New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వైదేహి – 5
వైదేహి 6 min read

వైదేహి – 5

 

 

 

ఇప్పుడు ఇక్కడికెందుకు అడిగింది వైదేహి కంగారుగా.

 

“అంటే అమ్మవాళ్లు నీకు నల్లపూసలు వేయాలంట. ఇంకా అమ్మ ఒక్కటే చెప్పింది. నాకు నచ్చింది ఏదో తీసుకునే కంటే, తనకి నచ్చింది తీసుకుంటే తను వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా! మీరు ఇద్దరూ కూడా మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా! వెళ్లు” అని చెప్పింది. అందుకే మళ్లీ వచ్చాను అన్నాడు విక్కీ.

 

“అవునా?” అని అంటూ విక్కీతో కలిసి బ్లాక్ బీడ్స్ సెక్షన్‌కి వెళ్లింది వైదేహి.

 

విక్కీ, వైదేహి ఇద్దరూ కూర్చుని, అక్కడే ఉన్న సేల్స్‌మ్యాన్ వైపు చూస్తూ, “డైమండ్స్‌లో బ్లాక్ బీడ్స్ చూపించండి” అంటూ చెప్పడంతో వైదేహి ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి విక్కీ వైపు చూసింది.

 

“ఏమైంది? అలా చూస్తున్నావ్?” అడిగాడు విక్కీ వైదేహి వైపు చూస్తూ.

 

“డైమండ్స్ ఎందుకు ఇప్పుడు? అంత కాస్ట్ అవసరమా, విక్కీ గారు?” అంది వైదేహి.

 

“మరి ఈ బంగారం మెడలో కనిపించాలి అంటే మినిమం డైమండ్స్ ఉండాలి కదా!” అన్నాడు విక్కీ.

 

“విక్కీ గారు, నాకు భయంగా ఉంది. ఒకవేళ పొరపాటున నేను పోగొట్టుకుంటే, దాని విలువ చాలా భారీ మూల్యం అవుతుంది కదా!” అంది వైదేహి భయంగా.

 

“నువ్వు ఏమీ చిన్నపిల్లవి అనుకుంటున్నావా? పడేసుకోవడానికి అలా ఏం కాదులే. ఒకటి డైలీ వేర్ తీసుకుందాం, ఒకటి పార్టీ వేర్ తీసుకుందాం” అని విక్కీ వైదేహికి రెండు బ్లాక్ బీడ్స్ సెలెక్ట్ చేస్తాడు.

 

అవి వైదేహికి చాలా అంటే చాలా బాగుండటంతో, విక్కీ వైదేహి వైపు చూస్తూ, “నీకు చాలా బాగున్నాయి. ఈ రెండు తీసుకుందాం” అన్నాడు విక్రమ్.

 

“సరే” అని వైదేహి చెప్పడంతో, అవి రెండూ ప్యాక్ చేయించి తనని తీసుకొని తిరిగి బయటికి వచ్చాడు.

 

ఇక లంచ్ టైమ్ అవ్వడంతో, “ఏమైనా బయట లంచ్ తినేసి వెళ్దామా?” అడిగాడు విక్కీ.

 

“అలాగే” అని వైదేహి చెప్పడంతో, సరే అని తనని తీసుకొని ఒక రెస్టారెంట్‌కి వెళ్లి ఇద్దరూ తినేసిన తర్వాత గగన, దేవా కోసం కొన్ని చాక్లెట్స్, స్నాక్స్ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చారు ఇద్దరూ.

 

వీళ్లు వచ్చేసరికి, స్కూల్‌కి వెళ్లిన దేవా, గగన ఇద్దరూ వచ్చారు. అక్కడ విక్కీని చూసి, “అమ్మా, ఎవరు అతను? ఎందుకు ఇక్కడ ఉన్నాడు?” అని అమాయకంగా అడిగారు.

 

ఆ మాటకి సుజాత గారు విక్కీ వైపు చూస్తూ, “ఏమీ అనుకోకండి అల్లుడుగారు. పిల్లలు మొన్న మీరు వచ్చినప్పుడు చూడలేదు కదా, అందుకే ఇప్పుడు అడుగుతున్నారు” అని చెప్పి, వెంటనే చిన్న కూతురు వైపు, కొడుకు వైపు చూసి, “తను మీ బావగారు. మీ అక్కకి కాబోయే భర్త” అన్నారు సుజాత గారు.

 

“అంటే అక్క ఇప్పుడు మనతో ఉండదా?” అని అడిగారు వాళ్లు అమాయకంగా.

 

“ఇంకో 15 రోజుల్లో అక్క బావగారిని పెళ్లి చేసుకొని వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది” అన్నారు సుజాత గారు.

 

ఆ మాటకి ఇద్దరూ కళ్ల నీళ్లు తెచ్చేసుకొని అక్కడి నుంచి బయటికి పరుగెత్తి వెళ్లిపోయారు.

 

“ఏమనుకోకండి బాబు. చిన్నప్పటి నుంచి వాళ్ల అక్కతో అటాచ్‌మెంట్ బాగా ఎక్కువ. అందుకే అలా అన్నారు” అని సుజాత గారు, అల్లుడు ఎక్కడ మళ్లీ నొచ్చుకుంటారో అన్న భయంతో చెప్పారు.

 

“అయ్యో, పర్వాలేదు అత్తయ్యా! మీరు మరీ ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు” అని చిరునవ్వుతో చెప్పి, అత్తగారి వైపు చూస్తూ, “ఇవి వాళ్ల కోసం తీసుకొచ్చాను. వాళ్లకి ఇవ్వండి” అని చెప్పేసి వైదేహి వైపు చూశాడు.

 

వైదేహి కూడా విక్కీ వైపు చూసింది. విక్కీ తిరిగి సుజాత గారి వైపు చూసి, “ఇక నేను వెళ్లొస్తాను అత్తయ్యా. ఇప్పటికే లేట్ అయింది” అన్నాడు.

 

“అలాగే బాబు” అని చెప్పడంతో, విక్కీ అక్కడి నుంచి వెళ్లడానికి బయలుదేరితే, వైదేహిని విక్కీ వెనకే పంపించారు సుజాత గారు.

 

విక్కీ బండి దగ్గరికి వెళ్లేసరికి, అతనికి ఒక మూడు అడుగుల దూరంలో ఉన్న వైదేహిని చూసి చిన్నగా నవ్వుకొని, “నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయాను” అని తన పాకెట్‌లో తన భార్య కోసం కొన్న లిమిటెడ్ ఎడిషన్ డైరీ మిల్క్ హార్ట్ చాక్లెట్ తీసుకొని ఆమె చేతిలో పెట్టాడు.

 

“ఇది నీకోసమే” అని తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని, “మీ తమ్ముడికి, చెల్లికి ఇవ్వకుండా నువ్వు ఒక్కదానివే తిను.

 

ఇది నా ప్రేమ” అన్నాడు విక్కీ.

 

ఆ మాటకి వైదేహి సిగ్గుతో తల కిందకి దించేసుకుంటే, విక్కీ తన వైపు చూసి, “సరే, బాయ్” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 

వైదేహి లోపలికి వచ్చేసరికి, సుజాత గారు కూతురికి ఎదురొస్తూ తన చేతిలో ఉన్న చాక్లెట్ చూసి, “అల్లుడుగారు ఇచ్చారా?” అని అడిగారు చిన్నగా.

 

“ఆ, అవునమ్మా” అని దాన్ని పక్కన పెట్టేసి, అమ్మకి జరిగినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది వైదేహి.

 

“ఏమంటున్నావే? డైమండ్ నల్లపూసలు తీసుకున్నారా అల్లుడుగారు?” అని అడిగారు సుజాత గారు, కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తూ.

 

“అవునమ్మా. నేను వద్దు అని చెప్పాను, కానీ ఆయనే ‘ఏం కాదు, బాగుంటుంది’ అని చెప్పి తీసుకొని ఆయనే సెలెక్ట్ చేశారు. చాలా బాగున్నాయి అమ్మ” అంది వైదేహి.

 

“అవునా?” అని అల్లుడికి కూతురు మీద ఉన్న ప్రేమకి మురిసిపోయారు సుజాత గారు.

 

కొంతసేపటికి చెల్లి, తమ్ముడు ఇంటికి రావడంతో, వాళ్లకి విక్కీ కొనిచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ ప్యాకెట్లన్నీ ఇస్తే, వాళ్లు అవన్నీ తీసుకుని నవ్వుతూ, “ఇవన్నీ అతను తీసుకొచ్చి ఇచ్చారా?” అని అడిగింది గగన.

 

“అతను ఏంటి? బావగారు అనాలి” అన్నారు సుజాత గారు.

 

“అదే, బావగారు ఇచ్చారా?” అని అడిగింది గగన.

 

“అవును” అని చెప్పింది వైదేహి.

 

ఇక ఆ రోజు తర్వాత మెల్లగా రోజుకొకసారి, రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి వైదేహితో మాట్లాడడం మొదలుపెట్టాడు విక్కీ.

 

ఇక వైదేహి కూడా మెల్లగా విక్కీతో మాట్లాడడం మొదలుపెట్టింది. అలా చూస్తూ ఉండగానే ఇంకో 15 రోజులు కూడా తెలియకుండానే గడిచిపోయాయి.

 

పెళ్లి ఖర్చు మొత్తం విక్కీ వాళ్లే పెట్టుకుంటామని ముందే చెప్పడంతో, అంతా ఖర్చు వాళ్లే పెట్టుకున్నారు. ఒక పెద్ద కళ్యాణ మండపంలో చాలా గ్రాండ్‌గా ఇద్దరి పెళ్లి జరిపించారు.

 

అది చూసిన అందరికీ అసలు నోట మాట రాలేదు. అంత బాగా జరిపించారు పెళ్లిని.

 

పెళ్లి తంతులు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, కూతుర్ని భారమైన హృదయంతో అత్తవారింటికి సాగనంపారు.

 

తల్లిదండ్రుల్ని, చెల్లిని, తమ్ముడిని వదిలేసి ఒక కొత్త ఇంటికి, కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్న వైదేహికి భయంగా అనిపిస్తూ ఉంటే, ఏడుస్తూ కూర్చుంది. విక్కీ తనకి ధైర్యం చెప్పి తనని తీసుకొని కారులో ఇంటికి బయలుదేరాడు.

 

విక్కీ ముందే చెప్పడంతో మిగతావాళ్లు వేరువేరు కార్లలో వస్తే, తన కారులో తన భార్యని తీసుకొని బయలుదేరాడు.

 

“మీకు కార్ డ్రైవింగ్ కూడా తెలుసా?” అడిగింది వైదేహి, విక్కీ వైపు చూస్తూ.

 

“ఈ కార్ మనదే” అన్నాడు విక్కీ చిన్న చిరునవ్వుతో.

 

“మరి ఆరోజు బండి తీసుకొచ్చారు?” అడిగింది వైదేహి అమాయకంగా.

 

“బండి కూడా మనదే. బండి, కార్ రెండూ ఉన్నాయి. ఆరోజు మరి నా భార్యతో బయటికి వెళ్లాలి అనిపించింది. కార్ అయితే డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. అదే బండి మీద అనుకో, నువ్వు నన్ను పట్టుకుని కూర్చుంటావు కదా! అందుకే బండి తీసుకొచ్చా” అన్నాడు విక్కీ కన్ను కొడుతూ.

 

ఆ మాటకి తనకి తెలియకుండానే తల కిందకి దించేసుకుంది వైదేహి.

 

ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు రావడంతో, కొడుకుని, కోడల్ని దిష్టి తీసి అప్పుడు లోపలికి ఆహ్వానించారు ఊర్మిళ గారు.

 

కోడలి చేత దీపం పెట్టించి, ఆ తర్వాత తనని గెస్ట్ రూమ్‌లోకి పంపించి, విక్కీని తన రూమ్‌లోకి పంపించేశారు.

 

తన రూమ్‌లోకి వచ్చిన వైదేహికి బాగా నిద్ర రావడంతో, నగలు, పట్టుచీర ఏమీ మార్చుకోకుండానే అలానే పడుకుండిపోయింది.

