Login with OTP

అందాల రాక్షసి{2}-72

aashyatech

Author

శ్రావ్య ఇద్దరి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ…….. !! మోహిత్ & విక్రమ్ ల కోసం టీ తెప్పించి వాళ్ళూ ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తూ ఉంటుంది ……. !! మెయిడ్ తీసుకొని వచ్చిన టీ సిప్ చేసి కప్స్ టేబుల్ మీద పెడుతూ తమ వైపు చూస్తున్న శ్రావ్య ను చూసి ……. !! మోహిత్ శ్రావ్య వైపు చూసి మీకు మేము ఎవరో తెలిసే ఉంటుంది కదా శ్రావ్య గారు ……. !! నా పేరు అంటూ చెప్పబోతున్న మోహిత్ ను అడ్డుకుంటూ మీరు నాకు తెలుసు మోహిత్ సర్ …… !! నన్ను శ్రావ్య అని పిలవండి చాలు అని సౌమ్యంగా చెప్తున్న శ్రావ్య ను చూసి మోహిత్ కి శ్రావ్య అంటే పాసిటివ్ ఫీలింగ్ కలుగుతుంది …… !!

మిసెస్ శ్రావ్య ఇలాంటి టైమ్ లో నేను ఈ టాపిక్ గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు ……. !! బట్ తప్పక దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది నాకు మీరు తప్పా మరో ఆప్షన్ కూడా లేదు ……. !! అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను & ఇలాంటి టైమ్ లో డిస్టర్బ్ చేసాను ఐ ఆమ్ సారి ఫర్ దట్ …… !!

మోహిత్ సర్ మీరు నాకు ఎక్సప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ……. !! మీరు ఏదో ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకోవాలి అనే స్వయంగా వచ్ఛారు అని నాకు అర్థం అవుతుంది…… !! మీరు ఎందుకు వచ్చారో చెప్పండి సర్ అంటూ విక్రమ్ వైపు ఎవరు అన్నట్టు చూస్తుంది…… !!

హి ఈజ్ విక్రమ్ నాకు ఆయుష్ కి ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బడ్డీ ….. !! అనగానే శ్రావ్య విక్రమ్ వైపు చూసి నమస్కారం చేయటం తో విక్రమ్ కూడా నవ్వుతూ విష్ చేస్తాడు ……. !!

శ్రావ్య నేను స్ట్రెయిట్ గా పాయింట్ కి వస్తున్నాను…… !! నీకు తెలిసే ఉంటుంది కదా నీ హస్బెండ్ భువన్ మాకు ఉన్న ఎనిమీస్ లో ఒక్కరని …… !! తన వల్లే ఇప్పుడు ఆయుష్ తో పాటు తన వైఫ్ ఆషి కూడా హాస్పటల్ లో అడ్మిట్ అయింది…… !! అండ్ నీ హస్బెండ్ భువన్ చనిపోవడానికి రీసన్ కూడా తెలిసే ఉంటుంది రైట్……? అంటూ శ్రావ్య వైపు చూస్తాడు….. !!

భువన్ రూపం కళ్ళ ముందు మెదలగానే తెలుసు అన్నట్టు తల ఊపి ఉబికి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ…… !! భువన్ అత్యాసే ఇవాళ ఆయన చావుకి కారణం ఈ విషయంలో నాకు ఎవరి మీద కోపం లేదు సర్ ……. !! ఎందుకంటే నేను భువన్ ను మ్యారేజ్ చేసుకునే టైమ్ కి నాకు భువన్ ఇలాంటి వాడు అని నిజంగా తెలియదు …… !! తను ఏంటో తెలిసాక ఆయనను మారమని ఎన్నో సార్లు చెప్పాను బట్ భువన్ చేంజ్ అవ్వలేదు …… !!

తను చేసిన తప్పులకు శిక్ష ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను…… !! నా మ్యారీడ్ లైఫ్ గురించి ఎన్నో కలలు కన్నాను కానీ నాకు ఇప్పుడు కన్నీళ్ళే మిగిలాయి🥹 ……. !!

కంట్రోల్ మిసెస్ శ్రావ్య రీసెంట్ గా మీ హస్బెండ్ బ్రదర్ సుమిత్ కూడా చనిపోయాడు కదా …… !! తనను ఎవరు చంపారో మీకేమైనా ఐడియా ఉందా ఐ మీన్ మీకు శత్రువులు ఏవరైనా ఉన్నారా…… ?? ఉంటే వాళ్లకు మీకు గొడవ ఏంటి …… ??

భువన్ చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ కి చాలా మంది రైవల్స్ ఉండే వాళ్ళు సర్ …… !! బట్ మనిషిని చంపేంత శత్రుత్వం ఎవరు పెంచుకున్నారో సీరియస్లీ నాకు తెలియదు సర్ ……. !! భువన్ చేస్తున్న పనులు నచ్చక నేను భువన్ నుండి 5 మంత్స్ గా ఓకే ఇంట్లో ఉన్నా దూరంగా ఉంటున్నాను……. !! రోజూ లాగే భువన్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు బట్ కాసేపటికి తను చనిపోయి శవంగా వస్తాడు ……. !! అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తుంది ……… !!

శ్రావ్య ప్లీస్ కంట్రోల్ మీ పెయిన్ నాకు తెలుస్తుంది…… !! మీ మాటలు బట్టి మీరు చాలా సెన్సిటివ్ & ఎమోషనల్ అని కూడా అర్థం అవుతుంది……. !! అసలు మీరెలా భువన్ ను మ్యారేజ్ చేసుకున్నారు శ్రావ్య మీ ఇద్దరికీ ఎలా పరిచయం…… ??

ఐ థింక్ లవ్ మ్యారేజ్ అనుకుంటా మోహిత్ ……. !! అందమైన అమ్మాయిలు ఇలాంటి వేధవలకే కదా పడతారు …… !! పక్క నుండి శ్రావ్య కంటే ముందు అన్సర్ ఇస్తాడు విక్రమ్……. !!

లేదండి నాది లవ్ మ్యారేజ్ కాదు ….. !!

ఓహ్ అయితే డెఫనేట్ గా వాడు భయపెట్టే నిన్ను రాక్షస వివాహం చేసుకుని ఉంటాడు ఆమ్ ఐ రైట్…….. !! ఇక తప్పక వాడితో లైఫ్ షేర్ చేసుకున్నావ్ అంతేనా మిసెస్ శ్రావ్య……. !!

శ్రావ్య అసహనంగా విక్రమ్ వైపు చూడ్డం తో …….. !! విక్కీ షట్ అప్ మీరు చెప్పండి శ్రావ్య అంటూ మోహిత్ విక్రమ్ వైపు సీరియస్ గా చూస్తూ…… !! మీరు భువన్ ను ఏలా మ్యారేజ్ చేసుకున్నారు శ్రావ్య …… ??
మా పేరెంట్స్ కి నేను వన్ అండ్ ఓన్లీ డాటర్ సర్……. !! అందుకే వాళ్ళు నన్ను చాలా గారాబంగా పెంచారు నాకు ఎంత ఫ్రీడం ఇచ్చినా నేను నా లిమిట్స్ లో ఉంటూ నా స్టడీస్ కంప్లీట్ చేసాను…… !! నా కాలేజ్ టైమ్ లో భువన్ నన్ను మా కాలేజ్ యానుయల్ ఫంక్షన్ లో చూసి ఇష్టపడ్డాడు …… !!

వెంటనే నా డిటైల్స్ తెలుసుకుని మా డాడ్ క్లోజ్ ఫ్రెండ్ ద్వారా మా డాడ్ ను అప్రోచ్ అయ్యాడు…… !! తనను తాను చాలా మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకుని మా డాడ్ ను మౌల్డ్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు …….. !! బట్ మ్యారేజ్ అయ్యాక తన గురించి తెలిసి నేను తనకు ఇవన్నీ వదిలేయమని చాలా రిక్వెస్ట్ చేశాను……. !! ఇన్ఫాక్ట్ ఇవన్నీ ఆపకపోతే నేను తనతో ఉండను అని కూడా భయపెట్టాను అయినా తనలో చేంజ్ రాలేదు……. !! ఇవన్నీ కాదు అని ఆఖరి ప్రయత్నంగా నేను  దూరంగా ఉంటే అయినా భువన్ చేంజ్ అవుతాడు ……. !! అని ఆశ పడ్డాను బట్ తను చేంజ్ అవ్వలేదు భువన్ కి నా కంటే డబ్బే ఇంపార్టెంట్ ……… !! ఇప్పుడు దాని కోసమే పగ… పగ అంటూ ప్రాణాలు కోల్పోయాడు …….. !!
శ్రావ్య మాటల ద్వారా సుమిత్ ను చంపింది ఎవరో శ్రావ్య కి ఐడియా లేదు …… !! అని అర్థం అవ్వడం తో భువన్ అక్రమంగా సంపాదించిన అస్థి తనకు వద్దు అని ఎవరిది వాళ్లకు ఇచ్చేయమని శ్రావ్య చెప్పడం తో …… !! శ్రావ్య గుణానికి ఇంప్రెస్ ఆయిన విక్రమ్, మోహిత్ భువన్ నిజాయితీగా సంపాదించిన అస్థి శ్రావ్య కి అందించి ……. !! శ్రావ్య పేరెంట్స్ ను కూడా శ్రావ్య దగ్గరే ఉంచి తనకు ఎలాంటి హెల్ప్ కావాలి ఆన్నా కాల్ చేయమని చెప్పి …….. !! ఇద్దరు ఆ ఇంటి నుండి బయటకి వచ్చి కార్ లో హాస్పటల్ కి స్టార్ట్ అవుతారు ……. !!

