయిన రెండో రోజులోనే వీళ్ల గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నావు. నాకు ఇప్పుడు నువ్వు చెప్పినంతవరకు అసలు ఏమీ తెలియదు అని అంది మహేశ్వరి.
ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. పైగా ఆ ఇంట్లో ఉంటున్న ఆవిడ ఒకసారి నన్ను పలకరించింది కూడా అని అంది సరిత.
సరే సరే, నీకు టైం అవుతున్నట్లుంది. నువ్వెళ్లి రెడీ అవు. మిగతా పని నేను చూసుకుని పిల్లలను తీసుకుని స్కూల్‌కి వెళ్తాను అని మహేశ్వరి చెప్పింది.
అది నిజమే. అసలుకే ఈ మధ్య పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. డాక్టర్ చూసి పంపించడం, మందులు రాయడంతో డాక్టర్ వర్క్ అయిపోతుంది. అంత రిస్క్ ఏమీ లేదు. కానీ మాలాంటి నర్సులకే ఎక్కువ పని పడుతోంది.
అసలు నర్సుగా ఎందుకు చేరాను? ఆ వర్క్ ఎందుకు నేర్చుకున్నాను? అని ఇప్పుడు బాధపడుతున్నాను అని అంది సరిత.
అది ముందే ఆలోచించాలి కదా. సరే, వెళ్లు వెళ్లు. టైమ్ అవుతుంది అని మహేశ్వరి తొందర చేసింది.
సరిత రెడీ అయి తన బాక్స్ తీసుకుని ఆసుపత్రికి వెళ్లిపోయింది.
మహేశ్వరి కూడా హడావిడిగా ఇంట్లో మిగిలిన పనంతా చేసుకుంది. పిల్లల కోసం బాక్స్ రెడీ చేసి, తను కూడా రెడీ అయి పిల్లలిద్దరినీ తీసుకుని స్కూల్‌కి బయలుదేరింది.
మహేశ్వరి, సరిత ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. వాళ్లిద్దరికీ తండ్రి లేడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో, హడావిడిగా తన అన్న కొడుకు రాజేష్‌కి సరితని ఇచ్చి పెళ్లి చేసింది.
రాజేష్‌కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో అతని మేనత్త సుమిత్ర అతనిని పెంచింది.
తల్లిదండ్రులు లేకపోయినా, రాజేష్‌కి సొంతంగా ఒక ఇల్లు మాత్రమే ఉంది. రెండు చిన్న బెడ్‌రూమ్‌లు, ఒక చిన్న హాల్, కిచెన్ ఉన్న పెంకుటింట్లో వాళ్లు ఉంటున్నారు.
రాజేష్ ఒక కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.
రాజేష్, సరితలకు ఇద్దరు పిల్లలు. బాబు వివేక్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు. పాప శ్రయ థర్డ్ క్లాస్ చదువుతోంది.
సరిత టెన్త్ క్లాస్ వరకు చదివి, ఆ తర్వాత చదువు ఆపేసింది. ఒక హాస్పిటల్‌లో నర్సుగా పనిచేయడం మొదలుపెట్టి, ఇప్పుడు తన వర్క్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ సంపాదించింది. చిన్నప్పటి నుంచి పక్కూర్లో ఉన్న హాస్పిటల్‌లోనే నర్సుగా పనిచేస్తోంది.
మహేశ్వరి, సరిత వాళ్ల అమ్మ సరితకు పెళ్లయిన సంవత్సరం తర్వాత కాలం చేసింది. దాంతో సరిత మహేశ్వరిని తన వెంట తీసుకొచ్చి, చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే ఉంచుకుంది.
సరిత వాళ్లు ఉన్న ఇల్లు అమ్మేసి, కొంత స్థలం కొన్నారు. ఆ స్థలం అమ్మి వచ్చిన డబ్బుతో మహేశ్వరికి పెళ్లి చేయాలని సరిత అనుకుంది. కానీ ఇంతవరకు ఆ పని వీలు పడలేదు.
