Login with OTP

అందాల రాక్షసి{2}-75

aashyatech

Author

రోడ్ మీద పడ్డ ప్రణవి చేతులు దులుపుకుంటూ పైకి లేచి నన్ను…. ఈ ప్రణవి నే ఇంతలా ఇన్సల్ట్ చేస్తారా అని పళ్ళు నూరుతూ…..     !! చూస్తూ ఉండరా దీని గురించి అయితే మీరందరూ నన్ను రోడ్ మీదకు లాగేసారో అదే చెల్లి ని మీ లైఫ్ లో లేకుండా చేసి మీ అందరికీ ప్రణవి అంటే ఏంటో చూపిస్తా…… !! ఒసేయ్ ఆషి ఎన్ని సార్లు తప్పించుకుంటావే నీకు ఇప్పటికే చాలా ఛాన్సెస్ అయిపోయాయి ఇక నో మోర్ ఛాన్సెస్ నిన్ను చంపకుండా నేను వదలను చూస్తూ ఉండు అనుకుంటూ అక్కడి నుంచి కోపంగా తన కార్ తీసుకుని వెళ్ళిపోతుంది…… !!

మోహిత్ కోపంగా ఆయుష్ ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉండగా….. !! మోహిత్ అని పిలిచిన విక్రమ్ వైపు చూస్తూ ఏంట్రా ఇక్కడ ఉన్నావ్ ఆషి ఎక్కడ…… ?? ఆషి ఓవర్ గా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల అన్ కాన్షియస్ అయి పడిపోయింది రా లోపల తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది……… !!

ఓహ్ షట్ పదా అంటూ ఇద్దరూ ఆషి ను ట్రీట్ చేస్తున్న రూమ్ ముందుకు వెళ్ళి డాక్టర్ కోసం నిషాన్ పక్కనే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు….. !! కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ ను చూసిన మోహిత్ కంగారుగా డాక్టర్ ముందుకు వచ్చి….. !! ఆషి కి ప్రాబ్లెమ్ ఎమ్ లేదు కదా డాక్టర్ అంటూ టెన్షన్ గా చూస్తూ అడుగుతాడు…..     !!

సర్ నేను ముందే చెప్పాను ఆశ్రిత మేడం అసలు స్ట్రెస్ తీసుకోకూడదు అని మేడం కి జరిగింది నార్మల్ సర్జరీ కాదు….. !! అయినా మేడం ఇంతా త్వరగా కన్షియస్ లోకి రావడం నిజంగా గ్రేట్ అలాంటి మేడం ఇలా ఏడ్చి సిచుయేషన్ ను క్రిటికల్ చేసుకున్నారు …… !! మేడం కంప్లీట్ గా బెడ్ దిగకుండా రెస్ట్ తీసుకుని టైం కి ట్రీట్మెంట్ తీసుకుంటేనే త్వరగా రికవరీ అవుతారు….. !!

ఎందుకు ఇలా చెప్తున్నానంటే మేడం కి వన్ ఆర్ బ్యాక్ చేయాల్సిన ఇంజెక్షన్ ఇప్పుడు చేశాం అది మేడం హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది…… !! ప్లీస్ ఇప్పటి నుండైనా మేడం ను అలా చేయకండి అని చెప్పండి మేము ఎంత ట్రీట్ చేసినా ఆవిడ పీస్ఫుల్ గా ఉండి టైమ్ కి ఫుడ్ &  మెడిసిన్స్ తీసుకుంటేనే రికవర్ అవుతారు…… !! ఇంకో హాఫ్ ఆన్ ఆర్ కి మేడం కాన్షియస్ లోకి వస్తారు టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు డాక్టర్…… !!

ఇదంతా నీ వల్లే నిష్ ఇంకో సారి దానితో మాట్లాడినా & మాట్లాడుతున్నట్టు తెలిసినా సరే ఆ రోజే ఆఖరి సారి అవుతుంది నీతో మాట్లాడ్డం అంటూ……. !! కోపంగా ఆషి దగ్గరకు వెళ్తాడు మోహిత్ అది చూసిన విక్రమ్ నిషాన్ భుజం మీద చెయ్ వేసి….. !! మోహిత్ పెయిన్ లో ఉన్నాడు ఫీల్ అవ్వకు నిష్ అన్ని త్వరలోనే సెట్ అవుతాయి…… !!