సుమిత్ ను చంపింది ఎవరై ఉంటారని నీ ఒపీనియన్ విక్రమ్ ……. ??

ఆఫ్ కోర్స్ భువన్ అంటే గిట్టని వాళ్ళే చేసి ఉండాలి …….. !! ఎందుకంటే భువన్ అక్రమంగా చాలా మంది దగ్గరనుండి లెక్కలేనన్ని ఆస్తులు లాక్కున్నాడు …….. !! వాళ్ళల్లో ఎవరో ఇలా చేసుంటారు ….. !!!

నువ్వు అన్నది నిజమే అయితే చంపితే భువన్ ను చంపాలి కానీ సుమిత్ ను ఎందుకు టార్గెట్ చేసి చంపారు ……. ??

మే బీ సుమిత్ తో కూడా వాళ్ళకి క్లాషెస్ ఉండచ్చు ……. !!

నిజంగా అంతేనా నాకు ఎందుకో మనం ఈ విషయాన్ని సరిగ్గా ఆలోచించడం లేదు అనిపిస్తుంది . మోహిత్ ……. !!

లిసన్ విక్కీ ప్రతీ విషయాన్ని డీప్ గా థింక్ చేయడం మానేయ్ …….. !! నువ్వు థింక్ చేయాల్సింది నీతో లైఫ్ షేర్ చేసుకోబోయే ఆమ్మాయి గురించి అంటూ ……. !! మోహిత్ ఆ టాపిక్ అక్కడితో కట్ చేయడం తో విక్రమ్ కూడా తనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనుకుని సైలెంట్ అవుతాడు ……. !!

@@&&@@&&@@&&
ఛా!! ఈ విప్లవ్ కి పిచ్చి పట్టినట్టుంది …… !! ఆ ఆషి ను ఎలా అయినా ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపో రా బాబు……. !! అడ్డుకోవడానికి బావ కూడా కదిలే సిచుయేషన్ లో లేడు అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంటే ……… !!! నేను ఆయుష్ లేచాక మగాడిలా తీసుకుని వెళ్తాను …….. !! అని పిచ్చిగా వాగుతున్నాడు బావ లేచాక ఆషి ను కాదు కదా తన షాడో ను కూడా వీడు టచ్ చేయగలడా……??

వీడ్ని నమ్ముకుని లాభం లేదు ఏమైనా మాట్లాడితే ఫుల్ ప్లాన్డ్ లో ఉన్నాను అంటాడు…..!! కానీ ప్లాన్ ఎంటో చెప్పి చావడు …… !!

లేదు నేను ఇలాగే చూస్తూ కూర్చుంటే ఈ లైఫ్ కి బావ తో లైఫ్ షేర్ చేసుకోలేను …….. !! నేనే ఏదో ఒకటి చేయాలి ….. !! బావ లేచే లోగా ఈ ఆషి ను విప్లవ్ గాడితో ఈ కంట్రీ దాటించేయాలి ……. !! అలా జరగాలి అంటే ఆ ఆషి మనసు విరిచేసి ముందు బావ కి దూరంగా ఉంచాలి ……. !! లేదా అది చచ్చేలా చేయాలి అనుకుంటూ …… !! ఒసేయ్ ఆషి వస్తున్నానే అని నవ్వుకుంటూ అర్థరాత్రి అని తెలిసినా ఆషి ఉన్న హాస్పటల్ కి వొంటరిగా స్టార్ట్ అవుతుంది ప్రణవి…… !!

