New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘4

ప్రియమైన శత్రువు💘4

 

 

 

అప్పటివరకు ఒకింత బెరుకుతో అర్థం కాని కన్ఫ్యూషన్ తో మిగిలిపోయిన పేరెంట్స్ మొత్తం కోపంతో కట్టలు తెంచుకున్నారు. 

 

అటు ప్రియ పేరెంట్స్ ఇటు అలోక్ మదర్ అవంతిక గారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. 

 

 

 

 

 

రేణుక గారు తల కొట్టుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే.. విరాజ్ అంటూ కూతురి కోసం దూసుకు వచ్చిన రవికాంత్ అతని కాలర్ బిగించాడు వెనుక నుంచి. 

 

కూతురి నుంచి విడదీయాలని చేసినా ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు వీరాజ్ కుడి చేతితో ఆయన మెడ బిగించి. 

 

 

 

 

ఇటు ప్రియ అతని నుంచి విడిపించుకోవడానికి ఒక్క చేత్తోనే ముష్టి యుద్ధం చేస్తుంది. 

 

చీమ కుట్టినట్టుగా కూడా లేదు అతనికి.

 

 

 

అయ్యో ఎవరైనా దీనిని ఆపండి.. అని రేణుక గారు నెత్తి నోరు కొట్టుకుంటూ అతని చేతి నుంచి భర్తను విడిపించడానికి ప్రయత్నిస్తుంటే 

 

ఒక్క అడుగుల మండపం మీదికి వచ్చిన అలోక్ అతని చేతిని బిగించాడు మామని విడిపించడానికి.

 

 

 

కచ్చితంగా అర నిమిషం.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటు తాళి కట్టిన ప్రియని అటు అప్పుడే వరుస కలిసిన మామని వదలకుండా సక్సెస్ఫుల్ గా ప్రియా పెదవికి చిల్లు పెట్టి వెచ్చని ఉప్పటి రుచి తెలియడంతో ముద్దుకి బ్రేక్ ఇస్తూనే లెఫ్ట్ లెగ్ తో అలోక్ గుండెల మీద తన్ని దూరంగా పడేలా చేసిన అతను కళ్ళు తేలేస్తున్న మామని ఫోర్స్ గా వెనక్కి తోసేసాడు.

 

రేణుక గారితో సహా సాయం నిలిచిన వారంతా నేలకు పడ్డారు. 

 

 

 

 

చిట్లిన పెదవి లోపలికి బిగించిన ప్రియ నోటి నుంచి మాట లేదు, కోపం కన్నీళ్లు పోటీ పడుతున్నాయి తన ముఖంలో. 

 

ఆ ఫీలింగ్స్ తో అవసరమే లేనట్టు ప్రియా మెడలో ఉన్న వరమాల తనకి కూడా సగానికి అలంకరించుకొని తనని మరింత దగ్గరికి లాక్కొని పూజారి వైపు చూశాడు విరాజ్ నందన్.

 

 

 

అన్నయ్య షి ఇస్ మై లవ్.. అని మళ్లీ ముందుకు రాబోతున్న అలోక్ మీద నుంచి గన్ ప్రియా ఫోర్ హెడ్ కి పాయింట్ చేశాడు విరాజ్. 

 

అతని గొంతులో మాట గొంతులోనే ఆగిపోతే ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసుకొని.. నో.. నౌ.. తనని ఏమీ చేయొద్దు అంటూ హాండ్స్ రైస్ చేసిన అలోక్ సరెండర్ అయిపోయాడు. 

 

 

 

నెక్స్ట్ సెకండ్ అలోక్ మదర్ అవంతిక గారిని వీరాజ్ సెక్యూరిటీ సరౌండ్ చేశారు.

 

ఎవరిని ఏమీ చేయొద్దు, నీకు కావాల్సింది నేనే కదా..?? అని పట్టరాని కోపంతో విరాజ్ చేతిని బిగించింది ప్రియా.

 

 

 

ఒక ఈవిల్ స్మైల్ తో చుట్టూ మరోసారి చూస్తూ.. షి ఇస్ మైన్, ఈ క్షణం నుంచి షి ఇస్ మిస్సెస్ విరాజ్ నందన్. 

 

ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉంటే స్పీక్ అవుట్.. అని గర్జించిన అతని గొంతుకి ఒక్కరి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. 

 

 

 

నేను అలోక్ ని అంటే నీ తమ్ముడిని ప్రేమిస్తున్నాను.. అని తలకి గన్ పెట్టిన భయపడని అసహ్యంతో చెప్పిన ప్రియా కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. 

