మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 1
RR ఇండస్ట్రీస్ ముందు కార్ ఆగుతుంది. దాంట్లో నుంచి దిగుతాడు అరుఅడుగుల అందగాడు వాడి అందం ఎంత ఉందొ వాడి పొగరు ఆటిట్యూడ్ అంతే ఉంటాయి.స్టైల్ గా పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకుని ఆటిట్యూడ్ గా నడుచు కుంటూ వచ్చి లిఫ్ట్ లో తన కేబిన్ కి వెళ్తాడు రుద్రాన్ష్ రాథోడ్ ఆ కంపెనీ సీఈఓ మన హీరో గారు.
రుద్ర pa ని పిలిచి షెడ్యూల్ చెప్పు అని అడుగుతాడు.
చరణ్ సార్ మీకు @@@@@@ ఆ హోటల్ లో మీటింగ్ ఉంది అని చెప్తాడు.
రుద్ర ఎన్ని గంటలకి అని అడుగుతాడు. 1 కి సార్ అని చెప్తే మళ్ళీ ఒకసారి గుర్తు చెయ్ అని చెప్పి లాప్టాప్ లో వర్క్ లో పడిపోతాడు రుద్ర….
చరణ్ తన సీట్ లో కి వెళ్లి వర్క్ లో పడిపోతాడు.
12 కి రుద్ర దగ్గరికి వెళ్లి సార్ మీరు మీకు మీటింగ్ టైం అవుతుంది అని చెప్తాడు.
రుద్ర ఓకే అని చెప్పి లేచి తన హెయిర్ సెట్ చేసుకుంటూ బయటికి వచ్చి తన ప్రైవేట్ లిఫ్ట్ కి లోకి వెళ్లి కిందకి తన కార్ లో హోటల్ కి వెళ్తాడు.
రుద్ర మొబైల్ చూసుకుంటూ ఒక అమ్మాయి కి డాష్ ఇస్తాడు. ఒక సెకండ్ ఆగి తన ముఖం కుడా చూడకుండా సారీ చెప్పి వెళ్ళబోతాడు కానీ ఆ అమ్మాయి నీకు బుద్ది లేదా డాష్ ఇచ్చి మళ్ళీ చూడకుండా మాట్లాడతావ్ ఇంత ఆటిట్యూడ్ ఏంటి నీకు ముందు నీ అమ్మ బాబు ని అనాలి అని మాట పూర్తి కాకముందే చెప్పాలి పగులుతుంది రుద్ర చేతి లో ఆ అమ్మాయికి.
హేయ్ ఇడియట్ నన్నే కొడతావా అని అరుస్తుంది. రుద్ర షట్ up ఇంకో మాట నీ నోట్లో నుంచి వచ్చింది ఇక్కడే నీ ప్రాణం తీస్తా పో ఇక్కడ నుంచి అన్ని తిట్టేసి తను మీటింగ్ కోసం బుక్ చేసిన ప్రైవేట్ రూమ్ కి వెళ్తాడు రుద్ర.
ఇక్కడ ఆ అమ్మాయి ఇడియట్ ఎవడో వీడు మా అమ్మనాన్న కుడా కొట్టలేదు మోనార్క్ ఈడు ఎంత గట్టిగ కొట్టాడు సచ్చినోడు అని తిట్టుకుంటూ వెళ్లి పోతింది ఆ అమ్మాయి.
రుద్ర అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళు రాకపోయే సరికి చరణ్ కి కాల్ చేసి వాళ్ళు ఇంకా ఇక్కడకి రాలేదు కాల్ చేసి కనుక్కో అని చెప్పి చరణ్ మాట వినకుండా కాల్ కట్ చేస్తడు రుద్ర.
చరణ్ వాళ్ళకి కాల్ చేసి ఇంకా రాలేదు అని అడిగి వాళ్ళు 5 మినిట్స్ చెప్పడం తో మళ్ళీ రుద్ర కి కాల్ చేసి సార్ 5 మినిట్స్ లో ఉంటారు అని చెప్పడం తో ఓకే అని చెప్తాడు.
వాళ్ళు చెప్పినట్టే 5 మినిట్స్ కి వాళ్ళు రావడం సారీ సార్ లేట్ అయ్యింది అని చెప్తే హ్మ్మ్ అని రుద్ర అనగానే వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్సప్లయిన్ చేస్తారు అది రుద్ర కి నచ్చక కాన్సల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ ఆఫీస్ కి.
రుద్ర ఎంట్రీ ఇవ్వగానే ఆఫీస్ లో అమ్మాయి లు కొరుక్కుతినెలా చూస్తారు.
అది గమనించిన రుద్ర ఒక షార్ప్ లుక్ ఇస్తే అందరు తల దించుకుని వర్క్ చేసుకుంటారు..
రుద్ర వీళ్ళు నన్ని ఇలా చూస్తుంటే అది మాత్రమే నన్ను అన్ని మాటలు అంటుందా అని మనుసులో ఆకుంటాడు.
రుద్ర ఆలా ఈవెనింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్తాడు.
హాల్లో నే రుద్ర వాళ్ళ అమ్మ దేవయాని గారు ఉంటారు.
రుద్ర వెళ్లి వాళ్ళ అమ్మ ఒడిలో పడుకుంటాడు. దేవయాని గారు ఏమి అయ్యింది కన్నయ్య అంటూ హెడ్ మసాజ్ చేస్తారు.
ఏమి లేదు మా అని చెప్పి అలాగే పడుకుంటాడు.
రుద్ర ని ఆలా చూసి న కొడుకు ఇంకా చిన్న పిల్లడే అనుకుంటూ ఉండగా.
హ నీ కొడుకు ఇంకా పాలు తాగే పిల్లడు అంటూ అక్కడికి వస్తారు దేవేంద్ర గారు.
మీకు ఎందుకు నా కొడుకుని చుస్తే కుళ్ళు అని అంటారు దేవయాని గారు.
నిన్ను నీ కొడుకుని చూసే కుళ్ళు కోవాలి అంటూ దేవేంద్ర గారి ఒడిలో సెటిల్ అవుతుంది రిత్విక.
దేవేంద్ర గారు అవును కదా బంగారం అంటూ కూతురి మాటకి ఒత్తస్ పలుకుతారు.
వీళ్ళ మాటలకి లేచిన రుద్ర చెల్లిని చూస్తూ నిన్ను చెత్త కుప్పలోనుంచి తెచ్చారు అంట అమ్మనాన్న అని చెల్లి ని ఏడిపిస్తాడు రుద్ర.
చూడు నాన్న అన్న ఎం అంటున్నాడో అని కంప్లెయింట్ ఇస్తుంది రుద్ర మీద నాన్నకి.
రుద్ర నా కూతురు బంగారం ఈ కోటకి మహారాణి మీరు ఇద్దరు న కూతురి సర్వేంట్స్ అని చెప్తారు దేవేంద్ర.
రుద్ర దేవయాని గారు దేవేంద్ర వైపు కోపం గా చుస్తే వాళ్ళ చూపులు తప్పించు కుని బంగారం నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి లేస్తాడు దేవేంద్ర.
డాడీ నన్ను బయటికి తీసుకు వెళ్ళండి డాడ్ అంటుంది రిత్విక.
హేయ్ కోతి నాన్న వర్క్ మీద బయటికి వెళ్లి వచ్చాడు టైడ్ అయ్యి ఉంటాడు రెస్ట్ తీసుకుని. నువ్వు రూమ్ కి వెళ్లి చదువుకో అని చెప్తాడు రుద్ర.
డాడీ అని రాగం తీస్తూ బుంగమూతి పెడుతుంది రిత్విక.
దేవేంద్ర గారు సరే బంగారం ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్దాం అంటే దేవయాని మరి నేను అంటుంది.
నిన్ను నీ కొడుకుని తీసుకెళ్లామను నేను నాకు కూతురిని తీసుకెళ్తా్ అని చెప్పి బంగారం నువ్వు రెడీ అయ్యి రా అని రూమ్ కి వెళ్తాడు.
రిత్విక రుద్ర ని వాళ్ళ అమ్మ ని ఎక్కిరించి పైకి వెళ్తుంది.
దేవాయని రుద్ర వైపు చుస్తే రుద్ర అమ్మ మనం అసలు తగ్గద్దు రెడీ అయ్యి ఉండు అని చెప్పి తను రెడీ అవ్వడానికి తన బెడ్ రూమ్ కి వెళ్తాడు రుద్ర…
కంటిన్యూ…..
అందరు కలిసి బయటికి వెళ్తారో లేదో next పార్ట్ లో చూద్దాం…
🫣🫣🫣🫣🫣
స్టోరీ నచ్చితే ఒక్క కామెంట్…. 🫣🫣
Swipe left/right or tap the sides to turn pages