అందాల రాక్షసి{2}-65
మోహిత్ అపరేషన్ థియేటర్ ముందు నుంచుని థియేటర్ వైపు చూస్తూ ఉన్నాడు…. !! మోహిత్ కళ్ళు రెండు గంటల నుండి ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి …… !! జోషి మోహిత్ ను ఎంత కంట్రోల్ చేయాలి అని చూసినా మోహిత్ కొంచెం కూడా కంట్రోల్ అవ్వడం లేదు …… !!
ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి ఇప్పటి నుండి అయినా ……. !! ఆయుష్, ఆషి సంతోషంగా ఉంటారని మోహిత్ ఎన్నో కలలు కన్నాడు……. !! దూరం అయిపోయిన తన చెల్లి అషిక ఆషి బిడ్డ రూపం లో తిరిగి రావాలని ఎంతగా వెయిట్ చేస్తున్నాడో….. !! తనకు తన మనసుకు మాత్రమే తెలుసు …… !!
ఆషి కి ఉన్న గైనిక్ ప్రాబ్లెమ్ క్లియర్ అయింది …… !! అని ఆయుష్ సంతోషంగా తనకు చెప్పడం ఇంకా తన చెవిలో వినిపిస్తూ ఉంది …… !! ఇక మ్యాన్షన్ కి బేబీ రావడమే ఆలస్యం అని ఎంతో పొంగిపోయాడు & మురిసిపోయాడు……. !! ఆషి ప్రాబ్లెమ్ క్లియర్ అయింది అనిపించాకే ఎంగేజ్మెంట్ కి ఓకే అన్నాడు …… !! ఇక అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అనుకున్న టైమ్ లో ఇలా జరగడం మోహిత్ బరించలేక పోతున్నాడు …… !!
ఆయుష్, ఆషి ఇద్దరిలో ఎవరు లేకపోయినా మోహిత్ తట్టుకోలేడు…… !! ఇద్దరి పరిస్థితి ఇప్పుడు క్రిటికల్ గానే ఉందని …… !! అర్థం అవ్వడం తో తన కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటూ వస్తుంటే …… !! మౌనంగా కన్నీళ్ళు కార్చడం తప్పా ఎమ్ చేయలేని స్థితిలో ఉన్నాడు మోహిత్….. !!
తన బుజం మీద పడ్డ చేతి స్పర్శ కి తల తిప్పి చూసిన మోహిత్ కి విక్రమ్ కనిపించడం తో చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ……. !! విక్రమ్ ను హగ్ చేసుకుంటూ బా….. బావా… బావా విక్కి అంటూ ఒక్క సారిగా బర్స్ట్ అయిపోతాడు ……. !!
మోహిత్ ప్లీస్ రా ఏడవకు ఆయుష్ కి ఎమ్ కాదు భయపడకు …… !! ఆషి మీదున్న ప్రేమే ఆయుష్ కి ఊపిరి పోస్తుంది …… ;! చూస్తూ ఉండు ఇద్దరు నవ్వుతూ మనతో పాటు మ్యాన్షన్ కి వస్తారు……. !! అని ధైర్యం చెప్తూ మోహిత్ ను కొంచెం లో కొంచెం నార్మల్ చేస్తాడు విక్రమ్…… !!
ఎక్స్క్యూస్ మీ సర్…. !!
సిస్టర్ పిలుపుకు మోహిత్, విక్రమ్ ఇద్దరు సిస్టర్ వైపు చూస్తారు ……. !! పాప కాన్షియస్ లోకి వచ్చింది బట్ బాగా భయపడుతుంది……. !! డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఇద్దరినీ దియా ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది …… !!
డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటే చేయించుకోకుండా ఏడుస్తున్న దియా ను చూసి …… !! మోహిత్ ఒక్క అంగుళం లో దియా ను చేరుకుని తనను గుండెలకు అదుముకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు …… !!
మోహిత్ ను గుర్తు పట్టిన దియా మా….. మావయ్య ……. !! అంటూ మోహిత్ మెడను చుట్టేసి ఏడుస్తూ మమ్మా 😭😭 డాడ్ …… !! నాకు మమ్మా డాడ్ కావాలి నన్ను వాళ్ళ దగ్గరకు తీసుకుని వెల్లు అంటూ ఏడుస్తూ అడుగుతుంది …… !!
అమ్మ, నాన్న కి ట్రీట్మెంట్ జరుగుతుంది దియా ….. !! మనం కాసేపు అయ్యాక వెళ్ళి చూద్దాం ……. !! ఇప్పుడు నువ్వు ఇంజెక్షన్ చేయించుకుని కాసేపు పడుకో బంగారం…… !!
ఉహూ నేను మమ్మా ను చూడాలి….. !! మమ్మా ను వాడు… వాడు కత్తి తో పొడిచాడు నేను ముందు మమ్మా ను చూడాలి ….. !! అని బెడ్ దిగి బయటకు పరిగెడుతున్న దియా ను ఎత్తుకుని దియా కి బలవంతంగా సెడిటివ్ ఇప్పించి…… !! వేద, జోషి లను దియా దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి …… !! దియా కి ఏ ప్రాబ్లెమ్ లేదు అని తెలుసుకుని ఆయుష్, ఆషి లను ట్రీట్ చేస్తున్న రూమ్స్ దగ్గరకు వస్తారు …… !!
@@&&@@&&@@
విక్రమ్ మ్యాన్షన్ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పగానే …… !! పెద్ద వాళ్ళు హడావిడిగా హాస్పిటల్ కి చేరుకుంటారు …….. !! ఆడవాళ్ళు జరిగింది విని బోరున ఏడుస్తూ ఉంటే వాళ్ళని మగ వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు …… !!
అషిక చనిపోయినా ఆషి రూపం లో తనును చూసుకుంటున్న సంధ్య, దిలీప్ లకు ఈ హ్యాపీనెస్ కూడా ఎక్కువ రోజులు లేకుండా పోతోంది ….. !! అని ఇద్దరు ప్రాణం లేని బొమ్మలా కూర్చుని ఏడుస్తూ ఉంటే వాళ్ళను ఓదారుస్తూ ఉంటాడు మోహిత్ …… !!
ఇద్దరు కూతుర్లు చావు బతుకుల మధ్య ఉండడం చూసిన అనిత బాధ అంతా ఇంతా కాదు ……. !! ప్రభాకర్ ను పట్టుకుని ఏడుస్తూ నాకు నా పిల్లలు కావాలి …… !! వాళ్ళు లేకుండా నేను ఎలా ఉండాలి అని ఏడుస్తూ ఉంటుంది …… !!
ఇటు రాగిణి కూడా ఆయుష్, ఆషి లను తలచుకుంటూ …… !! అంతే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ….. !! ఆయుష్ ను అలా చూసి ప్రణవి కూడా బాధగా గ్లాస్ డోర్ నుండి కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది …… !!
కాసేపటికి అభి ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ రావడం తో ముందుగా….. !! అప్పటి వరకు శూన్యం లోకి చూస్తూ కూర్చున్న నిషాన్……. !! ఫాస్ట్ గా పైకి లేచి డాక్టర్ ముందుకు వచ్చి అభి గురించి అడుగుతాడు ……. !!
టైమ్ కి తీసుకుని వచ్చారు బులెట్ రిమూవ్ చేశాం …… !! తలకు కూడా పెద్దగా దెబ్బ తగిలింది ప్రెసెంట్ ప్రాణానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు…… !! బట్ తను స్పృహ లోకి వస్తే తప్పా తన కండిషన్ ఏంటో చెప్పలేం…… !! సో తను స్పృహ లోకి వచ్చే దాకా వెయిట్ చేయడం తప్పా ఇంకేం చేయలేం నిషాన్ సర్ …… !!
తను ఎపుడు స్పృహ లోకి వస్తుంది డాక్టర్ ….. ?? అని బయం భయంగా అడుగుతాడు నిషాన్…. !!
ఇంకో 5 అవర్స్ పట్టచ్చు సర్ ….. !! బట్ డోంట్ వర్రీ ధైర్యంగా ఉండండి ….. !! అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతే నిషాన్ గ్లాస్ డోర్ నుండి కనిపిస్తున్న అభి ను నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ ఉంటాడు…… !!
ఆషి ను ట్రీట్ చేస్తున్న ఆపరేషన్ థియేటర్ లైట్స్ ఆఫ్ అయ్యి డాక్టర్స్ బయటకు వస్తారు….. !! డాక్టర్ అందరి వైపు చూస్తూ 48 అవర్స్ గడిస్తే తప్పా ఎమ్ చెప్పలేం 50 – 50 ఛాన్సెస్ …. !! అని చెప్పగానే అనిత, సంధ్య ఆ మాటకి బీపీ ఎక్కువ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతారు …… !!
వాళ్ళని ఇమ్మీడియెట్ వేరే రూమ్స్ లోకి షిఫ్ట్ చేసి ….. !! ఆయుష్ గురించి ఎమ్ వార్త వినాల్సి వస్తుందో …….. ?? అని గుండెను అరచేత్తో పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటే ……. ?? కాసేపటికి డాక్టర్ బయటకు రావడం అందరి వైపు చూసి ఎమ్ మాట్లాడకుండా తన క్యాబిన్ వైపు వెళ్ళడం చూసి…… !! అందరికీ గుండె జారి చేతిలోకి వచ్చినట్టు వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకే వినిపిస్తూ ఉంటుంది …… !!
ఆయుష్ ను ట్రీట్ చేసిన డాక్టర్ ఏలాంటి సమాధానం చెప్పకుండా తన క్యాబిన్ వైపు వెళ్ళడం చూసిన …… !! మోహిత్, విక్రమ్ & నిషాన్ లతో పాటు సూర్యదేవ్ & క్రిష్ణదేవ్ ఒకరిని ఒకరు చూసుకొని…… !! డాక్టర్ వెనుకే క్యాబిన్ లోకి వెళ్లి సూర్యదేవ్, క్రిష్ణదేవ్ & దిలీప్ చైర్స్ లో కూర్చుంటే……. !! నిషాన్, విక్రమ్ & మోహిత్ వాళ్ళ వెనుక నుంచుని డాక్టర్ వైపు చూస్తారు …… !!
డాక్టర్ అందరి వైపు చూసి జూనియర్ డాక్టర్ తీసుకుని వచ్చిన ఒక్కో రిపోర్ట్ చేతిలోకి తీసుకుని చెక్ చేస్తాడు…… !! స్కానింగ్, ఎమ్. అర్. ఐ & ఈ. సీ. జీ. ఇలా ప్రతీ ఒక్క రిపోర్ట్ ను చెక్ చేస్తాడు …… !! వేరే ఇద్దరి స్పెషలిస్ట్ డాక్టర్స్ తో పాటు ఆయుష్ రిపోర్ట్ చెక్ చేస్తూ ……. !! ఆ డాక్టర్స్ తో ఆయుష్ హెల్త్ గురించి అరగంట పాటు డిస్కస్ చేసి …… !! తన స్పెట్స్ తీసి టేబుల్ మీద పెడుతూ సూర్యదేవ్ వైపు చూస్తాడు ……. !!
డాక్టర్ మీరు అనవసరంగా టెన్షన్ పడ్డం ఆపి ఆయుష్ కి ఎలా ఉందో చెప్పండి ……. !! నాకు చాలా కంగారుగా ఉంది అంటూ వణుకుతున్న గొంతు తో చెప్తున్న సూర్యదేవ్ చేతి మీద చేయ్ వేసి……. !! ధైర్యం చెప్తూ మన ఆయుష్ కి ఎమ్ కాదు బావ టెన్షన్ పడకు …… !! అని ధైర్యం చెప్పి డాక్టర్స్ వైపు ఆయుష్ కండిషన్ ఏంటీ అన్నట్టు చూస్తాడు క్రిష్ణదేవ్ …… !!
సర్ మీతో ఇలాంటీ న్యూస్ అది కూడా ఆయుష్ సర్ గురించి చెప్పాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు…… !! బట్ ఇది దాస్తే దాగే విషయం కూడా కాదు అందుకే క్లియర్ కట్ గా సర్ హెల్త్ గురించి …… !! అన్ని చెక్ చేసి నా సీనియర్ డాక్టర్స్ తో పాటు స్పెషలిస్ట్ లతో కూడా డిస్కస్ చేసి చెప్తున్నాను …… !! ఆయుష్ సర్ ఆయుష్ సర్ ఇస్ ఇన్ కోమా అని మెల్లగా చెప్తాడు …… !!
వాట్ …?? అందరు ఒక్క సారిగా డాక్టర్ చెప్పిన విషయానికి అదిరిపడతారు ….. !!
సర్ ప్లీజ్ కంట్రోల్ ….!! ఈ విషయం చెప్పడానికి నాకు చాలా భాధగా ఉంది ఎందుకంటే నాకు ఆయుష్ సర్ అంటే చాలా గౌరవం …… !! ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి నేను సర్ ను హెల్ప్ అడిగినపుడు సర్ 30 cr హెల్ప్ చేసి చాలా మంది పూర్ పీపుల్ కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వమని ……. !! ఆ అమౌంట్ సర్ నే పే చేసేవాడు అలాంటి సర్ ను ఇవాళ అలా చూడ్డం నాకే చాలా కష్టంగా ఉంది ….. !! ఇక మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను…… !! అని పైకీ లేచి స్కానింగ్ రిపోర్ట్స్ ను స్క్రీన్ మీద చూపెడతాడు …… !!
ఆయుష్ సర్ బాడీ లో నుండీ మేము 7 బుల్లెట్స్ తీశాం…… !! రెండు బుల్లెట్స్ కడుపులో & ఒకటి లెఫ్ట్ హ్యాండ్ ఇంకోటి స్కల్ దగ్గర ….. !! రెండు బుల్లెట్స్ చెరో వైపు నీస్ దగ్గర ఇంకోటి థై దగ్గర అవి కూడా చాలా డీప్ గా దిగాయి …… !! అంతే కాకుండా ఆయుష్ సర్ కి కడుపులో & వీపున కత్తి తో చాలా దారుణంగా పొడిచారు….. !! రాడ్స్ తో తల మీద కరెక్ట్ గా మెదడు దగ్గర ఐరన్ రాడ్ తో కొట్టడం వల్ల …… !! సర్ మెదడు లో కొన్ని నర్వ్స్ పని చేయకుండా పోయాయి …… !! పైగా బుల్లెట్ కూడా అక్కడే ఉండడం వల్ల సర్ కోమా లోకి వెళ్ళిపోయారు …… !!
ప్రెసెంట్ అయితే సర్ బాడీ లోని ప్రతీ బుల్లెట్ ను రిమూవ్ చేశాం…… !! బట్ బ్రెయిన్ లో ఉండే ఫ్రంటల్ లోబ్, నసల్ సెప్టమ్ లోని యాక్టిివ్ గా ఉండాల్సిన నెర్వ్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి…… !! అక్కడ బుల్లెట్ రిమూవ్ చేయడం కూడా మాకు చాలా కష్టం అయింది ……. !! దీనికి సర్జరీ చేసిన యూస్ ఉండదు ……. !!
ఆయుష్ సర్ కోమా లో నుండి బయటకు రావడానికి ట్రీట్మెంట్ అయితే ఇస్తాం …… !! మీరు సర్ ను ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటే సర్ అంత త్వరగా రికవర్ అవుతారు …… !! అది నెల కావచ్చు సంవత్సరం కావచ్చు 10 సంవత్సరాలు ఆయినా పట్టచ్చూ ….. !! అది ఏదైనా మీరు చూసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ……. !!
సర్ ప్రెసెంట్ మనల్ని చూడలేడు, మాట్లాడలేడు & మన మాటలు కూడా వినిపించవు …… !! ప్రెసెంట్ సర్ ను ఒక చిన్న బేబీ లా చూసుకోవాలి & 1 మంత్ కంప్లీట్ గా హాస్పిటల్ లోనే ఉండాలి …… !!
డాక్టర్ చెప్పింది విన్న సూర్యదేవ్ కంట్లో నీళ్లు ఆగనంటు వస్తూ ఉంటే…… !! సూర్యదేవ్ ను క్రిష్ణదేవ్ బయటకు తీసుకుని వెళ్లి నువ్వే ఇలా అయిపోతే రాగిణి, ఆషి లకు ఎవరు ధైర్యం చెప్తారు బావా…… !! ఆయుష్ తప్పకుండా నార్మల్ అవుతాడు ….. !! అని కృష్ణదేవ్ ధైర్యం చెప్తున్నా సూర్యదేవ్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు ….. !!
ఆయుష్ లేని మ్యాన్షన్ రాజు లేని రాజ్యం లా వెల వెల పోతుంది…… !! ఆయుష్ కమాండింగ్ అంటే క్రిష్ణదేవ్ కి చాలా ఇష్టం …… !! చిన్నవాళ్ళు నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరికీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లెమ్ రాకుండా చూసుకుంటూ ….. !! ఎవరికి ప్రాబ్లెమ్ వచ్చినా వాళ్ళ ముందే ఉండే ఆయుష్ ఇప్పుడు ఇలా ప్రాణం లేని బొమ్మలా పడుకుని ఉండడం చూసి…… !! ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటారు వాళ్ళను ఓదార్చడం దిలీప్ కి చాలా కష్టంగా మారుతుంది …… !!
ఏడుస్తున్న నిషాన్ బుజం మీద చేయ్ వేసి …… !! డాక్టర్ లండన్ కి తీసుకుని వెళ్తే ఏమైనా యూస్ ఉంటుందా అని అడుగుతాడు మోహిత్…. !!
లేదు మోహిత్ సర్ ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు …… !! నేను ఆల్రెడీ ఫారిన్ డాక్టర్ తో మాట్లాడను సర్ ….. !! రిపోర్ట్స్ చూసి వాళ్లు కూడా నేను చెప్పిందే చెప్పారు ఎక్కడికి వెళ్ళినా సేమ్ ట్రీట్మెంట్ సర్ ….. !! కోమా నుంచి బయటకు వచ్చే వరకు ఆయుష్ సర్ ను పుట్టిన బేబీ లా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ …… !! ఎవరీ మినిట్ కాపాడుకుంటూ ఉండాలి చిన్న ఆలస్యం చేసినా …… ?? మాట కంప్లీట్ అవ్వకముందే
నో డాక్టర్ ….. !! బావ కి ఎమ్ కాదు కాకూడదు బావ ను నమ్ముకుని కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి …… !! 😭😭 బావ ను పిచ్చిగా ప్రేమించే నా చెల్లెలు బావ ఒక్క రోజు కనిపించక పోయినా గుక్క తిప్పుకోకుండా ఏడ్చే తన కూతురు దియా …… !! అంతే కాదు తనను అమితంగా ప్రేమించే ఒక పెద్ద కుటుంబమే ఉంది 🥹 …… !! ఇన్ని రోజులు బావ మా అందరినీ చూసుకున్నాడు ఇప్పుడు మా వంతు …… !! బావా మా ప్రాణం డాక్టర్ మేము బావ ను జాగ్రత్తగా చూసుకుంటాం 🥺🥺 అని చెప్పి నిషాన్ ను తీసుకుని ఇద్దరూ బయటకు వస్తారు ….. !!
ఎందుకు రా ఏడుస్తావ్ 🥹…. ?? ఇన్ని రోజులు బావ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు …… !! అందుకే బావ బాగా అలసిపోయి ఉంటాడు ……. !! ఇప్పుడు బావ కి విశ్రాంతి కావాలి అందుకే కొద్ది రోజుల పాటు నిద్రపోతాడు….. !! అని ఏడుస్తున్న మోహిత్ ను చూసి విక్రమ్, నిషాన్ గట్టిగా హత్తుకుని……. !! ఆయుష్ రూపాన్ని తలచుకుని విక్రమ్ ఆయుష్ అంటూ నిషాన్ ఆన్నయ్య అంటూ మోహిత్ బావ అంటూ ముగ్గురు గుండె పగిలేలా ఏడుస్తారు …… !!
అబ్బా ఫీలింగ్ ఎమోషనల్ 🥹 మేమే ఏడ్చాం అంటే మిమ్మల్ని కూడా సక్సెస్ఫుల్ గా ఏడిపించే ఉంటాం 😌 కొద్ది రోజుల తప్పదు అబ్బా దయచేసి నన్ను తిట్టుకోకండి అసలే కడుపు నొప్పి గా ఉంది ☹️