Login with OTP

అందాల రాక్షసి{2}-79

aashyatech

Author

అభి అసలు ఆయుష్ రూమ్ లో ఎమ్ జరిగింది నువ్వు ప్రణవి ను లాక్కొచ్చి మరీ హాల్ లో అందరీ ముందు ఎందుకలా కొట్టావ్…… ?? ఇప్పుడు కూడా కోపంగా కూర్చున్నావ్ తప్పా అసలు రూమ్ లో ఎమ్ జరిగిందో చెప్పడానికి ట్రై చేయడం లేదు…… !! నువ్వు జరిగింది చెప్తేనే కదా తెలుస్తుంది మాట్లాడు అభి అసలేం జరిగింది……. !!

వదిన చెప్తుంది నిజం అభి నువ్విలా కామ్ గా కూర్చుంటే అక్కడ నీదే మిస్టేక్ ఉంది అని బాబాయ్ మాత్రనే కాదు అత్తమ్మ, మావయ్య కూడా అనుకుంటారు……. !! అని అంటున్న ఆషి వైపు చూస్తూ నేను చెప్పాలి అని అనుకుంటున్నా నాకు అక్కడ ఎవరు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అక్క……. !! తీరా నేను నిజం చెప్పాలి అని అనుకున్నపుడు ఆ స్టుపిడ్ ప్రణవి కళ్ళు తిరిగి పడిపోయింది….. !! నాకు తెలిసి అది కావాలనే నేను నోరు తెరవకూడదు అని ఎలా యాక్ట్ చేసింది…… !!

ప్చ్ సరే జరిగింది ఏదో జారిపోయింది కానీ మా రూమ్ లో ఎమ్ జరిగిందో చెప్పు ఆయుష్ గారిని చూసోస్తా అని వెళ్ళి దానితో గొడవ ఎందుకు పడ్డావ్…… ??

అక్కా నేను కావాలని దాన్ని కొట్టలేదు అసలు అది రూమ్ లో ఎమ్ చేయబోయిందో తెలిస్తే……. ?? నేను కాబట్టి కొట్టి ఊరుకున్నా అదే నువ్వైతే అక్కడి నుండి కిందకు తోసి చంపేసే దానివి…… !! అసలు ఆది ఎంత చీప్ గా బిహేవ్ చేసిందో తెలుసా నేను రూమ్ లోకి వెళ్ళడం క్షణం లేట్ అయినా చీ…… !! దాని గురించి చెప్పాలి అంటేనే చిరాగ్గా & అసహ్యంగా ఉంది……. !! అంటూ నిషాన్, మోహిత్ & విక్రమ్ ల ముందు చెప్పలేక వెళ్ళి కోపంగా కౌచ్ లో కూర్చుంటుంది…… !!

అభి ఇబ్బందిని గమనించిన ముగ్గురు అబ్బాయిలు ఒకరిని ఒకరు చూసుకుంటారు…… !! ఆషి చిన్న వర్క్ ఉంది అని ఆషి కి సైగ చేసి ముగ్గురు బయటకు వెళ్లగానే వేద డోర్ లాక్ చేసి అభి పక్కన కూర్చుంటూ……. !! ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది అంటున్న వేద ను హత్తుకుంటూ నేను నిజంగా కావాలని కొట్టలేదు అని బాధగా చెప్తున్న అభి తల నిమురుతూ……. !! అరే నా చోట బాంబ్ నువ్వు బ్రేవ్ గర్ల్ కదా ఇలా ఏడవచ్చా అది కూడా అలాంటి దాని గురించి ఇట్స్ టూ బ్యాడ్ అభి …….. !! యూ నో యూ ఆర్ మై క్యూట్ బచ్చా వి కదా డోంట్ క్రై అని అభి కళ్ళు తుడుస్తూ వాటర్ తాగించి అభి వైపు చూస్తుంది……. !!

అభి ఇద్దరి వైపు చూస్తూ నేను బావ ను చూడడానికి తన రూమ్ కి వెళ్ళేసరికి ఆ ప్రణవి బావ పక్కన పడుకుని బావ ను కిస్ చేయపోతూ కనిపించింది…….. !! బావ కోమా లో ఉన్నాడని చాన్స్ తీసుకుని బావ ను కిస్ చేయాలి అని చూసింది ఆ ఇడియట్ ఆది చూసి కూడా నార్మల్ గా నేను ఉండలేక పోయాను….. !!

