Login with OTP

అందాల రాక్షసి{2}-73

aashyatech

Author

నీతో మాట్లాడింది బావ కాదు ….. !! ఇన్ఫాక్ట్ బావ నీతోనే కాదు ఎవరితో మాట్లాడలేదు & అసలు మాట్లాడే స్థితిలో బావ లేడు …… !!

ఏం… ఎమ్ అంటున్నావ్ ప్రణవి…… !! ఆయుష్ గారు బానే ఉన్నారు కదా …… !! అని బయం తో గుండె అదురుతూ ఉంటే కంగారుగా అడుగుతుంది ……. !! హహ ఏంటి ఆషి నీ మాట తడబడుతుంది అసలు నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుందేమో అని వెటకారంగా నవ్వుతూ…… !! అయినా నిన్ను అమితంగా ప్రేమించే మీ అన్నయ్యలు అదే మోహిత్, విక్రమ్ లే నీ దగ్గర నిజాన్ని దాచారు అంటే మే బీ నీకు బావ గురించి తెలియకూడదు అనుకుంటున్నారేమో …… !!

ఇప్పుడు నేను నీకు నిజాన్ని చెప్పినా అందరి దృష్టిలో బ్యాడ్ గానే పోట్రే అవుతాను అవసరమా చెప్పు……. !! ఇప్పటికే నీ మీద పగ పెంచుకున్నాను అని అందరూ నన్ను విలన్ ను చూస్తున్నట్టు చూస్తూ ….. !!  నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు నాకెందుకు లే అని వెళ్ళబోతుంది….. !!

ప్రణవి ప్లీస్ నన్ను టెన్షన్ పెట్టకు ఆయుష్ గారు ఎక్కడ….. ?? ఆయనకి ఎమ్ జరిగింది ప్లీస్ చెప్పు ఆయన సేఫ్ గానే ఉన్నారు కదా…… ?? అంటూ ప్రణవి చెయ్ పట్టుకుని ఆపేస్తూ నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ అడుగుతుంది……. !!

ఆషి ను అలా చూసిన ప్రణవి యస్ నా ప్లాన్ సక్సెస్ 😎 దీన్ని చూస్తుంటే బావ ను అలా చూసి గుండాగి చచ్చేలా ఉంది అని మనసులో నవ్వుకుంటూ….. !! హ్మ్మ్ నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావ్ కాబట్టి బావ గురించి చెప్తాను లేదు డైరెక్ట్ గా చూపిస్తాను జస్ట్ ఏ సెకండ్ అంటూ బయటకు వెళ్ళిపోతుంది….. !!

ప్రణవి ఆయుష్ గారి గురించి ఏదేదో మాట్లాడుతుంది ఏంటి…… ?? నిజంగా ఆయుష్ గారు ఇక్కడే ఉన్నారా మరెందుకు నన్ను చూడ్డానికి రాలేదు అని రక రకాలుగా ఆలోచిస్తూ……. !! స్ట్రెస్ ఫీల్ అవ్వడం తో నరాలు మొత్తం ఒక్కసారిగా తెగిపోయేంతలా తల గిర్రున తిరుగుతూ ఉంటుంది……. !!

బయటకు వెళ్ళిన ప్రణవి కాసేపటికి వీల్ చైర్ తీసుకుని వచ్చి ఆషి ఎదురుగా నిలబడి….. !! పదా బావ దగ్గరకు వెళ్దాం అనగానే కొంచెం హెల్ప్ చేయవా అని తిరుగుతున్న తలతోనే కష్టంగా లేచి కూర్చుంటూ…… !! చేతికి పెట్టిన సెలైన్ వైర్ ను వేళ్ళతో గట్టిగా లాగగానే దారాలంగా బ్లడ్ కారుతూనే ఉంటుంది…… !!

తన చేతికి బ్లడ్ కారుతున్నా ఆషి పట్టించుకునే స్టేజ్ లో లేదు ఇప్పుడు తను ఆయుష్ ను చూడాలి అంతే……. !! అందుకే ఒక్కో అడుగు వేస్తుంటే కత్తి తో కడుపును చీల్చినంత నొప్పి పడుతున్న కష్టంగా లేని ఓపిక తెచ్చుకుని ప్రణవి హెల్ప్ తో వీల్ చైర్ లో కూర్చుంటుంది……. !!

త్వరగా తీసుకుని వెళ్ళు ప్రణవి నేను ఆయుష్ గారిని చూడాలి ప్లీస్…… !! ఒకే… ఒకే తీసుకుని వెళ్తున్నా కదా రిలాక్స్ అంటూ ఆ రూమ్ నుండి బయటకు వీల్ చైర్ ను పుష్ చేస్తూ తీసుకుని వెళ్తూ ఉండగా ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు జూనియర్ డాక్టర్…… !!

మేడమ్ ఎక్కడికి వెళ్తున్నారు అని ఆషి మొహం లోని లో ఎక్స్ప్రెషన్స్ & తన చేతికి అవుతున్న బ్లీడింగ్ వైపు చూస్తూ కంగారుగా అడుగుతాడు ఆ డాక్టర్……. !! నీకు అనవసరం ముందు తప్పుకో అంటూ ఆ జ్యూనియర్ డాక్టర్ ను పక్కకు నెట్టి ఆషి ను తీసుకుని ముందుకు వెళుతుంది ప్రణవి…. !!

మేడం ఆగండి అని కింద పడ్డ జ్యూనియర్ డాక్టర్ పైకి లేచి ఆషి ముందు వాళ్ళు వెళ్ళకుండా అడ్డుగా నుంచుంటూ…… !! మీ సిచుయేషన్ తెలిసి కూడా ఎక్కడికి వెళ్తున్నారు మ్యామ్ ప్లీస్ అర్థం చేసుకోండి…… !! ఇది మీకు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి టైమ్ మీరు ఇలా కూర్చోవడం మీకు అసలు మంచిది కాదు…… !!

ప్రణవి నేను ఆయుష్ గారిని చూడాలి అని నీరసంగా వినిపించిన ఆషి వాయిస్ కి ప్రణవి ఆ జ్యూనియర్ డాక్టర్ వైపు సీరియస్ గా చూస్తూ…… !! అక్కడి నుంచి ఆయుష్ రూమ్ వైపు వెళ్ళడం చూసి……… !! ఆ జ్యూనియర్ డాక్టర్ కంగారుగా విక్రమ్ నంబర్ కి డయల్ చేస్తాడు…… !!

వర్క్ మీద బయటకు వచ్చిన విక్రమ్ & మోహిత్ కార్ లో హాస్పిటల్ కి రిటర్న్ అవుతూ ఉండగా……. !! హస్పిటల్ నుండి డాక్టర్ కాల్ చేస్తూ ఉండడం చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు…… !!

హలో డాక్టర్

సర్ ఎక్కడున్నారు ……. ??

ఏమైంది డాక్టర్ ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నారు ….. ?? వర్క్ మీద బయటకు వచ్చాం ఎనీ ఎమర్జెన్సీ మీకు ఏమైనా కావాలంటే నిషాన్ ను కాంటాక్ట్ అవ్వండి తను హాస్పిటల్ లోనే ఉన్నాడు…… !!

ఓహ్ నో సర్ కొంప మునిగింది….. !! ఆషి మేడమ్ కి ఆయుష్ సర్ గురించి తెలిసి సర్ ను చూడాలి అని పట్టుబట్టి ఆయన రూమ్ వైపు వెళ్తున్నారు…… !! నేను ఎంత ఆపడానికి ట్రై చేసినా మేడం నా మాట వినడం లేదు….. !! ప్లీస్ మీరు త్వరగా రండి మేడం కండిషన్ బాలేదు పైగా హ్యాండ్ కి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది…… !! నిషాన్ సర్ కూడా హస్పిటల్ లో లేరు….. !!

వాట్ అంటూ సడెన్ బ్రేక్ తో కార్ ఆపిన విక్రమ్ కి డాక్టర్ చెప్పింది అర్థం అవ్వడానికి 2 మినిట్స్ పడుతుంది…… !! అసలు ఆషి కి ఎలా తెలిసింది డాక్టర్ & మీరంతా ఎమ్ చేస్తున్నారు…. ?? ఆషి ఒక్కటే ఎవరి హెల్ప్ లేకుండా ఆయుష్ దగ్గరకు ఎలా వెళ్లగలదు వాట్స్ గోయింగ్ ఆన్…… ?? అంటూ సీరియస్ గా అడుగుతాడు….. !!

సర్ నేను అభి మేడం ను అసిస్ట్ చేయడానికి వెళ్ళాను నేను వచ్చేసరికి ప్రణవి మేడం కోపంగా ఆశ్రిత మేడం ను ఆయుష్ సర్ వైపు తీసుకుని వెళ్తున్నారు…… !! ప్లీస్ సర్ ఏదో ఒకటి చేయండి ఐ ఆమ్ హెల్ప్లెస్ మే బీ ఆశ్రిత మేడం కి ఆయుష్ సర్ గురించి ప్రణవి మేడం చెప్పినట్టు ఉన్నారు…… !!

ఓహ్ షట్ అది ఎందుకు అక్కడికి వచ్చి చచ్చింది అంటూ కోపంగా కాల్ కట్ చేసి పక్కన కూర్చున్న మోహిత్ తో విషయాన్ని షేర్ చేయగానే మోహిత్ కోపంగా నిషాన్ కి డయల్ చేస్తాడు…… !!

హాయ్ బావా కాల్ లిఫ్ట్ చేయగానే నార్మల్ గా విష్ చేస్తున్న నిషాన్ తో నిష్ ఎక్కడున్నావ్….. ?? మేము వచ్చేదాకా హస్పిటల్ లో ఉండమని చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నావ్ నువ్వు…… ??

బావా ప్రణవి కాల్ చేసి అర్జంట్ గా మహల్ కి రమ్మంది అందుకే వెళ్తున్నా ఒక హాఫ్ ఆన్ ఆర్ లో రిటర్న్ అవుతాను…… !! అవును నేను హాస్పిటల్ లో లేను అని మీకు ఎలా తెలుసు…… ??

యూ ఫూల్ ప్రణవి నిన్ను తెలివిగా ట్రాప్ చేసి నిన్ను మహల్ కి వెళ్ళేలా చేసి నువ్వు వెళ్లగానే ఆషి కి బావ గురించి నిజాన్ని చెప్పేసింది…… !! వాట్ అంటూ సడెన్ బ్రేక్ తో కార్ ఆపిన నిషాన్ వాయిస్ కి గో ఫాస్ట్ నిష్ ఆషి ఆయుష్ ను చూడకుండా ఆపాలి…… !! మేము చాలా దూరం లో ఉన్నాం రా ఫాస్ట్ గా వెళ్ళు ఆషి కండిషన్ అసలు బాలేదని డాక్టర్ చెప్తున్నాడు…… !!

ఒకే….. ఒకే….. బావా ఇప్పుడే వెళ్తున్నా అంటూ కార్ రివర్స్ చేసి నిషాన్ ఫాస్ట్ గా హాస్పిటల్ వైపు కార్ ను పరుగులు పెట్టిస్తే… !! మరో వైపు విక్రమ్ కూడా కార్ ను 130 స్పీడ్ లో డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ ముందు 20 నిమిషాల తరువాత కార్ ఆపుతాడు……. !!

✨✨✨✨✨✨✨✨✨✨

 

ఐ. సీ. యూ. ముందు ఆగిన ప్రణవి తన చేత్తో రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఆషి ను లోపలికి తీసుకుని వెళ్తుంది…… !! అక్కడ బెడ్ మీద ఎవరో పడుకున్నట్టు కనిపిస్తూ ఉంటే చుట్టూ మిషన్స్ మధ్య ఆక్సిజన్ మాస్క్ తో పడుకున్నది ఎవరో అర్థం అవ్వక ……. !! ఆషి తన గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటే అక్కడ ఉంది ఆయుష్ గారు అవ్వకూడదు అని టెన్షన్ గా చూస్తూ ఉంటుంది……. !!

అక్కడ ఉన్న డాక్టర్స్ ను ప్రణవి బెదిరించి నోరు మూసుకునేలా చేసి బయటకు పంపించేస్తుంది …… !! బెడ్ దగ్గరకు వచ్చిన ఆషి కి అక్కడుంది ఆయుష్ నే అని అర్థం అవ్వగానే షాక్ అవుతూ ఆ… ఆ…. ఆయుష్ గారు 🥹 …… !! ఆయుష్ గారు ఏమైందండి ఎందుకిలా పడుకున్నారు నన్ను చూడండి ఆయుష్ గారు ప్లీస్……. !! అని ఏడుస్తూ ఉంటే అది చూసిన ప్రణవి నవ్వుతూ ఆషి ఏడుపును ఎంజాయ్ చేస్తూ ఉంటుంది…… !!

ఆయుష్ గారు ప్లీస్ నాతో మాట్లాడండి మీరు ఇలా పడుకుని ఉంటే నాకు భయమేస్తుంది ప్లీస్ అంటూ…… !! తనే ఎవరి హెల్ప్ లేకుండా వీల్ చైర్ నుండి కిందకు దిగి నుంచునే శక్తి కూడా కింద పడి పోతుంది…… !! అయినా బెడ్ పట్టుకుని పాకుతూ కస్టంగా పైకి లేచి ఆయుష్ బెడ్ పక్కన కూర్చుని స్టిచెస్ వేసిన ఆయుష్ స్టమక్ ను తడుముతూ……. !! అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఇంకా కనిపిస్తూ ఉంటే ఆషి కి తన గుండె ముక్కలైనంత బాధగా ఉంది…. !!

ఒక్క సారి నన్ను చూడండి ఆయుష్ గారు 🥹 నాతో మాట్లాడకుండా ఎలా ఉన్నారు అండి….. ?? నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా ఒక్క సారి ఆషి అని పిలవరా 🥺 …… !! నేను ఇంకెప్పుడు మిమ్మల్ని ఇరిటేట్ చేయను ప్లీస్ అండి కళ్ళు తెరిచి నన్ను చూడండి అని ఆషి ఎంతలా ఏడుస్తున్నా ఆయుష్ నుండి ఎలాంటి సమాధానం ఉండదు…. !!

నేను ఇలా మీ గుండె మీద పడుకుంటే మీకు ఇష్టం కదా ప్లీస్ నన్ను మీ హ్యాండ్స్ తో హోల్డ్ చేయండి అని ఆయుష్ ❤️ హార్ట్ మీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది…… !! నువ్వు ఎంత ఏడ్చినా బావ నుండి సమాధానం రాదు ఆషి ఎందుకంటే బావా కోమా లో వున్నాడు….. !! కేవలం నిన్ను కాపాడడం కోసం బావ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు …… !! నువ్వు బావ లైఫ్ లో లేనన్ని రోజులు బావ ఒక రాజు లా తన లైఫ్ లీడ్ చేశాడు ఎప్పుడైతే నువ్వు బావ లైఫ్ లోకి వచ్చావో అప్పటి నుండి బావా కి కష్టాలు మొదలయ్యాయి …… !!

 

ఇవాళ బావ ఈ స్థితిలో ఉండడానికి నువ్వే రీసన్ ఇంకా నువ్వు బావ లైఫ్ లో ఉంటే ఆ ఉన్న ప్రాణం కూడా పోతుంది…… !! నీకు బావా ఏమాత్రం ప్రాణాలతో ఉండాలి అనుకున్నా ఈ క్షణమే వెళ్ళిపో లేదా చచ్చిపో …… !! బావ నువ్వు నిజంగా ప్రేమించి ఉంటే ఈ క్షణమే చచ్చిపో బావ జాతకం లో కూడా ఉందట నువ్వు బావ తో ఉంటే బావా ప్రాణాలకు ప్రమాదం అని సో చెప్పు ఇంకా నువ్వు బావ తోనే ఉండి ఉన్న ఆ కాస్త ప్రాణాన్ని కూడా తీసేస్తావా…… ?? అంటూ కోపంగా అడుగుతుంది….. !!

 

లే…..లేదు ఆయుష్ గారు సంతోషంగా ఉండాలి  ఇదంతా నా వల్లే జరిగింది 🥹…… !! అవును నేను నిజంగా నష్ట జాతకురాలిని నా వల్ల ఎవరికి ఆనందం లేదు…… !! ఆయుష్ గారు 🥹 ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందుకు నేను చావడానికి అయినా సిద్ధమే …….. !! అంటూ టేబుల్ పక్కన ఉన్న ట్రే లో కత్తి కనిపించగానే అది తీసుకుని ఆయుష్ వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ మిస్ యూ ఆయుష్ గారు అని కత్తితో లోతుగా తన కడుపులో గుచ్చుకుంటుంది ……. !!