పెళ్లి చూపులు -44
సరే రూమ్ కి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం అని అనుకొని వైష్ణవ్ తన సిస్టం ఓపెన్ చేసి వర్క్ చేయాలి అని చూశాడు. కానీ ఇంతకుముందు తను చేసిన వర్క్ అంతా కూడా డిలీట్ అయిపొయి ఉండటంతో తనకు ఏమీ అర్థం కాలేదు ఒక్కక్షణం మైండ్ పనిచేయడం ఆగిపోయింది..
డిలీట్ ఎలా అయిపోయింది. వర్క్ అంత నేను బయటకి వెళ్లేముందే కదా సేవ్ చేసి పెట్టాను. అలా ఎలా డిలీట్ అయిపోయింది అని సిస్టం మొత్తం ఒక 10 మినిట్స్ చూశాడు. అయినా కూడా ఎక్కడ తన ప్రాజెక్ట్ కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.
వైష్ణవ అంత టెన్షన్ పడుతూ ఉండటం గమనించిన సిరి “ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్..?” అని నార్మల్గా అడిగింది అసలు మ్యాటర్ ఏంటో తనకు తెలియక పోవడంతో
అది ఏం లేదు అని అనుకుంటూ నేను లంచ్ కి వెళ్లేటప్పుడు సిరియే కదా నా సిస్టం యూస్ చేసింది ఒకవేళ పొరపాటున తను ఏమైనా డిలీట్ చేసిందా అని అనుకోని కూడా లేదు లేదు పొరపాటున కూడా సిరి ఇటువంటి పనిచేయదు. నేను ఇలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అని అనుకొని ఒకవేళ ఎక్కడైనా బ్యాక్అప్ లో ఉందేమో అని ట్రై చేశాడు వైష్ణవ్.
గౌతమి జరిగేది మొత్తం చూస్తూనే ఉంది సిస్టంలో ప్రాజెక్ట్ డిలీట్ అయిపోయింది అని వైష్ణవ్ కి అర్థమయిపోయింది సిరి అడిగినా సరే ఆమెను అనుమానించకుండా తనే ట్రై చేస్తూ ఉన్నాడు.