అందాల రాక్షసి{2}-76
ఇప్పుడు నేను జరిగింది చెప్పింది నీకు ప్రణవి గురించి తెలియడానికి కాదు అభి ……. !! నేను ఆషి తో క్లోజ్ గా ఉంటే నీకు కూడా ప్రణవి లానే అనిపిస్తుందా…… ?? నిజంగా నేను ఇంకా ఆషి ను లవ్ చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావా అంటూ అభి వైపు తన ఆన్సర్ కోసం చూస్తూ ఉంటాడు నిషాన్ …… !! అభి నిషాన్ వైపు సూటిగా చూసి తన మిల్క్ గ్లాస్ పక్కన పెడుతూ ……. !! నువ్వు అక్క పాస్ట్ లో లవ్ చేసుకున్నారు కాదు అనను బట్ వన్స్ నువ్వు వాళ్ళ రిలేషన్ కి రెస్పెక్ట్ ఇచ్చి…….. !! ఎప్పుడైతే నీ ప్రేమను చంపుకుని అక్క ని మీ అన్నయ్య బార్య స్థానం లో చూడ్డం స్టార్ట్ చూశావో అప్పుడే మీ ఇద్దరి మధ్య ఒక ప్యూర్ బాండ్ స్టార్ట్ అయింది బావ…… !!
అక్క అంటే నీకు ఎంత ఇష్టమో అది మన ఫ్యామిలీ లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు & బావ ను కూడా నువ్వు అంతే ఇష్టపడ్డావ్ ఎంతలా అంటే రాముడి మాట వినే లక్ష్మణుడిలా ఎప్పుడూ బావ వెనుకే ఉండాలి అనుకున్నావ్……. !! నేను కూడా నీ అంతలా మా అక్క ను ఇష్టపడుతున్నానో లేదో నాకు తెలియదు కానీ…….. !! నువ్వు మాత్రం అక్క బావ కోసం ప్రాణాలు తీసుకోవడానికి క్షణం కూడా ఆలోచించవు….. !! ఇప్పుడు నీది అక్కది తల్లీ కొడుకు లాంటి రిలేషన్ అలాంటి ప్యూర్ బాండ్ ను అనుమానించేంత చీప్ క్యారెక్టర్ నాది కాదు బావ……. !!
నిషాన్ అభి వైపు స్మైలీ ఫేస్ తో చూస్తూ నీలో ఈ చేంజ్ కోసమే అభి నేను వెయిట్ చేసాను…… !! నువ్వు చెడ్డదానివి అని నేను చెప్పను బట్ నీలో ఉన్న సెల్ఫిష్నెస్ పోవాలి అనుకున్నాను అది ఇప్పుడు నీలో క్లియర్ గా కనిపిస్తుంది…… !!
బావ నీకు ఇలా చెప్పడం ఇష్టం ఉండదు & కోపం వస్తుంది అని కూడా తెలుసు కానీ ఒక్కటి మాత్రం నిజం బావ……. !! నాకు నువ్వంటే చాలా ఇష్టం అది ఇప్పుడు కాదు మన పరిచయం అయినప్పటి నుండి నాకు నువ్వంటే ఇష్టం…….. !! నీ క్యారెక్టర్ , మంచితనం, ఇంటెలిజెన్స్ & ఫ్యామిలీ కి నువ్వు ఇచ్చే వాల్యూ ఇలా ఒక్కటేంటి నాకు నీలో ప్రతీది ఇష్టమే……. !!
ఒప్పుకుంటాను నేను మొండిగా బిహేవ్ చేస్తాను అది నాన్న, అక్క వల్ల వచ్చిన గారాబం బావ……. !! కానీ ఎప్పుడైతే నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసానో అప్పటి నుంచి నన్ను నేను నాకు నచ్చినట్టు కాకుండా నీకు నచ్చేలా…… !! నువ్వు ఇష్టపడేలా చాలా చాలా చేంజ్ అయ్యాను బావ నేను నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నానో ఒక్క మాట లో చెప్పాలంటే…… !! లక్ష్మణుడు రాముడి తో వనవాసం వెళ్లేటపుడు తన భార్య ఊర్మిళ ఎలా అయితే ఆ వనవాసం అయ్యే వరకూ వెయిట్ చేసిందో…….. !! నేను కూడా నా ప్రేమ నువ్వు యాక్సెప్ట్ చేసే వరకూ వెయిట్ చేస్తూనే ఉంటాను…… !!