మహేశ్వరికి చదువుకోవాలని ఉన్నా, ఇక చదివించను చదవడానికి వీలు లేదు అని రాజేష్ చెప్పడంతో ఆమె చదువు అక్కడితో ఆగిపోయింది.
తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండటం మహేశ్వరికి ఇష్టం లేకపోవడంతో, అదే ఊరిలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. అది చేయడానికి కూడా అక్క చెల్లెళ్లు ఇద్దరు రాజేష్ ను ఎన్నో రోజులు బ్రతిమిలాడారు….
సరిత భర్త రాజేష్…..
ఒక ప్రైవేట్ కంపెనీ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాడు…. బాగా డ్రింక్ చేయడం….ఇంటిని సరిగా పట్టించుకోకపోవడం చేస్తుంటాడు…
సరిత కన్నా మహేశ్వరి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది… అందుకే మహేశ్వరి కి ఎన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా రాజేష్ ఆమె మీద ఉన్న కోరికతో చెడగొడుతూ ఉంటాడు.
మహికి ఒకరోజు బాగా స్టమక్ పెయిన్ రావడంతో భరించలేక పోయింది.. అప్పటికే రాజేష్ మహి ను బలవంతంగా అయిన సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు..
ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. అదే అవకాశంగా తీసుకున్న రాజేష్ డాక్టర్ కి డబ్బు ఆశ చూపించి మహేశ్వరి గర్భసంచి ప్రాబ్లం ఉందని పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పించాడు…
అది విన్న సరిత చాలా భయపడిపోయింది.. మళ్ళీ ఒకసారి చూడమని రిక్వెస్ట్ చేసింది… అయిన ఆ డాక్టర్ అదే చెప్పింది… మహి చాలా బాధపడింది..
డిప్రెషన్ లోకి వెళ్లింది… కానీ అక్కకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు నాకు పిల్లలే కదా…!! అని సరిపెట్టుకుంది..
సరిత ఊరుకోకుండా తను వర్క్ చేసే హాస్పిటల్ లో మహికు చెక్ అప్ చేయించింది.. అది రాజేష్ ముందుగా తెలుసుకొని అక్కడ కూడా మ్యానేజ్ చేపించి అదే చెప్పించాడు…
సరిత అది నమ్మలేక 4 హాస్పిటల్స్ వరకు చూపించిన అందరూ అదే చెప్పారు… ఈ మధ్యనే ఆమెకు పెళ్లి చేయాలని సరిత సంబంధాలు చూస్తున్న పిల్లలు పుట్టరు అని ముందే చెప్పడంతో మహి అందంగా వున్న ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు…
మొదట నుండి రాజేష్ మహిని చూసే వంకర చూపులు , ఆమెను తాకాలని చూడటం అవకాశం కోసం ఎదురు చూడటం వాళ్ళకి తెలుసు.. అలా అని అందరి ఆడవాళ్ళను అలా చూడడు, కోరుకుడు… అతని కోరిక కేవలం మహేశ్వరి మీద మాత్రమే…..
సరిత ఎప్పటికప్పుడు రాజేష్ ను బెదిరించి మహి జోలికి వెళ్లకుండా అడ్డుకునేది…
అయిన మహి దొరక్కపోతుందా తన అందాన్ని అనుభవించక పోతాన అని రాజేష్ ఎదురు చూస్తున్నాడు…
ఆ రోజు స్కూల్ ముగించుకొని పిల్లలను తీసుకొని ఇంటికి చేరుకుంది మహేశ్వరి.. వాళ్ళ అక్క సరితకు రావడం లేట్ అవుతుంది అని ముందే కాల్ చేసి చెప్పింది….
పిల్లలు రాగానే బ్యాగ్ పక్కన పెట్టీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి టీవీ ముందు కూర్చున్నారు….
మహి కూడా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి పిల్లలకు బిస్కట్స్ పెట్టి తను టీ తాగుతూ టీవీ దగ్గర కూర్చుంది.
