అన్విక రిసార్ట్ నుండి ఇంటికి రాగానే ఆ రోజంతా జరిగిన అల్లరిని వాళ్ళ వాసవి గారికి, నాన్న శ్రీనివాస్ గారికి, అన్నపూర్ణమ్మ గారికి కథలు కథలుగా చెప్పింది.
అందరూ కలిసి నవ్వుకుంటూ డిన్నర్ పూర్తి చేసి, అన్విక తన గదిలోకి వెళ్లి హాయిగా నిద్రపోయింది. ఆ క్షణం ఆమెకు తెలియదు, రేపటి సాయంత్రం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మలుపు తిరగబోతోందని.
మరుసటి రోజు ఉదయం, సామ్రాట్ మెన్షన్‌లో వాతావరణం కొంచెం వేడెక్కి ఉంది. రణ్వీర్ ప్లాన్ చేసిన ఫ్యామిలీ అవుటింగ్ అర్జెంట్ ఆఫీస్ మీటింగ్ వల్ల క్యాన్సిల్ అయ్యింది.
అన్నా నువ్వు ఎప్పుడూ ఇంతే. వారం రోజుల ముందే చెప్పాను కదా, ఈరోజు మనం బయటకి వెళ్లాలని. నీకు ఎప్పుడూ బిజినెస్సే ముఖ్యమా అనిత కోపంతో ఊగిపోతోంది.
రణ్వీర్ శాంతంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. అనిత, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, నేను ఉండాలి. ప్లీజ్ అర్థం చేసుకో.