 

 

దట్స్ నాట్ మై ప్రాబ్లం.. నేను తాళి కట్టే వరకే వాడికి నీకు ఎన్ని ఉన్న. ఈ క్షణం నుంచి నీ ప్రాబ్లమ్స్ నన్ను బోదర్ చేయకూడదు. 

 

అత్తింటి సూత్రానికి తలవంచి పుట్టింటి సూత్రానికి విలువనిస్తూ నా పెళ్ళాం గా సర్వీస్ చేయడమే ఇక నీ డ్యూటీ.. అని సేమ్ ఈవిల్ స్మైల్ తో వార్నింగ్ ఇచ్చిన విరాజ్ నందన్ పంతుల్లను చూశాడు మిగిలిన తంతు పూర్తి చేయమని.

 

 

 

 

అంతమంది ఉన్న మండపంలో ఏ ఒక్కరు ఎదురు చెప్పలేని పొజిషన్ అతనిది అని గ్రహించిన పెద్ద పంతులు మిగిలిన ఇద్దరి చేతులు బిగించి మంత్రాలు అందుకున్నాడు. 

 

మరుక్షణం మేళాలు  మండపం మొత్తం ముందులా ప్రతిధ్వనిస్తుంటే శాస్త్ర ప్రకారం తెచ్చిన నల్లపూసలు విరాజ్ ప్రియ మెడలో అలంకరించాడు. 

 

ఆ తర్వాత కాలి వేళ్లకు మెట్టెలు పెట్టి, పాపిటి సిందూరం దిద్ది ప్రియా ని చూశాడు తన కాళ్లకు నమస్కరించమని. 

 

 

 

విరాజ్ కంట్రోల్లో ఉన్న మండపం మొత్తం ఒకసారి కళ్ళతో స్కాన్ చేసిన ప్రియా మనసు చంపుకొని విరాజ్ పాదాలు తాకి నమస్కరిస్తే పద్ధతి ప్రకారం తన తల మీద వేసిన అక్షింతలతో పాటు వెచ్చని ఆమె కన్నీళ్లు కూడా అతని పాదాలను అభిషేకించాయి. 

 

ఫోర్స్ గా ప్రియ రెక్క బిగించి లేపి తన పక్కన నిలిపి చేతిని బిగించి పంతులు వైపు తిరిగాడు.

 

 

 

ఇక మిగిలింది సప్తపది అరుంధతి దర్శనం ఆ తర్వాత అప్పగింతలు అని వరుస చెప్పినా పంతులు వేదమంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా బిగించిన కొంగు ముడులతో అగ్ని చుట్టూ సప్తపది చేయమని చెప్పారు.

 

అడుగు కాదు కదా అంగుళం కూడా వీరాజ్ వెనుక అనుసరించే ఆలోచన లేదు ప్రియా లో. 

 

అదే మండపం మీద హోమ గుండంలో అతన్ని తోసేయాలన్నంత కోపంతో రగిలిపోతుంది తను. 

 

 

 

ప్రియా పవిటి చెంగుకు బ్రహ్మ ముడులు వేసిన అతని భుజం మీద అంగ వస్త్రం ఒకపక్క తన భుజం మీద నుంచి కింద ఒక హ్యాండ్ తో బిగించి రెండువ పక్క పవిటి చెంగు బారు పైకి తీసి ప్రియా మెడ చుట్టూ ఒక వరుస చుట్టి ముందుకి అడుగు వేసాడు వీరాజ్. 

 

ఇప్పుడు అతని అడుగులో అనుసరించకపోతే ప్రియా మెడకి ఒరుసుకుంటూ ఊపిరిని బిగించేస్తుంది.

 

 

అమ్మ ప్రియా అని రేణుక గారు తల్లడిల్లిపోతుంటే నా బేబీకి ఏదైనా జరిగితే నిన్ను వదలను.. అని కోపంతో ఊగిపోతున్నారు రవికాంత్.

 

 

 

¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢

 

 

మరి లవర్ బాయ్ అలోక్..???

 

ఇక్కడ బలుపు బాబులు, సైకో బాబులు, బీస్ట్ బాబులు.. లేరమ్మ వీడు ఒట్టి బ్యాడ్ బాయ్ లా ఉన్నాడు. 

 

మీరే చూసుకోండి..

 

ఎంట్రీ ఇవ్వడమే పిల్ల మెడలో మూడు ముళ్ళు వేసి కిస్సులు కూడా కానిచ్చాడు.

 

కామెంట్స్ మస్ట్ బేబీస్..

మళ్లీ కలుద్దాం

_వర్ణ.