నీకు నా ప్రేమ ఈ లైఫ్ లో అర్థం అవ్వక పోతే అది నా దురదృష్టం అనుకుని నీతో ఉన్న జ్ఞాపకాలతో ఈ లైఫ్ ను ఇలా గడిపేస్తాను…… !! నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేదని సర్ది చెప్పుకుంటాను బావ ……… !! నా మాట లతో నిన్ను హర్ట్ చేసుంటే సారి బావ బట్ ఐ స్వేర్ ప్రేమ అంటూ నిన్ను అసలు ఇబ్బంది పెట్టను అంటూ……. !! కాసేపటికి నిషాన్ ను చూస్తూనే టాబ్లెట్స్ మత్తుకు మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది……. !!
అభి నిద్రపోయాక గుండెల దాకా బెడ్ షీట్ కప్పుతూ ఫోర్హెడ్ మీద కిస్ పెడుతూ……. !! నువ్వంటే ఇష్టం ఉన్నా చెప్పలేని సిచుయేషన్ నాది అన్నయ్య కి నువ్వంటే గుడ్ ఒపీనియన్ లేదు అభి…… !! అది నీకు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టలేను ఐ ఆమ్ సారి అభి ఈ జీవితానికి ఇంతే అని ……. !! బాధగా అనుకుంటూ అక్కడే కూర్చుని అభి వైపు రెప్ప వేయడం మాని చూస్తూ ఉంటాడు……… !!
✨✨✨✨✨✨✨✨✨✨✨✨
డోర్ ఓపెన్ చేసి నుంచున్న విక్రమ్ అభి & నిషాన్ కాన్వర్జేషన్ విని అక్కడే ఆగిపోతాడు…. !! విక్కీ అని బుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూసిన విక్రమ్ తన ఎదురుగా ఉన్న వేద ను చూసి…… !! ఎప్పుడొచ్చావ్ వేద అని డోర్ సౌండ్ రాకుండా ముందుకు వేసి తన చెయ్ పట్టుకుని అదే ఫ్లోర్ లో ఉన్న వెయిటింగ్ లాంజ్ లో కూర్చుంటారు….. !!
నేను వచ్చి 5 మినిట్స్ అవుతుంది విక్కీ…… !! ఏంటి అభి నిషాన్ ను లవ్ చేస్తుందా….. ?? మరి నిషాన్ ఏంటీ ఎమ్ ఆన్సర్ ఇవ్వలేదు…… ?? ఈ విషయం గురించి మహల్ లో అందరికీ తెలుసా…… ?? నాకు ఎవరు చెప్పలేదు మరి….. ??
ప్చ్ లేదు వేద ఈ విషయం మహల్ లో ఎవరికీ తెలియదు…… !! నాకు, మోహిత్ కి మాత్రమే తెలుసు ఆయుష్ కి తెలిస్తే ఇక అంతే మహల్ లో మూడో ప్రపంచ యుద్ధమే జరిగి ఉండేది …… !!
అదేంటీ విక్కీ…… ?? నిషాన్ అభి కి బావ అవుతాడు కదా పైగా ఆషి ఓన్ సిస్టర్ ఇంకేంటి ప్రాబ్లెమ్…….. ?? ఇద్దరూ చూడ్డానికి కూడా చాలా బావుంటారు పైగా అభి బాగా చదువుకుంది & అందంగా కూడా ఉంటుంది…… !! ఆయుష్ కి ఎందుకు ఇష్టం లేదు…… !!
ఐ ఆమ్ సారీ వేద నువ్వు నాతో లైఫ్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా కొన్ని కొన్ని నీ దగ్గర దాచాల్సి వస్తుంది…… !! ఆషి బర్త్ సీక్రెట్ ఎవరికీ తెలియకూడదు అని ఆయుష్ స్ట్రిక్ట్ గా చెప్పాడు అందుకే ఈ విషయాన్ని నీతో చెప్పలేక పోతున్నా…… !!
విక్కీ అడుగుతుంటే మాట్లాడవేంటీ…… ?? అసలు ప్రాబ్లెమ్ ఏంటి….. ??
ఆ…… వేద యాక్చుయల్లీ విషయం ఏంటంటే నీకు తెలుసు కదా నిషాన్ పాస్ట్ లో ఆషి ను లవ్ చేసాడని….. !! ఆల్ ఆఫ్ సడెన్ కొన్ని రీజన్స్ వల్ల ఆషి ను ఆయుష్ చేసుకున్నాడు …… !! సో అప్పుడు అభి & నిషాన్ కి చాలా గొడవలు అయ్యాయి అభి నిషాన్ ను ఎవ్రీ సెకండ్ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడేది…… !! అది ఆయుష్ కి ఏమాత్రం నచ్చేది కాదు దట్ టూ అభి డెసిషన్స్ ఏవీ స్టేబుల్ గా ఉండవు….. !!
తను చాలా హైపర్, ఎక్స్ట్రోవర్ట్ & లిటిల్ బిట్ యాటిట్యూడ్ పర్సన్ దానికి క్వైట్ అపోసిట్ నిషాన్……. !! సో ఇద్దరికీ అసలు మ్యాచ్ అవ్వదు వీళ్ళకు మ్యారేజ్ అయిన హ్యాపీగా ఉండరు కొట్టుకొని డైవర్స్ దాకా వెళ్తారని ఆయుష్ స్ట్రాంగ్ ఫీలింగ్…… !! అందుకే నిషాన్ మ్యారేజ్ ఎవరితో జరగాలో తనే డిసైడ్ చేస్తానని చెప్పాడు సో అలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వకుండానే బ్రేకప్ అయింది…… !!
దిస్ ఈజ్ రేడిక్యులస్ విక్కీ…… !! గర్ల్స్ ఇష్టాలు చేంజ్ అవుతూ ఉంటాయి ఐ అగ్రీ బట్ అది రీసన్ గా చూపెడుతూ అభి కరెక్ట్ కాదు అనడం సీరియస్లి నాట్ ఏ గుడ్ డెసిషన్……. !! అభి సచ్ ఏ ప్యూర్ సోల్ నేను తనను దగ్గరుండి చూసాను మనసులో ఎదీ ఉంచకుండా మాట్లాడేస్తూ ఉంటుంది అది చాలా మందికి చేతకాదు…….. !!
అంత దాకా ఎందుకు విక్కీ ఇవాళ అభి లేకపోయి ఉంటే దియా ప్రాణాలతో ఉండేదా……. ??
వేద అసలేం మాట్లాడుతున్నావ్…… ??
ఏంటి కోపం వస్తుందా …… ?? నిజాలు ఇలా చేదు గానే ఉంటాయి విక్కీ ఒక అమ్మాయిగా అభి పెయిన్ నాకు తెలుస్తుంది……. !! నువ్వు కూడా ఒక్క సారి అభి పొజిషన్ లో ఉండి ఆలోచించు తన అక్క కూతురు కోసమే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధ పడిన అభి…… !! తను ప్రాణంగా ప్రేమించిన మనిషి కోసం ఇంకెంత చేస్తుందో జస్ట్ థింక్ అబౌట్ ఇట్…… !!
వేద నాకు కూడా అభి పెయిన్ తెలుస్తుంది బట్ మహల్ లో ఆయుష్ మాటే ఫైనల్ యూ నో ఇట్ రైట్…… !! ఎనీ వే ఈ ఇన్సిడెంట్ తర్వాత అభి అంటే నీకే కాదు అందరికీ చాలా మంచి అభిప్రాయం స్టార్ట్ అయింది……. !! మే బీ ఆయుష్ థాట్ లో కూడా చేంజ్ వచ్చి ఉండచ్చు తను కాన్షియస్ లోకి వస్తే వుయ్ విల్ గెట్ ద క్లారిటీ…… !! నేను మోహిత్ కూడా అభి & నిషాన్ లను కలపడానికి ట్రై చేస్తాం ఒకే…… !!
వేద చిన్న స్మైల్ ఇచ్చి నౌ యూ ఆర్ లుకింగ్ లైక్ మై బాయ్ అంటూ……. !! తనతో ఆయుష్ & ఆషి హెల్త్ అప్డేట్స్ గురించి అడుగుతూ మాట్లాడుతూ ఉంటుంది……….. !!
