New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘5

ప్రియమైన శత్రువు💘5

 

 

 

ప్రియా మెడ చుట్టూ ఒక వరుస చుట్టి ముందుకి అడుగు వేసాడు వీరాజ్. 

 

ఇప్పుడు అతని అడుగులో అనుసరించకపోతే ప్రియా మెడకి ఒరుసుకుంటూ ఊపిరిని బిగించేస్తుంది.

 

 

అమ్మ ప్రియా అని రేణుక గారు తల్లడిల్లిపోతుంటే నా బేబీకి ఏదైనా జరిగితే నిన్ను వదలను.. అని కోపంతో ఊగిపోతున్నారు రవికాంత్.

 

 

 

 

ప్రియా ఒక చెయ్యి విరాజ్ చేతిలో బంధీగా మారింది, మిగిలిన రెండో చేత్తో విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే

 

విరాజ్ షి ఇస్ ఇన్నోసెంట్.. డోంట్ హార్ట్ హార్.. అని అరుస్తున్న అలోక్ ని నిర్లక్ష్యంగా చూస్తూనే ముందుకి మరో అడుగు వేయడమే వెనక తన ప్రమేయం లేకుండానే ఫాలో అయింది ప్రియ.

 

 

రాక్షస ఆనందంతో సప్తపది పూర్తి చేసిన విరాజ్ శాస్త్ర ప్రకారం అరుంధతి దర్శనం కూడా కావించి చివరిలో బ్యాలెన్స్ ఉన్న అప్పగింతలు కోసం ప్రియా పేరెంట్స్ ని చూశాడు. 

 

నా కూతురికి ఇష్టం లేకుండా జరిగిన ఈ రాక్షస వివాహం నేను ఆమోదించను, పోలీస్ కంప్లైంట్ చేసి నిన్ను రోడ్డుకి లాగుతాను అని ఆవేశంతో వార్నింగ్ ఇస్తున్నారు రవికాంత్. 

 

దానితో విరాజ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.. నీ బాబు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట.. ఇవ్వమంటావా..?? అని తెలుసు స్వరంతో ప్రియా ని ప్రశ్నిస్తూనే నడుము చుట్టి దగ్గరికి హత్తుకుని ఎదురుగా ఉన్న అలోక్ ని చూశాడు సూటిగా. 

 

విరాజ్ ప్లీజ్ షి ఈజ్ రియల్లీ వెరీ ఇన్నోసెంట్, తను ఏం చేసినా నాకోసం, నా విక్టరీ కోసమే చేసింది, నా మీద ప్రేమతోనే చేసింది. నీ కోపం ఏదైనా నా మీద చూపించు.. జస్ట్ లీవ్ ఆర్ అలోన్ అని కోపం అసహనం మేలవించి అరుస్తున్నట్టే అర్ధిస్తున్నాడు అలోక్. 

 

నాకోసం నా మీద ప్రేమతో అన్నదానికే విరాజ్ దవడ కండరాలు బిగుసుకుంటే.. వావ్ వాట్ ఏ ట్రూ లవ్ స్టోరీ, నా పెళ్ళాం మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్న నీకు కచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి అని అలోక్ గొంతు బిగించి ఆ పక్కనే ఉన్న గోడకి విసిరికొట్టడంతోనే అన్ కాన్షియస్ అయ్యాడు అతను.

 

కిందపడిన అలోక్ మీద కాలు ఎత్తడమే అవంతిక గారు మోకాళ్ళ మీద చేతులు జోడించారు.. వాడిని వదిలేయ్ విరాజ్. వాడికి అర్థం అయ్యేలా నేను చెబుతాను అంటూ. 

 

ఈ ప్రాసెస్ లో ఎక్కడ ప్రియ చేయి వదలలేదు విరాజ్.

 

ఇటువంటి రాక్షసులకు ఏం చెప్పినా ఎలా చెప్పినా అర్థం కాదు. మీరు అనవసరంగా ఏడ్చి వాడిని బెగ్ చేయకండి అని ఆవేశంతో అరుస్తూనే విరాజ్ చేతిన విడిపించుకుని అలోక్ ని తాకబోతున్న ఆఖరి క్షణం బిగించిన కొంగుముడి పవిట పట్టుకొని వెనక్కి లాగే అదే చీరతో తనని చుట్టి చేతులు కూడా కదలకుండా చేసాడు విరాజ్.

 

అతని చర్యకి తోక తొక్కిన త్రాచుపాముల తల ఎగరేసి బుసలు కొడుతుంది ప్రియా. 

