రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 1
నో లాయర్ గారు !! మీరు ఎన్ని చెప్పినా నేనైతే నా డెసిషన్ మార్చుకోలేను నాకు మా ఆయనతో డివోర్స్ కావాల్సిందే మీరు ఇప్పించగలరా చెప్పండి లేదంటే మేము వేరే వాళ్ళని అప్రోచ్ అవుతాము అని కరాకండిగా చెప్పేస్తుంది మధుమిత.
అదేంటమ్మా అలా అంటావ్ నీ మొండితనం కాకపోతే మీ ఆయన ముక్కు మీద ఉన్న మచ్చ నీ విడాకులకి కారణం కావడం ఏదైనా నమ్మశక్యంగా ఉందా ?? ఎవరికైనా చెప్తే నవ్విపోతారు ఎవరికో ఎందుకు జడ్జ్ వరకు ఈ కేసు వెళితే ముందు నా వైపు అదొక రకంగా చూస్తాడు.
నేను చెప్పేది ఒకటే మీ ఆయన విడాకులకు ఇష్టపూర్వకంగా లేడు కేవలం నువ్వు మాత్రమే బలవంత పెడుతున్నావ్… కాబట్టి ఇప్పుడు ఫామ్ ఫిల్ చేస్తున్నాను ఒక మూడు నెలలు కాలం పాటు మీ ఇద్దరూ కలిసి వుండి అప్పటికి కూడా మీ నిర్ణయం మారదు అని నా దగ్గరికి వస్తే అప్పుడు అప్లికేషన్ ను హైకోర్టు వరకు మూవ్ చేద్దాం ” అంటాడు లాయర్ ఇద్దరు వైపు చూస్తూ.
అసలు ఆ కొద్ది టైం కూడా ఇష్టపడని వారిద్దరూ చిరాకు పడిన ఇంకేం చేయలేక కలిసి ఉండటానికి అగ్రీ చేసి రిటర్న్ స్టార్ట్ అవుతారు.
మధు నీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్ లో మీటింగ్ ఉండటంతో స్టార్ట్ అవుతాడు సుమిత్.
కార్ వేగంగా పరిగెడుతుంటే అంతకన్నా వేగంగా పరిగెడుతున్నాయి అతని ఆలోచనలు సుమిత్ మధుమిత ఇద్దరిదీ ప్రేమ వివాహం ఏమీ కాదు.
పెద్దలు కుదరొచ్చిన సంబంధం… పెళ్లి చూపులో ఒకరికొకరు నచ్చి ఒకే మాట మీద ఉండి చేసుకున్న వివాహమే కావచ్చు కానీ ప్రేమ వివాహానికి అతీతం ఏమీ లేకుండా ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు.
పెళ్లి తర్వాత సుమిత్ జాబ్ కారణంగా బెంగళూరులో ఇద్దరు కొత్త కాపురం మొదలుపెట్టారు… ఉదయం లేచిన దగ్గర నుంచి చిన్న చిన్న సరసాలు చిలిపి అల్లరులతో ఎంతో సరదాగా టిఫిన్ ముగించి ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం 6:00 గంటలు దాటకుండానే ఇంటి బెల్ కొట్టేవాడు ఉత్సాహంగా.
అందంగా ముస్తాబయి భర్త కోసం ప్రేమగా ఎదురుచూసే భార్య చూపులు కొంటెగా విసురుతున్న చూపుల బాణాలు విందులు వినోదాలు ఇలా సరికొత్తగా తమ జీవితాన్ని తమ లోకంగా భావించి ఎంతో ఆనందంగా ఉండేవారు.
వీకెండ్ వస్తే సినిమాలు షికార్లు పిక్నిక్లు స్పెషల్ నైట్ లు మూడు సంవత్సరాల కాలం గిర్రును తిరిగి పోయాయి వారికే తెలియకుండా.
అంత అన్యోన్యంగా ఉన్న వారి దాంపత్య జీవితానికి ఎవరి కన్ను పడిందో ఏమో గత పది రోజుల నుంచి మధు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది.
చీటికిమాటికి కసురుకుంటుంది ఇంతకు ముందు ప్రేమగా ఎదురుచూసే తను ఇప్పుడు ఇంటికి వస్తే చాలు ముఖం పక్కకు తిప్పుకుంటుంది.
అతన్ని ముద్దులతో మురిపించి లాలించే తను ఇప్పుడు కసురుతూనే ఉంటుంది అది కూడా రీజన్ లేకుండా అసలు ఏమైందో ఏంటో తెలియకుండా తన బిహేవియర్ అతనికి పిచ్చి లేస్తుంది.
సడన్గా ఒక రోజు పేపర్ చదువుతున్న సుమిత్ దగ్గరికి వచ్చి నాకు డివోర్స్ కావాలి అని అడిగింది !!
ఎందుకు ?? అంటాడు సుమిత్
” ఎందుకంటే నీ ముక్కు మీద ఒక మచ్చ ఉంది దానివల్ల మన ఫైనాన్స్ స్టేటస్ బాగోవడం లేదు నాకు మీ దగ్గర నుంచి లగ్జరీ లైఫ్ దొరకడం లేదు… ” అంటుంది మధు.
వాట్ !! గట్టిగా అరుస్తూ షాక్ అవుతాడు తన మాటలకి.
ఏంటి నువ్వు మాట్లాడేది ఇలాంటి సిల్లీ రీజన్స్ కూడా నువ్వు నమ్ముతున్నావా అయినా నువ్వు నమ్మితే నమ్ము దానికి పరిష్కారం ఆలోచించాలి కానీ సమస్యను పెద్దది చేసుకుంటావా ఏంటి.
అయినా నీకు ఎవరు చెప్పారు నువ్వెలా చెప్పగలుగుతున్నావ్ ముక్కు మీద మచ్చ ఉంటే ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతింటుందని నువ్వు చదువుకున్న పిల్లవే కదా మరి మూర్ఖంగా కాకుండా కొంచెం మెచ్యూర్ గా థింక్ చెయ్యి మధు అని అసహనంగా అంటాడు సుమిత్.
నో సుమీ !! ఐ డోంట్ వాంట్ లివింగ్ విత్ యూ !! ఐ వాంట్ డివోర్స్ థర్డ్ సెట్ అంటూ వేరొక బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంటుంది.
స్టోరీ కంటిన్యూస్…
ఇదండీ నేటి సరికొత్త కథ…!! ఇంట్రో ఎలా ఉంది కామెంట్ చేయండి
సోషల్ మీడియా ఆల్గరిదమ్స్ మాయలో పడి నిజమైన ప్రేమను కాదనుకున్న మధు ఆమెను తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి సుమిత్ చేసిన హ్యూమరస్ ఐడియా డిజిటల్ పిచ్చి ముదిరిన జనాలకి సూట్ అయినా ఈ స్టోరీ
మంచి కామెడీ ఎంటర్టైన్ తో ఎట్ ది సేమ్ టైమ్ బ్యూటిఫుల్స్టో లవ్ స్టోరీ రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ కలగలిపిన ఈ స్టోరీ ను అస్సలు మిస్ అవ్వకుండా చదివేయండి
అలా చదవాలి అంటే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేసిన స్టోరీ మీకు నోటిఫికేషన్ రావాలి…అలా రావాలి అంటే మీరు నన్ను ఫాలో అవ్వాలి
సో ప్లీజ్ ఫాలో అండ్ ట్యాగ్ యువర్ కామెంట్ గాయ్స్… నెక్స్ట్ అప్డేట్ టుమారో 12 వస్తుంది డోంట్ మిస్ బాయ్
Swipe left/right or tap the sides to turn pages