New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ 1

మిస్టర్ మాన్స్టర్ 1

                          మిస్టర్ మాన్స్టర్ 1 

 

 

సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. 

 

సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..

 

శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.

అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. 

 

బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.

 

బయట ఒక భారీ బ్లాక్ రోల్స్ రాయల్ కారు శబ్దం వినిపించింది. అది కారు కాదు, రోడ్డు మీద నడిచే ఒక నల్లని చిరుతపులిలా ఉంది. 

 

కారు ఆగింది. డోర్ తెరుచుకోగానే మెరిసిపోయే నల్లటి బూట్లు నేల మీద పడ్డాయి. ఆ అడుగుల శబ్దం ఆఫీస్ చివరి వరకు వినిపిస్తున్నట్టు ఉంది. 

 

అతను నడుచుకుంటూ వస్తుంటే, అక్కడ ఉన్న ఏ ఒక్క వ్యక్తికీ అతని కళ్లలోకి చూసే ధైర్యం లేదు. అందరూ గుడ్ మార్నింగ్ చెపుతున్నారు.

 

అతను ఎవరినీ పలకరించడు, ఎవరి వైపు చూడడు. అతని చూపు కేవలం తన లక్ష్యం వైపు మాత్రమే ఉంటుంది.

 

అతను నడుస్తున్నప్పుడు అతని వెనుక నలుగురు బాడీగార్డ్స్, ముగ్గురు సెక్రటరీలు పరుగున వస్తున్నారు. అతని వేగాన్ని అందుకోవడం ఎవరి వల్లా కావడం లేదు.

 

నేరుగా బోర్డ్ మీటింగ్ రూమ్‌లోకి ప్రవేశించాడు. అక్కడ దేశంలోని టాప్ బిజినెస్ మేగ్నెట్స్ కూర్చుని ఉన్నారు. అందరూ అతని కోసం 30 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారు.

 

అతను రాగానే అందరూ రోబోల్లా లేచి నిలబడ్డారు.

అతను తన సీట్లో కూర్చుని, ఎదురుగా ఉన్న ఫైల్‌ని ఒక్కసారి చూశాడు. 

 

ఆ తర్వాత నెమ్మదిగా తల పైకెత్తి అక్కడ ఉన్న సీనియర్ బిజినెస్ మ్యాన్ వైపు చూశాడు. ఆ చూపులో ఒక రకమైన క్రూరత్వం ఉంది.

 

ఈ డీల్ ప్రకారం నాకు 80 శాతం వాటా కావాలి, అన్నాడు చాలా లోతైన, గంభీరమైన స్వరంతో.

కానీ.. సర్ ఇది అన్యాయం.. 

 

మేము 50 శాతం అనుకున్నాం అని ఆ పెద్దాయన తడబడుతూ అన్నాడు.అతను ఒక్క క్షణం ఆగి, తన కోటు జేబులో ఉన్న ప్లాటినం పెన్‌ని తీసి టేబుల్ మీద గట్టిగా గుచ్చాడు. 

 

ఆ శబ్దానికి ఆ గదిలో ఉన్న వారందరి గుండెలు ఆగిపోయినంత పని అయింది.న్యాయం గురించి మాట్లాడటానికి ఇది కోర్టు కాదు. ఇది వర్మస్ ఎంపైర్ 

 

ఇక్కడ నా మాటే న్యాయం. నాతో చేతులు కలిపితే నువ్వు బతుకుతావు, నన్ను ఎదిరిస్తే నీ కంపెనీ రేపు ఉదయానికి అడ్రస్ లేకుండా పోతుంది. సంతకం పెట్టు అని గర్జించాడు.

 

అతనిలో ఉన్న ఆ అహంకారం, ఆ రాజసం చూస్తుంటే అతను ఒక మామూలు మనిషిలా లేడు.. ఒక మృగంలా ఉన్నాడు. 

 

అందుకే అందరూ అతన్ని ఇషాంత్ భూపతి రాజు అని పిలవడానికి కూడా భయపడతారు.పని ముగించుకుని అతను తన ఫ్యామిలీ ఉండే భారీ భవంతులకు వెళ్ళలేదు. 

 

నగరానికి దూరంగా ఒక కొండ పైన ఉన్న తన పర్సనల్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళాడు. అక్కడ అతను ఒక్కడే ఉంటాడు. అతని తండ్రి ఈశాంత్ చిన్న వయసులోనే చనిపోయారు. 

 

తల్లి సుమిత్రా దేవి, పెద్దమ్మ దేవిక, పెద్దనాన్న రఘువీర భూపతి రాజు గారు అందరూ కలిసి ఉండమని ప్రాధేయపడినా, అతను ఎవరి మాట వినలేదు.

 

సింహం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. మందలో ఉంటే అది తన పవర్‌ని కోల్పోతుంది అని తన తాతయ్య చెప్పిన మాటలని అతను తు.చ తప్పకుండా పాటిస్తాడు.

 

ఆ గ్లాస్ హౌస్ లో నిలబడి వైన్ గ్లాస్ పట్టుకుని కింద ఉన్న సిటీని చూస్తుంటే, ఆ సిటీ అంతా తన కాళ్ళ కింద ఉన్నట్టు అతనికి అనిపిస్తోంది. 

 

కానీ అతని చుట్టూ జరుగుతున్న కుట్ర అతనికి తెలీదు. అతని బాబాయ్ ప్రతాప్ భూపతి రాజు ఆ గెస్ట్ హౌస్ వైపు చూస్తూ ఒక క్రూరమైన ప్లాన్ వేస్తున్నాడు. 

 

నువ్వు ఎంత ఎత్తుకు ఎగిరినా ఇషాంత్.. నిన్ను కిందకి పడేసే తాడు నా చేతిలో ఉంది అని ప్రతాప్ ముఖంలో విషపు నవ్వు చిందించాడు.

 

                         కొనసాగుతుంది….

ఇదండీ మన హీరో గారికి క్యారెక్టర్ అహంకారానికి, అధికారంకి బ్రాండ్ అంబాసిడర్. రేపు మన హీరోయిన్ పాపా ని తీసుకొస్తాను. ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…

 

ఇది నా కొత్త స్టోరీ అండి ఒకసారి చదివి ఎలా ఉందో కొంచెం కామెంట్స్ లో చెప్తారని అనుకుంటున్నా.ఇది నా కొత్త స్టోరీ మిగతా స్టోరీ లాగే దీన్ని కూడా ఆధారిస్తారని కోరుకుంటున్నా….

 

 

నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో….

 

ఆ అమ్మాయి  గాఢ నిద్రలో ఉంది. అప్పుడే ఆమె తల్లి పద్మ వంటగదిలో గిన్నెలతో చేసే శబ్దం, దేవుడి గదిలో నాన్న రామకృష్ణ చదివే శ్లోకాలు ఆ ఇంటికి ఒక జీవం పోస్తున్నాయి.