అందాల రాక్షసి{2}-69
విక్రమ్ పోలీస్ ల వైపు చూస్తూ తనను తాను పరిచయం చేసుకుని…… !! నేను డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నాను సుమిత్ మర్డర్ మోటో ఎమ్ అయుంటుంది సి. ఐ. గారు ఎనీ క్లూస్? అని పొలైట్ గా అడుగుతాడు ….. !!
అప్పటీకే విక్రమ్ ఎవరో తెలుసుకున్న సి. ఐ. ఇద్దరి వైపు చూస్తూ……. !! ఐ మీన్ విక్రమ్, మోహిత్ లను తీసుకుని రూమ్ బయటకు నడుస్తూ …… !!దీని వెనుక ఉన్న సీక్రెట్ మోటివ్ కనిపెట్టడానికి నాకు టైమ్ పట్టచ్చు సర్ ……. !! బట్ ఇది డెఫనెట్ గా ఎవరో కావాలని ప్లాన్ చేసి ఆ అబ్బాయిని చంపారు అని మాత్రం కచ్చితంగా చెప్పగలను ……. !!
అంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు సి. ఐ. గారు ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా ……. ??
నో సర్ వాడు ఎవడో కానీ ఒక్క క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా ఈ మర్డర్ చేశాడు ……. !! ఈవెన్ సి.సి టివి ఫుటేజ్ కూడా కొన్ని నిమిషాల పాటు వర్క్ చేయలేదు మోహిత్ గారు ……. !! ఈ సరౌండింగ్స్ లో ఉన్న కామ్స్ చెక్ చేశాం బట్ నో క్లూస్ సస్పెక్ట్ గా మాకు ఎవరు కనిపించలేదు ….. !!
మీ డ్యూటి మీరు చేయండి సి.ఐ గారు ఒక్క క్లూ దొరికినా మాకు ఇన్ఫామ్ చేయండి …… ! ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరు చేశారో కానీ వాడికి మాకు చాలా విషయాలు లింక్ అయి ఉన్నాయి …… !! వాడు ఎవరో తెలిస్తే తప్పా మా వెనుక ఉన్న ఆ శత్రువు ఎవరో మాకు తెలియదు ……. !!
స్యూర్ సర్ నా డ్యూటీ నేను చేస్తాను…… !! ఈ కేస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ వాడు ఎవడో తెలుసుకుంటాను …… !!
కీప్ ఇన్ టచ్ అని ఇద్దరూ సి. ఐ. కి షేక్ హ్యాండ్ ఇవ్వగానే ……. !! సి.ఐ. వాళ్ళతో కాసేపు మాట్లాడి కానిస్టేబుల్ తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు …… !!
ఏంట్రా ఇది ఈ సుమిత్ ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ?
మే బీ భువన్ శత్రువులు ఎవరైన ఎటాక్ చేసి ఉండచ్చు కదా ……. !! ఐ మీన్ భువన్ కి మ్యారేజ్ అయినా పిల్లలు లేరు కాబట్టి ……. !! తన ఆస్తులకు భువన్ తర్వాత సుమిత్ నే వారసుడు …… !! సో తనను లేకుండా చేస్తే ఆ అస్థి వాల్ల సొంతం చేసుకోవడానికి ఎలాంటి అడ్డు ఉండదు …… !! అని తనను చంపేసి ఉండచ్చు థింక్ దట్ వే….. !!
లేదు విక్కీ నువ్వు చెప్పినట్టు అస్థి కోసమే అయితే డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకుని వదిలేసేవాల్లు……. !! సో ఇది అస్థి కోసం జరిగిన మర్డర్ కాదు …… !! ఎదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని వాంటెడ్ గా చంపేశారు ……. !!
పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోడానికి సుమిత్ ఇస్ నాట్ ఎ రౌడీ మోహిత్ ……. !! తను చదువుకున్నాడు పైగా భువన్ ఆఫీస్ లో అకౌంట్స్ చూసేది అన్ని సునిత్ నే …… !! భువన్ కి శత్రువులు ఉన్నారు అంటే నమ్మచ్చు బట్ సుమిత్ మీద అంత పగ & అది కూడా ప్రాణం తీసెంత ఎవరికి ఉంటుంది ……. ??
