మనస💞వాచా – 5
అరిచేతితో గుండెని బిగించనట్టు విలవిలలాడిపోతున్న మేఘ కళ్ళు కన్నీళ్ళతో దారకట్టయి.
ప్లీజ్ డోంట్ క్రై, నువ్వు ఎంత ఏడిస్తే వాడు అంత ఎక్కువ చేస్తున్నాడు.. అని రిత్విక్ కన్సోల్ చేస్తూనే ఉన్నా తనని తోసుకుంటూ కారు దగ్గరికి వెళ్లి పోయిన మేఘ.. ఇక్కడ ఎవరి కోసం టైం అండ్ ఎమోషన్స్ వేస్ట్ చేసుకోవలసిన అవసరం నాకు లేదు. నువ్వు వస్తున్నావా లేదా..?? అని అరిచింది.
డ్రైవింగ్ సీట్ సైడ్ వచ్చిన అర్జున్ కాలర్ బిగించి.. రెడీ టు పే ఫర్ ఎవ్రీథింగ్. మేఘ ను నువ్వు ఎంతగా ఏడిపించావో దానికి టు టైమ్స్ పెయిన్ నీకు ఇస్తా.. అని లాయర్ అని కూడా మర్చిపోయి వార్నింగ్ ఇస్తున్న రిత్విక్ ని ఒక ఐ బ్రో రైస్ చేసి సీరియస్ గా చూశాడు అర్జున్.
వాట్.. అని మరింత ఎమోషన్ అవుతూ ఆరోజు నేను కూరలో కరివేపాకుని కావచ్చు. బికాస్ తను నిన్ను నమ్మింది. రైట్ నౌ ఐ యామ్ నాట్ కరివేపాకు, షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యు.
సో నా మరదలు కి బావగా, నా మరదలు కి లాయర్ గా, ఇంకా ఫ్యూచర్ హస్బెండ్ గా ఇప్పుడు నేను మాట్లాడతాను.
నువ్వు వినాలి వింటావు, ప్రతి దానికి ఆన్సర్ చెప్తావు.. అని వార్నింగ్ ఇస్తుంటే సింగల్ హ్యాండ్ తో రిత్విక్ ని గుండెల మీద హ్యాండ్ తో వెనక్కి తోసాడు.
ఆ చిన్న మూమెంట్ కే మూడు అడుగులు వెనక్కి వెళ్లిన రిత్విక్ కోపంగా చూస్తుంటే తనకోసం రెండు అడుగులు క్లోజ్ గా వచ్చిన అర్జున్.. బ్రో నువ్వు నాకన్నా అన్నింటిలో సీనియర్ వే, బట్ దాని మొగుడుగా నేనే సీనియర్ ని. లాయర్ గా నువ్వు 100 చెప్పు 100 వింటాను.
బట్ బావని, ఫ్యూచర్ మొగుడ్ని అని చెప్పడానికి ముందు దాని దగ్గర చెప్పు. అది ఇచ్చిన ఆన్సర్ తెచ్చి నాకు చెప్పు.. అప్పుడు నువ్వు చెప్పే ప్రతిది చేతులు కట్టుకొని వింటాను.
ఎగ్జాక్ట్లీ కూరలో కరివేపాకులా నువ్వు చెప్పింది మాత్రమే వింటాను.
అప్పటివరకు పైన కింద అన్ని మూసుకొని నా పెళ్ళాం పే చేస్తున్న ఫీజు కి నీ డ్యూటీ మాత్రం చెయ్.. అని రిత్విక్ గుండెల మీద వేలుతో పొడుస్తూ లాస్ట్ డైలాగ్ చెప్పిన అర్జున్, అటు తిరిగి ఉన్న మేఘా ని వెనుక నుంచే కళ్ళతో పాయింట్ చేస్తూ ట్రై చెయ్.. అని మీసాల వంపున పొగరు నవ్వు మెరిపిస్తూ కార్ ఎక్కేసాడు.
