Login with OTP

అందాల రాక్షసి{2}-78

aashyatech

Author

నిన్ను లైఫ్ లో ఒక్క సారైనా కిస్ చేయాలి అనుకున్నా  బావా ఆ ఛాన్స్ నాకు ఇపుడు వచ్చింది ఐ ఆమ్ సారి బావా అంటూ……. !! ఆయుష్ లిప్స్ వైపు చూస్తూ తన లిప్స్ ను ఆయుష్ లిప్స్ దగ్గరకు తీసుకుని వెళ్తూ …….. !! ఆల్మోస్ట్ ఇక ఇద్దరి పెదాలు కలుసుకుంటాయి అనగా……. !! సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది అభి…… ??

 

ప్రణవి చేస్తుంది చూసిన అభి కోపంగా ప్రణవి అని అరవగానే అభి వాయిస్ కి ప్రణవి షాక్ అవుతూ……. !! ఆయుష్ కి దూరంగా జరిగి అ…. అభి నువ్వా ఎప్పుడొచ్చావ్ అని అడుగుతున్న ప్రణవి జుట్టు పట్టుకుని లాగి బెడ్ మీద నుండి కిందకు లాగి పడేస్తుంది…….. !! ఫ్లోర్ మీద తన రెండు పళ్ళు అచ్చు పడ్డం తో నొప్పికి ఆ…. అమ్మా అని అరుస్తూ ఏయ్ పిచ్చా నీకు అని అడుగుతున్న ప్రణవి ను చూస్తుంటే……. !! అభి కి ఆవేశం కట్టలు తెంచుకుని వస్తుంది యూ అసలు నోరు తెరిచావో చంపేస్తానే నిన్ను అంటూ……. !! ప్రణవి కి రెండు చెంపలు చేతి గుర్తులు పడే దాకా నాన్ స్టాప్ గా కొడుతూ ఉంటుంది……. !!

 

కాసేపటికి చేతులు నొప్పి పుట్టడం తో ఆ…. అమ్మా అని అభి కొట్టడం ఆపి చేతులను విదిలించుకుంటూ ఉంటుంది…… !! ప్రణవి ఆ గ్యాప్ లో మెల్లగా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ ఉండగా అభి అది గమనించి ఎక్కడికి పారిపోతావే నువ్వు అని ప్రణవి చెయ్ పట్టుకుని ఈడ్చుకుంటూ …… !! మహల్ లో ఉన్న అందరినీ పేరు పెట్టి పిలుస్తూ అందరు హాల్ లోకి వచ్చేలా చేస్తుంది…… !!

దియా రూమ్ సర్దుతున్న ఆషి కి అభి వాయిస్ విని ఈ తిక్కల్ ది ఎందుకింత గట్టిగా అరుస్తోంది అని అభి అరుపులకు ఎక్కడ దియా నిద్ర లేస్తుందో అని కంగారు పడుతూ…..  !! దియా డిస్టర్బ్ అవ్వకుండా రూమ్ డోర్ లాక్ చేసి కిందకు వస్తూ…….. !! అప్పటికే అందరూ హాల్ లో ఉండడం చూసి ఏమైంది అనుకుంటూ తను కూడా హాల్ లోకి వచ్చి నుంచుంటుంది……. !!

బుగ్గలు వాచిపోయి కనిపిస్తున్న ప్రణవి ని పక్కనే కోపంగా pranavi వైపు చూస్తున్న అభి ను మార్చి మార్చి చూస్తూ…… !! అభి ఏమైంది రా ఎందుకంత కోపంగా ఉన్నావ్ అని అడుగుతాడు విక్రమ్…… !!

ఎమ్ చేసిందో నేను కాదు ఇదే చెప్తుంది అని ప్రణవి ను కోపంగా చూస్తూ…… !! చెప్పవే బావ రూమ్ లో ఎమ్ చేస్తున్నావో చెప్పు అంటూ ఇంకో చంప కూడా కోపంగా పగల కొడుతుంది అభి….. !!

అభి కొట్టిన ఫోర్స్ కి ఆ….. అమ్మా అంటూ వెళ్ళి కృష్ణదేవ్ కాళ్ళ దగ్గర పడుతుంది ప్రణవి…… !! అయ్యో ప్రణవి అంటూ కూతురిని అలా చూడలేని కృష్ణదేవ్ ప్రణవి ను జాగ్రత్తగా పైకి లేపి ఏమైంది ప్రణవి అభి ఎందుకు నిన్ను కొడుతుంది అని అడుగుతాడు….. !!

చాలా రోజుల తర్వాత కృష్ణదేవ్ తనతో మాట్లాడడం తో ప్రణవి ఏడుస్తూ…… !! డాడ్…. ఇ… ఇది నన్ను కావాలనే కొడుతుంది బావ ను చూడ్డానికి నాకు ఎవరు పర్మిషన్ ఇవ్వడం లేదు….. !! అందుకే బావ మహల్ కి వచ్చాడని తెలిసి తన రూమ్ కి చూడ్డానికి వెళ్ళాను అంతే …… !! నేను బావ ను చూడ్డానికి కానీ ముట్టుకోవడానికి కానీ వీల్లేదు అని అభి నన్ను కొట్టి ఇక్కడికి తీసుకుని వచ్చింది…… !! ఒక్కసారి బావ ను చూస్తాను అన్నా కూడా నన్ను చూడనివ్వలేదు డాడ్ ఆఖరికి కాళ్ళు కూడా పట్టుకున్నాను అంటూ కృష్ణదేవ్ గుండెల మీద తల వాల్చి ఏడుస్తుంది…… !!

అబ్బా ఇది మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది రా బాబు 🤦 అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకుంటున్న విక్రమ్ వాయిస్ కి ప్రణవి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది…… !! హ్మ్మ్ అయిపోయిందా నీ మహా నటి యాక్టింగ్ 1 రూపీ యాక్టింగ్ చేయమంటే 100 రుపీస్ చేస్తావేంటే నువ్వు…… ?? అయినా నీ గురించి ఇక్కడున్న అందరికీ ఒక ఐడియా ఉంది కానీ ఇక నీ యాక్టింగ్ బంద్ చేసి అసలు జరిగిన మ్యాటర్ ఏంటో చెప్పు…..  !! అభి మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అక్కడేదో చెయ్యకూడనిది ఏదో చేసే ఉంటావ్…… !!

స్టాప్ ఇట్ మోహిత్ ఇంకొక్క మాట నా కూతురి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను చెప్తున్నా…….. !! ప్రణవి నా కూతురు ఈ మహల్ కి పని మనిషి కాదు తనకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బావుంటుంది అంటున్న కృష్ణదేవ్ వాయిస్ కి అందరూ షాక్ అయితే…….. !! ప్రణవి మాత్రం కన్నింగ్ గా నవ్వుకుంటూ మొహాన్ని గర్వంగా పెట్టుకుని మోహిత్ వైపు చూస్తుంది…… !!

బాబాయ్ తన గురించి తెలిసి కూడా మీరు ప్రణవి ను సపోర్ట్ చేస్తూ అన్నయ్య ను అంటున్నారా……. ??? తను ఎన్ని చేసిందో మీకు మాత్రం తెలియదా అన్ని తెలిసి కూడా మళ్ళీ ప్రణవి సైడ్ తీసుకుని మాట్లాడడం నిజంగా నాకు నచ్చలేదు…… !!

ఆషి ప్రణవి ఎమ్ చేసినా ఆయుష్ కోసం & తన ప్రేమ కోసమే చేసింది….. !! నేను దాన్ని సమర్థించడం లేదు ప్రణవి చేసింది చాలా తప్పు ఐ అగ్రీ దట్….. !! కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని నీ చెల్లి కనీసం ఆయుష్ ను చూడ్డానికి కూడా వీల్లేదు అని చెప్పడం ఎంత వరకూ కరెక్ట్……!! తనకు మాత్రం ఆయుష్ కి ఇలా అయినందుకు బాధగా ఉండదా ఒక్క సారి చూడనిస్తే ఎమ్ అవుతుంది….. ?? ఆయుష్ ను చూస్తే ప్రణవి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా…… !!

చూడండి బాబాయ్ మీకు మీ కూతురి మీద ప్రేమ ఉండచ్చు బట్ జరిగింది తెలుసుకోకుండా మాట్లాడకండి అసలు రూమ్ లో ఎమ్ జరిగిందో తెలుసా…… !! అక్కడ జరిగింది తెలిస్తే నేను కొట్టి వదిలేశాను అదే మీరైతే నిలువునా చంపేస్తారు…… !!

అంతా తప్పు నా కూతురు ఎమ్ చేసింది అభి చెప్పు నేను కూడా వింటాను….. !!

అమ్మో ఇప్పుడు ఇది రూమ్ లో జరిగింది చెప్తే డాడ్ కచ్చితంగా చంపేస్తాడు అనుకుంటూ…… !! ప్రణవి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ కింద పడిపోతుంది…… !!

ప్రణవి ను అలా చూసిన కృష్ణదేవ్ ప్రణవి….. ప్రణవి అమ్మా ప్రణవి కళ్ళు తెరువు అని పిలుస్తున్నా ప్రణవి నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు…… !! ప్రణవి ను అలా చూసి ఒక్కరు కూడా చలించరు ఒక్క కృష్ణదేవ్ తప్పా నిషాన్ కి కృష్ణదేవ్ ను అలా చూసి వెళ్ళాలి అనున్నా మోహిత్ తన చెయ్ పట్టుకుని ఆపేస్తాడు….. !!

విక్కీ కొంచెం హెల్ప్ చేయ్ ప్రణవి కళ్ళు తెరవడం లేదు అని చెప్తున్న క్రిష్ణదేవ్ ను చూసి…… !! విక్రమ్ ఇంచ్ కూడా కదలడు అది చూసిన కృష్ణదేవ్ ఓహ్ మీ అందరికీ ఇప్పుడు నా కూతురు శత్రువు కదా ఆ విషయం మర్చిపోయి నిన్ను అడిగి ఇబ్బంది పెట్టినందుకు సారీ విక్రమ్ అంటూ…… !! ప్రణవి ను లిఫ్ట్ చేయబోయి కింద పడతాడు అది చూసిన విక్రమ్……!! అయ్యో మావయ్య ప్లీస్ ఆగండి అని కృష్ణదేవ్ ను అలా చూడలేక…… !! ప్రణవి ను టచ్ చేయడం కూడా ఇష్టం లేకపోయినా కృష్ణదేవ్ కోసం ప్రణవి ను రెండు చేతులతో లిఫ్ట్ చేస్తాడు…… !!

విక్రమ్ ను చూడ్డానికి తనకు ఉన్న వర్క్స్ 1వీక్ పోస్ట్ పోన్ చేసుకుని అక్కడికి వచ్చిన వేద సర్ప్రైజ్ అంటూ అక్కడికి వచ్చి…… !! విక్రమ్ ప్రణవి ను ఎత్తుకుని వెళ్లడం చూసి గుమ్మం లోనే ఆగిపోతుంది….. !! అప్పటికే విక్రమ్, కృష్ణదేవ్ ప్రణవి ను తీసుకుని లిఫ్ట్ లో ఉండడం తో వీళ్ళకు వేద వాయిస్ వినిపించదు…. !! కానీ హాల్ లో ఉన్న అందరూ అక్కడ వేద ను చూసి షాక్ అవుతూ వేద వైపు చూస్తూ ……… !! వేద నువ్వా ఏంటి అక్కడే ఆగిపోయావ్ లోపలికి రా అని ఇన్వైట్ చేస్తాడు మోహిత్…… !!

ఎమ్ జరుగుతుంది మోహిత్….. ?? విక్కీ దాన్ని ఎత్తుకోవడం ఏంటి అసలు ఎలా ఎత్తుకుంటాడు దాన్ని అంటూ కోపంగా అరుస్తున్న వేద ను చూసి……. !! నీ కోపం నాకు అర్థం అయింది ముందు ఇక్కడి నుండి పదా నీకు అన్ని క్లియర్ గా చెప్తాను అని ఆషి, నిషాన్ & అభి లను తీసుకుని తన రూమ్ కి వెళతాడు మోహిత్…… !!

✨✨✨✨✨✨✨✨✨

 

ప్రణవి ను బెడ్ మీద విసిరినట్టే పడేసి వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ……. !! విక్కి చాలా కంగారుగా ఉంది ప్లీస్ డాక్టర్ కి కాల్ చేసాను ఆయన వచ్చే వరకు ఉండవా అని అడుగుతున్న కృష్ణదేవ్ వైపు చూస్తూ…… !! మావయ్య నేను మీ కో….. అంటూ ఉండగా డాక్టర్ రావడం చూసి విక్రమ్ సైలెంట్ అవుతాడు……. !!

డాక్టర్ ప్రణవి ను చెక్ చేసి దేనికో స్ట్రెస్ ఫీల్ అయినట్టు ఉంది ఈ మెడిసిన్స్ యూస్ చేయండి అని చెప్పి వెళ్లగానే….. !! థాంక్ యూ విక్రమ్ అంటున్న కృష్ణదేవ్ వైపు చూసి అక్కడి నుండి విసురుగా తన రూమ్ కి వెళ్ళిపోతాడు విక్రమ్….. !!

కాసేపటికి స్పృహలోకి వచ్చిన ప్రణవి అప్పుడే స్పృహ లోకి వచ్చినట్టు యాక్ట్ చేస్తూ…… !! తల పట్టుకుని చుట్టూ చూస్తూ పైకి లేచి కూర్చుంటుంది అది చూసిన కృష్ణదేవ్ ప్రణవి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు…… !!

హ్మ్మ్ ఐ ఆమ్ ఒకే డాడ్ కొంచెం తల నొప్పిగా ఉంది…… !!

నువ్వు దీని గురించి ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకు ప్రణవి……. !! అన్ని త్వరలోనే సెట్ అవుతాయి ఇప్పటి నుంచి అయినా నా మాట విని ఆయుష్ ను మర్చిపో ప్రణవి…… !! నువ్వు కూడా అందరిలా పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండాలి అని ఈ తండ్రి ఆశ పడుతున్నాడు…… !! మరి నా కోరిక తీరుస్తావా…… ??

 

ఉఫ్ 🤦 మళ్ళీ ఈ పెళ్ళి అనే గోల స్టార్ట్ చేసాడా అని విసుక్కుంటూ…… !! లేదు ఇప్పుడు నేను వద్దు అని చెప్తే నాకు ఉన్న ఒకే ఒక్క సపోర్ట్ కూడా మిస్ అయిపోతుంది…… !! నాకు ఇప్పుడు డాడ్ సపోర్ట్ చాలా అవసరం డాడ్ నా వైపు ఉంటేనే నేను వీళ్ళను ఒక ఆట ఆడుకోగలను …… !!

ప్రణవి చెప్పమ్మా ఆయుష్ ను మర్చిపోయి పెళ్ళి చేసుకుంటావా …… ??

డాడ్ ఆయుష్ బావ ఎప్పుడైతే నన్ను అందరి ముందు కొట్టి మహల్ లో ఎవరితో నేను మాట్లాడకూడదు ……. !! అని చెప్పాడో అప్పుడే నేను పూర్తిగా ఆయుష్ బావ ను మర్చిపోయాను……. !! ఇప్పుడు కూడా బావ ను చూడాలి అని తన రూమ్ కి వెళ్ళాను కానీ ఇంకో ఇంటెన్షన్ తో కాదు నన్ను నమ్మండి……. !!

ఏడవకు ప్రణవి చూడు నేను నిన్ను నమ్ముతున్నా ఎవరు నమ్మినా నమ్మక పోయినా నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది…… !! నువ్వు ఇక ఆ విషయం మర్చిపోయి ప్రశాంతంగా పడుకో ఒకే అంటూ ప్రణవి ను జాగ్రత్తగా బెడ్ మీద పడుకో బెట్టి ఆనందంగా బయటకు వెళతాడు కృష్ణదేవ్…… !! వెళ్తున్న తన ఫాదర్ ను చూసి నవ్వుతూ పిచ్చి డాడ్ నేను బావ ను మర్చిపోవాలి అంటే అది ఈ గొంతు లో ప్రాణం పోయిన తర్వాతే అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది……. !!

💫💫💫💫💫💫💫💫

వేద మోహిత్ వైపు చూస్తూ ఎక్కడ నీ ఫ్రెండ్ అర్జంట్ గా తనను ఇక్కడికి రమ్మను….. !! ప్రణవి అంత చేసినా ఇంకా తన మీద సాఫ్ట్ కార్నర్ పోలేదా అందరి ముందు అలా ఎలా ఎత్తుకుంటాడు అని అరుస్తూ ఉండగానే అక్కడికి వస్తాడు విక్రమ్…… !!

వేద ను చూసి విక్రమ్ నవ్వుతూ హగ్ చేసుకోవడానికి ముందుకు వస్తుంటే వేద కోపంగా వెనక్కు జరుగుతూ ……. !! దాన్ని టచ్ చేసిన చేతులతో నన్ను టచ్ చేయకు విక్కీ అయినా దాన్ని మర్చిపోయాను అని చెప్పి ఇప్పుడు దాన్ని ఎందుకు ఎత్తుకున్నావ్…… ?? దట్ మీన్స్ నువ్వు ఇంకా ఆ స్టుపిడ్ ను మర్చిపోలేదా……… ??

వేద అని సీరియస్ గా చూస్తూ…… !! అసలేం జరిగిందో తెలుసా అంటూ జరిగింది మొత్తం చెప్పి మావయ్య కోసం దాన్ని ఎత్తుకున్నా తప్పా కావాలని కాదు…… !! రూమ్ లో బెడ్ మీద పడేసి ఇలా వస్తున్నా అంతే ఇంతకు మించి ఇంకేం జరగలేదు…… !!!

విక్రమ్ మాటలకు వేద తల పట్టుకుని సారి చెప్పి…….. !! అయినా అభి దాన్ని ఎందుకు కొట్టావ్ అసలు రూమ్ లో ఏం జరిగింది అనగానే అందరూ కూడా అవును ఎమ్ జరిగింది అన్నట్టు చూస్తారు……. !!

ఇప్పుడు అభి జరిగింది చెప్పాక వీళ్ళ రియాక్షన్ ఏంటి…. ?? ప్రణవి మళ్ళీ కొత్త ప్లాన్స్ వేయనుందా…… ?? వేద విక్రమ్ మధ్యలోకి ప్రణవి రానుందా…… ?? విప్లవ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి….. ??