పిల్లలు టీవీ చూస్తూ వుండగానే ఇంట్లో పనంతా చక చక చేసి ,ఇంటి ముందు డోర్ దగ్గరికి వేసి పిల్లలతో సహా పెరట్లో చాప పరుచుకొని కూర్చుని హోమ్ వర్క్ చేయిస్తుంది…
పిల్లలు తమ హోమ్ వర్క్ చేస్తూ డౌట్స్ ఉంటే అడుగుతున్నారు… వాళ్ళకి చెబుతూనే తనకున్న అలవాటు ప్రకారం బుక్ చదువుతూ కూర్చుంది మహి.
అప్పుడే ఇంట్లోకి రాజేష్ ఆడుకు పెట్టాడు.. కానీ అది మహి గమనించలేదు… పెరటి గుమ్మం డోర్ తీసి ఉండటంతో అక్కడికి వచ్చి పెరట్లో వున్న మహి ను చూస్తూ డోర్ కి ఆనుకుని నిలబడ్డాడు…
ఆమె తన చున్నీ పక్కన పెట్టీ ఉండటంతో ఆమె చెస్ట్ దగ్గర క్లీవేజ్ షో అవుతుంటే పెదవులు కొరుక్కుంటూ కళ్ళతోనే తినేసేలా చూస్తూ కొంత సేపు అక్కడే నిలబడ్డాడు…
ఆమె చూడక ముందే లోపలికి వెళ్ళి…..
మహి.. మహి.. అని పిలిచాడు… అది విన్న మహి పెరట్లో నుండే హా బావ అని పలికింది… తల నొప్పిగా ఉంది టీ పెట్టీ ఇవ్వు అని చెప్పాడు…
పిన్ని మేము బుద్ధిగా రాసుకుంటాం నువ్వు టీ ఇచ్చేసి రా…!! నాన్న పిలుస్తున్నాడు అని వివేక్ అన్నాడు..
ఇప్పుడు మహి వెళ్ళక పోయిన తను టీ పెట్టీ ఇచ్చేంత వరకు అలానే పిలుస్తాడని లేచి దుపట్టా తీసుకొని సరిగా అడ్జస్ట్ చేసుకుంటూ కిచెన్ లోకి వెళ్లింది…
ఆమె వెళ్ళి టీ పెడుతుంటే చిన్నగా కిచెన్ లోకి వచ్చిన రాజేష్.. మహి చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు.
ఆమె మెత్తటి శరీరం తగలగానే మత్తుగా ఆమె వైపు చూస్తు పెదవులు తడుపుకున్నాడు..
మహి కోపంగా అతని నుండి విడిపించుకొని బావ నీకు ఎన్నో సార్లు చెప్పాను… ఇలా బిహేవ్ చేయకు అని కోపంగా అంది…..
నీకు ఎన్నో సార్లు చెప్పాను నా కోరిక తీర్చమని….
నిన్ను చూస్తుంటేనే వంట్లో నరాలన్నీ జివ్వు జివ్వు మంటున్నాయి… బాడీ మొత్తం హీట్ ఎక్కిపోతుంది. ఇలా చూస్తూ దూరంగా ఉండటం ఎంత కష్టంగా ఉందో అని మత్తుగా చెబుతుంటే…
అది వింటున్న మహికి కంపరంగా అనిపించింది… మరిగిన టీ గ్లాస్ లో పోసి చేతికి కూడా ఇవ్వకుండా పక్కనే సౌండ్ వచ్చేలా పెట్టీ బయటికి వెళ్లిపోయింది..
ఆమె ఫేస్ లో అతని మీద అసహ్యం అంతగా కనిపిస్తున్న అది రాజేష్ లెక్కచేయలేదు… టీ తాగుతూ పెరటి గుమ్మం దగ్గరకు వచ్చి ఆమెనే చూస్తూ ఉన్నాడు….
కథ కొనసాగుతోంది………
Swipe left/right or tap the sides to turn pages