లేదు బ్రో బావ అన్నది నిజమే నేను ప్రణవి కోసం మహల్ కి స్టార్ట్ అవ్వకుండా ఉండుంటే….. !! ఆషి కి అన్నయ్య గురించి తెలిసేది కాదు ఇప్పుడు తన కండీషన్ ఇంత క్రిటికల్ గా కూడా ఉండేది కాదు….. !! ఇదంతా నా వల్లే & బావా చెప్పాడు అని కాదు కానీ నేనే డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు ప్రణవి తో నేను మాట్లాడను……… !!

ఇది కూడా మనకు విధంగా మంచిదే నిష్….. !! ఆయుష్ గురించి ఆషి కి తెలిసింది కాబట్టి ఇక మనం ఆషి దగ్గర ఎలా మ్యానేజ్ చేయాలి అని టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు….. !! ఆషి కూడా తన గురించి కాకపోయినా ఆయుష్, దియా ల కోసం అయినా తనను తాను స్ట్రాంగ్ గా చేంజ్ చేసుకుంటుంది….. !!

హ్మ్మ్ నువ్వు చెప్పింది కూడా నిజమే బ్రో పదా లోపలికి వెళ్దాం అని ఇద్దరూ లోపలికి వచ్చేసరికి మోహిత్ ఆషి చెయ్ పట్టుకుని తన వైపే బాధగా చూస్తూ ఉంటాడు…… !! మోహిత్ ను అలా చూసిన ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని మోహిత్ బుజం మీద చేయి వేస్తారు….. !! మోహిత్ ఇద్దరినీ చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆషి తల నిమురుతూ ఆషిక ను దూరం చేసుకుని ఇప్పటికే సగం ప్రాణాన్ని పోగొట్టుకున్నాను ……… !? కానీ నీకేమైనా అయితే మాత్రం బావ నే కాదు నేను కూడా ఉండను కళ్ళు తెరువు ఆషి నిన్ను ఇలా చూడడం చాల నరకంగా ఉంది……. !!

మోహి ప్లీస్ రా కంట్రోల్ నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు తను నీ చెల్లెలు రా నీ లాగే ఆషి కూడా చాలా స్ట్రాంగ్…… !!  చూస్తూ ఉండు డాక్టర్స్ చెప్పిన దాని కంటే ఇంకో వీక్ ముందే తను నార్మల్ అవుతుంది…… !! అని చెప్తూ ఉండగా ఆషి నెమ్మదిగా కదులుతూ ఉండడం చూసి ముగ్గురూ ఆషి వైపు చూస్తూ ఉంటారు….. !!

ఆషి నెమ్మదిగా మూసుకుపోతున్న కళ్ళను  కష్టంగా తెరిచి చూస్తూ…… !! ఆ… ఆయుష్ గారు ఎక్కడ అని తను ఆయుష్ దగ్గర లేకపోయేసరికి కంగారుగా చూస్తూ అడుగుతుంది…… !! ఆషి రిలాక్స్ బావ వేరే రూం లో ఉన్నాడు తను బానే ఉన్నాడు రా నువ్వు టెన్షన్ పడకు నీ కండిషన్ అసలు బాలేదు అని డాక్టర్స్ చెప్తున్నారు …… !! నా అమ్మ వి కదూ కొద్దిగా ఈ జ్యూస్ తాగురా కొంచెం ఎనర్జీ వస్తుంది……. !!

ఆషి మోహిత్ చెయ్ పట్టుకుని అన్నయ్య నేను ఒకటి అడుగుతాను కాదు అనకుండా చేస్తావా ప్లీస్…… !! చెప్పు రా ఎమ్ చేయాలి ఫస్ట్ అయితే ఏడవకు అని ఆషి బుగ్గల మీద నుండి జారుతున్న కన్నీటిని తుడుస్తూ తన పక్కనే కూర్చుంటాడు…… !! నన్ను ఆయుష్ గారి రూమ్ దగ్గరకే తీసుకుని వెళ్ళు అన్నయ్య ఆయన ను చూడకుండా ఇలా దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు 🥺 ….. !! ఆయన నాతో మాట్లాడకపోయినా దూరంగా ఉండి ఆయనను చూస్తూ బ్రతికేస్తాను…… !!

ఆయుష్ గారు నాతో మాట్లాడలేక పోతే ఏంటి నేను మాట్లాడేది వింటారు కదా 🥺…… !! ప్లీస్ అన్నయ్య నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళు అంటూ వెక్కిళ్లు పెడుతున్న ఆషి ను చూస్తూ….. !! ఒకే నేను తీసుకుని వెళ్తాను ఏడవకు అని ఆషి కి బలవంతంగా జ్యూస్ తాగించి ఇప్పుడు అయితే నువ్వు పడుకో రా….. !! రేపు మార్నింగ్ డాక్టర్ తో మాట్లాడి నిన్ను బావ ను ఒకే రూమ్ లో ఉంచేలా ప్లాన్ చేస్తాను సరేనా….. !!

ఊ 🥺 థాంక్స్ అ….న్న….య్య ….. !! ఇంజెక్షన్ మత్తుకు ఆషి కి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది దాంతో మోహిత్ చేతిలో ఉన్న ఆషి చెయ్ బెడ్ మీద కు జారిపోతుంది…… !! ఆషి చేతిని సరిగ్గా పెడుతూ ముగ్గురూ సౌండ్ చేయకుండా ఆషి రూమ్ నుండి బయటకు వచ్చి ఆషి గురించి డాక్టర్స్ తో మాట్లాడాలి అనుకుంటారు….. !! మోహిత్ ఆషి రూమ్ లో ఉన్న ఎక్స్ట్రా బెడ్ మీద ఆయుష్ రూమ్ లో విక్రమ్ & అభి రూమ్ లో నిషాన్ కూడా మండుతున్న కళ్ళను మూసి నిద్రలోకి జారుకుంటారు…… !!

✨✨✨✨✨✨✨✨✨✨

 

సూర్యుని కిరణాలు వెచ్చగా తన మొహాన్ని తాకగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తున్న అభి కి ఎదురుగా క్యూట్ గా నిద్రపోతూ కనిపిస్తాడు నిషాన్….. !! తనను అలా చూసిన అభి చిన్నగా నవ్వి తన రెండు చేతులతో నిషాన్ కి దిష్టి తీస్తూ ఐ లవ్ యూ బావా 🥺❤️…… !!

 

. నా ప్రతీ డే ఇలాగే స్టార్ట్ అవ్వాలని నా కోరిక అది ఎలా అయినా నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను….. !! దాని కోసమే కదా నీతో కూడా ప్రామిస్ చేయించుకొన్నాను…… !! నేను, అక్క & బావ రికవర్ అవ్వగానే నన్ను మ్యారేజ్ చేసుకోమని అడుగుతాను ఐ నో నీకు కూడా నేనంటే ఇష్టమే కానీ ఎందుకో చెప్పడం లేదు ……. !!

 

నిజం చెప్పనా బావా నేను ముందులా అసలు లేను ఇప్పుడు పూర్తిగా చేంజ్ అయ్యాను….. !! నాకు నా ఫ్యామిలీ మాత్రమే ఇంపార్టెంట్ అనుకునేదాన్ని బట్ ఇప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావ్…… !! నువ్వు నా లైఫ్ లో ఉంటే నిజంగా నా అంత లక్కి మరే అమ్మాయి ఉండదు అని నిషాన్ వైపు ప్రేమగా చూస్తూ….. !? కష్టంగా బెడ్ మీద నుండి కాలు కింద పెడుతూ ఒక్కో అడుగు వేస్తూ వాష్ రూమ్ వైపు వెళ్ళబోతూ కింద పడిపోబోతుంది …… !!

