Login with OTP

అందాల రాక్షసి{2}-71

aashyatech

Author

విక్రమ్ సన్నని నవ్వుతో ఇద్దరి వైపు చూడ్డం తో ఆ నవ్వుకు అర్థం తెలియక నిషాన్, మోహిత్ అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ విక్రమ్ వైపు అర్థం కానట్టు చూస్తారు …… !!

ఏంట్రా నేనేం చెప్తున్నానో మీకు ఇంకా అర్థం అవ్వడం లేదా….. ?? అని అదే స్మైల్ మెయిన్టైన్ చేస్తూ అడుగుతాడు విక్రమ్……. !!

నువ్వు అర్థం అయ్యేలా చెప్తే మాకు కూడా అర్థం అవుతుంది …… !! అని ఇద్దరు విసుగ్గా అడగడం చూసి విక్రమ్ చిన్నగా నవ్వి …… !! ఇప్పుడు కోమా లో ఉన్న ఆయుష్ లేచి మాట్లాడ్డం పాసిబుల్ కాదు కనుక …… !! నేను మరో వే ఆలోచించి ఆషి కి ఆయుష్ తో మాట్లాడిస్తాను అని చెప్పాను …… !! అదేంటంటే అని నిమిషం పాటు గ్యాప్ తీసుకుని టెన్షన్ గా తన వైపు చూస్తున్న ఇద్దరినీ చూసి…… !! ఒక ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ ను పట్టుకుని ఎక్స్యాక్ట్ గా ఆయుష్ వాయిస్ తో ఆషి తో మాట్లాడిస్తే …… ?? మన ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది కదా అంటూ తను అనుకున్న ప్లాన్ చెప్పి కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు ….. !!

వాట్? అంటూ ఇద్దరూ షాక్ అవుతూ ఓహ్ నో విక్కి అసలేం చేస్తున్నావ్ రా నువ్వు…… ?? ఆషి ఈజీగా బావ వాయిస్ గుర్తు పడుతుంది….. !! ఈ ఐడియా అసలు వర్క్ అవుట్ అవ్వదు అనవసరంగా లేని పోనీ ప్రాబ్లమ్స్ లో పడతాం…… !!

ఓకే ఫైన్ మీ దగ్గర ఇంత కంటే బెటర్ ఐడియా ఉంటే చెప్పండి …… !! నేను ఇక్కడితో డ్రాప్ అవుతాను …… !!

విక్రమ్ మాటకు ఇద్దరూ లేదు అని తల పట్టుకోవడం చూసి …… !! లిసన్ మోహిత్ మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు రిస్క్ అనిపిస్తున్నా సరే ఇప్పటికీ ఇదే కరెక్ట్ …… !! ఆషి కి డౌట్ రాకుండా మీరే చూసుకోవాలి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ పక్కనే ఉండి ……. !! ఆషి అడిగే వాటికి నేను పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాను…… !! అని ఇద్దరినీ కస్టంగా ఒప్పించి ముగ్గురూ మిమిక్రీ ఆర్టిస్ట్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు…. !! హైదరాబాద్ లో ఉన్న టాప్ మిమిక్రీ ఆర్టిస్ట్ ల నుండి 30 మందిని చూసి 10 మందిని సెలెక్ట్ చేస్తారు…… !! అందులో నుండి ఆయుష్ వాయిస్ సరిగ్గా మ్యాచ్ చేసిన ఆర్టిస్ట్ ను ఓకే చేసి తనకు ఎమ్ మాట్లాడాలి ….. ?? ఎలా మాట్లాడాలి ….. ?? అని పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తారు …… !!

 

&&@@&&@@&&@@

హాస్పటల్ కి వచ్చిన ప్రణవి నేరుగా ఆయుష్ ఉన్న రూమ్ లోకి వెళ్లబోతుంది …… !! కానీ అక్కడున్న జూనియర్ డాక్టర్ ప్రణవి ను డోర్ లోనే ఆపేసి ….. !! ప్రణవి కి అడ్డుగా నుంచుని నిషాన్ సర్ పర్మిషన్ లేకుండా ఎవరినీ లోపలికి అలో చేయకూడదు అని మాకు స్ట్రిక్ట్ గా చెప్పారు మ్యామ్ ……… !!

డు యూ నో హు ఆమ్ ఐ అంటూ కోపంగా అరుస్తున్న ప్రణవి వైపు చూస్తూ …… !! మీరు ఎవరైనా కావచ్చు మ్యామ్ బట్ మాకు సర్ పర్మిషన్ ఇచ్చాకే మిమ్మల్ని లోపలికి ఎలో చేస్తాం …… !!

యూ జస్ట్ వెయిట్ ఇప్పుడే నిష్ తో మాట్లడిస్తాను ……. !! అని జూనియర్ డాక్టర్ వైపు సీరియస్ గా చూస్తూ నిషాన్ కి కాల్ చేస్తుంది …… !!

హెలో చెప్పు ప్రణవి …… ??

ఎక్కడున్నావ్ నిష్? నేను బావ ను చూడ్డానికి హాస్పటల్ కి వచ్చాను ……… !! బట్ ఇక్కడున్న డ్యూటీ డాక్టర్ నన్ను లోపలికి ఏలో చేయట్లేదు ……. !!

నేను హాస్పటల్ లోనే ఉన్నాను …… !! అలా ఎవరినీ ఏలో చేయద్దు అని చెప్పింది నేనే…… !! అన్నయ్య నార్మల్ అయ్యే వరకూ మీరు ఎవరూ అన్నయ్య ను చూడ్డానికి వీల్లేదు ……. !! నువ్వు ఫస్ట్ మహల్ కి వెళ్ళు నాకు చెప్పకుండా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ …….. ??

అది కాదు నిష్ నేను ఒక్కసారి బావ ను చూడా……. !!

చెప్పింది విను ప్రణవి ……. !! అని కాల్ కట్ చేసిన నిషాన్ ను తిట్టుకుంటూ నాకు టైమ్ రాకపోదు అప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని …… !! అని కాల్ కట్ చేసి తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది …….. !!

@@&&@@&&@@

హాయ్ విప్లవ్ ఎలా ఉన్నావ్ …… ??

హెలో డార్లింగ్ నేను చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావ్ ……. ??

నేను కూడా అంతే బావున్నా ఇంకేంటి హైదారాబాద్ విశేషాలు వాట్స్ గోయింగ్ ఆన్ …… ??

ఏముంది షరా మామూలే …… !! ఆయుష్ వర్మ స్టిల్ ఆన్ కోమా …… !! ఆశ్రిత ఇపుడిపుడే క్యూర్ అవుతుంది …… !! తన సిస్టర్ కూడా ఔట్ ఆఫ్ డేంజర్ ……. !!

ఆశ్రిత ను మీట్ అవ్వడానికి వెళ్తాను అన్నావ్ కదా …… !! వెళ్లావా తనను మీట్ అయ్యావా …… ??

ఆ చాన్స్ నాకు ఆయుష్ బ్రదర్ & ఫ్రెండ్స్ ఇవ్వలేదు……. !! ఇదంతా కాదు ముందు నువ్వు ఎపుడు ఇక్కడికి వస్తున్నావో చెప్పు ……. !! ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ…… !!

తొందర ఎందుకు డియర్ తప్పకుండా కరెక్ట్ టైమ్ కి వస్తాను కదా…… !! అంత వరకూ నువ్వు మన ప్లాన్ ఎక్కడ లీక్ అవ్వకుండా చూడు …… !! అని నవ్వుతూ కాల్ కట్ చేసి తన ఎదురుగా ఉన్న ఫోటో ను ప్రేమగా తడుముతుంది ……. !!

@@&&@@&&@@&&

ఇంజక్షన్ మత్తు వదలడం తో మెల్లగా కళ్ళు తెరచిన ఆషి ……. !! ఎదురుగా కూర్చున్న నిషాన్ వైపు చూస్తూ నేను ఆయుష్ గారితో ఇప్పుడే మాట్లాడాలి నిష్ ……. !! ప్లీస్ ఆయనకు కాల్ చెయ్ అంటూ ఆవేదనగా అడుగుతుంది ……. !!

తప్పకుండా చేస్తాను ఆషి ముందు ఈ కోకోనట్ వాటర్ తాగు …… !! అని ఆషి తో మోహిత్ వాటర్ తాగించాక నిషాన్ ఆయుష్ కి కాల్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ……. !! మిమిక్రీ ఆర్టిస్ట్ కి కాల్ చేసి మొబైల్ స్పీకర్ లో పెడతాడు ……. !! ఆషి కి డౌబ్ట్ రాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ నంబర్ అన్నయ్య అని సేవ్ చేసుకుంటాడు నిషాన్…… !!

తన ముందున్న మొబైల్ రింగ్ అవ్వడం చూసి……. !! డౌట్ రాకుండా మ్యానేజ్ చెయ్ & టెన్షన్ పడకుండా కాల్ ఎటెండ్ చేయ్ …… !! అని మిమిక్రీ ఆర్టిస్ట్ కి చెప్తూ కాల్ లఫ్ట్ చేసి ఆర్టిస్ట్ ముందు పెడతాడు …… !!

హాయ్ అన్నయ్య …… !!

హెలో నిష్ అన్న ఆయుష్ వాయిస్ విని ఆషి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి…… !! వెంటనే మొబైల్ లాక్కుని ఆయుష్ గారు అంటూ అనందంగా పిలుస్తున్న ఆషి ను చూసి ……. !! మోహిత్, నిషాన్ భాధగా తన వైపు చూస్తూ ఉండిపోయారు …… !!

ఆయుష్ గారు ఎలా ఉన్నారు మీతో మాట్లాడి ఎన్ని డేస్ అవుతుందో తెలుసా మిస్ యూ సో మచ్ అండి ……. !!

ఆషి …… !!

హా నేనే అండి …… !! అంటూ కన్నీళ్ళు తుడుచుకుని మీ నోటి నుండి ఈ పేరు విని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా ……. !! ఆయుష్ గారు అని ఏడుస్తూ అడుగుతుంది …… !!

 

 

 

హా నేనే అండి మీ నోటి నుండి ఈ పేరు విని ఎన్ని రోజులు అవుతుందో ……. !! అని ఏడుస్తూ అడుగుతున్న ఆషి ను చూసి మోహిత్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి …… !!

 

ఆషి ప్లీస్ కామ్ డౌన్ నీకు ఫ్యూ డేస్ బ్యాక్ నే సర్జరీ జరిగింది ……. !! నువ్విలా ఏడ్చి హెల్త్ ను వర్స్ట్ చేసుకోకు …… !! అని సీరియస్ టోన్ తో చెప్తున్న ఆయుష్ వాయిస్ కి ఆషి కన్నీళ్ళు తుడుచుకుని ……. !! మీ వాయిస్ వినగానే ఆటోమాటిక్ గా ఏడుపు వచ్చేస్తుంది ……. !! ఆయుష్ గారు ఎలా ఉన్నారు అంటూ ప్రేమగా అడుగుతుంది ……. !!

ఐ యాం గుడ్ నువ్వెలా ఉన్నావ్ …… ?? ఆఫ్కోర్స్ నీ అన్నయ్యలు నిన్ను బాగా చూసుకుంటూ ఉంటారు …… !! చూసుకోక పోతే ఇద్దరి తాట తీస్తాను ….. !! అని వాళ్లకు బాగా తెలుసు …… !!

ఆయుష్ మాటలకు ఆషి చిన్నగా నవ్వుతూ …… !! లేదండి అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు …… !! బట్ మీరు లేని లోటు క్లియర్ గా కనబడుతోంది ఎపుడు వస్తారు…… ?? ఆయుష్ గారు మిమ్మల్ని నేను బాగా మిస్ అవుతున్నా అని బాధగా అంటుంది …… !!

నేను కూడా ఇక్కడ మిమ్మల్ని ఇంతే మిస్ అవుతున్నాను ఆషి ……. !! బట్ ఇక్కడ బ్రాంచ్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మధ్య ఇష్యు క్రియేట్ అయింది ……. !! అది క్లియర్ అవ్వడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది ….. !! ప్రాబ్లెమ్ క్లియర్ అవ్వగానే వెంటనే వచ్చేస్తాను ఒకే ……… !!

హ్మ్మ్  త్వరగా రావడానికి ట్రై చేయండి ఆయుష్ గారు. …. !! నాకు ఇలా జరిగినా మీరు వెళ్లారు అంటే అది చాలా పెద్ద ప్రాబ్లెమ్ అని అర్థం అవుతుంది ……. !! అందుకే మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్ చేయాలి అనుకోవడం లేదు ……. !!

అర్థం చేసుకున్నందుకు థాంక్ యూ ఆషి ఇంకేంటి లంచ్ చేశావా ……. ??

ఆషి కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండి …… !! జ్యూస్ తాగాను ఆయుష్ గారు మీరు తిన్నారా అని అడుగుతుంది ……. !!

