వైదేహి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే నీట్ ఎగ్జామ్స్‌కి రెండు నెలలు ఉండటంతో విక్కీ తనని కోచింగ్‌లో జాయిన్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నాడు.
వైదేహి వద్దు అని చెప్పినా, ఊర్మిళ గారు, విశ్వనాథ్ గారు కూడా వైదేహిని కోచింగ్ సెంటర్‌కి వెళ్ళమని సజెషన్ ఇవ్వడంతో ఇక తను కూడా కస్తూరి కోచింగ్ తీసుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయింది.
అంటే కస్తూరి ఇంకా నీట్ క్రాక్ చేయలేదు. తను ఇంకా టూ ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ చేస్తూనే ఉంది.
వైదేహిని మొదటి రోజు క్లాస్‌లో చూసిన కస్తూరి తనని హగ్ చేసుకుని, “ఎలా ఉన్నావే? నిజంగా చాలా మిస్ అయ్యాను తెలుసా?” అంది కస్తూరి.
వైదేహి చిన్న చిరునవ్వు నవ్వుతూ, “నేను బానే ఉన్నాను. కానీ నీకేమైంది? టూ ఇయర్స్ నుంచి ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నావు?” అడిగింది వైదేహి.