అప్పుడే మెలకువ లోకి వచ్చిన నిషాన్ కింద పడుతున్న అభి ను చూసి…… !! ఫాస్ట్ గా లేచి అభి అంటూ వచ్చి జాగ్రత్తగా పట్టుకుంటూ నన్ను లేపచ్చు కదా అభి ఎక్కడికి వాష్ రూమ్ కా……. !! ఊ అని ఇబ్బందిగా తల ఊపుతున్న అభి ను చూసి ఇందులో ఇబ్బంది పడాల్సింది ఎమ్ లేదు కానీ పదా…… !! అని అభి ను వాష్ రూమ్ లో దించి నీ వర్క్ అవ్వగానే డోర్ నాక్ చెయ్……. !! అంటూ డోర్ ముందుకు వేసి ముందు నుంచి లాక్ చేస్తూ అక్కడే నుంచుంటాడు….. !!

10 మినిట్స్ తరువాత డోర్ నాక్ చేస్తున్న సౌండ్ విని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అభి ను ఎత్తుకుని వస్తూ ఉండగా…… !! బావ కొంచెం బ్రష్ ఇస్తావా చాలా చిరాగ్గా ఉంది ఫేస్ వాష్ చేసుకుంటాను…… !! ఒకే అభి అంటూ అభి ను స్టూల్ మీద కూర్చో పెడుతూ అభి కి తనే దగ్గరుండి బ్రష్ చేయిస్తూ ఉంటాడు…… !!!

నిషాన్ వైపు సూటిగా చూస్తున్న అభి వైపు చూస్తూ…… !! కాన్సంట్రేషన్ ఇక్కడ పెట్టవే అని బ్రష్ చేయించాక హెయిర్ కి క్లక్చర్ పెట్టి నీట్ గా ఫేస్ వాష్ చేసి టవల్ తో తుడిచాక తనను ఎత్తుకుని బెడ్ రూమ్ కూర్చో పెడతాడు…… !!

బావా ఇదంతా నా మీద ప్రేమ లేకుండానే చేస్తున్నావా…… ?? అని అడుగుతున్న అభి వైపు చూస్తూ తన చేతిని వెనక్కి తీసుకుంటూ బాధ్యత తో చేస్తున్నా ……. !! తినకముందు మెడిసిన్స్ వేసుకోవాలి కదా అని మెడిసిన్స్ వేసాక అభి కోసం మిల్క్ తన కోసం టీ తెప్పించి మెల్లగా సిప్ చేస్తూ….. !! నైట్ ప్రణవి తో గొడవ దగ్గర నుండి ఆషి హెల్త్ వరకూ మొత్తం డీటెయిల్డ్ గా చెప్తాడు…… !!

చిచీ అది అసలు మనిషేనా బావా ఎందుకు దానికి మా అక్క అంటే అంత ద్వేషం….. ?? ఒక్క క్షణం నువ్వు రావడం లేట్ అయ్యుంటే అసలేం జరిగి ఉండేది ఓహ్ గాడ్ ఇమాజిన్ చేసుకుంటుంటే కాళ్ళు చేతులు షివర్ అవుతున్నాయి….. !! దాన్ని చంపేసినా పాపం లేదు బావా ఇంకా ఎందుకు బావ దాన్ని మాన్షన్ లోనే ఉంచారు అంటూ కోపంగా అరుస్తుంది అభి…… !!

కృష్ణదేవ్ మావయ్య కోసం….. !! ఆ రోజు అన్నయ్య అయినా ఇవాళ నేను అయినా దాన్ని ప్రాణాలతో వదిలాం అంటే అది మావయ్య కోసమే…… !! ఇన్నాళ్ళు ప్రణవి మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండేది నైట్ జరిగిన గొడవ తో అది కూడా పోయింది….. !! అయినా ఇప్పుడు నేను జరిగింది చెప్పింది నీకు ప్రణవి గురించి తెలియడానికి కాదు……. !! నేను ఆషి తో క్లోజ్ గా ఉంటే నీకు కూడా అలానే అనిపిస్తుందా…… ?? నిజంగా నేను ఇంకా ఆషి ను లవ్ చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావా అంటూ అభి వైపు తన ఆన్సర్ కోసం చూస్తూ ఉంటాడు…… !!

 

ఇప్పుడు అభి ఎమ్ ఆన్సర్ ఇస్తుంది….. ?? ప్రణవి ఆషి ను చంపడానికి మళ్ళీ ప్లాన్ చేస్తుందా…. ??