 

ఆషి తో మాట్లాడ్డానికి హాస్పటల్ కి వచ్చిన ప్రణవి కి సెక్యూరిటీ ద్వారా మోహిత్, విక్రమ్ అర్జంట్ వర్క్ మీద బయటకు వెళ్ళారని తెలిసి ……. !! వావ్ కరెక్ట్ టైమ్ కి వచ్చాను వాళ్ళు ఇద్దరూ ఉండగా నేను ఆషి తో మాట్లాడ్డం కాదు కదా తన రూమ్ లోకి ఎంటర్ అవ్వలేను……. !! నన్ను లోపలికి రానివ్వకుండా తనకు సెక్యూరిటీ ఇస్తూ గూర్కా డ్యూటీ చేస్తూ ఉంటారు …… !! ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లెమ్ కూడా లేకుండా ఇద్దరూ ఇక్కడ లేరు …… !! సో వాళ్ళు వచ్చే లోపు నా వర్క్ ఫినిష్ చేసుకుని డౌట్ రాకుండా వెళ్లిపోవాలి ……. !! అని కన్నింగ్ గా నవ్వుకుంటూ హాస్పటల్ లోకి ఎంటర్ అవుతుంది…… !!

( ఇక్కడ హాస్పటల్ మొత్తం క్రిష్ణదేవ్, సూర్యదేవ్ హ్యాండ్ ఓవర్ చేసుకోడం వల్ల హాస్పటల్ లో ఆయుష్, ఆషి & అభిత ఉన్న ఫ్లోర్ మొత్తం ఫుల్ సెక్యూరిటీ తో అక్కడ బయట పేషంట్స్ కి అలో లేదు & వర్మ ఫ్యామిలీ ను మాత్రమే సెక్యూరిటీ అలో చేస్తారు అందుకే ప్రణవి ను  నైట్ అయినా లోపలికి అలో చేసారు)

ప్రణవి డైరెక్ట్ గా ఆషి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే …….. !! ఆషి బెడ్ పక్కన కూర్చుని తనతో మాట్లాడుతూ కనిపిస్తాడు నిషాన్ ….. !!

అక్కడ నిషాన్ ను చూసిన ప్రణవి వెంటనే డోర్ క్లోజ్ చేసి పక్కకు వెళ్ళి దాక్కుని ……. !! షట్ నిష్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నాడు ……. ?? ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్లాలి …… ?? అని ఆలోచిస్తూ గోళ్ళు కొరికేస్తూ ఉంటుంది అప్పుడే తనకు కన్నింగ్ ఐడియా రాగానే పాకెట్ లో నుండి మొబైల్ తీసి వెంటనే నిషాన్ కి కాల్ చేస్తుంది …….. !!
ఆషి తో మాట్లాడుతూ తనను ఆయుష్ ఆలోచనల నుంచి డైవర్ట్ చెయ్యడానికి ట్రై చేస్తున్న నిషాన్ కి ప్రణవి నుండి కాల్ రావడం తో వన్ మినిట్ ఆషి అంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు …… !!

హలో నిష్ ఎక్కడున్నావ్ ….. ??

ఎక్కడుంటా ప్రణవి ఐ యాం ఇన్ హాస్పటల్ …….. !! నువ్వేంటి ఈ టైమ్ లో కాల్ చేసావ్ పడుకోకుండా ఇంకా ఎమ్ చేస్తున్నావ్ ……. ??

నిష్ నేను నీతో మాట్లాడాలి …… !!

ఏదైనా రేపు మాట్లాడుకుందాం ప్రణవి…… !! నేను మార్నింగ్ మహల్ కి వచ్చి నిన్ను మీట్ అవుతాను సరేనా…… !! ఇప్పుడు ఇక పడుకో గుడ్ నైట్ …… !!

నో … నేను ఇపుడే నీతో మాట్లాడాలి వెంటనే మహల్ కి రా ……. !! అంటూ మొండిగా చెప్తున్న ప్రణవి బిహేవియర్ కి అసహనంగా ఫీల్ అవుతూ…… !! ఓకే వస్తున్నా అంటూ కాల్ కట్ చేయగానే…… !! ప్రణవి కన్నింగ్ గా నవ్వుకుంటూ నిషాన్ ఎపుడు బయటకు వెళ్తాడా అని చూస్తూ ఉంటుంది ……. !!

వాట్ హ్యాపెండ్ నిష్ సడెన్ గా ఎక్కడికి వెళ్తున్నావ్ …..?? అంతా బానే ఉంది కదా……. ??

ప్రణవి ఏదో మాట్లాడాలి అంటుంది ఆషి…… !! నేను మహల్ కి వెళ్లి త్వరగా వచ్చేస్తాను నువ్వు ఇక రెస్ట్ తీసుకో ఆషి……. !! అంటూ బెడ్ అడ్జస్ట్ చేసి తనకు బెడ్ షీట్ సరి చేసి ఫాస్ట్ గా బయటకు వెళ్లిపోతాడు ……. !!

నిషాన్ ఆషి రూమ్ నుండి రావటం చూసిన ప్రణవి ……. !! నిషాన్ కి కనిపించకుండా దాక్కుని నిషాన్ బయటకు వెళ్లే వరకూ చూసీ ……. !! తను వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆషి రూమ్ లోకి వెళ్తుంది …….. !!
ఈ టైమ్ లో నిష్ తో ఎమ్ మాట్లాడాలి ఇది……. ?? మళ్ళీ ఎదైనా ప్రాబ్లెమ్ క్రియేట్ చేయబోతుందా ……. ?? అని ఆలోచిస్తున్న ఆషి తన రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం తో అటుగా చూసిన ఆషి కి …….. !! మహల్ లో ఉండాల్సిన ప్రణవి తన రూమ్ లోకి వస్తూ కనిపిస్తుంది ……. !!

ప్రణవి!!! నువ్వేంటి ఇక్కడ నిష్ తో మాట్లాడాలి ……. !! అని తనను మహల్ కి రమ్మని చెప్పి నువ్వు ఇక్కడ ఎమ్ చేస్తున్నావ్ ……. ?? అంటూ అశ్చర్యంగా అడుగుతుంది ……. !!

అదంతా తర్వాత నీ హెల్త్ ఎలా ఉంది ఆషి ……. !! అంటూ తన ఎదురుగా ఉన్న చేర్ లో కూర్చుంటూ నవ్వుతూ అడుగుతున్న ప్రణవి ను చూసి……. !! ఆషి తన వైపు డౌట్ గా చూస్తూ ఉంటుంది …… !!

వాట్ హ్యాపెండ్ ఆశ్రిత…… ?? నేను నీ హెల్త్ గురించి అడుగుతుంటే నా వైపు అలా చూస్తున్నావ్ …….. ??

మళ్ళీ ఎమ్ చేయాలి అనుకుంటున్నావ్ ప్రణవి ……. ?? ఇప్పటి వరకు నువ్వు ఫ్యామిలీ లో క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు ……. !! ఇప్పటికైనా చేంజ్ అవ్వు నువ్వు నన్ను ఎమ్ చేయాలి అని చూసినా ……. !! ఆయుష్ గారు నిన్ను ఈ సారి చంపకుండా నిన్ను వదలడు అది నువ్వు గుర్తు పెట్టుకో ……. !!

హహ పిచ్చి ఆశ్రిత బావ నన్ను చంపాలి అంటే అంతా ఈజీ అనుకున్నావా……. ?? అసలు బావ ఇపుడు ఏ పొజిషన్ లో ఉన్నాడో తెలుసా ……. ??

ఆయుష్ గారు ఇండియా లో లేకపోవచ్చు బట్ ఇంకో 3 డేస్ లో ఇక్కడికి వస్తున్నారు …… !!

ఓహ్ గాడ్ ఇంత పిచ్చి దానివి ఎంటి ఆశ్రిత నువ్వు ……. !! బావ వేరే కంట్రీ లో ఉన్నాడు అంటే అలా ఎలా నమ్మేశావ్ …….. ?? నిన్ను ఇలాంటి టైమ్ లో ఒంటరిగా వదిలి దూరంగా ఎలా వెళతాడు అనుకున్నావ్ …… !!

వాట్ ఎమ్ మాట్లాడుతున్నావ్ నువ్వు ఆయుష్ గారు ఇండియా లోనే ఉన్నారా ……. ??

అవును బావ ఇండియా లోనే ఉన్నాడు అది కూడా ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాడు …… !! అంటూ ఆషి వైపు సూటిగా చూస్తూ చెప్తుంది …… !!

ఎంటి హైదరాబాద్ లో ఉన్నారా …… ?? మరి నాతో ఎందుకు బిజినెస్ ఇస్యూ మీద వేరే కంట్రీ వెళ్ళాను అని చెప్పాడు ……. !!

నీతో మాట్లాడింది బావ కాదు ….. !! బావ నీతోనే కాదు ఎవరితో మాట్లాడలేదు & అసలు మాట్లాడే స్థితిలో బావ లేడు …… !!

ఏం… ఎమ్ అంటున్నావ్ ప్రణవి…… !! ఆయుష్ గారు బానే ఉన్నారు కదా …… !! అని బయం తో గుండె అదురుతూ ఉంటే కంగారుగా అడుగుతుంది ……. !!

ఇప్పుడు ప్రణవి ఎమ్ చెప్పనుంది…… ?? ఆషి కి నిజం తెలియనుందా…… ?? నిజం తెలిస్తే ఆషి తట్టుకోగలదా……. ??