లేదు ఆషి ఇపుడే ఫ్రీ అయ్యాను …… ;! ఇంకో 10 మినిట్స్ లో మారో మీటింగ్ ఉంది …… !! అది అయ్యాక లంచ్ చేస్తాను ఇంతకీ దియా ఏలా ఉంది …… !!

బావుంది ఆయుష్ గారు …… !! పాప కూడా మిమ్మల్ని మిస్ అవుతుంది వర్క్ లో పడి ఫుడ్ స్కిప్ చేయకండి మీ హెల్త్ జాగ్రత్త …… !!

శ్యూర్ ఆషి ఇక రెస్ట్ తీసుకో నేను తర్వాత కాల్ చేస్తాను …… !!

ఆయుష్ గారు ఒక సారి ఫేస్ టైమ్ ఆన్ చేయరా మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది ….. !!

మిమిక్రీ ఆర్టిస్ట్ కంగారుగా విక్రమ్ వైపు చూడ్డం తో విక్రమ్ నోట్ ప్యాడ్ మీద ఏదో రాసి ఇవ్వడం తో ……. !! అది చూస్తూ నాకు మీటింగ్ కి టైమ్ అవుతోంది కాల్ యూ బ్యాక్ ఆషి అని ఫాస్ట్ గా కాల్ కట్ చేస్తాడు …… !!

ఇదేంటి ఆయుష్ గారు ఇలా కట్ చేసారు …… !! అని మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన స్విచ్ ఆఫ్ రావటం తో బిజీగా ఉన్నాడేమో…… !! అని ఆషి డిసప్పాయింట్ అవుతుంది ……… !!

బావ బిజీగా ఉన్నాడేమో ఆషి నువ్వు డల్ అవ్వకు……. !! ఫ్రీ అయితే తనే కాల్ చేస్తాడు కదా…… !! అని ఆషి ను మాటలతో డైవర్ట్ చేసి తనను నిద్రపుచ్చి ఇద్దరూ విక్రమ్ ఉన్న రూమ్ లోకి వెళతారు …… !!

మోహిత్, నిషాన్ విక్రమ్ ను గట్టిగా హగ్ చేసుకుని ప్లాన్ సక్సెస్ ……. !! ఆషి ఇస్ హ్యాపీ నౌ అని చెప్పగానే విక్రమ్ కూడా హ్యపీగా ఫీల్ అవుతూ …… !! ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్ట్ కి పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చి……. !! ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ అవ్వకూడదు అని వార్నింగ్ ఇచ్చి ……. !! మళ్ళీ అవసరం అయితే నువ్వు రావాలి అని ఆ అబ్బాయిని అక్కడి నుండి పంపించేస్తారు ……. !!

@@&&@@&&@@

నెస్ట్ డే మార్నింగ్ ఆషి, అభి ల కోసం తనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని దియా తో కలిసి హాస్పటల్ కి వస్తుంది రాగిణి ……. !! ముందుగా అభి ఉన్న రూమ్ లోకి వెళ్ళిన తనకు……………. !! అభి నిషాన్ మాట్లాడుతూ కనిపించడం తో నవ్వుతూ వెళ్ళి అభి పక్కనున్న చేర్ లో కూర్చుంటుంది ……. !!

గుడ్ మార్నింగ్ అత్తయ్య …… !! అంటూ దియా ను బెడ్ మీద పక్కనే కూర్చో పెట్టుకుని డల్ గా ఉన్న దియా ఫేస్ చూసి …… !! ఏమైంది మా ప్రిన్సెస్ కి ఎందుకంత డల్ గా ఉంది ……. ?? అంటూ దియా మొహాన్ని దోసిలిలో తీసుకుని ఆప్యాయంగా అడుగుతుంది అభి…… !!

మమ్మా కి అబ్బు అయింది డాడ్ స్టిల్ స్లీపింగ్ …… !! అంటూ అభి ను తన చిట్టి చేతులలో చుట్టేసి వెక్కిళ్లు పెడుతున్న దియా ను చూసి అందరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ……. !!

దియా నువ్వు బ్రేవ్ గర్ల్ కదా ఇలా ఎడవచ్చా చెప్పు …… !! అంటూ దియా కన్నీళ్ళు తుడిచి ఇంకొన్ని రోజులు బంగారం అక్క, బావ సెట్ అయిపోతారు …… !! నువ్వు ఇలా బ్యాడ్ గర్ల్ లా ఏడవకూడదు సరేనా …. !!

ఊ 🥹 బట్ డాడ్ ను ఆలా చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అమ్మా …… !! ఏడవకూడదు అనుకున్నా నాకు తెలియకుండానే ఏడ్చేస్తున్నా …… !! మమ్మా కూడా స్టిల్ ఆన్ బెడ్ & నాకు డాడ్ తో వెళ్లే రైడ్స్ & మమ్మా తో ఔటింగ్ ఇంకా మమ్మా నాకు ఫీడ్ చేయడం బాత్ చేయించడం…….. !! ఐ మిస్డ్ ఎవ్రీ థింగ్ అంటూ నిషాన్ మీదకు చేరిపోయి డాడ్ ను లేవమని చెప్పు …… !! నాన్న ప్లీస్ నేను గుడ్ గర్ల్ లా ఉంటాను అసలు అల్లరి చేయను ……. !! అని చెప్పండి లేదా నేను మెడిసిన్స్ వేసుకోవడం లేదు అని చెప్పు తిట్టడానికి అయినా డాడ్ లేస్తాడు …… !! అంటున్న ఆ పసి దాన్ని చూసి నిషాన్ ఏడుస్తూ దియా ను అలాగే ఎత్తుకుని ……. !! బయటకు వెళ్లి దియా ఏడుపు కంట్రోల్ చేస్తూ తను కూడా కంట్రోల్ అవుతాడు ……. !!

మనవరాలిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న రాగిణి చెయ్ పట్టుకుని ……. !! ప్లీస్ అత్తయ్య దైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా ……. !! ప్లీస్ కంట్రోల్ అంటూ ఆవిడను ఓదార్చి రాగిణి హెల్ప్ తో వీల్ చైర్ లోకి షిఫ్ట్ అయ్యి ఇద్దరూ కలిసి ఆషి రూమ్ కి వెళతారు ……. !!

@@&&@@&&@@

 

భువన్ ఫోటో ముందు నుంచుని అక్రమ మార్గం లో వెళ్ళద్దు …… !! మనకు ఉన్నది చాలు అతిగా ఆశ పడద్దు అని ఎన్ని సార్లు చెప్పినా విన్నారా ….. ?? అని ఏడుస్తూ నిన్ను పిచ్చిగా ప్రేమించి మా నాన్న ను ఎదిరించి నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు…… ?? నన్ను ఇలా వదిలేసి చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చావ్ భువన్ ……. !! అంటూ ఏడుస్తూ భువన్ ఫోటో ముందు దీపం వెలిగిస్తుంది తన భార్య శ్రావ్య ….. !!

మేడమ్ మిమ్మల్ని కలవడానికి ఎవరో ఇద్దరూ పర్సన్స్ వచ్చారు ……. !! అని పని మనిషి చెప్పడం విని ఇపుడు నేను ఎవరిని కలవలేను …… !! వాళ్ళను వెళ్ళిపొమ్మని చెప్పు మంగ …. !!

సర్ గురించి మీతో ఏదో మాట్లాడాలి అంట మేడమ్ …….. !! పైగా వాళ్ళు వర్మ ఇంటి నుండి వచ్చారు అని చెప్పమన్నారు ……. !!!

భువన్ గురించి ఆ ఇంటి వాళ్ళు నాతో ఎమ్ మాట్లాడాలి …… ??!అని ఆలోచిస్తూ సరే వస్తున్నా వాళ్లకు టీ ఇవ్వు ….. !! అని కన్నీళ్ళు తుడుచుకుని ఆ రూమ్ నుండి హాల్ లోకి వెళ్లి …… !! అక్కడ సోఫా లో కూర్చున్న మోహిత్, విక్రమ్ లను చూసి……. !! నమస్తే అంటూ ఇద్దరికీ ఎదురుగా నుంచుంటుంది ……. !!

సింపుల్ గా చూడ్డానికి అమాయకంగా ఉన్న శ్రావ్య ను చూసి …… !! ఇద్దరు కూడా నమస్తే చేస్తూ తిరిగి సోఫా లో కూర్చుంటే …….. !! వాళ్ళనే ప్రశ్నార్థకంగా చూస్తూ శ్రావ్య కూడా వాళ్ల ఎదురుగా కూర్చుంటుంది …….. !!