 

నీ బాబు రాక్షస వివాహం అన్నాడు, నువ్వు రాక్షసుడివి అని సర్టిఫికెట్ ఇచ్చావు.. అంటూనే బొమ్మల చీర మధ్యన బిగించిన తనని ఒక్క చేత్తో లేపుకొని తీసుకెళ్లి రవికాంత్ ముందు నిలిపి ఈ రాక్షస వివాహానికి ముందు ఈ రాక్షసుడిని నీ కూతురు గాంధర్వ వివాహం చేసుకుంది. 

 

మసక చీకటిలో మల్లెపూలు లేని పట్టు పరుపు మీద రేయంత ఈ రాక్షసుడితో రాసలీలలు నడిపి తెల్లరి కోడి కూయగానే చప్పుడు చేయకుండా పారిపోయింది. అక్కడ నాతో రాసలీలలు ఇక్కడ ప్రియుడుతో మళ్ళీ పరిణయ బాసాలు.. తప్పు కదా మామ..?? 

 

ఇదేనా నీ పెంపకం.. ఆడపిల్లని అందులోనూ ఇంత అందంగా ఉన్న ఆడపిల్లని ఎలా పడితే అలా పెంచితే నాలాగే రాక్షస వివాహం చేసుకుంటాడు.. అని రవికాంత్ మీదకి కాస్త బెండ్ అయ్యి చెప్తున్న విరాజ్ మాడు కంగుమని తగిలింది ప్రియా తల. 

 

చేతులు కట్టేసి ఉండడంతో తన మీద నిందలు వేస్తున్న విరాజ్ ప్రతి మాటకి వస్తున్న కోపం తలతో తలని కొట్టి మరి చూపించింది. 

 

క్షణం కళ్ళు గట్టిగా బిగించి తల విదిలించి కళ్ళు తెరిచిన విరాజ్ ఎదురుగా నిప్పులు చెరుగుతున్న కళ్ళతో ప్రాణం తోడే అంతా ఆవేశంతో రగిలిపోతుంది ప్రియా. 

 

తన కోపానికి విరాజ్ కళ్ళు ఆర ఇంచ్ పెద్దవిగా మారితే.. చంపేస్తా ఇప్పుడే ఇక్కడే చంపేస్తా. నీ ఇష్టానికి నీ స్వార్థానికి నా క్యారెక్టర్ మీద మచ్చ వెయ్యాలని చూసావో ఇక్కడే చంపేస్తా.

 

నీ మీద అలోక్ గెలిచాడు, దానికి నేను హెల్ప్ చేశాను.. అలోక్ విక్టరీ తీసుకోలేని  నీ రాక్షస బ్రెయిన్ కి నా జీవితాన్ని చెరపట్టావు. ఆ విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు.. దానిని దాచి పెట్టి నన్ను నా కుటుంబాన్ని నా కారెక్టర్ ని నవ్వులపాలు చేయాలని చూస్తే వింటూ ఊరుకునేది లేదు. 

 

అవసరమైతే నిన్ను చంపి ఇది అబద్ధమని ఇక్కడే నిరూపిస్తా.. అని దెబ్బతిన్న పులిలా గాండ్రిస్తున్న ప్రియా గొంతు బిగించి దగ్గరికి తీసుకుని క్షణం పాటు తన కళ్ళల్లోకి లోతుగా చూసిన విరాజ్ కళ్ళు చిన్న వయ్యాయి. 

 

తన అభిమానాన్ని నిప్పుల రగులుతున్న కళ్ళల్లో నిండుగా నిలిపి ఉంచిన ప్రియా మీద నుంచి చూపుతిప్పి రవికాంత్ ని టార్గెట్ చేశాడు విరాజ్.

 

అప్పటికే దడదడలాడుతున్న గుండెని చేతితో బిగించి పట్టుకున్న ఆయనకి మాట రావడం లేదు. ఒక పక్క తన కూతురిని అన్ని కాలాలలో కాచుకున్న అలోక్ ఇప్పుడు సృహలో లేడు. 

 

తమ్ముడు మీద ద్వేషంతో తనను ఓడించాడన్న కోపంతో ప్రియా ను చెరబట్టిన విరాజ్ ను ఎదిరించే మనిషి లేడు.

 

ఆయనకు కూతురు ఎలా కాపాడుకోవాలో, ఈ ఉపద్రవం నుంచి ఇలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి.

 

 

 

 

¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢

 

 

 

కామెంట్స్ మస్ట్ బేబీస్..

మళ్లీ కలుద్దాం

_వర్ణ.