💫💫💫💫💫💫💫💫💫💫
నిద్రబోతున్న మోహిత్ ఫీట్ ఎవరో మసాజ్ చేస్తున్నట్టు అనిపించడం తో కష్టంగా కళ్ళు తెరిచి చూసిన మోహిత్ కి తన కాళ్ళను వడిలో పెట్టుకుని నొక్కుతూ కనిపిస్తుంది జోషి…… !! ఏయ్ నువ్వెప్పుడు వచ్చావ్ జోషి అని పైకి లేస్తున్న మోహిత్ ను ఆపుతూ లేవకుండా పడుకో మోహిత్……. !! నువ్వెంత టైర్డ్ గా ఉన్నావో నీ ఫేస్ & ఐస్ లో క్లియర్ గా కనిపిస్తుంది కాసేపు పడుకో….. !!
జోషి ముందు నా కాళ్ళు వదులు ఐ ఆమ్ ఒకే కొంచెం స్లీప్ అవర్స్ తగ్గాయి అంతే….. !! ఆషి లేకుండా తనకు 7 కి మెడిసిన్ ఇవ్వాలి ఇప్పుడు టైం ఎంత అవుతోంది……. ??
ఆషి స్టిల్ స్లీపింగ్ మోహిత్ & టైమ్ కూడా 6:25 అవుతోంది సో నువ్వు కాసేపు టెన్షన్ తీసుకోకుండా పడుకో……. !! 7 కి ఆషి కి నేను మెడిసిన్ ఇస్తాను ఒకే నా యూ ఆర్ లుకింగ్ సో రెస్ట్లెస్ యూ హ్యావ్ టు టెక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్…… !!
ఇంత ఎర్లీ గా అది కూడా ఒంటరిగా ఎందుకు వచ్చావ్ జోషి……. ?? నిన్ను నేను లేట్ గా రమ్మన్నాను కదా…… !!
నువ్వు అటు ఆఫీస్ వర్క్స్ ఇటు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇంత టైర్డ్ గా ఉంటే నేను అక్కడ మహల్ లో పీస్ఫుల్ గా ఎలా ఉండాలి…… ?? అందుకే నేను వేద 5 కే లేచి ఇలా వచ్చాం తను విక్కీ దగ్గరకు వెళ్ళింది నేను నిన్ను వెతుకుతూ వచ్చేసరికి స్లీప్ లో ఉన్నావ్…… !! నీ ఫేస్ చూశాను చాలా టైర్డ్ గా కనిపించింది అందుకే ఫుట్ మసాజ్ చేస్తున్నాను…….. !!
థాంక్ యూ….. !!
నో నీడ్….. !! పరాయి వాళ్లకు చెప్పినట్టు నాకు థాంక్స్ ఎం అక్కర్లేదు ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకుని పడుకో…… !!
మోహిత్ చిన్న స్మైల్ ఇచ్చి ఒకే బట్ ఆషి మెడిసిన్ మర్చిపోకు అని కళ్ళు మూసుకుంటూ ఉండగా……. !! మోహిత్ నీకో విషయం చెప్పాలి అదేంటంటే ప్రణవి కి ఏమైంది మేము హాస్పిటల్ కి వచ్చే ముందు చూసాం….. !! హాల్ లో పిచ్చి దానిలా కూర్చుంది మేము ఎంత పిలిచినా రెస్పాండ్ అవ్వలేదు తను చాలా డిఫరెంట్ గా కనిపించింది…. ??
ఆది రాత్రి ఇక్కడికి వచ్చింది అని జరిగింది మొత్తం చెప్పి వన్స్ ఆయుష్ బావా స్పృహ లోకి వచ్చాక……. !! ఆది మహల్ లో కూడా ఉండకుండా గెంటిచేస్తాను ఆ పాము మన మహల్ లో ఉంటే ఎప్పటికైనా ఆషి కి ప్రమాదమే…… !!
ఓహ్ మై గాడ్ ఇంత జరిగిందా ఎందుకైనా మంచిది మనం కేర్ఫుల్ గా ఉండాలి మోహిత్….. !! బై ది బై ఆషి కి ఆయుష్ గురించి నిజం తెలిసిపోయింది కదా తను ఎలా ఫీల్ అయింది….. !!
చాలా ఏడ్చింది బావ ను చూసి చచ్చిపోవాలి అనుకుంది బట్ ఏదోలా తనకు అర్థమయ్యేలా చెప్పాం……. !! ఆషి కూడా ఇప్పటి నుంచి తను త్వరగా క్యూర్ అయ్యి బావ ను చూసుకుంటాను అని స్ట్రాంగ్ గా చెప్పింది సో ఆ విషయం లో మనం భయపడాల్సిన అవసరం లేదు…… !!
టైం గాడ్ ఇక మనకు ఏ టెన్షన్స్ లేవు ఆషి, ఆయుష్ త్వరగా నార్మల్ అయిపోతే బావుండు….. !!
హ్మ్మ్…. !! అని జోషి తో మాట్లాడుతూనే మోహిత్ నిద్రలోకి జారుకుంటాడు….. !! మోహిత్ తల నిమురుతూ తనకు కాసేపు మసాజ్ చేసి ఆషి మెడిసిన్స్ టైం అవ్వగానే తనే ఆషి ను నిద్రలేపి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి మెడిసిన్స్ కూడా వేస్తుంది…… !!
వ….. వదిన నాకు చిన్న హెల్ప్ చేయవా ప్లీస్…….. !! స్లోగా మాట్లాడుతున్న ఆషి వాయిస్ విని తను చెప్పింది అర్థం చేసుకోవడానికి జోషి కి 4 మినిట్స్ పడుతుంది……. !! అదంతా కాదు ముందు నువ్వు ఈ కోకోనట్ వాటర్ తాగు చాలా వీక్ గా ఉన్నావ్ నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు ఆషి……. !!
ఆది కాదు వదిన నన్ను ఆయుష్ గా……
ముందు నువ్వు కోకోనట్ వాటర్ తాగు అని ఆషి పక్కనే కూర్చుని మెల్లగా ఆషి తో ఆ వాటర్ తాగించి బెడ్ మీద పడుకో పెడుతూ…… !! ఆషి చెయ్ పట్టుకుని లుక్ ఆషి జరిగింది మొత్తం నీకు తెలుసు కదా…….. !! ఇప్పటి నుండైనా ప్లీస్ కొంచెం కేర్ఫుల్ గా ఉండు ఇది నా కోసం కాదు నీతో ఆయుష్ ఫ్యూచర్ కోసం అడుగుతున్నా …… !!
యాస్ ఏ డాక్టర్ గా చెప్తున్నా ఆయుష్ డెఫినెట్ గా నార్మల్ అవుతాడు తన గురించి ఆలోచిస్తూ నువ్వు డల్ అయిపోతే దియా కి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు…… !! ఫ్యూ డేస్ గా దియా సరిగ్గా ఫుడ్ తినడం లేదు నిద్రపోవడం లేదు స్కూల్ కి వెళ్ళడం లేదు ఇదంతా నీ మీద ఉన్న దిగులు…… !! సో ప్లీస్ స్టే స్ట్రాంగ్ ఆషి అన్ని త్వరలో సెట్ అవుతాయి ఒకే నా….. !!
లేదు వదిన నేను ఇప్పటి నుంచి ఆయుష్ గారి గురించి ఒక్క డ్రాప్ కూడా ఎడవను….. !! ఆయన మీరు చెప్పినట్టు త్వరలో నార్మల్ అవుతారు అయ్యేలా నేను చూసుకుంటాను …… !! నేను ఉండగా ఆయుష్ గారికి ఎమ్ అవ్వదు వదిన ఆయన నన్ను, దియా ను చూడకుండా మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేరు అని చెప్తూ…… !! నన్ను ఆయన రూమ్ కి తీసుకు వెళ్ళు వదిన ప్లీస్ అని నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతున్న ఆషి వైపు చూస్తూ…… !! ఒకే ఏడవను అని ప్రామిస్ చేస్తే తీసుకుని వెళ్తాను అని ప్రామిస్ చేయించుకుని ఆషి ను ఆయుష్ రూమ్ కి తీసుకుని వెళ్తుంది……. !!