Login with OTP

అందాల రాక్షసి{2}-77

aashyatech

Author

జోషి ఆషి ను జాగ్రత్తగా ఆయుష్ ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది…… !! ఆషి కి ఆయుష్ ను అలా చూస్తుంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ అనిపిస్తున్నా తను వీక్ గా ఉంటే తను కూడా ఆయుష్ తో పాటే హాస్పిటల్ బెడ్ మీదే ఉండాలి…… !! తన ఫ్యామిలీ ఇప్పటికే ఇద్దరూ ఇలా హస్పిటలైస్డ్ అయినప్పటి నుండి ఎమోషనలీ చాలా డల్ అయిపోయారు సో ఇప్పుడు వర్మ ఫ్యామిలీ కి తన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్…… !! ఇలాంటి క్రూషియల్ టైం లో ఆషి తనే స్టాండ్ తీసుకుని తనను తాను స్ట్రాంగ్ గా మార్చుకుని……. !! తను త్వరగా నార్మల్ అయ్యి ఆయుష్ తో పాటు ఫ్యామిలీ ను కూడా చూసుకుంటూ ……… !! ఆయుష్ ఎంతో కష్టపడి టాప్ 1 లో నిలబెట్టిన వర్మ ఇండస్ట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆయుష్ నార్మల్ అయ్యే వరకూ తనే స్వయంగా చూసుకోవాలి అని బలంగా ఫిక్స్ అవుతుంది….. !!

అందుకే ఆయుష్ ను అలా చూస్తుంటే గుండెల్లో రంపం తో కోసినంత బాధగా ఉన్నా కంట్రోల్ చేసుకుంటూ ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది…… !! ఈ లోగా ఆయుష్ ను చూడ్డానికి అక్కడికి వచ్చిన డాక్టర్ ఆయుష్ తో పాటు అక్కడే ఉన్న ఆషి ను కూడా చెక్ చేసి……… !! మీరు ఎక్కువ సేపు ఇలా సిట్టింగ్ పొజిషన్ లో ఉండకూడదు ప్లీస్ టేక్ రెస్ట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు….. !!

ఆషి ఆయుష్ చేతికి తన రెండు చేతులతో పట్టుకుని ఆయుష్ గారు మీరు నా మాట వింటున్నారు కదా అంటూ……. !! మీరు నా గురించి దియా గురించి వర్రీ అవ్వకండి మేము బావున్నాం మిమ్మల్ని మీరు మరింత స్ట్రాంగ్ గా మార్చుకుని త్వరగా కళ్ళు తెరవండి ఆయుష్ గారు……. !! మీరు లేకుండా మా లైఫ్ ను ఇమాజిన్ కూడా చేసుకోలేక పోతున్నాం మీరు నార్మల్ అయ్యే వరకూ మన ఫ్యామిలీ ను నేను చూసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్……. !! ఆఖరిగా ఒక్క మాట ఐ మిస్ యూ 🥺 అండ్ ఐ లవ్ యు ఆయుష్ గారు…… !!

ఆషి కి ఆయుష్ అంటే ఎంత ప్రేమ ఉందో వణుకుతున్న తన గొంతు చెప్పడం తో ఆషి మాటలు వింటున్న ఆయుష్ గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటుంది…… !! మేడం ప్లీస్ మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి అని చెప్తున్న జూనియర్ డాక్టర్ వైపు చూస్తూ వదిన అన్నయ్య కి చెప్పి నాకు కూడా ఇక్కడే బెడ్ ఎరేంజ్ చేయించు……. !! అప్పటికే ఆషి కి బ్యాక్ పెయిన్ & స్టమక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది…… !!

ఒకే ఆషి అంటూ మోహిత్ కి కాల్ చేసి తను వచ్చాక ఆషి ను కూడా ఆయుష్ రూమ్ కే షిఫ్ట్ చేసి ఇద్దరినీ ఒకే రూమ్ లోనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు……. !! ఫ్యామిలీ మొత్తానికి ఒక రిలాక్సేషన్ ఏంటంటే ఆషి నిజాన్ని యాక్సెప్ట్ చేసి తన హెల్త్ మీద కేర్ తీసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ……. !! ఆయుష్ మీద తన ప్రేమను ఇలా చూపిస్తుంది అది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ కి కొంత లో కొంత ఆషి హెల్త్ లో వస్తున్న చేంజెస్ చూసి ధైర్యం వస్తుంది…… !!

 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨

 

రోజులు చాలా ఫాస్ట్ గా గడుస్తున్నాయి ఆషి వాళ్ళు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి అప్పటికే 20 డేస్ అవుతుంది…… !! అభి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి కాలేజ్ కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది మరో వైపు దియా కూడా……… !! ఆషి చెప్పడం వల్ల స్కూల్ కి వెళ్తూ అది అవ్వగానే ఆషి కోసం హాస్పిటల్ కి వచ్చి నైట్ కి మహల్ కి వెళ్ళిపోయేది…… !!

జోషి సర్జరీస్ కోసం & వేద తన వర్క్స్ కోసం వన్ మంత్ లండన్ కి వెళ్ళిపోతారు….. !! ఇన్ ఫాక్ట్ ఆషి బలవంతం మీద వెళ్ళడం ఇష్టం లేకపోయినా వన్ మంత్ లో వచ్చేస్తాం అని లండన్ ఫ్లయిట్ ఎక్కుతారు …… !! నిషాన్ తన ఆఫీస్ & ఆయుష్ ఆఫీస్ ను చూసుకుంటూ చాలా బిజీ అవుతాడు….. !! మరో వైపు మోహిత్, విక్రమ్ కూడా తమ ఆఫీస్ & ఆషి ఆఫీస్ వర్క్స్ చూసుకుంటూ ఎవ్రీ డే హాస్పిటల్ కి వచ్చి ఆషి, ఆయుష్ లను చూసి వెళ్తూ ఉంటారు….. !!

ఆషి కూడా ప్రెసెంట్ నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది ఎంతలా అంటే డాక్టర్ చెప్పిన 1 మంత్ కంటే 10 డేస్ ముందే పూర్తిగా నార్మల్ అయిపోతుంది…… !! తన హెల్త్ లో వచ్చిన చేంజెస్ కి డాక్టర్స్ కూడా షాక్ అవుతారు ఇంత ఫాస్ట్ గా రికవర్ అవుతారు అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అదంతా మెడికల్ మిరాకిల్ అనుకుంటున్నారు……… !! కానీ నిజానికి ఆయుష్ మీదున్న ప్రేమే ఆషి ను ఇంత త్వరగా నార్మల్ అయ్యేలా చేసింది ……. !!

ఆషి ముందే డాక్టర్స్ కి చెప్పడం తో ఆషి ను డిశ్చార్జ్ చేసే రోజే ఆయుష్ కి అన్ని టెస్ట్స్ చేసి ఒకే అనుకున్న తర్వాతే ఆయుష్ ను కూడా డిశ్చార్జ్ చేస్తారు…….. !! ఆయుష్ ను చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అని పదే పదే జాగ్రత్తలు చెప్పి మరీ ఆయుష్ డిశ్చార్జ్ కన్ఫర్మ్ చేస్తారు డాక్టర్స్……. !!

డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకుని ఆషి & ఆయుష్ లను తీసుకుని వర్మ మ్యాన్షన్ కి స్టార్ట్ అవుతారు మోహిత్ & నిషాన్…… !! వీల్ చైర్ లోకి ఆయుష్ ను షిఫ్ట్ చేశాక దాన్ని పుష్ చేసుకుంటూ వస్తున్న ఆషి ను గుమ్మం దగ్గరే ఆపేసి ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తుంది రాగిణి…… !!

దిష్టి తీసాక అందరినీ లోపలికి పిలిచి ఆ నీళ్లను బయట పడేయమని మెయిడ్ కి చెప్పి ఆషి ను ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది రాగిణి….. !! అత్తమ్మ కంట్రోల్ అంటూ రాగిణి వెన్ను నిమురుతూ ఐ ఆమ్ ఒకే ప్లీస్ ఏడవకండి అని చెప్పి రాగిణి కన్నీళ్ళు తుడుస్తుంది……. !!

నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఆషి ఇదిగో నువ్వు వచ్చాకే ఈ మహల్ మళ్ళీ ముందులా ఉంది…… !! నిన్ను అలా హస్పిటల్ బెడ్ మీద చూసి ఎంతలా ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు …… !!

అత్తమ్మ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండగా నాకు ఎం అవ్వదు నేను ఎలా నార్మల్ అయ్యానో ఆయుష్ గారు అలాగే అవుతారు ట్రస్ట్ మీ….. !! ఇంకో వన్ మంత్ లో ఆయుష్ గారు ముందులా మన అందరినీ కంటి చూపు తో కంగారు పుట్టించే వారు కదా అలా ముందులా తప్పకుండా చేస్తాను ప్రామిస్…… !!

రాగిణి తన కన్నీళ్ళు తుడుచుకుంటూ…… !! ఎటో చూస్తూ ప్రాణం లేని బొమ్మ లా కూర్చున్న ఆయుష్ ను గుండెలకు హత్తుకుని నిన్ను ఇలా చూడలేకపోతున్నా ఆయుష్ త్వరగా నార్మల్ అవ్వు నాన్న అని నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది…… !!

ఆషి సూర్యదేవ్ & కృష్ణదేవ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని కాసేపు తన పేరెంట్స్ అదే అనిత, ప్రభాకర్ లను హత్తుకుని అలాగే ఉండిపోతుంది……. !! తర్వాత సంధ్య, దిలీప్ లను కూడా హత్తుకుని తనను నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ నుంచున్న దియా ముందు నీస్ మీద కూర్చుని చేతులు రెండు చాపగానే……. !! మమ్మా అంటూ ఏడుస్తూ వచ్చి హగ్ చేసుకుంటుంది దియా మమ్మా 🥹 నువ్వు నార్మల్ అయిపోయావ్…… !! ఐ మిస్ యూ ఏ లాట్ మమ్మా & ఐ ఆమ్ బ్యాడ్లీ మిస్సింగ్ యువర్ హగ్ అంటూ ఆషి మెడ చుట్టూ చేతులు వేసి మొహానికి ముద్దులు పెడుతూ ఏడుస్తుంది…… !!

క్యూటీ మమ్మా అల్సో మిస్సింగ్ యూ 🥹 ఐ లవ్ యూ మోర్ అని దియా ను గుండెలకు హత్తుకుంటుంది…….. !! వాళ్ళను అలా చూసిన అందరూ కూడా కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ బాండింగ్ ను మురిపెంగా చూసుకుంటూ ఉంటారు…… !! కనకపోయినా ఆషి కి దియా మీదున్న ఆన్ కండిషనల్ లవ్ చూస్తే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి…… !! ఆషి దియా కోసం పెట్టిన ఎఫర్ట్స్ & దియా కి ఆషి మీదున్న ప్రేమ అందరికీ చాలా నచ్చుతుంది…… !!

ఆయుష్ గురించి చాలా మంది నుండి తనో యారోగెంట్, బీస్ట్, శాడిస్ట్, మాన్స్టర్ ఇలా చాలా విన్నాడు ప్రభాకర్…… !! అలాంటి వ్యక్తి తో ఆషి ఎలా ఉంటుందో అని కూడా చాలా బయటపడ్డాడు బట్ ఆయుష్ గురించి పూర్తిగా తెలిశాక తన కూతురి అదృష్టం చూసి మురిసిపోయాడు …… !! అంతా బావుంది ఇక ఆషి జీవితం లో ఎలాంటి సమస్యలు లేవు అనుకున్న టైమ్ కి ఈ ఇన్సిడెంట్ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది…….. !!

ఆషి సిచ్చుయేషన్ & తన హెల్త్ కండీషన్ చూసి తను నార్మల్ అవ్వగలదా అని అనుకున్నాడు కానీ …….. !! అషి అన్ని పెయిన్స్ భరించి ఆయుష్ కోసం త్వరగానే నార్మల్ అయింది…… !! ఇప్పుడు ఆయుష్ ఒక్కటే కోమా లో నుండి బయటకు వస్తే చాలు ముందులా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది…….. !! అని వెనుక వస్తున్న అతిపెద్ద ప్రమాధం గురించి తెలియక ఆషి ను చూసి నవ్వుతూ ఉంటాడు……. !!

మమ్మా నాకు నీ చేత్తో ఏదైనా తినాలి అని ఉంది ప్లీస్ మమ్మా ఏదైనా కుక్ చేయవా…… !! దియా అలా అడిగేసరికి ఆషి కి చాలా బాదేస్తుంది ఎందుకంటే దియా తన మీదున్న బెంగతో సరిగ్గా ఫుడ్ తీసుకోక పోవడం వల్ల బాగా వెయిట్ లాస్ అయింది….. !! ఆషి చాలా కష్టం మీద హెల్తీ ఫుడ్ పెడుతూ దియా వెయిట్ పెంచింది కానీ ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి……. !! దియా ను హగ్ చేసుకుంటే ఏదో బొమ్మ ను హగ్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది…… !!

దియా అమ్మ ఇప్పుడే కదా వచ్చింది తనకు ఇప్పుడు రెస్ట్ అవసరం….. !! నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను…… !! ఇన్ని రోజులు ఆషి లేదని నువ్వు సరిగ్గా తినలేదు ఇప్పుడు అమ్మ వచ్చేసింది కదా ఇప్పుడు నువ్వు కడుపు నిండా తినాలి సరేనా……. !!

లేదు అత్తయ్య దియా కోసం నేనే కుక్ చేస్తాను దియా నే కాదు నేను కూడా దియా ను బాగా మిస్ అయ్యాను….. !! అంటూ క్యూటీ 15 మినిట్స్ ఫ్రెష్ అయి వస్తాను అని ఆయుష్ ను తీసుకుని లిఫ్ట్ లో తమ ఫ్లోర్ కి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది…… !! దాదాపు 1 మంత్ తర్వాత రూమ్ లోకి రావడం తో రూమ్ మొత్తాన్ని చూస్తూ…….. !! ఆయుష్ తో గడిపిన మెమోరీస్ గుర్తు చేసుకుంటూ కాసేపు ఎమోషనల్ అయినా అది కనిపించకుండా కవర్ చేసుకుంటూ…… !! బెడ్ మీద ఆయుష్ ను జాగ్రత్తగా పడుకో బెట్టి వాళ్లకు ప్రైవసీ ఇచ్చి మోహిత్, విక్రమ్ & నిషాన్ బయటకు వెళ్ళిపోతారు……. !!

ఆషి బెడ్ మీద కూర్చుని ఆయుష్ తల నిమురుతూ……. !! గుర్తుందా ఆయుష్ గారు మనకు ఈ రూమ్ లో ఎన్ని మెమోరీస్ ఉన్నాయో……. ?? ఒక సారి మీరు నాకు మొబైల్ గిఫ్ట్ చేసినపుడు ఆది ఈ రూమ్ లోనే మిస్ చేసుకుని మీతో తిట్లు కూడా తిన్నాను అని నవ్వుతూ నవ్వుతూ ఒక్క సారిగా ఏడ్చేస్తుంది……. !!

పైకి ఎంత గంభీరంగా ఉండడానికి ట్రై చేస్తున్నా మిమ్మల్ని ఇలా చూడ్డం నా వల్ల అవ్వట్లేదు ఆయుష్ గారు 🥹……. !! ప్లీస్ త్వరగా నార్మల్ అవ్వండి అని ఆయుష్ కి ముద్దు పెడుతూ కాసేపటికి కన్నీళ్ళు తుడుచుకుంటూ……….. !! డోర్ లాక్ చేసి ఆయుష్ కి వెట్ క్లాత్ తో బాడీ మొత్తం పసి పిల్లాడికి బాత్ చేయించినట్టు ……. !! క్లాత్ తో నీట్ గా తుడిచి డ్రెస్ చేంజ్ చేసాక తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది…….. !!

ఆయుష్ గారు మీరు రెస్ట్ తీసుకోండి నేను దియా కోసం ఏదైనా వేడి వేడిగా కుక్ చేస్తాను అని ఆయుష్ కి ఫోర్హెడ్ కిస్ పెడుతూ అక్కడి నుంచి కిందకు వెళుతుంది…… !!

ఆషి కిందకు వెళ్లి హాల్ లో కూర్చుని సంధ్య , రాగిణి లతో ముచ్చట్లు చెప్తున్న దియా ను ఎత్తుకుని కిచెన్ లోకి వెళ్ళి……. !! దియా ఫుడ్ తో పాటు అందరికీ స్వీట్ కూడా ప్యారలల్ గా ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది……. !!

చాలా డేస్ తర్వాత ఆషి చేతి ఫుడ్ తిన్న దియా హాయిగా ఆషి వడిలోనే నిద్రలోకి జారుకుంటుంది…. !! అది చూసిన ఆషి తనను జాగ్రత్తగా జో కొడుతూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వస్తుంది అభి…… !!

అక్కా అంటూ పరిగెడుతూ వస్తున్న అభి వైపు చూస్తూ……. !! హుష్ 🤫 అరవకే దియా డిస్టర్బ్ అవుతుంది అని దియా ను అలాగే ఎత్తుకుని జాగ్రత్తగా తన రూమ్ కి తీసుకుని వెళ్లి పడుకో పెడుతుంది…… !! వెనుకే వచ్చిన అభి నిముషం కూడా లేట్ చేయకుండా ఆషి ను హత్తుకుంటూ ఐ ఆమ్ సారీ అక్క నువ్వు వచ్చేసరికి నేను మహల్ లో లేను….. !!

ఇట్స్ ఒకే అభి నీకు ఎగ్జామ్ కదా ఇవాళ ఐ కెన్ అండర్ స్టాండ్ అని చిన్నగా చెప్పి దూరం జరుగుతూ……. !! ఎలా రాసావ్ ఎగ్జామ్ అని అడుగుతూ దియా కింద పడేసిన బొమ్మ లు తీస్తూ ఉంటుంది…… !!

బాగా రాసాను అక్క అవును బావ ఎక్కడ ఉన్నాడు….. ??

మా రూమ్ లో ఉన్నాడు…… !!

ఓహ్ అయితే ఒక సారి బావ ను చూసోస్తా అక్క అంటూ అభి ఆయుష్ ఉన్న రూమ్ వైపు వెళ్తే…… !! ఆషి దియా రూమ్ ను సర్దుతూ బిజీగా ఉంటుంది……. !!

బావ ను చూసి ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు ఎలాగో అందరూ కిందే ఉన్నారు కాబట్టి ఎవరు చూడకుండా……. !! వెళ్ళి బావ ను చూస్తే బెటర్ అనుకుంటూ ప్రణవి మెల్లగా ఆయుష్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళుతుంది…… !!

బెడ్ మీద పడుకున్న ఆయుష్ ను చూసి ప్రణవి బాధగా చూస్తూ వెళ్ళి బావా అంటూ వెళ్ళి ఆయుష్ ను హగ్ చేసుకుంటుంది……. !! నిన్ను చూసి ఎన్నో మంత్స్ అయినట్టు ఉంది బావా ప్లీస్ ఒక్క సారి కళ్ళు తెరువు అని ఆయుష్ మొహం వైపు చూస్తూ…… !! నువ్వు నార్మల్ గా ఉన్నపుడు ఎలాగూ ముద్దు పెట్టుకోలేను కనీసం ఇప్పుడైనా నిన్ను కిస్ చేయాలని ఉంది బావా……. !! నిన్ను లైఫ్ లో ఒక్క సారైనా కిస్ చేయాలి అనుకున్నా ఆ ఛాన్స్ ఇపుడు వచ్చింది ఐ ఆమ్ సారి బావా అంటూ……. !! ఆయుష్ లిప్స్ వైపు చూస్తూ తన లిప్స్ ను ఆయుష్ లిప్స్ దగ్గరకు తీసుకుని వెళ్తూ ఆల్మోస్ట్ ఇద్దరి పెదాలు కలుసుకుంటాయి అనగా……. !! సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది అభి…… ??

అభి ఇప్పుడు ప్రణవి ను ఎమ్ చేస్తుంది అంటారు 😌…… ??