అసలు దాని ప్లాన్ ఏంటి బావ తో కిస్ పెడుతూ పిక్ తీసుకోవాలి అనుకుందా లేక అంతకు మించి ప్లాన్ చేసిందా…… ?? వాట్ ఎవర్ తన ఇంటెన్షన్ ఏదైనా అవ్వచ్చు బట్ దాన్ని అలా చూసాక నేను నా యాంగర్ ను కంట్రోల్ చేసుకోలేక పోయాను…… !! ఆడపిల్ల అని కూడా మర్చిపోయి ఆది చాలా చీప్ గా బిహేవ్ చేసింది అందుకే కొట్టాను….. !! ఇప్పుడు చెప్పు అక్క నేను చేసింది తప్పా దానికే బాబాయ్ గారు నన్ను పరాయి మనిషి లా ట్రీట్ చేస్తూ మాట్లాడాలా……. ??

అభి అంటూ ఏడుస్తున్న తనను దగ్గరకు తీసుకుని చూడు ఆయన కి ప్రణవి ఓన్లీ డాటర్ & ప్రణవి అచ్చు బాబాయ్ వైఫ్ లాగే ఉంటుందట…… !! సో అందుకే బాబాయ్ గారు అలా మాట్లాడారు ఆది దాని మీదున్న పిచ్చి ప్రేమే కానీ నీ మీదున్న కోపం కాదు….. !! అత్తమ్మ, మావయ్య నిన్ను ఏదైనా అంటే నువ్వు ఇలా బాధ పడాలి కానీ బాబాయ్ మాటలకు ఎడవడం ఏంటి…… ??

వదిన చెప్పినట్టు నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి కాబట్టి ఇలా ఏడవకు….. !! చెప్పావ్ కదా ఇక నుండి దాన్ని ఆయుష్ గారి సరౌండింగ్స్ వైపు కూడా చూడనివ్వను పదా దియా రూమ్ కి వెళ్దాం…… !! తను ఈ పాటికి లేచే ఉంటుంది మళ్ళీ నేను కనిపించక పోతే ఏడుస్తుంది అని అభి ను తీసుకుని దియా రూమ్ కి వెళ్తుంది…… !!

వాళ్ళు వెళ్లగానే మొబైల్ చెవి దగ్గర పెట్టుకున్న వేద విన్నారు కదా ఆ ప్రణవి ఎమ్ చేయబోయిందో …… !! మహల్ లో ఇంత మంది ఉండడం కాదు దాని మీద ఒక కన్ను వేసి అది ఎమ్ చేస్తుందో ఏంటో కూడా చూడాలి…….. !! అంటూ కోపంగా కాల్ కట్ చేసి ప్రణవి రూమ్ వైపు వెళ్తుంది……. !!

✨✨✨✨✨✨✨✨✨✨

 

ప్రణవి ఇలా చేస్తుంది అనుకోలేదు బావ అయినా దానికి అన్నయ్య అంటే అంత పిచ్చి ఏంటీ…… ?? అన్నయ్య ఉన్న పొజిషన్ ఏంటీ ఆది చేయబోయిన పని ఏంటీ ఛా….. !! ఇమాజిన్ చేసుకుంటేనే చిరాగ్గా ఉంది దీనికి అన్నయ్య ఇచ్చిన పనిష్మెంట్ చాలా చిన్నది అని ఇప్పుడు అనిపిస్తుంది…… !!

వన్స్ ఆయుష్ కోమా నుండి బయటకు రానివ్వు నిష్….. !! అప్పుడు చెప్తాను దీని సంగతి అరే ఇది ఎన్ని తప్పులు చేసినా ఫర్గివ్ చేసే ఓపిక మీ మావయ్య కి ఉందేమో కానీ నాకు మాత్రం లేదు….. !! పైగా బావ కూడా ప్రణవి ఇంకొక్క మిస్టేక్ చేసినా మహల్ నుండి గెంటేస్తానని ఆ రోజే గట్టిగా చెప్పాడు…… !! సో దీనికి రోజులు దగ్గర పడ్డాయి ఎన్ని రోజులు ఎగురుతుందో ఎగరనివ్వు ఆయుష్ నార్మల్ అవ్వడం దీని రెక్కలు విరిచి డొక్క చించి బయటకు విసురుతాడు…… !!

అరే పాపం మోహిత్ మావయ్య ప్రణవి ను మళ్ళీ గుడ్డిగా నమ్ముతున్నాడు …… !! చూసావ్ కదా ఆది కింద పడిపోగానే ఎంత టెన్షన్ పడ్డాడో ఇది మళ్ళీ యాక్టింగ్ చేస్తుందని తెలిస్తే అసలు ఆయన తట్టుకోగలడా……. ??

హు అలాంటి కూతురిని కన్నందుకు & ఇంత జరిగినా సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకు జరగాల్సిందే…….. !! ఆయన ఫీల్ అవుతున్నాడు అనో ఇంకేదో అనుకుంటున్నాడు అనో దాని దగ్గరకు వెళ్ళడం కానీ చేశావో వేద పైకి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు……  !! నీ కోసం డ్రమ్, కుక్కర్ ఏదైనా ఓన్లైన్ లో ఆర్డర్ పెట్టచ్చు ఎందుకైనా మంచిది……. !!  కొంచెం జాగ్రత్తగా ఉండు అని బుజం తడుతూ అక్కడి నుండి బయటకు వెళ్తాడు మోహిత్….    !!

బావ చెప్పింది నిజం బ్రో నువ్వు ప్రణవి కి దూరంగా ఉంటేనే వేద వదిన కి దగ్గరగా ఉంటావ్…… !!

అందరూ నాకు సలహాలు ఇచ్చే వాళ్లే హు 😏 అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకుంటాడు విక్రమ్….. !!

 

💫💫💫💫💫💫💫💫💫💫

 

ఏమైందండీ ఎందుకలా ఉన్నారు …….. ??

ఆయుష్ మహల్ లో ఉన్నంత వరకూ అందరూ చాలా మంచిగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ బుద్దిగా ఉన్నారు రాగిణి……. !! కానీ ఆయుష్ కోమా లోకి వెళ్లినప్పటి నుండి ఎవరికి ఇష్టానికి వాళ్లు బిహేవ్ చేస్తున్నారు……. !! మన మహల్ ముందులా ఉండాలంటే అది ఆయుష్ వల్లే అవుతుంది……. !!

 

మీ బాధ నేను అర్థం చేసుకోగలను అండి అన్నీ అవే సర్దుకుంటాయి మీరు అనవసరంగా ఆలోచించకండి …….. !!

నాకు బావ బిహేవియర్ ఇవాళ ఏమాత్రం నచ్చలేదు…… !! ప్రణవి     గురించి తెలిసి కూడా తన వైపు స్టాండ్ తీసుకుని అభి ది తప్పు అన్నట్టు మాట్లాడాడు…… !! ఇది నేను అప్పుడే చెప్పాలి అనుకున్నాను కాని బావ మరింత కోపం తెచ్చుకుంటాడు అని ఆగిపోయాను…… !!

నిజమే అండి అన్నయ్య నుండి నేను కూడా ఈ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయలేదు…… !! ఇదంతా ఆయుష్ లేడు అన్న ధైర్యం తోనే మాట్లాడాడు ఎందుకంటే ఆయుష్ ముందు మాట్లాడే సాహసం అన్నయ్య చేయడు & చేయలేడు…… !!

హ్మ్మ్ చూద్దాం ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ ఇద్దరూ నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు…… !!

 

💢💢💢💢💢💢💢💢💢💢💢

ఇప్పుడేం చేయాలి ఎమ్ చేసి వీళ్ళ మధ్య గొడవ పెట్టాలి…… ?? మోహిత్, విక్రమ్ లకు ఎలా అయినా గొడవ పెట్టి ఇద్దరూ గొడవ పడి కొట్టుకునేలా చేసి ఇక్కడి నుండి వెళ్లేలా చేయాలి కానీ ఎలా……. ?? ఇద్దరూ దోస్త్ మేరా దోస్త్ తూహే మేరీ జాన్ అంటూ మొగుడు పెళ్లాళ్ళ అతుక్కుని తిరుగుతారు……. !! అలాంటి వీళ్ళ మధ్య గొడవ పెట్టడం అంటే నాట్ ఎట్ ఆల్ ఈసీ బట్ కష్టం అయితే కాదు …….. !!

ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్న ప్రణవి ను డిస్టర్బ్ చేస్తూ….. !! కోపంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది వేద తనను చూసిన ప్రణవి ఇదెప్పుడు వచ్చింది అనుకుంటూ తన వైపు చూస్తుంది…… !!

కళ్ళు తిరిగి పడిపోయావ్ అంట ఎలా ఉంది ప్రణవి……. ?? అని కన్సర్న్ గా అడుగుతున్న వేద ను చూసి ఇది నేను నిజంగా పడిపోయాను అనుకుంటుందా అని నవ్వుకుని……. !! యాహ్ ఐ ఆమ్ ఒకే నువ్వు ఎపుడు వచ్చావ్ అయినా నువ్వు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నావా ఇట్స్ ర్యాలీ షాకింగ్……. !!

అదేంటి ప్రణవి నువ్వు ఎంత కాదు అనుకున్నా ఈ ఇంటి ఆడపిల్లవి కదా…… !! అలాంటప్పుడు నీ మీద ఈ మాత్రం కన్సర్న్ ఉండడం కామన్ కదా…… !! ఒక సారి లేచి నుంచోవా నేను ఇండియా కి వస్తూ అందరికీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను ……. !! వాళ్ళతో పాటు నీకు తెచ్చాను ప్లీస్ నో అనకుండా తీసుకో……. !!

నాకు గిఫ్ట్ తెచ్చావా…… ?? ఏంటిది ఆది నా రేంజ్ కి తగ్గట్టు ఉంటేనే నేను తీసుకుంటాను అని పొగరుగా చెప్తూ…… !! నీ హ్యాండ్స్ లో ఎమ్ కనిపించడం లేదు మరి గిఫ్ట్ ఎక్కడ……. ??

అయ్యో నీ రేంజ్ కి తగ్గట్టే తెచ్చాను నువ్వు లేచి నుంచుంటే నీ గిఫ్ట్ నీకు ఇచ్చేస్తా…… !!

హ్మ్మ్ ఒకే అంటూ లేచి నుంచున్న ప్రణవి దవడ పళ్ళు ఊడేలా కొడుతుంది వేద…… !!

హేయ్ యూ వాన పాము లాంటి నువ్వు నా మీద చెయ్ చేసుకుంటావా ఎంత ధైర్యమే నీకు…… ??

నేను వాన పాము అవునో కాదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నాగు పాము వేనే……. !! మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఏం చేయాలి అనుకుంటున్నావ్……. ?? అసలేం క్యారెక్టర్ నే నీది నువ్వంటే ఇష్టం లేదు అని అంటున్నా ఆయుష్ వెంట పడుతున్నావ్ ……. !! ఆగలేక పోతే పెళ్ళి చేసుకుని పిల్లల్ని కను అంతే కానీ పెళ్ళి చేసుకున్న వాడిని కోరుకున్న నిన్ను ఏమంటారో తెలుసా……. !!

వేద 😬😬 !!

ఏయ్ హుష్ 🤫 🤫 అరవకు నీకంటే గట్టిగా అరవగలను…….. !! ఇంకోసారి ఆయుష్ వైపు కానీ విక్కీ వైపు కానీ చూశావో గుడ్లు పీకేస్తా మోహిత్ విషయం లో నీ గురించి నాకు ఆ భయం లేదు ఎందుకంటే తను నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు…… !!

 

మళ్ళీ చెప్తున్నా అనవసరంగా మహల్ లో లేని పోనీ గొడవలు పెడితే మాత్రం కంట్లో కారం పొడి కొడతాను జాగ్రత్త…… !! విక్కీ మీద నీ చూపు కూడా పడ్డం నాకు ఇష్టం లేదు హి ఈజ్ మైన్ అర్థం అవుతుందా…… !! నువ్వు ఈ మహల్ లో ఉండే రోజులు కౌంట్ చేసుకుంటూ ఉండవే…….. !! నీ కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని విసురుగా ప్రణవి ను బెడ్ మీద కు నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద…….. !!

ప్రణవి వెళుతున్న వేద వైపు పళ్ళు నూరుతూ చూస్తూ……. !! అనవసరంగా నన్ను రెచ్చ కొట్టావే ఇప్పటి వరకూ విక్రమ్ & మోహిత్ లను ఎలా విడగొట్టాలి అని ఆలోచించాను……. !! కానీ ఇప్పుడు చెప్తున్నా జస్ట్ ఫ్యూ డేస్ లో నిన్ను విక్రమ్ ను విడ కొట్టి నీకు నేనేంటో తెలిసేలా చేస్తాను ……. !! అని కృష్ణదేవ్ వాయిస్ విన్న ప్రణవి తన మొబైల్ లో కావాలనే విక్రమ్ ఫొటో వైపు చూస్తూ……. !! అటు వైపు తిరిగి కూర్చుని రాని కన్నీళ్లను తుడుచుకుంటూ మిస్ యూ విక్రమ్ అంటూ తన ఫోటో ను కిస్ చేస్తూ ఉంటుంది……. !!!

అప్పుడే రూమ్ లోకి వచ్చిన కృష్ణదేవ్ ప్రణవి ను అలా చూసి ప్రణవి విక్రమ్ ను ఇష్టపడుతుందా …… ?? కానీ విక్రమ్ వేద ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాడు కదా ఇప్పుడెలా……. ?? ఒక సారి లవ్ లో ఫెయిల్ అయినందుకే ప్రణవి అందులో నుండి బయట పడడానికి ఇయర్స్ పట్టింది ……. !! ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే తను తట్టుకోగలదా……… ?? అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన ప్రణవి నవ్వుకుంటూ ……… !! ఇప్పుడు సరి కొత్త కథ మొదలవుతుంది 😈 చూస్తూ ఉండు వేద అని కన్నింగ్ గా నవ్వుకుంటూ మొహాన్ని సీరియస్ గా పెట్టుకుంటుంది……. !!

 

💥💥💥💥💥💥💥💥💥💥

విషిత ఫైనల్లీ యూ ఆర్ ఇన్ హైదరాబాద్ ఎలా ఫీల్ అవుతున్నావ్ అంటూ విషిత ను హగ్ చేసుకుంటూ అడుగుతాడు విప్లవ్……. !! వెరీ హ్యాపీ విప్లవ్ మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికి డేస్ మాత్రమే ఉంది అది తలచుకుంటే ఐ ఆమ్ సో ఎక్స్సైటెడ్ ……. !! అంటూ విప్లవ్ కి దూరంగా జరుగుతూ హౌ ఇస్ ఆశ్రిత తను ఇప్పుడు కంప్లీట్లీ ఒకే అని చెప్పావ్ కదా ఇప్పుడు మీట్ అవుతున్నావ్ తనను ……. ??

ఆశ్రిత ప్రెసెంట్ మహల్ లోనే ఉంటుంది విషిత తన ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తూ…… !! మరో వైపు ఆయుష్ ను కేర్ చేస్తూ షి ఇస్ వెరీ బీసీ నౌ…….. !! రేపటి నుంచి తను ఆయుష్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది……. !! అని తెలిసింది సో తను ఆఫీస్ కి రాగానే వెళ్ళి కలవాలి అని వెయిట్ చేస్తున్నా…… !!

ఓహ్ నైస్ దెన్ వాట్ అబౌట్ ప్రణవి…… ?? తను మన కంట్రోల్ లోనే ఉంది కదా……. !!

అబ్వియస్లీ అది టీవీ అయితే రిమోట్ మనమే కదా సో అది ఎమ్ చేయాలి అన్నా మనం ఉండాల్సిందే అని నవ్వుతూ…… !! జర్నీ చేసి టైడ్ అయ్యింటావ్ రెస్ట్ తీసుకో అని రూమ్ చూపించాగానే విషిత బెడ్ మీద కూర్చుని తన మొబైల్ లో ఉన్న ఆయుష్ ఫోటో వైపు చూస్తూ……. !! ఐ లవ్ యూ ఆయుష్ త్వరలోనే ఆ ఆషి ను నీ లైఫ్ నుండి తప్పించి దాన్ని విప్లవ్ కి హ్యాండ్ ఓవర్ చేసాక…….. !! నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుంటాను యూ ఆర్ ఆల్వేస్ మైన్ మిస్ యూ లాట్ ……… !! అంటూ తన ఫోటో ను జూమ్ చేసి చూస్తూ ఆయుష్ ను తను ఫస్ట్ ఎక్కడ చూసిందో గుర్తు చేసుకుంటూ ఫొటో స్క్రోల్ చేస్తుంది……. !!

విషిత రాకతో వర్మ ఫ్యామిలీ లో టెన్షన్ 😈 ఎనీ గెస్