ఎపిసోడ్ 22
“సరే, అంకుల్ పదండి. ఆ సీతాలు, భరత్ కి ఒక మంచి కాఫీ ఇచ్చి పంపించు. ఓకే భరత్, బై,” అని చెప్పి ఒదే సందని అక్కడి నుండి ఎస్కేప్ అయ్యింది స్వప్నిక.
భరత్ ఆవేశంతో రగిలిపోయాడు.
కంట్రోల్, కంట్రోల్ అనుకున్న అతను ఎక్కడ లేని సెన్సిటివ్ నెస్ మేంటేన్ చేస్తే గానీ ఇలాంటి అమ్మాయిలు లొంగరని ఆలోచించాడు భరత్.
“వొద్దు సీతాలు, నేనేం కాఫీకి గతి లేక ఇంత దూరం రాలేదు. తనతో మాట్లాడి చాలా రోజులయింది.
ఆఫీసులో పనుల వల్ల స్వప్నిక చాలా అలిసిపోతుందని నిన్న నువ్వు చెప్పావు కదా,