 

కొంతసేపటికి గదిలోకి వచ్చిన ఊర్మిళ గారు, కోడలు అలానే పడుకుండిపోవడం చూసి, “అయ్యో, పిచ్చిపిల్ల” అనుకుని తనని నిద్రలేపి, “ఇవన్నీ గుచ్చుకుంటాయి కదరా! ఇవన్నీ తీసేసి పడుకోవచ్చు కదా! అయినా ఈ పట్టు చీరలో ఇంత ఉక్కపోత ఉంటే ఎలా నిద్ర పడుతుంది? ఇదిగో, ఇది నైట్ డ్రెస్. మీ వదినది, కొంచెం లూజ్ అయిపోతుంది నీకు. నీకోసం బట్టలు కొన్నాను, కాకపోతే అవన్నీ కలిసిపోయాయి. ఒక్క రెండు రోజులు అడ్జస్ట్ అవ్వు తల్లి. అన్నీ సర్దేసిన తర్వాత నీ బట్టలు నీకు ఇస్తాను” అన్నారు ఊర్మిళ గారు.

 

“పర్లేదు అత్తయ్య గారు” అంది వైదేహి వెంటనే.

 

“అత్తయ్య” అని పిలిస్తే సరిపోతుంది. “గారు” అవసరం లేదు” అన్నారు ఊర్మిళ గారు, కోడలికి నగలన్నీ తీస్తూ.

 

ఊర్మిళ గారు తనతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతుంటే, వైదేహి కూడా ఆమెతో చాలా మర్యాదపూర్వకంగా, గౌరవంగా మాట్లాడుతూ ఉంది.

 

ఇక ఇద్దరూ కలిసి నగలన్నీ తీసేసిన తర్వాత, పూలజడ కూడా విప్పేసి, “వెళ్లి స్నానం చేసి రా తల్లి. తలస్నానం అంటే జిగురుజిగురుగా ఉంటుంది కదా, జీలకర్ర బెల్లం అందుకే” అని చెప్పడంతో, వైదేహి స్నానానికి వెళ్తే, తనకోసం నైట్ డ్రెస్ తీసి పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చారు.

 

ఇంతలో స్నానం చేసి వచ్చిన తనకి అక్కడ తన డ్రెస్ కనిపించడంతో ఆ డ్రెస్ వేసుకుంది.

 

అది తనకి ఎంత లూజ్‌గా ఉందంటే, అందులో ఇంకొకరు కూడా పట్టేస్తారు అంత లూజ్‌గా ఉంది ఆ డ్రెస్.

 

“ఇదేంటి ఇలా ఉంది?” అనుకుంటూ ఉండగా, అక్కడికి వచ్చిన ఊర్మిళ గారు, “అయ్యో, బాగా లూజ్ అయిపోయింది. జాగ్రత్త. ఈరోజుకి అడ్జస్ట్ అయిపో. రేపు ఏదో ఒకలా నీకు డ్రెస్ తీసి పెడతాను” అని కోడలికి తీసుకొచ్చిన భోజనాన్ని తినిపించేసి, “ఇక పడుకో” అని అక్కడి నుంచి వెళ్లిపోయారు ఊర్మిళ గారు.

 

వైదేహి పెళ్లి అలసటతో హాయిగా నిద్రపోయింది.

 

ఇక్కడ విక్కీ కూడా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి, ఊర్మిళ గారు కొడుకుకి కూడా భోజనం తీసుకొని రావడంతో, విక్కీ తింటూ, “తను తినిందామా?” అని అడిగాడు.

 

“మీ ఆవిడకి పెట్టిన తర్వాతే నీ దగ్గరికి తీసుకొచ్చాను నాన్న” అన్నారు ఊర్మిళ గారు నవ్వుకుంటూ.

 

“అబ్బా, నువ్వు మరీ అంతలో నన్ను మోసేయాల్సిన పనిలేదు. తనకి ఇదంతా కొత్త కదా! మళ్లీ మొహమాటంతో అడగలేదేమో అని డౌట్. అసలే దానికి ఉన్న మొహమాటం ఎవ్వరికీ ఉండదు, నాకు తెలిసి” అన్నాడు విక్కీ.

 

“బంగారం రా నా కోడలు” అన్నారు ఊర్మిళ గారు.

 

“అదే, అదే” అన్నాడు విక్కీ.

 

“సరే, నువ్వు కూడా ఎక్కువసేపు మేల్కొని ఉండకు. రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది” అని చెప్పడంతో,

 

“అలాగే అమ్మ” అని తినేసి, తను కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు విక్కీ.

 

 

 

 

 

——–Continues…………….

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