Login with OTP

అందాల రాక్షసి{2} -68

aashyatech

Author

దియా ను ఆలా చూసిన మోహిత్, విక్రమ్ కంగారు పడుతూ ఉంటే……. !! కరెక్ట్ గా అప్పుడే దియా అంటూ ఆషి ఒక్క సారిగా స్రృహ లోకి రావడం చూసి మోహిత్ స్టాచ్యూ లా నిలబడిపోతాడు…… !! ఆషి ను ఆలా చూసిన విక్రమ్ రేయ్ మోహి ఆషి అంటూ ఏడుస్తున్న దియా ను ఎత్తుకుని ……. !! వెంటనే బయటకు నడిచి ఆషి కి స్పృహ వచ్చిందని డాక్టర్స్ కి ఇన్ఫామ్ చేసి……. !! దియా ను జోషి కి ఇస్తూ దియా కి అర్జంట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయించమని చెప్తూ …… !! దియా కి మరో సారి ముద్దు పెడుతూ నువ్వు నిజంగా బంగారం రా ……. !! అమ్మ కోసం ఇంత నొప్పిని బరిస్తున్నావ్ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుస్తుంది……. !! అమ్మ కి ఎమ్ కాదు ఏడవకు బంగారం అని దియా కన్నీళ్ళు తుడిచి …… !! ఫాస్ట్ గా వెల్లు అని జోషి ను అక్కడి నుండి పంపించి ఆషి ఉన్న రూమ్ లోకి పరిగెడతాడు ……. !!

అప్పటీకే డాక్టర్స్ ఆషి ను చెక్ చేస్తూ మోహిత్ ను బయట వెయిట్ చేయమని చెప్పి బయటకు పంపిస్తారు…… !! అందరూ ఆషి రూమ్ ముందు నిలబడి టెన్షన్ గా వెయిట్ చేస్తూ డాక్టర్ ఎమ్ చెప్తాడా అని కంగారుగా చూస్తూ ఉంటారు……. !!

కాల్ మాట్లాడి వస్తున్న నిషాన్ ఫ్లోర్ లో జరుగుతున్న హడావిడికి ఆయుష్ కి ఏమైందో …… ?? అని కంగారుగా అక్కడికి వచ్చిన తనకు విక్రమ్ ఆషి గురించి చెప్పడం తో నిజమా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ……. !! అందరితో పాటు తను కూడా డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తాడు……. !!

గంట సేపటి తరువాత ఆషి రూమ్ నుండి బయటకు వస్తారుడాక్టర్స్ …… !! ఆషి ను చెక్ చేసిన డాక్టర్స్ వైపు వర్మ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ గా చూస్తూ ఉంటారు…… !!
ఆషి గురించి ఏలాంటి బ్యాడ్ న్యూస్ వినకూడదు…… !! అని మనసులో కోరుకుంటూ అందరిలోకి ముందుగా …… !! ఆ టెన్షన్ తట్టుకోలేక డాక్టర్ ను ఆషి హెల్త్ గురించి అడుగుతాడు సూర్యదేవ్ వర్మ ….,.!!

డాక్టర్స్ సూర్య దేవ్ వైపు చూస్తూ నాతో రండి సర్ ……. !! అంటూ అందరినీ తీసుకుని కాన్ ఫరెన్స్ రూమ్ లోకి తీసుకుని వెళతారు ……. !! అందరినీ చైర్స్ లో కూర్చోమని చెప్పి స్క్రీన్ మీద జూనియర్ డాక్టర్ ఇచ్చిన …… !! ఆషి రిపోర్ట్స్ స్క్రోల్ చేస్తూ అందరి వైపు చూస్తూ మాట్లాడ్డం మొదలు పెడతాడు……. !!

మిసెస్ ఆయుష్ గారు ఇంత త్వరగా కాన్షియస్ లోకి రావడం నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి ……. !! ఇక్కడ ఈ రిపోర్ట్ చూడండి అని ఆషి స్కాన్ రిపోర్ట్స్ వైపు జూమ్ చేసి మరీ చూపిస్తూ…… !! కత్తి చాలా డీప్ గా దిగటం వల్ల ఆశ్రిత గారు కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అనే చెప్పాలి ……. !! తను ఎక్కువ సేపు కూర్చోవడం కానీ నడవడం కానీ చేయకూడదు…… !! అలాగే తను దేనికి ఎమోషనల్ అవ్వకూడదు …… !! మొత్తం మీద తను కంప్లీట్ గా వన్ మంత్ బెడ్ రెస్ట్ లోనే ఉండాలి ……. !!

ఆ తర్వాత తన హెల్త్ కండిషన్ చూసి…… !! తనకు కొన్ని టెస్ట్స్ చేసి తనతో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ …… !! లైక్ వాకింగ్, మెడిటేషన్ , ఫిజియోథెరపీ వంటివి చేస్తూ ఉంటే …… !! తను విత్ ఇన్ 3 మంత్స్ లో నార్మల్ అవుతారు……. !! మళ్ళీ చెప్తున్నా తనకి ఏలాంటి షాకింగ్ న్యూస్ చెప్పకండి ఇది తన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది…… !!

డాక్టర్ ఇప్పుడు ఆషి కండిషన్ బానే ఉంది కదా ……. ?? ఐ మీన్ తన ప్రాణానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కదా ……… !! అంటూ టెన్షన్ గా అడుగుతాడు విక్రమ్ ….. !!

యాహ్ షి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ సర్ ఇంకో గంట లో స్రృహ లోకి కూడా రావచ్చు …… !! బట్ చెప్తున్నాను కదా తనకు ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పకూడదు.,… !! అలాగే తను ఎంత బాగా రెస్ట్ తీసుకుని & ప్రశాంతంగా ఉంటూ……. !! రెగ్యులర్ గా మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటే చాలా త్వరగా క్యూర్ అవుతుంది …… !!

థాంక్ యూ డాక్టర్ …… !! అంటూ అందరు కూడా సగ ప్రాణం తిరిగి వచ్చినట్టు ఫీల్ అవుతూ ……. !! డాక్టర్ చెప్పినట్టే ఆషి కి ఆయుష్ గురించి చెప్పకూడదు ……. !! అని సూర్యదేవ్ అందరికి స్ట్రిక్ట్ గా చెప్పడం తో ఆషి హెల్త్ కూడా ద్రుష్టిలో పెట్టుకొని ……. !! అందరు కూడా తప్పక ఒప్పుకుని……. !! ఆషి రూమ్ ముందు తనకు ఎపుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు …… !!

@@&&@@&&@@&&@@&&

భువన్ చనిపోయాడు అని ఇప్పటి నుండి అన్నయ్య అనే ఈ ఒక్క బంధం కూడా లేకుండా పోయి ……. !! తాను ఒంటరి అయిపోయాడు అని  హాస్పటల్ బెడ్ మీద పడుకున్న సుమిత్ ….. !! అర్థరాత్రి అవుతున్నా నిద్ర పోకుండా భువన్ తో గడిపిన జ్ఞాపకాలు ….. !! పదే పదే గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళతో దిండు ను తడిపేస్తూ ఉంటాడు …… !!

భువన్ ఏలాంటి వాడైనా సుమిత్ ను తమ్ముడి లా కాకుండా  కొడుకు లా చూసుకునే వాడు …… !! అందుకే భువన్ ఎమ్ చెప్పినా కాదు అనకుండా చేసే వాడు సుమిత్…… !! ఆఖరి చూపుకు కూడా నోచుకోని తన దీన స్థితికి తనలో తనే మదన పడుతూ ఉంటాడు …… !!

ఆయుష్ గురించి తెలిసే వద్దు వద్దు అన్నాను అయినా వినకుండా……. !! పగ… పగ అంటూ వెళ్లి ఆ ఆయుష్ చేతిలో చచ్చిపోయావ్ …… !! ఇప్పుడు నేను ఎవరి కోసం ఉండాలి అన్నయ్య నా కంటూ చెప్పుకోవడానికి ఉన్నది నువ్వు మాత్రమే ……. !! ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోయాక నేను మాత్రం ఉండి ఎమ్ సాధించాలి ……. ?? అని భువన్ ఫోటో ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సుమిత్ ………. !!

అందుకే రా నిన్ను నీ ఆన్న దగ్గరకే పంపించడానికి వచ్చాను ……. !! వెళ్ళి మీ ఆన్న కి హాయ్ చెప్పు అని రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేస్తూ…… !! తన వైపు పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి నుంచున్న వ్యక్తి ను చూసి సుమిత్ భయం తో బిగుసుకుపోయాడు ……. !!

@@&&@@&&@@&&

తన కను గుడ్లను అటు ఇటు తిప్పుతూ …… !! కష్టంగా కను రెప్పలు తెరచి సీలింగ్ వైపు చూస్తు…… !! మసకగా కనిపిస్తున్న రూపానికి మళ్ళీ కళ్ళు తెరచి నోటికి పెట్టిన ఆక్సిజన్ మాస్క్ ను…… !! సెలైన్ పెట్టిన చేత్తో కష్టంగా తీసి ఆ.. ఆ… ఆయుష్ గారు ……. !! అంటూ కనిపించని ఆయుష్ కోసం చుట్టూ చూస్తుంది ఆషి మరి ఆయుష్ పరిస్థితి తెలిస్తే?

ఆషి స్పృహ లోకి రావడం చూసిన జూనియర్ డాక్టర్ ……. !! తనను చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాక ముందుగా……. !! సూర్యదేవ్, క్రిష్ణదేవ్ లను లోపలికి అలో చేస్తుంది ……… !! వాళ్ళతో పాటు ప్రభాకర్, దిలీప్ కూడా స్పెషల్ రిక్వెస్ట్ మీద లోపలికి వచ్చి …… !! ఆషి ను అలా కంటి నిండా నీళ్లతో చూస్తు ఉండి పోయారు …….. !!

 

 

ఆషి ను అలా చూసినా నలుగురు అడుగులో అడుగేసుకుంటూ వస్తూ ……. !! తన వైపు కళ్ళ నిండా నీళ్లతో చూస్తు ఆషి ఎదురుగా నుంచుని తన వైపు బాధగా చూస్తూ ఉంటారు …… !! ఆయుష్ గురించి తెలిస్తే ఆషి తట్టుకోగలదా …… ?? ఇప్పుడిప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అందరూ సంతోషంగా ఉన్నారు ……. !! అనుకున్న టైమ్ లో అనుకోని అగాధం వీళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేయడం తో వాళ్ళు ఏడవడం తప్ప ఎమ్ చేయలేని స్థితిలో ఉన్నారు …….. !!

అడుగుల చప్పుడుకి సీలింగ్ వైపు చూస్తున్న ఆషి ఇటు వైపు చూస్తుంది……. !! రైట్ సైడ్ లో నలుగురు తన వైపు బాధగా చుస్తూ కనిపించడం తో నీరసంగా కళ్ళు ఆర్పుతూ…… !! ఆ…… ఆ…… ఆయుష్ గారు ఎక్కడ మావయ్య ……… !! అంటూ ముందుగా తన కళ్ళకు కనిపించిన సూర్యదేవ్ వైపు చూస్తూ నెమ్మదిగా నోరు విప్పుతుంది …… !!

ఆశ్రిత ఏలా ఉంది తల్లీ…… !! అని లాలనగా తన తల నిమురుతూ అడుగుతున్న సూర్యదేవ్ వైపు చూసి …… !! మా… మా…. మావయ్య ఆయన ఎక్కడ ఆయుష్ గారికి ఎమ్ అవ్వలేదు కదా ……. ?? అని కంగారు నిండిన కళ్ళతో కష్టంగా పదాలు పలుకుతున్న ఆషి ను చూసి…… !! సూర్యదేవ్ కి ఎమ్ చెప్పాలో అర్థం అవ్వక ప్రభాకర్ వైపు చూస్తాడు …… !!

ఆషి అల్లుడు గారు బావున్నారు అని మరో వైపు కూర్చుంటూ…… !! నువ్వు కంగారు పడకు అంటూ స్మూతీ వాయిస్ తో నమ్మకంగా చెప్తాడు ప్రభాకర్…… !!

ఆయుష్ గారిని ఒక సారి చూడాలి అని ఉంది ……. !! ప్లిస్ నాన్న నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళండి ……… !! ఆయన ఎలా ఉన్నారో ఎంటో అంటూ కన్నీళ్ళతో చెప్తున్న కూతురిని చూసి …… !! ప్రభాకర్, దిలీప్ ల గుండె భారంగా మారుతుంది ……… !!

ఆషి ఏంట్రా ఇది చూడు అని ఆషి కన్నీళ్ళు తుడుస్తూ…… !! ఆయుష్ చాలా స్ట్రాంగ్ ఇది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా……. !! ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా ఆయుష్ ను ఎమ్ చేయలేరు ……. !! తను చాలా బాగున్నాడు ఇన్ఫాక్ట్ మా అందరితో మాట్లాడాడు కూడా ( ఇలా చెప్తున్నప్పుడు క్రిష్ణదేవ్ గొంతు వోనుకుతుంది) ……… !!

మీ…..మీరు చెప్పేదీ నిజమా బాబాయ్ ….. !! ఆయుష్ గారు 🥺🥺 ఆయుష్ గారు నిజంగా బావున్నారా…… !!

నిజం ఆషి …… !! నేను చెప్తున్నాను కదా తను చాలా బావున్నాడు అని తన కన్నీళ్లు తుడుస్తూ చెప్తాడు …… !!

ఆషి పల్స్ రేట్ చూస్తున్న జూనియర్ డాక్టర్ …… !! మేడమ్ ప్లీస్ కంట్రోల్ మీరు ఎమోషనల్ అవ్వకూడదు …….. !! సర్ ప్లీజ్ మీరు ఇక వెళ్లండి ……. !! మేడమ్ ఎక్కువ మాట్లాడకూడదు …… !! అంటూ అందరినీ బయటకు పంపిస్తాడు …… !!

వెళ్తున్న ప్రభాకర్ చేతిని  పట్టుకుంటూ …… !! ఆయుష్ గారిని నేను పిలిచాను అని చెప్పండి నాన్న ……. !! అని కన్నీళ్లతో చెప్తున్న కూతురి తల నిమిరి కన్నీళ్లతో బయటకు వెళ్ళిపోతాడు …… !!

ప్రతీ ఒక్కరూ రావడం కాసేపు ఆషి తో మాట్లాడ్డం & వెళ్ళడం ……. !! ఆయుష్ గురించి అడిగిన ప్రతీ ఒక్కరూ ఆయుష్ పడుకున్నాడు …… !! అని ట్రీట్మెంట్ జరుగుతుంది అని ఇంజెక్షన్ చేసారు ……… !! అని రీసన్స్ చెప్తూ ఆషి దగ్గర మాట దాటేస్తూ ఉంటారు …….. !!

నెక్స్ట్ డే ఆషి దగ్గరకు దియా ను తీసుకుని వెళ్తూ ……. !! ఆయుష్ గురించి మమ్మా కి చెప్పకు బంగారం ……. !! అని తన కండిషన్ క్లియర్ గా చెప్పడం తో దియా కూడా ఆషి తో ఆయుష్ గురించి హైడ్ చేస్తుంది …… ;!

దియా కి ఎమ్ కాలేదని ఆషి రిలాక్స్ అయ్యే లోపు ……. !! తనకు అయిన గాయాలు చూసి ఏడుస్తూ ……. ;! ఎమ్ అయింది దియా ఈ దెబ్బ ఎంటి …… ?? అంటూ తన మొహాన్ని తడుముతూ బాధగా అడుగుతుంది …… !!

మోహిత్ జరిగింది చెప్పగానే ☹️ …….. !! ఈ మమ్మా 🥹కోసం ఇంత నొప్పి బరించావా బంగారం ……. !! నీకేమైనా అయ్యుంటే నేను మీ డాడ్ ఎమ్ అయ్యే వాళ్ళం …… !! అంటూ ఏడుస్తూ దియా ను గుండెలకు హత్తుకుంటుంది ……. !!

నాకేమైనా అయినా డాడ్ ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావ్ గా మమ్మా 🥺…… !! కానీ … కానీ నీకు ఏమైనా జరిగితే నేను డాడ్ ఉండలేం ….. !! ఇన్ని ఇయర్స్ నువ్వు లేకుండా మేము చాలా పెయిన్ ఫేస్ చేశాం ……. !! మళ్ళీ ఆ పెయిన్ నేను ఫేస్ చేయలేను నాకు మమ్మా కావాలి …… !! దాని కోసం నేను ఎంత పెయిన్ అయినా బరిస్థాను…….. !! అంటున్న దియా ను చూసి ఆషి కళ్ళు ఆనందంతో చెమ్మ గిల్లుతాయి ……. !!

మోహిత్, విక్రమ్ ఆషి, దియా లను చూస్తూ ……. !! ఇంకా ఎన్ని రోజులు పడుకుంటావ్ బావా ……. !! ఆషి ను ఎక్కువ రోజులు నమ్మించలేము ……. !! అని బాధగా అనుకుంటూ ఇద్దరూ కాసేపటికి ఆషి ను రెస్ట్ తీసుకోమని చెప్పి దియా ను తీసుకుని బయటకు వెళ్ళిపోతారు …… !!

