అందాల రాక్షసి{2}-66
మోహిత్ & విక్రమ్ ఆయుష్ ను గుర్తు చేసుకుని ఏడుస్తున్న నిషాన్ కి ధైర్యం చెప్పి …… !! డాక్టర్ పర్మిషన్ తో ముగ్గురూ ఆయుష్ ఉన్న రూమ్ లోకి అదురుతున్న గుండెతో అడుగు పెడతారు…… !! బెడ్ దగ్గరవుతున్న కొద్దీ ముగ్గురికీ అడుగు ముందుకు పడక ఒకరిని ఒకరు పట్టుకుని బెడ్ దగ్గరకు వచ్చీ చూడగా…… !! చుట్టూ మెషిన్స్ మధ్య ప్రాణం లేని బొమ్మలా పడుకున్న ఆయుష్ ను చూసి …… !! అన్నయ్య అంటూ ఏడుస్తూ వెళ్ళి నిషాన్ ఆయుష్ గుండె మీద తల పెట్టుకుని …… !! కళ్ళ నిండా నీళ్ళతో ఏడుస్తూ నిన్ను ఇలా చూడ్డం కంటే నా ప్రాణం అక్కడే పోయున్నా బావుండేది అన్నయ్య 🥹…… !!
నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా ఆఖరికి చంపినా నాకు సంతోషమే అన్నయ్య…… !! కానీ… కానీ 😭😭 నువ్వు ఇలా మాట్లాడకుండా పడుకుని ఉంటే తట్టుకోవడం నా వల్ల కాదు అన్నయ్య 🥹 ….. !! ఇప్పుడు నన్ను ఎవరు కుడుల్ చేస్తారు …… ?? లేట్ గా మహల్ కి వస్తే ఎవరు వార్న్ చేస్తారు ….. ?? నేను తినకపోతే ఎవరు బలవంతంగా తినిపిస్తారు ………. ?? ఆఫీస్ వర్క్స్ లో తప్పు చేస్తే ఎవరు పనిష్ చేస్తారు చెప్పన్నయ్య 😭😭 చెప్పు……. !!
నీకు ఇలా అయింది అని తెలిస్తే వదిన, దియా తట్టుకోలేరు అన్నయ్య …… !! ప్లీస్ ఒక్క సారి నా వైపు చూడు అని 🥺 ఆయుష్ మొహాన్ని వణికే చేతులతో తాగుతూ….. !! ఒక్క సారి ఒకే ఒక్క సారి నిష్ అని పిలువు అన్నయ్య అని ఏడుస్తున్న నిషాన్ ను బలవంతంగా దూరం జరిపి…… !! నిష్ కంట్రోల్ రా ఆయుష్ కి ఎమ్ కాదు ధైర్యంగా ఉండు …… !! ఇప్పుడు మావయ్య అత్తయ్య లకు ధైర్యం చెప్పాల్సింది నువ్వే ……. !! అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తాడు విక్రమ్…… !!
నా వల్ల కావట్లేదు బ్రో అన్నయ్య ను ఇలా చూడలేక పోతున్నా అంటూ విక్రమ్ ను హత్తుకుని చంటి పిల్లాడిలా ఏడుస్తున్న నిషాన్ ను ఓదారుస్తూ కన్నీళ్లతో ఆయుష్ వైపు చూస్తాడు విక్రమ్…… !! అక్కడే బెడ్ పక్కన ఉన్న చైర్ మీద కూర్చుని ఆయుష్ చేతిని తన రెండు చేతులలోకి తీసుకొని …… !! బావా నేను మాట్లాడేది వినిపిస్తుందా ☹️🥺 త్వరగా కళ్ళు తెరువు బావా నీ కోసం దియా చాలా ఏడుస్తుంది అంటూ బాధగా వినిపిస్తుంది మోహిత్ వాయిస్…. !!
నీకు ఇలా జరిగింది అని తెలిస్తే ఆషి అస్సలు తట్టుకోలేదు …… !! నీ భార్య, కూతురిని ప్రాణాలతో కాపాడుకుని నువ్వు మాత్రం ఇలా బెడ్ మీద పడుకోవడం ఏమైనా బావుందా……. ?? నువ్వు ఇలా ఉంటే ఆషి, దియా తట్టుకోగలరా నువ్వే చెప్పు …… !! త్వరగా నార్మల్ అవ్వు బావా నువ్వు నార్మల్ అయితే తప్పా నేను ఎంగేజ్మెంట్ చేసుకోను …… !! అని కన్నీళ్ళతో ఆయుష్ వైపు చూస్తాడు ….. !!
