రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 1
అది ఒక మహానగరం హైదరాబాద్ అప్పుడప్పుడే తెల్లవారుతుంది…. అక్కడ అందరు ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఉరుకుల పరుగుల జీవితం…. అది ఒక కాలనీ అందులో అంతా ఇరుగు పొరుగు లేచి ఆడవాళ్లంతా ముగ్గులు వేసుకుంటూ ఉంటే….
అక్కడ ఉన్న అమ్మాయిలు జాగ్గింగ్ లు అని ఎక్సర్సైస్ అవి చేస్తూ ఉన్నారు…. అబ్బాయిలు మాత్రం ముసుగు తన్ని పడుకొనే ఉన్నారు….అలా వాళ్ళని లేపే ప్రక్రియ లో తండ్రులు అంతా సుప్రభాతం తో లేపుతున్నారు….
ఒక తండ్రి రేయ్ లే రా అంట్ల వెధవ బారుడు పొద్దేక్కిన ఇంక పడుకొనే ఉన్నావ్ కాలేజీ కి టైం అవుతుంది రా శుంఠ అని తిట్టి మరి లేపుతున్నారు…. అయినా అతనికి కొంచం అయినా చీమ కుట్టినట్టు గా కూడా లేకుండా అలానే ముసుగు తన్ని పడుకొనే ఉన్నాడు….
అయినా ఎంతకీ లేవకపోవడం తో వీడికి ఇలా కాదు అని వెనక్కి వెళ్లి స్పీడ్ గా పరిగెత్తుకొని వచ్చి లుంగీ పైకి ఎగట్టి కాలు తో లేవరా వెధవ అని గట్టిగ నడుము మీద తన్నాడు…. ఇంక అంతే అతను దొర్లుకుంటూ వెళ్లి కింద పడి అమ్మా అని పెద్దగా అరిచాడు…..
ఇంక అంతే కొడుకు కేక విని వంటింట్లో ఎదో పనిలో ఉన్న ఆవిడ పరుగున లోపలికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకు అలా అరిచావు అని కింద పడి ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళింది గాభరాగా ఏంటి నాన్న కింద ఎలా పడ్డావ్ అని అడిగారు కంగారు గా….
వాడు పడలేదే నేను తంతే దొర్లుకుంటూ వెళ్లి పడ్డాడు అని అన్నారు…. అసలు చెట్టంత కొడుకు అలా తన్నడానికి మీకు మనసు ఎలా వచ్చింది అండి పాపం పిల్లోడు ఏంత భయపడ్డాడో ఏంటో అని పైకి లేపి కూర్చోపెట్టి దెబ్బలు ఏమైనా తగిలాయేమో అని మొత్తం చూస్తున్నారు….
పిల్లోడు కాదే నా నెత్తిన గుదిబండ వీడు అని కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు….ఇంక అతను అసహనం గా ఏంటమ్మా నాన్న అసలు ఎప్పుడు చూడు తిట్లేనా లేపడానికి కూడా అని అన్నాడు….
నాన్న కి నువ్వంటే ప్రేమ రా నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడివి అవ్వాలనే తాపత్రయం అదంతా అని అన్నారు…. ఏమి అవ్వడం ఇలా తిడుతూ ఉంటే ఇంకెక్కడా అవుతాను అమ్మా అని చెప్పి అంటుంటే….
ఈ లోపు మళ్ళీ కింద నుంచి ఏరా లేచావా మళ్ళీ నన్ను రమ్మంటావా అని అన్నారు…. అమ్మో ఈయన మళ్ళీ వచ్చి ఎదో ఒకటి క్లాస్ పీకుతాడు దాని కన్నా ఇప్పుడు లేవడమే బెటర్ అని బాత్రూమ్ లోకి పరిగెత్తాడు….
ఇంక అలా రెడీ అయ్యి వచ్చి నాన్న డబ్బులు అని చేయి చాచాడు….కింద నుంచి మీదకి ఏగాదిగా చూసి పది రూపాయలు తీసి చేతిలో పెట్టాడు…. అది చూసి నాన్న మరి పది రూపాయలా ఒక వంద ఇవ్వు నాన్న అని అడిగాడు….
ఈ డిమాండ్ లకి ఏమి తక్కువ లేదు మార్కులు చూస్తే ఆ పదే దాటడం లేదు జల్సా లకి ఏమో వేలు దాటుతున్నాయి వెధవ అని తిట్టి అయిదు వందలు తీసి ఇచ్చాడు…. అది చూసి నవ్వుకొని థాంక్ యూ నాన్న అని చెప్పి కౌగిలించుకొని బయటకు వెళ్ళాడు….
నాన్న తినేసి వెళ్ళరా టిఫిన్ అయ్యింది అని అరిచే లోపు బయటకు వెళ్ళిపోయాడు…. అబ్బా వాడి గురించి తెలిసిందే కదే ఇప్పుడు బయటకు వెళ్లి ఆ మంద తో కలిసి కాంటీన్ లో తిండ్లు అని చెప్పి ఆయన కూడా బయటకు వెళ్లిపోయారు…..హ్మ్ మీ ఇద్దరితో నేను పడుతున్న వేగలేక అని నవ్వుకొని ఇంక ఆవిడ పనిలో నిమగ్న మయ్యారు….