@@&&@@&&@@&&

తన ఎదురుగా గన్ పట్టుకుని నుంచున్న విప్లవ్ ను చూసి ….. !! సుమిత్ భయంతో బిగుసుకు పోయాడు …….. !! కాసేపటికి తేరుకుని ఏ… ఎవరు నువ్వు అంటూ భయంగా సిస్టర్… సిస్టర్ అంటూ అరుస్తున్న సుమిత్ ను చూసి వంకరగా నవ్వుతూ ……. !! నువ్వు ఎంత గొంతు చించుకుని అరచినా నిన్ను కాపాడడానికి ఎవరూ రారు …… !! ఎందుకో తెలుసా కాసేపు ఇక్కడ ఎమ్ జరిగినా ఇటు వైపు ఎవరూ రాకూడదు …… !! అని ఈ హాస్పటల్ ఎమ్. డి. తో డీల్ మాట్లాడా వాడు కూడా నేను ఇచ్చిన డబ్బుకు ఆశపడి ఓకే చెప్పాడు ……. !!

ఈ కాసేపు సిసి టివి కూడా వర్క్ చేయదు సో నేను పక్కా ప్లాన్ తో వచ్చాను…… !! నువ్వు గొడవ చేయకుండా నాకు కోపరేట్ చేస్తే హాయిగా నిన్ను చంపేసి నా దారిన నేను వెళ్ళిపోతాను ……. !! కాదని గుంజుకుంటే మాత్రం నిన్ను అంటూ ప్యాంట్ లో పెట్టున్న కత్తి బయటకు తీస్తూ …….. !! దీంతో పొడిచి పొడిచి చంపుతాను చెప్పు నీకు ఎది కావాలి ……. ??

నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నావ్……. ?? ఇప్పటికే అన్నయ్య చనిపోయాడు అని నేను ఏడుస్తున్నాను ……. !! అయినా నన్ను చంపే అవసరం నీకు ఎంటి…… ?? నీకు నాతో ఏమైనా గొడవలు ఉన్నాయా ? విప్లవ్ ను మాటల్లో పెట్టి అక్కడి నుండి పారిపోవాలి అని సుమిత్ ప్లాన్ …… !!

గొడవ నీతో కాదు రా నీ అన్న భువన్ ….. !! వాడు నేను ప్రేమిస్తున్న అమ్మాయిని చంపాలి అని చూసాడు ….. !! కానీ వాడి చావు ఆ ఆయుష్ చేతుల్లో జరిగిపోయింది కానీ నిన్ను మాత్రం వదలను ….. !! అని పారిపోవడానికి ప్రయత్నించిన సుమిత్ షర్ట్ పట్టుకుని…….. !! బెడ్ మీద కి నెట్టి సుమిత్ నుదుటిన షూట్ చేయగానే సుమిత్ అక్కడికి అక్కడే ప్రాణాలు వదులుతాడు……. !! ( అది సైలెన్సర్ అవ్వడం తో షూట్ చేసినా సౌండ్ బయటకు వినిపించదు)

సుమిత్ చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత….. !! విప్లవ్ సుమిత్ ను చూసి క్రూరంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ……. !!

నెక్స్ట్ డే మార్నింగ్ సుమిత్ ను కలవడానికి తనున్నా హాస్పటల్ ఎడ్రెస్ తెలుసుకుని వచ్చిన విక్రమ్, మోహిత్ లకు……. !! బెడ్ మీద శవంగా పడున్న సుమిత్ ను చూసి ఇద్దరూ షాకింగ్ గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ …… !! చుట్టూ చేరిన హాస్పటల్ స్టాఫ్ ను ఎమ్ జరిగింది అని అడుగుతారు …… !!

నైట్ ఎవరో వచ్చి పాపం ఈ అబ్బాయిని చంపేసినట్టు ఉన్నారు సర్……. !! పక్క నుండి చెప్తాడు వార్డ్ బాయ్ …… !!

వాట్ చాంపేసినట్టు ఉన్నారా? అంటే చంపింది ఎవరో కూడా తెలియదా ……. ?? ఇంత ఇరెస్పాన్సిబుల్ ఎంటి మీరు? నైట్ డ్యూటీ ఎవరు ఇక్కడ అంటూ కోపంగా అడుగుతాడు విక్రమ్ ……. !!

అది నేనే సర్ నైట్ ఈ సర్ పడుకునే ముందు నేనే మెడిసిన్స్ కూడా ఇచ్చాను ….. !! వరుసగా నైట్ డ్యూటీస్ వల్ల బాగా టైడ్ అవ్వడం తో నేను తెలియకుండానే నిద్రపోయాను …….. !! ఉదయాన్నే మెలకువ రాగానే మెడిసిన్ వేయాలి అని వచ్చి చూస్తే సర్ చనిపోయారు……. !! వెంటనే పోలీస్ లకు ఇన్ఫామ్ చేశాం అంటూ పక్కన ఉన్న పోలీస్ లని చూపిస్తాడు …….. !!