New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 7

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 7

నెక్ష్ట్ ఎపిసోడ్ క్యాప్షన్ ….

భయంతో రాఖి చంక ఎక్కి కూర్చున్న జాను పాప ..

ఆ మేనేజర్ వెళ్లిపోయిన తర్వాత నన్ను …. నన్ను…” అంటూ మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది జాను.

మైధిలి జాను భుజం రబ్ చేస్తూ…” మేనేజర్ వెళ్ళిపోయాక నిన్ను ఏం చేశాడు…? ” అని అడిగింది.

నన్ను అతని మీదకి లాక్కొని కిస్ చేయబోయాడు …. నేను భయంతో అతని తోసేసాను … అప్పుడు అప్పుడు .. అతను నన్ను రెండు చెంపల మిద కొట్టి…

అక్కడే ఉన్న గోడకు అదిమి పెట్టాడు … నేను నన్ను ఏం చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసిన కూడా వినకుండా నా మీదకి వస్తూ , నా డ్రెస్ చింపేసాడు.

నేను ఏడుస్తూ నిన్ను చాలా సార్లు పిలిచాను కానీ నువ్వు రాలేదు … ఇంకా నాకు భయం వేసి పడిపోయాను …. ” అని ఎక్కిళ్లు పెడుతూ చాలా దీనంగా చెప్పింది జాను.

మొదటి నుంచి జాను ఎవరు అయిన తనని ఒక్క మాట అన్న కూడా  భయపడి ఏడ్చే టైప్ అలాంటిది … ఆ వివేక్ జాను నీ బలవంతం చెయ్యబోయి …

జాను వాడికి కోపరేట్ చెయ్యలేదు అని తనని చెంపల మిద కొట్టి , తన డ్రెస్ అంతా చించేసినప్పుడు జాను ఎంతలా భయపడి ఉంటుందో మైధిలి కి అర్ధం అయ్యి …

జాను నీ హగ్ చేసుకొని తను కూడా ఏడుస్తూ…
” సారీ రా కుట్టి పాప…! రియల్లీ సారి మా… నాకు జాబ్ వచ్చిన విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలి అని వెయిటింగ్ ఏరియా నుంచి కొంచం పక్కకి వెళ్లి వాళ్ళతో కాల్ మాట్లాడుతున్న…

నువ్వు నన్ను పిలిచిన కూడా నాకు అది వినిపించలేదు రా సారీ…! ” అని మైధిలి కూడా ఫుల్ గా ఏడ్చేసింది.

అప్పటి వరకు ఆ రూం డోర్ దగ్గర నిలబడి ఉన్న రాఖి  … జాను చెప్పింది అంతా విని  , పిడికిలి బిగించి ….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue