అందాల రాక్షసి{2}-67
అభి కొంచెం కూడా నువ్వు జ్యూస్ తాగలేదు ఇలా అయితే ఎలా త్వరగా పైకి లేవగలవు చెప్పు …… !! కొద్దిగా తాగు నానా ప్లీస్ అంటూ అభి కన్నీళ్ళు తుడిచి లాలనగా చెప్తున్న నిషాన్ వైపు చూస్తూ…… !! నా….. నాకొద్దు బావా నా కళ్ళ ముందు ఇంకా ఆయుష్ బావ అక్క నవ్వుతూ పార్టీ లో అందరినీ రిసీవ్ చేసుకోవడమే కనిపిస్తూ ఉంది …… !! ఎంతో సంతోషంగా ఉన్న మన ఫ్యామిలీ ఇవాళ నేను చేసిన పని వల్ల ఇలా ఏడుస్తూ ఉంది …… !! ఇదంతా నా వల్లే కదా బావ జరిగింది …… !! అక్కడే నా ప్రాణం పోయి బావ కి ఎమ్ కాకుండా ఉండుంటే ఎంత బావుండేది …….. !!
స్టాప్ ఇట్ అభి ఎన్ని సార్లు చెప్పాలి నీకు ……. !! అయినా జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అంటుంటే మళ్ళీ మళ్ళీ నా వల్లే జరిగింది అని పిచ్చి దానిలా మాట్లాడుతున్నావ్ ఎంటి …… ?? ఇంకో సారి నీ వల్లే ఇలా జరిగింది అన్నావో నాలుగు తగిలిస్తాను …… !! ఫస్ట్ జ్యూస్ తాగు అని బుగ్గలు వత్తి పట్టుకుని అభి కి బలవంతంగా జ్యూస్ తాగించి పెదవులు తుడుస్తాడు ……. !!
అభి నిషాన్ వైపు కళ్ళ నిండా నీళ్లతో చూస్తు ఉంటే చైర్ నుండి లేచి బెడ్ మీద కూర్చుంటూ…… !! తన బుజం చుట్టూ చేతులు వేసి తన వైపు చూస్తూ అభి చిన్ పట్టుకుని……. !! నువ్వు ఇంకా చిన్న పిల్లవి అభి నీలో ఇంకా చిన్న పిల్ల మనస్తవత్వం అలాగే ఉంది….. !! అందుకే దియా బయటకు వెళ్ళాలి అని అడగ్గానే తన హ్యాపీనెస్ కోసం రిస్క్ చేసి తీసుకుని వెళ్ళావ్ ….. !! కానీ ఇలా జరుగుతుంది అంటే తీసుకుని వెళ్తావా లేదు గా …… ?? అయినా దియా కోసం నీ ప్రాణాలు అడ్డు పెట్టి తనను సేవ్ చేశావ్ చూడు అది చాలు నువ్వేంటో చెప్పడానికి …….. !! అనవసరమైన విషయాలు అలోచించి బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పడుకో ….. !! అని అభి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఫస్ట్ టైమ్ నుదుటిన ప్రేమగా ముద్దు పెడతాడు ….. !!
నిషాన్ ముద్దుకు పరవశంగా కళ్ళు మూసుకున్న అభి ……. !! కాసేపటికి కళ్ళు తెరచి నిషాన్ వైపు చూసి ఏడుస్తూ గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ……. !!
నిషాన్ అభి వీపు నిమురుతూ తొందరగానే అన్ని సెట్ అవుతాయి……. !! నువ్వు ఇపుడే కద నానా స్పృహ లోకి వచ్చావ్ ఎక్కువగా ఇలా ఏడవడం అరవడం చేయకూడదు …… !! సరేనా కాసేపు పడుకో అని అభి ను తిరిగి బెడ్ మీదకు షిఫ్ట్ చేసి తనను పడుకో పెడుతూ ఉండగా……. !! రూమ్ లోకి వస్తారు విక్రమ్, మోహిత్ వాళ్ళను చూసిన అభి ఏడుస్తూ అన్నయ్య 🥺 అంటూ బెడ్ మీద నుండి లేస్తూ ఆపిన ఏడుపు మళ్ళీ మొదలు పెడుతుంది …….. !!
అభి అంటూ ఇద్దరూ చెరో వైపు కూర్చుని అభి కన్నీళ్ళు తుడిచి తనను కన్సోల్ చేస్తారు……. !!