డోంట్ నో విక్కీ బట్ ఇది మాత్రం అస్థి గురించి కాదు …… !! దీని వెనుక ఎవడో ఉన్నాడు వాడు మనకు కూడా శత్రువే ….. !! వాడు ఎవడో కనిపెట్టాలి సో మనం ఒక సారి భువన్ వైఫ్ ను మీట్ అయ్యి …… !! ఆవిడతో అన్ని విషయాలు మాట్లాడితే తప్పా మనకు క్లారిటీ ఉండదు …… !!
తన హస్బెండ్ చనిపోయింది ఆయుష్ వల్లే అని తెలిసి కూడా తను మనతో ఎందుకు మాట్లాడుతుంది మోహిత్ …..??
ట్రై చేద్దాం …… !! ముందు పదా ఆషి ఈ టైమ్ కి లేచే ఉంటుంది అని ఇద్దరు తిరిగి హాస్పటల్ కి స్టార్ట్ అవుతారు ……. !!
@@&&@@&&@@&&
ఎలా ఉన్నావ్ అభి …… ?? అంటూ బొకే చేత్తో పట్టుకుని తన పక్కనున్న చైర్ మీద కూర్చుంటూ ……. !! అడుగుతున్న చేతన్ ను చూసి బానే ఉన్నట్టు తల ఊపి చేతన్ ఇచ్చిన బొకే అందుకుని అనిత చేతికి ఇస్తుంది …….. !!
నీకు ఇలా జరిగింది అని నాకు నిజంగా తెలియదు అభి……. !! తెలియగానే మోహిత్ సర్ ను గంట సేపు రిక్వెస్ట్ చేస్తే ఇదిగో నిన్ను చూడ్డానికి 5 మినిట్స్ పర్మిషన్ ఇచ్చారు ……. !! హాస్పిటల్ లోకి ఎవరినీ ఎలో చేయడం లేదు సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంది ……. !!
అభి సైలెంట్ గా చేతన్ చెప్పేదీ వింటూ ఉంటుంది …… !! కానీ ఎమ్ ఆన్సర్ ఇవ్వదు ….. !! అభి ను ఆలా చూసిన చేతన్ అభి ఏమైంది …… ?? ఎందుకలా సైలెంట్ గా ఉన్నావ్ ….. ?? పెయిన్ ఏమైనా ఉందా డాక్టర్ ను పిలవనా….. ??
నో చేతన్ అదేం లేదు…… !! ఎంతో హ్యపీగా ఉండే నా ఫ్యామిలీ ……. !! ఇవాళ ఇలాంటి బ్యాడ్ సిచుయేషన్ ఫేస్ చేయడానికి & అక్క దగ్గర బావ గురించి హైడ్ చేయడానికి నేనే రీసన్…… !! అంటూ ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది………… !!
వాట్ ఈజ్ దిస్ అభి నీ వల్ల ఇలా జరగడం ఏంటి ……. ?? అని అభి చేతిని సున్నితంగా ప్రెస్ చేసి నువ్వు మాత్రం ఇలా జరుగుతుంది …… !! అని కళ కన్నావా లేదు కదా ఆ టైమ్ కి అలా జరగాలి అణుంది & జరిగిపోయింది ……. !! దట్స్ ఇట్ అనవసరంగా నీ వల్లే జరిగింది అని బాధ పడడం ఆపి త్వరగా నార్మల్ అవ్వు…….. !!
ఇప్పుడు ఆశ్రిత గారికి కావల్సింది దైర్యం చెప్పే మనుషులు……. !! తనకు ఇంకా ఆయుష్ అన్నయ్యా కండిషన్ గురించి తెలియదు ……. !! సో తనకు తెలిశాక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నువ్వు తన పక్కనే ఉండాలి ……. !! జరిగింది ఎలాగో మార్చలేం కాబట్టి ఈ టైమ్ లో మీ అక్క కి నువ్వు ఇవ్వగలిగేది పక్కనే ధైర్యంగా నిలబడడం…… !!