కాలేజ్:
ఏరా ఎంత సేపు అయ్యింది వచ్చి జస్ట్ ఇప్పుడే రా హా అదే కదా నువ్వెంటా ఇంత తొందరగా వచ్చావ్ అనుకున్న అని ఇంక మాటల్లో పడ్డారు ఫ్రెండ్స్ అంతా ఇంతలో ఇంకో ఫ్రెండ్ రేయ్ సూర్య అటు చూడరా అమ్మాయిలు వస్తున్నారు రా అని చెప్పగానే అటు వైపు చూస్తూ ఉన్నారు అంతా….
అది చూసి ఒక అమ్మాయి ముందుకు వచ్చి రేయ్ ఏంటి రా చూపు గుడ్లు పీకేస్తా ఏమనుకుంటున్నావో అని అనింది…. ఏంటే నన్నే అంత మాట అంటావా అని మీదకి వెళ్లేసరికి ఏంటి రా మీద మీదకి వస్తున్నావ్ రా చూసుకుందాం అని చున్నీ ముడి వేసుకొని తను కూడా మీదకి వెళ్ళింది….
ఏంటే మగాడిని అందులోను ఈ సూర్య ని ఒరేయ్ అనిందే కాక నా మీదే తిరగబడతావా రావే చూసుకుందాం అని జుట్టు పట్టుకున్నాడు…. నా జుట్టే పట్టుకుంటావా నిన్ను అని తను కూడా తిరిగి జుట్టు పట్టుకుంది….
ఒసేయ్ ఈ రోజు నిన్ను వదలనే అని అలానే పట్టుకొని కొట్టుకుంటున్నారు…. ఇంక మిగతా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆపాలని చూసిన అసలు వినకుండా అలా కొట్టుకుంటూనే ఉన్నారు….
నన్నే కొడతావే అని కాలు తొక్కాడు…. నా కాలే తొక్కుతావ్ రా అని చెప్పి తను కూడా తొక్కింది…. అబ్బా అని పెద్దగా అరిచి జుట్టు వదిలేసి కాలు చూసుకున్నాడు…. ఏంటి రా పొద్దున్నే మీ నాన్న తో తన్నులు తినింది చాల్లేదా మళ్ళీ నాతో కూడా తినాలా అని చెప్పి నవ్వుతుంటే….
మా నాన్న తన్నినట్టు నీకెలా తెలుసే కొంపతీసి నా రూమ్ లో సీసీ కెమెరా ఏమైనా పెట్టావా ఏంటి అని అడిగాడు… నీ మొఖానికి అంత సీన్ ఉందా నా బాల్కనీ లో నుంచుంటే చాలు రా నీ రూమ్ మొత్తం కనిపించిద్ది రా ఆముదం మోహమోడా అని తిట్టింది….
ఒసేయ్ రాక్షసి ఒక మగాడి గది లోకి అలా చూడటానికి సిగ్గు లేదానే నీకు అని అడిగాడు…. ఇక్కడ మగాడు ఎవడు రా అని అడిగింది…. ఒసేయ్ నన్ను చూసి మాట్లాడవే అంటే నిన్ను చూసాను కాబట్టే కద రా అంటున్న అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది….
ఒసేయ్ సాలీడు మొహం దాన నీకు ఎప్పుడో నా చేతిలో మూడిందే అని అరిచేసరికి వెనక్కి తిరిగి పోరా చిలకడ దుంప మోహమోడా అని స్పీడ్ గా వెళ్ళిపోయింది…. అది విని నువ్వు నాకెప్పుడో దొరక్కపొవే అప్పుడు చెప్తా నీ పని అని అక్కడ నుంచి క్లాస్ కి వెళిపోయాడు….
ఇంక తను క్లాస్ కి వెళ్లి కూర్చోగానే అప్పుడే సూర్య కూడా వచ్చేసాడు…. తనని చూసి జుట్టు ని వెనక్కి అనుకోని ఈ చంద్రిక తో పెట్టుకుంటే మూడు చెరువుల నీళ్లు తాగిస్తా అనుకోని సార్ వచ్చేసరికి ఇంక ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు….
హ్మ్ ఏంటి ఇది వీళ్ళు ఇలా దెబ్బ లాడుకుంటున్నారు అని చూస్తున్నారా….
హీరో:సూర్య
హీరోయిన్:చంద్రిక
ఇది నా కొత్త కథ కొంచెం కామెడీ వేలో ఉంటుంది…. ఎప్పుడు లవ్ అలా కాకుండా కొంచం ఇలా రాస్తే బాగుంటుంది అనిపించింది అందుకే ఇలా మీ ముందుకు తీసుకువచ్చా…..
దీన్ని మంచిగ ఆదరిస్తారు అని కోరుకుంటూ….
మీ
లక్ష్మి అవినాష్.
Swipe left/right or tap the sides to turn pages