సర్ పేషెంట్ దగ్గర ఎక్కువ సేపు ఉండకూడదు ప్లీస్ మీరు బయటకు వెళ్ళండి …… !! అని డాక్టర్ చెప్పడం తో ముగ్గురు బారమైన హృదయాలతో ఆయుష్ ను చూస్తూ 🥺 బయటకు నడుస్తారు ………. !!
ఐ. సి. యూ రూమ్ బయట కూర్చున్న సూర్యదేవ్ ముగ్గురి వైపు కన్నీళ్ళతో చూస్తాడు……!! నిషాన్ ఏడుస్తూ సూర్యదేవ్ ముందు నీస్ మీద కూర్చుని ….. !! డాడ్ అన్నయ్య కి ఎమ్ కాదు ప్లీస్ మీరు ఇలా ఉండకండి ….. !! నా లాంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన మంచి మనిషి అన్నయ్య …… !! అలాంటి అన్నయ్య కు దేవుడు అన్యాయం చేయడు …… !! అని చెప్తూ సూర్యదేవ్ వడిలో తల పెట్టుకుని ఆయుష్ గురించి ఏడుస్తూ ఉంటాడు నిషాన్……. !!
అక్కడున్న అందరికీ ఆయుష్ – నిషాన్ ల మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలుసు కాబట్టి …… !! మౌనంగా కన్నీళ్ళు కార్చడం తప్పా ఎమ్ చేయలేని స్థితిలో ఉన్నారు …… !!
@@&&@@&&@@
ఆఫ్టర్ 5 అవర్స్
అప్పుడే నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ తన చేతి వేళ్ళను కదిలిస్తున్న అభి ను చూసిన సిస్టర్ …… !! ఫాస్ట్ గా వెళ్ళి డాక్టర్ ను తీసుకుని వస్తుంది ….. !! డాక్టర్ అభి ను చెక్ చేసి తనకు ఇంజెక్షన్ ఇచ్చి …… !! అభి పూర్తిగా స్రృహ లోకి వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తాడు …… !!
కళ్ళు తెరచిన అభి కి తాను ఎక్కడుందో అర్థం అవ్వక సీలింగ్ వైపు చూస్తు …… !! చక్రాల్లంటి కళ్ళను అటు ఇటు తిప్పుతున్న తనకు డాక్టర్, సిస్టర్ కనిపించడం తో ……. !! అది హాస్పిటల్ అని అప్పటికి కానీ అర్ధం అవ్యదు…… !!
తన స్టేత్ తీసుకుని అభి ను చెక్ చేస్తున్న డాక్టర్ అభి కి ఎలా ఉందో అడిగి తెలుసుకుని …… !! తనకు వన్ వీక్ పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పి సిస్టర్ ను అక్కడె ఉండి చూసుకోమని చెప్పి…… !! రూమ్ బయటకు వచ్చి తన వైపు చూస్తున్న అందరితో అభి అవుట్ ఆఫ్ డేంజర్ ….. !! అని చెప్పడం తో అందరు కొంత లో కొంత ఊపిరి తీసుకుంటూ రిలీఫ్ అవుతారు ….. !!
అభి కి కడుపులో కత్తి తో కొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే …… !! ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ సి.. సి.. సిస్టర్ అంటూ కష్టంగా గొంతు విప్పుతూ అ….అక్క, బావ బానే వున్నారు కదా కంగారుగా అడుగుతుంది ……. !!
మేడమ్ మీరు ఇప్పుడే స్రృహ లోకి వచ్చారు ……. !! మీరు ఎక్కువగా మాట్లాడకూడదు ప్లీస్ ప్రశాంతంగా పడుకోండి ….. !!
సిస్టర్ ప్లీస్ చెప్పండి అక్క, బావా ఎక్కడ ……. ?? అని మరింత టెన్షన్ గా అడుగుతున్న అభి ను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక…… !! మీ సిస్టర్ కి ఇంకా స్రృహ రాలేదు మేడమ్ & ఆయుష్ సర్ కోమా లో ఉన్నారు ……. !! ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేం అని డాక్టర్స్ చెప్పారు …… !! ప్లీస్ మీరు స్ట్రెస్ తీసుకోకండి అని చెప్తూ వుండగానే డాక్టర్స్ పర్మిషన్ తో రూమ్ లోకి వస్తున్న నిషాన్ ను చూసి …… !! అభి ఏడుస్తూ బావా అని చేయ్ ముందుకు పెట్టగానే నిషాన్ ఒక్క అడుగులో అభి ను చేరుకుని …… !! తనను బాధగా గుండెలకు హత్తుకుని వీపు నిమురుతాడు ….. !!
సిస్టర్ ఇద్దరి వైపు చూసి సౌండ్ చేయకుండా రూమ్ బయటకు వెళ్ళిపోయి డోర్ ముందుకు వేస్తుంది ……. !!
నిషాన్ కాసేపటికి అభి నుండి దూరం జరుగుతూ…… !! తన కన్నీళ్లు తుడిచి అన్నయ్య కి ఎమ్ కాదు నువ్వు ఎమోషనల్ అవ్వకు….. !! అని అదురుతున్న అభి పొట్ట వైపు చూసి ……. !! అనునయంగా చెప్తూ ఆప్యాయంగా తన నుదుటిన ముద్దు పెడతాడు …… !!
ఇ …..ఇదంతా నా వల్లే జరిగింది బావా🥺….. !! నేను దియా ను బయటకు తీసుకుని వెళ్లకుండా ఉండుంటే బావుండేది కదా……. !! ఇదంతా నా వల్లే బావా నేనే బావ ను కోమా లోకి వెళ్లేలా చేశాను ….. !! అని బెడ్ ను రెండు వైపులా పిడికిలి బిగించి చేతులతో కొడుతూ ఉంటే …… !! చేతికి పెట్టిన సెలైన్ నీడిల్ ఊడిపోయి అభి హ్యాండ్ కి బ్లడ్ రావడం తో వైట్ బెడ్ షీట్ మొత్తం ఎర్రగా మారిపోతుంది …… !!
అభి ఎమ్ చేస్తున్నావ్ నువ్వు స్టాప్ ఇట్ …… !! ఇందులో నీ తప్పేం లేదు అనిఅభి చేతులు గట్టిగా పట్టుకొని సిస్టర్ ను పిలిచి…… !! తిరిగి సెలైన్ పెట్టించి అభి చేయ్ పట్టుకుని తన పక్కనే కూర్చుని తనను మాటల్తో డైవర్ట్ చేసి…… !! వీక్ గా ఉన్న అభి కి జ్యూస్ తాగిస్తూ నుదుటిన అయిన తన గాయం మీద చిరు ముద్దు అద్దుతాడు ……. !!
గాయ్స్ ఈ ఎపిసోడ్ విని ఎంత మంది నిజంగా ఫీల్ అయ్యారో కామెంట్స్ చేయండి….. !! మేమైతే నిజంగా చాలా ఎమోషనల్ అయ్యాం 🥺 సీరియస్లీ నిషాన్ & ఆయుష్ ల బాండింగ్ ఇక్కడ ఎంత మంది కి ఇష్టం చెప్పండి 😌
ఆయుష్ కోమా లో ఉన్న సంగతి ఈవెనింగ్ కి సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది …… !! అందరితో పాటు మీడియా రిపోర్టర్స్ కూడా ఆయుష్ గురించి రక రకాల న్యూస్ స్ప్రెడ్ చేస్తూ …… !! తమ చానెల్ టి . ఆర్. పి రేటింగ్ పెంచుకుంటూ తమ నోటికి వచ్చింది చెప్తుంటారు….. !!
ఒకరు హార్ట్ ఎటాక్ అని ఇంకొకరు యాక్సిడెంట్ అని మరొకరు డబ్బు కోసం ఆయుష్ గారిని దారుణంగా పొడిచారు …… !! అని ఇలా రక రకాలుగా న్యూస్ స్ప్రెడ్ చేయడం తో అవి కాస్త వర్మ ఫ్యామిలీ దాకా వెళ్తాయి …… !!
న్యూస్ రిపోర్టర్ హాస్పిటల్ బయట నుండి ఇస్తున్న లైవ్ చూసిన సూర్యదేవ్ ….. !! కోపంగా తన మొబైల్ ఆఫ్ చేసి హాస్పిటల్ బయటకు నడుస్తాడు …… !! ఆయన ఎందుకు అంత కోపంగా వెళ్తున్నాడో తెలియక విక్రమ్ కూడా వెనుకే వెళ్తాడు ….. !!
వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్….. !! అని హాస్పిటల్ బయట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెలికాస్ట్ చేస్తున్న మీడియా ను చూసి…… !! సీరియస్ గా అడుగుతాడు సూర్యదేవ్ వర్మ ….!!
సూర్యదేవ్ ను చూసిన సి. ఐ. పరుగున వచ్చి సెల్యూట్ చేస్తాడు ….. !! సి. ఐ. వైపు చూసి ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే…… !! మీరంతా ఎమ్ చేస్తున్నారు అసలు వీళ్లకు ఇక్కడి వరకూ రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు …… ?? అంటూ సీరియస్ గా అడుగుతాడు …… !!
వుయ్ ఆర్ రియల్లీ సారి సర్ …… !! మేము ఎంత చెప్తున్నా మీడియా రిపోర్టర్స్ మా మాటను లెక్క చేయకుండా లైవ్ ఇస్తున్నారు …… !! మరో వైపు ఆయుష్ సర్ గురించి తెలిసి ఆయన వెల్ విషర్స్ & మీ కంపెనీ ఎంప్లాయిస్ లోపలికి వెళ్ళాలి…… !! అని గొడవ చేస్తున్నారు వాళ్ళను కంట్రోల్ చేస్తూ ఉంటే ….. !! వీళ్ళు ఆయుష్ సర్ గురించి లైవ్ ఇస్తున్నారు లాటి ఛార్జ్ చేస్తాం అన్నా కూడా ఎవరు కొంచెం కూడా బ్యాక్ స్టెప్ వేయడం లేదు ……. !!
సూర్యదేవ్ సి. ఐ. వైపు చూసి ఇంత జరుగుతుంటే నాకు ఇన్ఫామ్ చేయాలి…… !! అని తెలియదా అని వెంటనే కమీష్ణర్ కి కాల్ చేసి 15 మినిట్స్ లో హాస్పిటల్ ముందు ఉండాలి అని కాల్ కట్ చేస్తాడు …… !!
మేము కమిష్ణర్ కాదు కదా డి. జి. పీ వచ్చినా ఇక్కడి నుండి కదలం…… !! వుయ్ ఆర్ మీడియా రిపోర్టర్స్ ప్రజలకు అనుక్షణం ఎక్కడ ఎమ్ జరుగుతుందో తెలియజేయడమే మా డ్యూటి …… !! మేము ఎవరికి బయపడం సర్ లోపల ఎమ్ జరుగుతుందో …… ?? మాకు క్లియర్ గా చెప్తే కానీ మేము ఇక్కడి నుండి కదలం …… !! అని అందరూ అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చుంటారు …….. !!
చూడండి నాకు మీడియా అంటే రెస్పెక్ట్ ఉంది ….. !! బట్ ఇప్పుడు మేము చాలా బ్యాడ్ సిచుయేషన్ లో ఉన్నాం మాకు ఇప్పుడు ప్రైవసీ కావాలి ……. !! గొడవ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళండి ఇక లోపల ఆయుష్ పొజిషన్ గురించి డాక్టర్స్ ఇంకా క్లారిటీ గా చెప్పలేదు …… !! వాళ్ళు చెప్పాక ప్రెస్ మీట్ పెట్టి నేనే అందరికీ ఇన్ఫామ్ చేస్తాను ……. !! అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు సూర్యదేవ్…… !!
సర్ సర్ ఆయుష్ సర్ కి ఇలా జరగడానికి కారణం ఎవరో చెప్పండి…… ?? సర్… సర్ అంటున్నా సూర్యదేవ్ వెళ్లిపోవడం తో అందరు విక్రమ్ ను చుట్టు ముడతారు ……. !!
సర్ మీరు ఆయుష్ సర్ బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలుసు ….. !! పైగా క్రిష్ణదేవ్ సర్ డాటర్ ప్రణవి ను ఎంగేజ్మెంట్ చేసుకుని ఇంకో ఫ్యూ మంత్స్ లో మ్యారేజ్ అనగా సడెన్ అది బ్రేక్ చేసుకున్నారు ఎందుకు…… ??
నో పర్సనల్ క్వశ్చన్స్ ….!!
మీ వెల్ విషర్స్ ఎందుకు మ్యారేజ్ బ్రేక్ చేశారో తెలుసుకోవాలి అనుకున్నారు …… !! వాళ్ళ కోసం ఆయినా మీరు రీసన్ చెప్పండి సర్ …….. !!
ఉఫ్ నేను ప్రణవి మీరు అన్నట్టు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాం ……. !! బట్ ఇద్దరికీ అండర్స్టాండింగ్ కుదరక ఫ్యామిలీ తో డిస్కస్ చేసి ……. !! మ్యూచువల్ అండర్స్టాండంగ్ తోనే ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకున్నాం …… !! ఇస్ ఇట్ క్లియర్??
మీరు వేరే అమ్మాయితో సీక్రెట్ గా డేట్ చేస్తున్నారు …. ?? అని కూడా రూమర్స్ వచ్చాయి….. ?? దాని మీద మీ కామెంట్స్ ఎంటి ఇస్ ఇట్ ట్రూ సర్ …….. ??
సీక్రెట్ గా డేట్ చేస్తున్నా అని ఎవరు చెప్పారో వాళ్లకు చిన్న క్లారిఫికేషన్ ……. !! తన పేరు వేదాన్షిక షి ఈజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ …….. !! నేను త్వరలో తనను మ్యారేజ్ చేసుకోబోతున్నాను……. !! ప్రెసెంట్ ఇద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటున్నాం …… !!
ఓకే సర్ థాంక్ యూ లాస్ట్ క్వశ్చన్ ఆయుష్ సర్ కి అసలేం జరిగింది ……. ?? ఇది యాక్సిడెంట్ / మర్డర్ ఎటెమ్ప్ట్ ……. ?? ఆయుష్ సర్ ను ఇంత దారుణంగా చంపడానికి రీసన్ ఎవరు? ఎందుకిలా చేశారు ? ఇదంతా మనీ కోసమే జరిగిందా…… ?? లేక ఇంకా ఏదైనా మోటో ఉందా………?
గాట్ రోడ్ లో 120 మందికి పైగా బీహార్ నుండి వచ్చిన రౌడీల శవాలు అక్కడే పడున్నాయి…… !! ఎగ్జాక్ట్లీ అక్కడే ఆయుష్ సర్ మీద ఎటాక్ జరిగింది …… !! సో వాళ్ళే ఆయుష్ సర్ మీద ఎటాక్ చేశారు …. !! అని ప్రజలు అనుకుంటున్నారు మరి దీనికి మీ సమాధానం ఎంటి?
చూడండి వర్మ ఫ్యామిలీ అంటే ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది …… !! అక్కడ ఎమ్ జరిగినా సెన్సేషన్ అవుతుంది …… !! మీ మీడియా దాన్నే హాట్ టాపిక్ గా చెప్తూ బ్రేకింగ్ న్యూస్ అంటూ చూపించిందే చూపిస్తూ మీ టి.ఆర్.పీస్ పెంచుకుంటూ ఉంటారు …… !!
మీ ఛానెల్స్ చూసిన ప్రజలు మీరు చెప్తుంది నిజమా అబద్దమా …… ?? అని కూడా థింక్ చేయకుండా బ్లైండ్ గా నమ్మేస్తారు…….. !! సో మీడియా అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళే కానీ ఇలా మీ చానెల్ రేటింగ్స్ కోసం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి…….. !! ఆయుష్, ఆషి హెల్త్ కండిషన్ గురించి ఇంకా క్లారిటీ గా తెలియదు ……. !! తెలిశాక అంకుల్ చెప్పినట్టు మేమే ప్రెస్ మీట్ పెట్టి మీకు & మీ ద్వారా అందరికీ చెప్తాం…… !! సో ప్లీస్ మా ప్రైవసీ కి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడి నుండి వెళ్లిపోండి ఇట్స్ మై రిక్వెస్ట్ ……. !!
విక్రమ్ వాయిస్ కి మీడియా రిపోర్టర్స్ తల వంచేస్తూ…… !! సారీ సర్ మీరున్న సిచుయేషన్ అర్థం చేసుకోకుండా మా చానెల్ రేటింగ్స్ గురించి ఆలోచించాం ……. !! ఆయుష్ సర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని అందరు అరగంట లో ఆ ప్లేస్ ను కాలి చేసి వెళ్ళిపోతారు ……. !!
విక్రమ్ సి. ఐ. వైపు చూస్తూ నా పర్మిషన్ లేకుండా ఎవరినీ లోపలికి అలో చేయకండి …… !! ఆయుష్ హెల్త్ గురించి బయటకు తెలియడానికి వీల్లేదు ……. !! అది తన ప్రాణానికి చాలా ప్రమాదం అలాగే భువన్ & రౌడీ ల గురించి ఎటువంటి న్యూస్ బయటకు రాకూడదు……. !! అని సీరియస్ గా చెప్తూ లోపలికి వెళ్తున్న తనను అపుడే అక్కడికి వచ్చిన విప్లవ్ పిలుస్తాడు …… !!
విప్లవ్ ను చూసిన విక్రమ్ తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న కానిస్టేబుల్స్ తో …,. !! తనను వదలమని చెప్పగానే విప్లవ్ ఫాస్ట్ గా విక్రమ్ ను చేరుకుని ……. !! ఆయుష్ కి ఎలా ఉంది విక్రమ్ …… ?? అంటూ కంగారుగా అడుగుతాడు……. !! ( ఆ కంగారు ఆషి గురించి అనుకోండి అది వేరే విషయం 😌😒 )
విక్రమ్ హాస్పిటల్ లోపలికి నడుస్తూ …… !! ఆయుష్ గురించి డాక్టర్స్ చెప్పింది బాధగా చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటాడు ….. !!
ఆయుష్ గురించి తెలిసి మనసులో కోయ డాన్స్ వేస్తున్న విప్లవ్ కి ఆషి హెల్త్ కండిషన్ విని అడుగు ముందుకు పడదు …… !!
విప్లవ్ ఏమైంది అక్కడే ఆగిపోయారు …… !!
ఆ…. నథింగ్ నేను ఒక సారి ఆయుష్, ఆషి లను చూడచ్చా అని బాధ నటిస్తూ అడుగుతాడు …… !!
కాసేపటి మౌనం తర్వాత ఆయుష్ ను కలవడానికి డాక్టర్స్ ఒప్పుకోవడం లేదు….. !! ఆషి ను చూపిస్తాను రండి అని ఆషి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు …… !!
లోపలికి అడుగు పెడుతున్న విక్రమ్ & విప్లవ్ లకు
విక్కీ ఆగు …… !! అన్న మోహిత్ వాయిస్ కి లోపలికి వెళ్ళే వాడు కాస్త ఆగి మోహిత్ వైపు చూస్తాడు …… !!
లోపలికి ఎందుకు వెళ్తున్నారు విక్కీ …… ??
విప్లవ్ ఆషి ను చూడాలి అంటుంటే తీసుకుని వెళ్తున్నా మోహిత్ …… !!
సారి మిస్టర్ విప్లవ్ ఆషి కాన్షియస్ లోకి వచ్చే వరకు లోపలికి ఎవరినీ అలో చేయాలి అనుకోవడం లేదు ….. !! తను లేచాక వచ్చి చూడండి ….. !! అని చెప్పగానే విప్లవ్ దవడ పళ్ళు బిగబట్టి నో ప్రాబ్లెమ్ టేక్ కేర్ …… !! అంటూ కాసేపు అక్కడే కూర్చుని కోపంగా వెళ్ళిపోతాడు …….. !!
వాట్ హ్యాపెండ్ టు యూ మోహిత్ …… ?? ఎందుకు విప్లవ్ తో అలా అన్నావ్ …… !! పాపం తను ఫీల్ అయినట్టు ఉన్నాడు ……. !!
ఇప్పట్లో నేను ఎవరినీ నమ్మాలి అనుకోవడం లేదు విక్కీ…….. !! పైగా ఈ విప్లవ్ ను చూస్తే నాకు కొంచెం కూడా పాసిటివ్ థాట్స్ రావు …… !! ఎందుకైనా మంచిది నువ్వు కూడా తనకు దూరంగా ఉండు ……. !! అని ఇద్దరూ అభి ను చూడ్డం కోసం తన రూమ్ కి వెళతారు …….. !!