నేను ఇంత కంటే ఎక్కువ చెప్పను …… !! ఎందుకంటే యూ ఆర్ నాట్ ఎ కిడ్ అని అభి తల నిమిరి …… !! నువ్వు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిన్న స్మైల్ ఇచ్చి …… !! అనిత కాళ్ళకు నమస్కరించి వెల్లోస్తాను ఆంటీ అని వెల్తున్న చేతన్ ను చూసి అభి ఆలోచనలో పడితే ……. ?? చేతన్ ను చూసిన అనిత ఈ అబ్బాయి అభి జీవితం లో ఉంటే అభి సంతోషంగా ఉంటుంది ……. !! ఇంతలా అర్థం చేసుకునే అబ్బాయి దొరకడం నిజంగా అదృష్టం అని మనసులో అనుకుంటూ ఉంటుంది ……. !!
ఏదైనా అకేషన్ ఉంటే తప్పా పర్టికులర్ గా టెంపుల్ కి వెళ్లని నిషాన్…… !! ఆషి, ఆయుష్ ల పేరు మీద టెంపుల్ లో పూజ చేయించి ముందుగా ఆయుష్ ఉన్న రూమ్ లోకి వెళతాడు …… !! బెడ్ మీద చుట్టూ మెషిన్స్ మధ్య ప్రాణం లేని బొమ్మలా పడుకున్న ఆయుష్ ను చూసి…… !! నిషాన్ కి అడుగు ముందుకు పడక ఉన్న చోటే నుంచుని కన్నీళ్లతో ఆయుష్ వైపు చూస్తూ ఉన్నాడు ……. !!
రాయల్ బ్లూ కలర్ సూట్ , చేతికి రోలెక్స్ వాచ్ & కళ్ళకు గాగుల్స్ నడకలో రాజసం …… !! చిరుత లాంటి పదునైన చూపులతో గంభీరంగా ఆయుష్ నడుస్తూ ఉంటే …… !! అచ్చం సింహం నడుస్తున్నట్టు ఉంటుంది …….. !! అలాంటి ఆయుష్ ను ఇలా చుట్టూ మెషిన్స్ మధ్య చూస్తూ ఉంటే నిషాన్ కి ప్రాణం పోతున్నట్టు ఉంది 🥺 ……. !!
ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తూ బెడ్ వైపు నడుస్తూ …….. !! తన చేతిలోని కుంకుమ తీసి ఆయుష్ నుదుటన పెడుతూ పక్కనే ఉన్న చైర్ లో కూర్చుని ……. !! సెలైన్ పెట్టిన ఆయుష్ చేతిని తన రెండు చేతులతో పట్టుకొని …… !! అన్నయ్య నిన్ను ఇలా చూడ్డానికి చాలా కష్టంగా ఉంది🥹 ……. !! ఎపుడూ హుందాగా నడుచుకుంటూ కనిపించే నిన్ను ఇలా హాస్పటల్ బెడ్ మీద జీవం లేని వాడిలా పడుకుని ఉండడం చూస్తూంటే ప్రాణం పోతుంది ……. !!
ఆషి దగ్గర ఎక్కువ రోజులు నిజాన్ని దాచలేము నీకు ఇలా జరిగింది …… !! అని తెలిస్తే తను తట్టుకోగలదా ప్లీస్ అన్నయ్య త్వరగా కాన్షియస్ లోకి రా 🥹☹️……. !! నువ్వు లేని మహల్ లో నిమిషం కూడా ఉండాలి అనిపించడం లేదు …… !! మామ్, డాడ్ నీ గురించి చాలా బాధ పడుతున్నారు …… !!
మన అందరి బంగారు తల్లి దియా రోజు నిన్ను చూసి ఏడుస్తూ డాడ్ ఎపుడు లేస్తాడు నాన్న …… ?? అని అడుగుతుంటే ఆ పసి దాని దగ్గర నిజాన్ని దాచలేక అబద్ధాన్ని చెప్పలేక నరకం చూస్తున్నాం …… !! దియా కి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా కనీసం దియా కోసం అయినా కళ్ళు తెరువు అన్నయ్య…… !! నేను ఆలోచించకుండా చేసే తప్పులు చూసి తిట్టడానికి అయినా పైకీ లేవు అన్నయ్య ప్లీస్…… !! అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అయిష్ వైపే చూస్తూ ఉండిపోయాడు…….. !!
నిషాన్ ఎన్ని మాటలు చెప్తున్నా అవి ఏవి ఆయుష్ చెవికి చేరవు …… !! తనలో ఏలాంటి కదలిక ఉండదు ఆయుష్ ను అలా చూసి మౌనంగా కన్నీళ్ళు కారుస్తున్న నిషాన్ వైపు చూస్తూ…… !! సర్ ఇక్కడ మీరు ఎక్కువ సేపు కూర్చోవడం పేషంట్ కి మంచిది కాదు ……. !! డాక్టర్ గారు చూస్తే నా మీద సీరియస్ అవుతారు ప్లీస్ వెళ్లండి …… !! అని జూనియర్ డాక్టర్ రిక్వెస్టింగ్ గా చెప్పడం తో ఆయుష్ చేతిని కన్నీళ్లతో ముద్దాడి నిషాన్ బయటకు వెళ్ళిపోతాడు …….. !!
@@&&@@&&@@&&@@
చేతన్ చెప్పిన విషయాల గురించి డీప్ గా థింక్ చేస్తూ …… !! ఇపుడు తనే ఆషి కి దైర్యం చెప్తూ ఆషి ను త్వరగా నార్మల్ చేయాలి ….. !! అని ఆషి గురించీ ఆలోచిస్తూ బాధ పడుతున్న అభి కి నిషాన్ తన రూమ్ లోకి రావడం నుదుటన బొట్టు పెట్టడం కూడా తెలియదు ……. !!
తన నోటికి ప్రసాదం అందిస్తున్న నిషాన్ వైపు చూసి ……. !! బావా నువ్వు ఎప్పుడు వచ్చావ్ …… ?? అంటూ పడుకున్నది కాస్త కూర్చోడానికి ట్రై చేస్తూ అడుగుతుంది ….. !!
వెయిట్ అభి అంటూ తన బెడ్ అడ్జస్ట్ చేసి తన పక్కనున్న చైర్ లో కూర్చుని …… !! నేను వచ్చింది కూడా గమణించనంతగా నువ్వు ఆలోచనలో మునిగిపోయినపుడు వచ్చాను…… !! కానీ ఎమ్ ఆలోచిస్తున్నావ్ అభి ఇంకా నీ వల్లే ఇలా జరిగింది ……. ?? అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నావా అని సీరియస్ గా చూస్తూ అడుగుతాడు ……. !!
లేదు బావా అక్క కి ఆయుష్ బావ కండిషన్ గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందా …… ?? అని ఆలోచిస్తున్నా ఇంకా ఎన్ని డేస్ ఇలా అక్క దగ్గర నిజాన్ని దాస్తారు …….??
తెలియదు అభి కానీ ఈ విషయాన్ని ఆషి కి చెప్పి తన కండిషన్ మరింత వర్స్ట్ గా చేయడం కంటే …… !! ఈ నిజాన్ని దాచడం కరెక్ట్ అనిపిస్తుంది ……. !! సర్లే నిన్ను 4 డేస్ లో డిశ్చార్జ్ చేస్తాం అన్నారు…… !! నువ్వు వీటి గురించి అలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రెస్ట్ తీసుకో ……. !! అని అభి నుదుటన ముద్దు పెట్టి బయటకు వెళ్ళబోతాడు …… !!
అభి నిషాన్ చెయ్ పట్టుకుని వెళ్లకుండా ఆపేయడం తో నిషాన్ వెనక్కీ తిరిగి అభి వైపు చూస్తాడు ….!!
ఏమైనా కావాలా అభి …… ??
నీ నుండి మాట కావాలి బావ ……. !!
ఏంట్రా అది …… !!
సమయం వచ్చినప్పుడు చెప్తాను….. !! ముందు నాకు మాట ఇవ్వు ….. !! అంటూ తన చేతిని ముందుకు పెడుతుంది ….. !!
నిషాన్ కాసేపు మౌనంగా ఉండి ….. !! అభి చేతిలో తన చేతిని పెడుతూ ప్రామిస్ అభి…. !! నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను ఓకే నా ….. !!
అలా అని ఆయుష్ బావ మీద ప్రామిస్ చేసి చెప్పు అపుడే నేను నమ్ముతాను…… !!
నిషాన్ అభి వైపు అయోమయంగా చూస్తునే …… !! ఆయుష్ మీద ఒట్టు వేసి ఆషి గది వైపు వెళ్ళిపోతాడు…… !! ( అయ్యయ్యో ఎంత పని చేసావు నిష్ 🤦 ఈ ఇంటెలిజెంట్ అభి ఎందుకు ప్రామిస్ చేయించుకుందో తెలిస్తే నువ్వేం అయిపోతావు రా ఉప్చ్ ☹️ )
@@&&@@&&@@
నిషాన్ ఆషి ఉన్న రూమ్ లోకి వెళ్ళే సరికి ఆషి సీలింగ్ వైపు చూస్తూ ఉంటుంది …… !! అది చూసిన నిషాన్ మొహాన నవ్వు పులుముకుని హాయ్ ఆషి గుడ్ మార్నింగ్ ……. !! అంటూ ఆషి బెడ్ అడ్జస్ట్ చేసాక తన ముందు కుంకుమ ఉంచి….. !! మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాను కుంకుమ పెట్టుకో అనగానే …… !! ఆషి కష్టం మీద నుదుటన కుంకుమ పెట్టుకోగానే నిషాన్ ఆషి నోటికి ప్రసాదం తినిపిస్తాడు …… !!
మెడిసిన్స్ వేసుకున్నావా ఆషి?
ఆషి నుండి ఎలాంటి ఆన్సర్ లేకపోవడం చూసి …… !! మెడిసిన్స్ వెైపు చూసిన నిష్ కి ఇంకా ఆషి మెడిసిన్ వేసుకోలేదు …… !! అని అర్థం అవ్వడం తో తనే మెడిసిన్ తీసి ఆషి చేతిలో పెట్టి నెగ్లేట్ చేయకు ఆషి …… !! నువ్వు త్వరగా క్యూర్ అవ్వాలి అంటే టైమ్ టు టైమ్ మెడిసిన్ వేసుకోవాలి ……. !!
ఆషి ఎమ్ మాట్లాడకుండా నిషాన్ ఇచ్చిన మెడిసిన్ వేసుకుని మిల్క్ తాగుతుంది….. !! ( నో…నో….. నిషాన్ తాగిస్తాడు)
తన పక్కన ఛైర్ లో కుర్చుంటున్న నిషాన్ వైపు సూటిగా చూస్తూ ……. !! ఆయుష్ గారు లండన్ నుండి ఎపుడు వస్తున్నారు నిష్ అని అడుగుతుంది ……. !!
అది…. అదీ హా అన్నయ్య రావడానికి ఇంకా 2 వీక్స్ పడుతుంది ఆట ఆషి …… !! కాల్ చేసి చెప్పాడు అపుడు నువ్వు పడుకున్నావ్ అందుకే నిన్ను డిస్ట్రబ్ చేయలేదు అని తడపడుతూ చెప్తాడు …….. !!
ఆషి నిషాన్ వైపు చూస్తూ కమ్ క్లోజ్ టు మీ …… !! అని పిలవగానే తన పక్కకు వచ్ఛిన నిషాన్ ను కోపంగా చూస్తూ ……. !! చేతికి ఉన్న సెలైన్ పీకేసి తన శక్తి మేరా నిషాన్ ను లాగి పెట్టి కొట్టి ……. !! ఇంకా ఎన్ని డేస్ నా దగ్గర ఆయుష్ గారి గురించి దాస్తారు ……. ?? అంటూ కోపంగా ఏడుస్తూ అరుస్తుంది అది విన్న నిష్???
ఆషి కి ఆయుష్ గురించి నిజం తెలిసిందా 😈😈 …. ?? నిషాన్ ఇప్పుడు ఎమ్ చేయబోతున్నాడు గెస్ చేస్తూ ఉండండి 😌