అభి కి అసలు ఏడుపు ఆగడం లేదు …… !! కేవలం తను దియా ను బయటకు తీసుకుని వెళ్ళడం వల్లే ఇవాళ ఇలా అయింది …… !! అని తన మనసులో బలంగా నాటుకుని పోవటం తో దాని గురించి ఆలోచిస్తూనే ఏడుస్తూ ఉంటుంది ……. !!
అభి ఏడవకు రా చూడు అందరూ బానే ఉన్నారు ….,.. !! అని వాళ్ళ కంగారు దాచి అభి కి ధైర్యం చెప్పి తనను జాగ్రత్తగా బెడ్ మీద పడుకో పెడతారు …… !!
చాల సేపటి నుండి ఏడవడం వల్ల అభి కి రైట్ సైడ్ స్టమక్ దగ్గర ……. !! బుల్లెట్ తగిలిన చోట పెయిన్ రావడం తో అమ్మా ….. !! అంటూ స్టమక్ దగ్గర చేయ్ పట్టుకుని మెలికలు తిరగడం …… !! చూసి నిషాన్ ఫాస్ట్ గా డాక్టర్ క్యాబిన్ వైపు పరుగులు పెడతాడు ……. !!
కూతురికి స్పృహ వచ్చింది అని తెలిసి అక్కడికి వచ్చిన అభి పేరెంట్స్……. !! నిషాన్ వాళ్ళు బయటకు వచ్చాక లోపలికి వెళ్ళాలి అని చూస్తున్న అనిత, ప్రభాకర్ లు సడెన్ గా నిషాన్ అలా పరిగెత్తడం చూసి కంగారు పడతారు …….. !!
నిషాన్ తో పాటు వస్తున్న డాక్టర్ ను చూసి ప్రభాకర్, అనిత కూడా కంగారుగా వెనుకే వెళతారు…… !! నొప్పికి మెలికలు తిరుగుతున్న అభి ను చెక్ చేసి తనకు ఇంజెక్షన్ ఇవ్వగానే ……. !! అభి కాసేపటికి మత్తుగా కళ్ళు మూసుకుని నిద్రపోతుంది ……. !!
డాక్టర్ అభి బానే ఉంది కదా తనకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కదా అంటూ కంగారుగా అడుగుతాడు నిషాన్…… !!
నథింగ్ టు వర్రీ సర్ తను ఇప్పుడే కదా స్రృహ లోకి వచ్చింది …… !! సో తను ఇలా ఎమోషనల్ అవ్వడం లాంటివి చేయకూడదు ……. !! తను ఎక్కువగా ఏడవడం వల్లే స్టిచేస్ దగ్గర పెయిన్ వచ్చింది …… !! నో ప్రాబ్లెమ్ సర్ కాసేపు నొప్పిగానే ఉంటుంది ఇప్పుడు ఇంజెక్షన్ చేసి సెడిటివ్ ఇచ్చాను సో తనకు పెయిన్ తెలియదు…… !! ఇంకో వన్ అవర్ తర్వాత కాన్షియస్ లోకి వస్తుంది బట్ ఇంత మంది పేషెంట్ దగ్గర ఉంటే…… !! తను మీ అందరినీ చూసి మరింత ఎమోషనల్ అవుతుంది ….. !! కాబట్టి సిస్టర్ తో పాటు ఎవరో ఒక్కరు మాత్రమే ఇక్కడ ఉండండి ……. !!
నేను ఉంటాను డాక్టర్ నా కూతురిని నేను దగ్గరుండి చూసుకుంటాను …… !! అని ఏడుస్తూ అనిత అభి చేయ్ పట్టుకుని పక్కనే కూర్చోవడం తో అందరూ అభి వైపు చూస్తూ బయటకు నడుస్తారు …… !! అభి తల నిమురుతూ ప్రభాకర్ కన్నీళ్లు తుడుచుకుంటూ రూమ్ బయట అదే ఫ్లోర్ లో ఆషి రూమ్ ముందు ఉన్న దిలీప్ ముందు వొంట్లో శక్తి లేనట్టు కిందకు జారిపోయి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు…… !!
అక్కడ ఆ ఫ్లోర్ లో ప్రెసెంట్ హాస్పిటల్ స్టాఫ్ తో పాటు నిషాన్, మోహిత్ & విక్రమ్ మాత్రమే ఉన్నారు……. !! అందుకే ప్రభాకర్ ను అలా చూసి వీళ్ళు షాక్ అవుతూ కంగారుగా ఇటు వైపు నడుస్తారు …….. !!
@@&&@@&&@@
నువ్వు నాకు ఎమ్ చెప్పావ్ ఇప్పుడేం చేస్తున్నావ్ ……. !? అని రావడం రావడమే కోపంగా అక్కడికి వస్తూ అరుస్తున్న ప్రణవి వైపు విసుగ్గా చూసి తల తిప్పుతాడు విప్లవ్…… !!
ఆ ఆషి ను ఇక్కడి నుండి అందరికీ దూరంగా తీసుకుని వెళ్తాను …… !! అని నాకు చెప్పావ్ కాబట్టే నీకు నేను నువ్వేం ఇన్ఫర్మేషన్ అడిగినా కాదు అనకుండా చెప్పాను…… !! ఆయుష్ బావ కి తెలిస్తే చంపేస్తాడు అని తెలిసినా రిస్క్ చేసి అన్ని చెప్పాను …… !! అలాంటి నన్ను చీట్ చేసి ఇప్పుడు ఆయుష్ బావ ను కోమా లోకి వెళ్లేలా చేస్తావా…… ?? అంటూ కోపంగా పిచ్చిపట్టినట్టు అరుస్తుంది ప్రణవి…… !!
ఏయ్ వచ్చే దారిలో పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా …… ?? ఎందుకలా వాగుతున్నావ్ నా మూడ్ అస్సలు బాలేదు……. !! ముందు నువ్వు ఇక్కడి నుండి దొబ్బేయ్ అంటూ చిరాగ్గా మొహాన్ని పెడతాడు విప్లవ్…… !!
స్టాప్ ఇట్ విప్లవ్ అసలేం అనుకుంటున్నావ్ నువ్వు ……. ?? నువ్వేం అంటున్నా పడుతున్నా అని ఇష్టానికి మాట్లాడకు ….. !! ఇప్పుడే నీ గురించి అందరికీ చెప్పి నిన్ను మా బావ పక్కనే ఉన్న మరో బెడ్ మీద పడుకో పెడతాను …… !!
ఆయుష్ కి ఇలా అవ్వడానికి రీసన్ నేను కాదు ….. !!నాకు ఈ ఇన్సిడెంట్ కి ఏలాంటి సంబంధం లేదు ….. !!
వాట్ ….. ?? అంటూ డోర్ హ్యాండిల్ పట్టుకుని బయటకు వెళ్ళబోతూ షాక్ తో వెనక్కి తిరుగుతుంది ప్రణవి….. !!
ఈ ఎటాక్ నేను చేయించలేదు…… !! నేను ఆషి ను వెతుక్కుంటూ వెళ్ళే సరికి అక్కడ మొత్తం అయిపోయింది …… !!
నో నేను నమ్మను నువ్వు తప్పా ఆయుష్ బావ ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ….. !! తనకు బిజినెస్ రైవల్స్ తో ఇస్సూస్ ఉన్నా ఎప్పుడు బావ ను టచ్ చేసే డేర్ కూడా చేయలేదు …… !! కాబట్టి ఇది నువ్వే చేశావ్ నీ మీద డౌట్ రాకుండా వేరే స్టేట్ నుండి రౌడిస్ ను పిలిపించి ఇలా ప్లాన్ చేశావ్ …… !!
ఏయ్ లూస్ చెప్తున్నా కదా నేను ఈ ఎటాక్ చేయించలేదు అని …… !! అయినా అది నేను చేయించి ఉంటే ఆయుష్ ను ఒకటే టార్గెట్ చేస్తాను కానీ ఆషి ను ఎందుకు ఇలా చావు అంచుల్లో పడుకో పెడతాను…… !! ఇప్పుడు ఆషి పరిస్థితి ఎలా ఉందో అని నేను ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో నీ గోల ఏంటి…… ?? ఒక సారి తనను దూరం చేసుకుని పిచ్చి వాడిలా 6 సంవత్సరాల పాటు తన కోసమే వెతుకుతున్నాను ……. !! ఆషి నాకు దొరకక దొరకక దొరికిన వరం తను అలాంటి తనను ఇలా చూసి నాకు పిచ్చి పట్టినట్టు ఉంది …… !! దీనికి కారణం అయిన వాడు చచ్చాడు కాబట్టి బతికిపోయాడు…… !! లేకపోతే వాడిని బతికుండగానే చంపి చావు ఎంత బయకరంగా ఉంటుందో చూపించి మరీ చంపే వాడిని అని కోపంగా చెప్తాడు ……. !!
విప్లవ్ చెప్పింది నిజం తను ఎటాక్ చేయిస్తే ఆషి ను తీసుకుని వెళ్ళే వాడే …… !! కానీ ఇలా చావు బతుకుల మధ్య పడుకో పెట్టేవాడు కాదు …… !! పైగా విప్లవ్ ను హాస్పిటల్ లో ఎవరినీ చూడ్డానికి కూడా ఎలో చేయడం లేదు ……. !! అని ఆలోచిస్తూ మరి ఈ ఎటాక్ చేయించి ఎవరు అని విప్లవ్ వైపు చూస్తుంది …, !!
నీ బావ రైవల్ కంపెనీ ఛైర్మెన్ భువన్ తనే ఇదంతా చేశాడు …… !! వాడ్ని నా చేతులతో చంపే అవకాశం కూడా లేకుండా మోహిత్,విక్రమ్ వాడ్ని అక్కడే చంపేశారు ……. !! అని కోపంగా చెప్పి తన సీక్రెట్ డ్రాయర్ లో దాచిన పవర్ఫుల్ డ్రగ్ ను టేబుల్ మీద కొద్దిగా స్పిల్ట్ చేసి….. !! దాన్ని ముక్కుతో కళ్ళు మూసుకుని గుండెల నిండా పీల్చి మత్చెక్కిన కళ్ళతో ప్రణవి వైపు చూసి …… !! మరో సారి ఇన్హెల్ చేసి నాకు వర్క్ ఉంది మళ్లీ కలుస్తా ……. !! అని అక్కడి నుండి వెళ్లిపోతున్న విప్లవ్ వైపు చూస్తూ వీడు ఎక్కడికి వెళ్తున్నాడు …… ?? పైగా డ్రగ్స్ కూడా యూస్ చేస్తున్నాడు అని ఆలోచనలో పడుతుంది …… !!
మమ్మా అంటూ ఒక్క సారిగా బెడ్ మీద నుండి లేచి కూర్చుంటూ….. !! భయం తో గొంతు తడారిపోతూ ఉంటే వ….. వద్దు మమ్మా ను ఎమ్ చేయద్దు డాడ్ సేవ్ అస్ ……. !! అని తాము ఇంకా భువన్ కి బంధీ గా ఉన్నాం అనుకుని భయం తో ఏడుస్తు ఉంటుంది దియా…… !! తనను అలా చూసినా వేద, జోషి కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు ……. !!
దియా బంగారం …… !! అంటూ ఇద్దరు దియా ను హత్తుకుని చూడు నీకేం కాలేదు …… !! అని దియా వెన్ను నిమురుతూ తను హాస్పటల్ లో ఉన్నట్టు దియా కి తనున్న రూమ్ చూపించడం తో కాసేపటికి దియా తన ఏడుపు ఆపుతుంది …… !!
వేద మెల్లగా దియా నుండి దూరం జరిగి …… !! టేబుల్ మీద దియా కోసం ఉంచిన జ్యూస్ గ్లాస్ తీసుకుని……. !! దాని మీదున్న కొస్టర్ తీసి దియా కి ఏవేవో మాటలు చెప్తూ కొంచెం జ్యూస్ తాగిస్తుంది …… !!
హాఫ్ గ్లాస్ జ్యూస్ వెక్కిళ్లు మధ్య తాగిన దియా కి ఆషి గుర్తు రావడం తో మ….. మమ్మా… మమ్మా ఎక్కడ ……. ?? నేను మమ్మా ను చూడాలి అని గ్లాస్ దూరంగా నెడుతూ తనకు పెట్టిన సెలైన్ వైర్స్ కూడా తీసేస్తున్న దియా ను బలవంతంగా ఆపి….. !! తనను గట్టిగా హత్తుకుని వేద ఫాస్ట్ గా వెళ్ళి మోహిత్ కి దియా గురించి చెప్పి తీసుకుని రా ఫాస్ట్ అని కంగారుగా చెప్తుంది ……. !!
ఇపుడే తీసుకుని వస్తాను అని బయటకు పరుగెత్తిన వేద కి …… !! అదే ఫ్లోర్ లో నడుచుకుంటూ ఎదురుగా వస్తారు మోహిత్, విక్రమ్ …… !! వాళ్ళను చూసి ఫాస్ట్ గా వాళ్ల ముందుకు వెళ్లి దియా ఆషి కోసం గొడవ చేస్తుంది ……. !! అని వేద చెప్పగానే ఇద్దరు పరుగున దియా రూమ్ కి వెళ్తారు వెనుకే వేద కూడా పరిగెడుతూ వెళ్తుంది ……. !!
నన్ను వదులు అత్త అంటూ జోషి ను కొడుతూ ఉన్నా ……. !! జోషి అలాగే పట్టుకుని దియా ను కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటుంది …… !! డోర్ ఓపెన్ చేసుకుని అక్కడికి వచ్చిన విక్రమ్ అది చూసి ……. !! ఫాస్ట్ గా జోషి చేతుల్లో నుండి దియా ను ఎత్తుకుని దియా కామ్ డౌన్…… !! అంటూ తన వెన్ను నిమురుతూ చెప్తాడు …. !!
నాకు మమ్మా కావాలి తీసుకుని వెల్తావా లేదా ……. !! అని ఏడుస్తూ కొడుతున్న దియా ను కంట్రోల్ చేయడం కష్టమే అవుతుంది …… !! అలా అని తనను ఎక్కువ సెడెటివ్ ఇవ్వడం కూడా తన హెల్త్ కి మంచిది కాదని …… !! మోహిత్ డాక్టర్స్ పర్మిషన్ తో దియా ను ఎత్తుకుని విక్రమ్ తో ఆషి ఉన్న రూమ్ లోకి అడుగు పెడతాడు …… !!
ఆషి ను అలా చూస్తూ ఉంటే డెలివరీ టైమ్ లో అషిక ను కూడా ఇలాంటి పరిస్థితిలో చూసింది ……. !! గుర్తొచ్చి మోహిత్ కళ్ళు వర్షించే మేఘంలా మారుతాయి ……. !! విక్రమ్ కూడా ఆషి ను ఆలా చూసి కన్నీళ్ళు పెట్టుకోవడం తప్పా ఇంకేం చేయలేని స్థితిలో ఉన్నాడు ….. !!
ఎపుడూ అన్నయ్య… అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే ఆషి 🥹 ……. !! ఇప్పుడు చుట్టు మెషీన్ల మధ్య ప్రాణం లేని బొమ్మలా పడుకుని కనిపించడం ఇద్దరూ తట్టుకోలేక పోతున్నారు …… !!
అప్పటి వరకు బెడ్ మీద ఉంది ఎవరో అనుకున్న దియా కి ఆషి మొహం కనిపించడం తో మమ్మా 🥹☹️……. !! అంటూ మోహిత్ చేతుల్లో నుండి జారి మమ్మా లెగు మమ్మా నన్ను చూడు అని ఏడుస్తూ పిలుస్తుంది ……. !!
దియా ఎంత పిలుస్తున్నా ఆషి నుండి ఎటువంటి సమాధానం ఉండదు ……. !! అది చూసిన దియా బెడ్ ఎక్కి కూర్చుంటూ ఆషి బుగ్గలు తడుతూ ……. !! మమ్మా నా వైపు చూడు నాకు ఏడుపు వస్తుంది 🥺………. !! నాతో మాట్లాడు మమ్మా నాకు ఫీడ్ చేయ్ హ్యాండ్స్ బాగా నొప్పిగా ఉన్నాయి ……. !! మమ్మా అని ఏడుస్తూ చెప్తుంటే మోహిత్ విక్రమ్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగతాయి 🥺🥹…… !!
దియా ఆషి కి మరింత దగ్గరగా జరిగి మమ్మా నాకు ప్రామిస్ చేశావ్ నన్ను వదిలి వెళ్ళను ……. !! అని మరి ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతావా చెప్పు మమ్మా ……. !! నువ్వు లేకపోతే నాకు బాత్ ఎవరు చేయిస్తారు …….. ?? నాకు నైట్ టైమ్ స్టోరీస్ ఎవరు చెప్తారు…… ?? అని ఏడుస్తూ ఆషి గుండెల మీద తల పెట్టుకుంటుంది ……… !!
( ఆఫ్టర్ నూన్ తన ప్లే స్కూల్ నుండి మహల్ కి వచ్చిన దియా కి ఆషి ఫీవర్ వల్ల పడుకుంది…… !! అని రాగిణి చెప్పడం తో బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఆషి వైపు చూస్తుంది ……. !! స్పృహ లో లేనట్టు నిద్రపోతూ కనిపిస్తున్న ఆషి ను చూసి దియా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి …… !!
ఆషి కోసం తినడానికి ఏమైనా తీసుకుని రావడానికి బెడ్ దిగి ఫాస్ట్ గా వెళ్తూ…… !! ఫ్లోర్ మ్యాట్ తగిలి కింద పడి నొప్పికి అమ్మా అంటూ ఏడుస్తున్న దియా ఏడుపు ……. !! ఆషి చెవిని తాకగానే దియా అంటూ ఆంత ఫీవర్ లో కూడా మెల్లగా కళ్ళు తెరచి దియా వైపు చూస్తుంది ……. !!
దియా కి చిన్న దెబ్బ తగిలినా ఆషి తట్టుకోలేదు …… !! అందుకే తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దియా ఏడుపు వింటే…… !! తను స్రృహ లో లేకపోయినా సరే దియా మీదున్న ప్రేమ తనను వాస్తవం లోకి తీసుకుని వస్తుంది…… !! )
అప్పుడు జరిగింది గుర్తు చేసుకున్న దియా ……. !! వెంటనే ఆషి మీద నుండి లేచి కూర్చుంటూ ……… !! మమ్మా…… మమ్మా లే వీళ్ళు నన్ను చంపేస్తున్నారు వదలండి… వదలండి …… !! మమ్మా ప్లీస్ వీళ్ళు నన్ను చంపేస్తున్నారు సేవ్ మీ …. !! అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ………. !!
రేయ్ ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావ్…… ?? అంటూ విక్రమ్ ఆషి ను ఇలా చూసి దియా ఏదైనా హెల్యూసినేషన్ లోకి వెళ్లిందా అని కంగారు పడతాడు ……. !!
వి….. విక్కీ అటు చూడు …… !! అని మోహిత్ అశ్చర్యంగా చెప్పడం తో ఏమైంది అంటూ అటుగా చూసిన విక్రమ్ కి ……. !! ఆషి చేతి వేళ్ళను కదిలించడం కనిపించి ఆనందంగా మోహిత్ వైపు చూస్తూ …… !! ఆషి రియాక్ట్ అవుతుంది మోహిత్ అని హ్యాపీ టియర్స్ తో చెప్తాడు …… !!
డాక్టర్స్ కూడా ఎమ్ చేయలేక పోయారు బట్ కన్న తల్లి ప్రేమ తనను కదిలించింది చూసావా విక్కీ ……. !! అని కన్నీళ్ళు తుడుచుకుంటూ దియా మొహం ముద్దులతో ముంచెత్తి ఇంకా అలాగే ఎడువు బంగారం …….. !! నువ్వు ఏడవడం మాకు కష్టంగా ఉన్నా మీ మామ్ పైకి లేవాలి అంటే నువ్వు ఏడవాలి దియా….. !! నీ కన్నీళ్ళు తనను కదిలించాయి నీ కన్నీళ్లకు తను రీయాక్ట్ అవుతుంది …… !! అయినా మాకు రాని ఆలోచన ఇంత చిన్న వయసులో నీకు వచ్చింది బంగారం …… !! అని దియా ను భారమైన హృదయం తో గుండెలకు హత్తుకుంటాడు …… !!
దియా మోహిత్ కన్నీళ్లు తుడిచి ఏడవకు మామ …… !! నేను మామ్ ను బెడ్ మీద నుండి లేపుతాను చూడు …… !! అని మోహిత్ నుండి దూరం జరిగి కొంచం వెనక్కి జరుగు మామ అని ఇద్దరినీ మూడు అడుగులు వెనక్కి జరిపి…… !! ఆషి వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ ఒక్క సారిగా బెడ్ మీద నుండి ఫ్లోర్ మీదకు అలాగే బోర్లా పడి …… !! మూతి పగల కొట్టుకోవడం తో రెండు పల్లు ఊడిపోయి దియా నోటి నుండి రక్తంతో పాటు మమ్మా …. !! అంటూ గట్టిగా కేక వినిపిస్తుంది ….. !!
ఊహించని పరిణామానికి విక్రమ్, మోహిత్ దియా అంటూ కంగారుగా పిలుస్తూ …… !! దియా ను పైకి లేపడం & ఆషి దియా …… !! అంటూ ఒక్క సారిగా స్రృహ లోకి రావడం ఎట్ ఏ టైమ్ జరుగుతాయి…… !! అది చూసిన మోహిత్ , విక్రమ్ షాక్ అవ్వడం కూడా ఓకే సారి జరుగుతాయి…… !!
ట్రూలీ దిస్ ఎపిసోడ్ మేక్స్ మీ సో ఎమోషనల్ 🥺