మెగా ఫ్యూచర్ తన ఇష్టం, బట్ తనకి ఈ పెయిన్ ఇచ్చిన నిన్ను మాత్రం వదలను. మేఘ హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేస్తాను.. అని కచ్చిగా శపధం చేసుకున్న రిత్విక్ కార్ ఎక్కడమే ఎందుకు వాడిని కొట్టావ్..?? అని సీరియస్ గా తన పక్కనే కూర్చున్న మెఘ ను ప్రశ్నించాడు.
ఐ హేట్ హిం.. ఇప్పుడు వాడి గురించి డిస్కషన్ చేస్తే నిన్ను కూడా కొడతా అని రెండు చేతులతో తల బిగించి గట్టిగా అరిచి చెప్పిన మేఘ ను బాధగా .. ఐ యాం సారీ అని దగ్గరికి తీసుకొని కన్సోల్ చేస్తూ స్టేట్ కామ్, వాడి సంగతి నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేశాడు రిత్విక్.
కార్ కోర్టు ప్రిమిసెస్ దాటుతుండగానే కుండపోతా మొదలైంది.
సైడ్ విండో నుంచి జారుతున్న వర్షం ధారా చూస్తూ ఉండిపోయింది మేఘ.
చీకటి పడుతుండగా ఇంటికి రీచ్ అయ్యారు అర్జున్ ఇంకా ధాత్రి.
జోరుగా పడుతున్న వర్షం లో గేట్ ముందు కార్ ఆపి దిగి వెళ్లి గేట్ ఓపెన్ చేసిన అర్జున్ మళ్లీ వచ్చి కార్ లోపలికి తీసుకొచ్చి ఆపాడు.
వన్ మినిట్ అంటూనే ఫాస్ట్ గా కారు దిగి తిరిగి వచ్చి డోర్ తీసిన అర్జున్ వర్షం పడకుండా అంబ్రెల్లా పట్టుకున్నాక పాపతో దిగింది దాత్రి.
మెయిన్ డోర్ వరకు తనని పంపించి నువ్వు లోపలికి వెళ్ళు వస్తున్న.. అని అంబ్రెల్లా క్లోజ్ చేసి పక్కన పెట్టేసిన అర్జున్ అంత వర్షం లోను మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ క్లోజ్ చేసి ఆ తర్వాత కార్ పార్క్ చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది ధాత్రి.
ఇలాగే ప్రతిదానికి అర్జున్ ముందు ఉండి తనని ఎక్కడ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చాడు.
అందులో పాప మీద ప్రేమతో పాటు తన మీద ఉన్న కేరింగ్ కి తడి తెరుతున్న కళ్ళతో ఇష్టంగా చూసుకుంటుంది ధాత్రి.
నీళ్లు కారుతున్న జుట్టుని వేళ్ళతో వెనక్కి తోసుకుంటూ పెద్దపెద్ద అడుగులతో వస్తున్న అర్జున్ ఒంటిమీద షర్ట్ అతని మస్కిలర్ బాడీకి అతుక్కుపోయి మరింత సెక్సీగా కనిపిస్తున్నాడేమో.. దగ్గరికి వచ్చిన అతని మీద నుంచి కళ్ళు ఇబ్బందిగా పక్కకు తిప్పేసింది ధాత్రి.
లోపలికి వెళ్ళమన్నాను కదా.. అని అడిగిన అతనికి రెండు చేతులతో పాపని ఎత్తుకున్న తన పొజిషన్ బరువైన కంటి రెప్పలతో ఇబ్బందిగా చూపించింది.
తడిసిన తన బాడీని చూసుకొని.. ఇబ్బందిగా ఉందా..?? అని అడిగిన అర్జున్ తో కన్నబిడ్డ ఇబ్బంది ఎలా అవుతుంది అర్జున్ ..?? అని చెప్తూనే హ్యాండ్ బ్యాగ్ వైపు చూపించింది కీస్ తీసుకోమని.
ππππππππππππππππππππππππππππππππππ
కామెంట్స్ మస్ట్ బేబీస్.
Thank You
__వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages