రావమ్మా.. మహాలక్ష్మి – 5
ఏంటి అలా చూస్తున్నారు?? ఈ ఆస్థి మా రక్తమే అనుభవించాలి.. ఇది నా స్వార్థం కావొచ్చు మరేదైనా కావొచ్చు.. కానీ.. నా భర్త, నా బిడ్డ కష్టార్జితం అయిన ఈ ఆస్థి ఎప్పటికి.. ఏ ఒక్కరికో అనాచితo గా దక్కకూడదు.. అంది ఆమె స్థిరంగా.
అప్పుడే అక్కడికి వచ్చిన వీర్, నిర్మల షాకింగ్ గా ఆమె వైపు చూస్తున్నారు.
కానీ అంజనీ దేవిగారు.. మీ బిడ్డ ఆనంద్, అతని బిడ్డ శరత్ చంద్ర కూడా చనిపోయారు.. మీరే కళ్లారా చూసారు.. కాని ఇప్పుడు మీరూ.. అని ఆగిపోయాడు జగన్నాధం.
నేనేమి పిచ్చిదాన్ని కాదు లాయర్ గారు.. అన్ని ఆలోచించి చెబుతున్నాను.. ఆనంద్ కి వారసులు ఉన్నారు.. ఆడబిడ్డ లేదా మగబిడ్డ నాకు ప్రస్తుతానికి తెలీదు.. కానీ ఆనంద్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఉన్నారు.. అంది అంజనీదేవి గంభీరంగా.
ఏమంటున్నావ్ అమ్మమ్మ.. నిజంగా నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావ్.. అంటూ ముందుకి వచ్చాడు వీర్.
వీర్.. నేనేం పిచ్చిదాన్ని కాదు.. నే చెప్పేది నిజం.. ఆనంద్ కి నీలిమ తో పెళ్ళికి ముందే ఒక ఆమె తో పెళ్లి జరిగింది.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. ఆనంద్ మమ్మల్ని కాదని ఆమెని పెళ్లి చేసుకున్నాడు.. అంది బాధగా అంజనీదేవి.
నిర్మల కి కళ్ల ముందు కట్టుకున్న కలల సౌధం కూలిపోతున్నట్టు ఉంది.
వీర్ ఆశ్చర్యం గా చూస్తున్నాడు.
మరి నీలిమ గారిని ని ఆనంద్ గారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు?? లాయర్ అడిగిన ప్రశ్న ఆఁ నిశ్శబ్దం లో బాంబు లా పేలింది.
చిన్నగా నిట్టూర్చి.. మా అంతస్థు కి సరిపడని అమ్మాయి.. వాళ్లిద్దర్ని విడదీసిన పాపం.. నేడు ఈ శిక్ష అనుభవిస్తున్నాను ఏమో.. అంది మెల్లిగా అంజనీదేవి.
నాకేం అర్ధం కావడం లేదు అమ్మమ్మా.. అన్నాడు వీర్.
నిర్మల నిరాశ గా చూస్తుంది.
ఇన్నాళ్లు నేను ఆఁ విషయం కూడా గుర్తు పెట్టుకోలేదు వీర్.. ఆనంద్ మనసు పొరల్లో ఒక జ్ఞాపకం లా ఆమె ఉందేమో.. తన పేరు.. తన పేరు కూడా గుర్తులేదు.. కానీ ఆనంద్, ఆమె విడిపోయి నప్పుడు ఆమె గర్భం దాల్చి ఉంది.. అంది అంజనీదేవి.
ఆనంద్ మావయ్య తనని వదిలేసాక ఆమె తన గర్భాన్ని వదిలించుకుని ఉండొచ్చు.. ఇంకో పెళ్లి చేసుకోను వచ్చు.. అమ్మమ్మా.. ఇప్పుడు సడెన్ గా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు..?? అన్నాడు వీర్.
9 నెలల గర్భవతి.. ఆ బిడ్డ ని కనే ఉంటుంది.. ఒకవేళ బిడ్డని ఏదైనా అనాధ ఆశ్రమం లో ఉంచిన ఆఁ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి.. ఆనంద్ కి కొడుకు లేదా కూతురు ఎవరు పుట్టి ఉన్నా సరే.. వాళ్లు ఆనంద్ ఆస్తికి వారసులు.. దానికి సాక్ష్యం..ఈ డైరీ.. అని లాయర్ ముందుకి ఒక డైరీ పెట్టింది ఆమె.
”ఇదే వీర్… ఆనంద్ దాచిపెట్టిన నిజం,” అంటూ ఆ డైరీని తెరిచింది. అందులో ఒక యువతి ఫోటో, ఆమె రాసిన చివరి ఉత్తరం ఉన్నాయి. “నీలిమతో పెళ్లి అయ్యాక కూడా, ఆనంద్ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. ఆమెకి పుట్టిన బిడ్డకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని, తన ఆస్తిలో సగం వాటా రాస్తూ ఆనంద్ కొన్ని రోజుల క్రితమే వీలునామా రాశాడు. ఆ విషయం నాకు నిన్ననే ఈ డైరీ చదివినప్పుడు తెలిసింది.” అంది ఆమె.
ఆ మాట వినగానే లాయర్ జగన్నాధం కళ్లద్దాలు సర్దుకుంటూ ఆ డైరీని పరిశీలించసాగారు. “ఇది నిజంగా ఆనంద్ గారు సంతకం చేసిన వీలునామానే… ఇందులో ఎలాంటి సందేహం లేదు!” అన్నారు ఆశ్చర్యంగా.
నిర్మల కాళ్లు వణికిపోయాయి. ఇన్నాళ్లూ ఈ ఆస్తి తమ కుటుంబానికే దక్కుతుందని కన్నా కలలన్నీ ఒక్కసారిగా చిద్రమైపోతుంటే ఆమె నోట మాట రాలేదు. “పెద్దమ్మ .. ఇన్నాళ్లు అందని దానికోసం ఇప్పుడు ఇలాంటి గాలి వార్తలను నమ్మి మా బతుకులతో ఆడుకోవద్దండి!” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
”ఇది గాలి వార్త కాదు నిర్మలా… ఆనంద్ రక్తానికి దక్కాల్సిన హక్కు. ఆ బిడ్డ ఎక్కడున్నా వెతికి పట్టుకోవాల్సిందే,” గంభీరంగా అన్నారు అంజనీదేవి.
వీర్ ఆ డైరీ అందుకుని చూసి.. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారో మనకెలా తెలుస్తుంది అమ్మమ్మా.. అన్నాడు.
ఇంత డబ్బు ఉందిగా.. వాళ్ళేక్కడ ఉన్నారో తెలుసుకో వీర్. ఆనంద్ వైజాగ్ లో చదువుకున్నాడు.. ఆమె కూడా అదే కాలేజీ.. ఆనంద్ తో చదువుకున్న వాళ్ళ వివరాలు నాకు కొంతమందివి తెలుసు.. వాళ్ళ ద్వారా విషయం తెలుసుకో.. ఆనంద్ కార్యక్రమం జరిగేలోగా వాళ్లు ఇక్కడుండాలి.. ఇది.. నా ఆజ్ఞ.. అని విసురుగా అక్కడ్నించి వెళ్ళిపోయింది ఆమె.
లాయర్ కళ్ల జోడు సరిచేసుకుంటూ.. ఈ ఆస్థి మీకు దక్కాలి అంటే ఆనంద్ మొదటి భార్య కి ఒక ఆడపిల్ల పుట్టుండాలి.. అదే మగ పిల్లాడు అయితే.. అని చిన్నగా నవ్వి అక్కడ్నించి వెళ్ళిపోయాడు అతడు.
ఏంటమ్మా ఇది.. అన్నాడు వీర్ అసహనం గా.
వీర్.. ఈ ఆస్థి నీకు దక్కుతుంది అనుకున్నాను.. మా పెద్దమ్మ మామూల్దీ కాదు.. వద్దనుకున్న బంధం కలుపుకోవాలి అనుకుంటుంది.. లాయర్ చెప్పింది నిజమే.. అందులో మొదటి పాయింట్ నాకు బాగా నచ్చింది వీర్. పెద్దమ్మ కి మిగతా ఏ వివరాలు తెలియవు.. నాకు ఒక ఆలోచన వచ్చింది.. అంది నిర్మల.
ఏంటమ్మా అది..?? అన్నాడు.
వాళ్ళని వెతికినట్టు నటించు.. ఎవరో ఒక అమ్మాయినే సెట్ చేద్దాం.. ఆస్థి తనది అనిపించుకున్నాక… నువ్వు పెళ్లిచేసుకో.. అవసరం తీరాక ఆ అమ్మాయిని వదిలించుకోవొచ్చు.. అంది నిర్మల.
అమ్మమ్మ నమ్ముతుంది అనుకున్నావా..డి ఎన్ ఏ టెస్ట్ చేపిస్తుంది.. అప్పుడు మనం మోసం చేసాము అనిపిస్తే.. షూట్ చేసి పడేస్తుంది.. అసహనం గా అన్నాడు వీర్.
డబ్బుతో అవన్నీ మేనేజ్ చేయొచ్చు వీర్.. ముందు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు.. అంది నిర్మల.
హ్మ్.. రేపు నేను వైజాగ్ బ్రాంచ్ కి వెళ్లాల్సిన పని ఉంది అమ్మ.. ఆ పని అయ్యాక.. చూస్తాను.. అన్నాడు వీర్.
వీర్.. ఇప్పుడు అవి కాదు ఇంపార్టెంట్.. 1000 కొట్లు.. దీని గురించి ఆలోచించు.. ముసల్ది తేడా చేస్తే సైలెంట్ గా లేపేస్తాను.. అంతేగాని ఈ ఆస్థి వదిలేది లేదు.. అంది నిర్మల.
***** ****** ********
దేవుడా.. ఫస్ట్ షో కి టికెట్స్ దొరక్క సెకండ్ షో కి వెళ్ళాము.. అత్తయ్య కి తెలిస్తే అంతే.. అంది బండి దిగుతూ మహా.
ఇక్కడ్నుంచి బండి నడిపించుకుంటూ వెల్దాము.. సౌండ్ ఉండదు కదా.. నువ్వు సైలెంట్ గా సందులోంచి వెళ్ళిపో.. నేను కాసేపాగి వస్తాను అన్నాడు విష్ణు.
సరే.. సరే.. బండి పక్కనే నడవసాగింది మహా.
చల్లగాలి రివ్వుమని తగులుతుంది.
దారిలో ఎవరు లేరు.. అక్కడక్కడా కుక్కలు నిద్రపోతు.. లేచి వీళ్ళని చూసి.. ఆఁ తెలిసినోళ్లే అనుకుంటూ నిద్రపోతున్నాయి.
విష్ణు, మహా వైపు చూసాడు. గాలికి ఎగురుతున్న ముంగురులతో అందంగా ఉంది ఆమె.
మహా.. నిన్నో విషయం అడగనా.. అన్నాడు విష్ణు.
అతడి వైపు చూసి.. హ్మ్.. సరే.. అడుగు.. అంది ఆమె.
నన్ను పెళ్లిచేసుకుంటావా.. అన్నాడు ఆమె వైపు చూస్తూ విష్ణు.
అతడి వైపు ఒక్కసారి అదోలా చూసి.. బావుంది జోక్.. అంది మహా.
బండి ని అలానే పట్టుకుని ఆపి.. లేదు మహా.. నేను సీరియస్ గా అడుగుతున్నాను.. నీకు నేనంటే ఇష్టమా కాదా..?? అన్నాడు విష్ణు.
అతడి వైపు సీరియస్ గా చూసి.. నువ్వంటే నాకు చాలా ఇష్టం విష్ణు.. కానీ నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు.. అంది మహా.
ఏమంటున్నావ్ మహా.. అన్నాడు విష్ణు సీరియస్ గా.
ఇంకా ఉంది
Swipe left/right or tap the sides to turn pages