నీ ఊపిరి సాక్షిగా ❣️-34
మహాన్ కార్ ఇంటి ముందు ఆగగానే మహాన్, విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఇంట్లోకి వెళ్తుంది శ్లోక….. !! వీళ్ల కోసమే వెయిట్ చేస్తూ హాల్ లో అటు ఇటు తిరుగుతూ పదే పదే గుమ్మం వైపు చూస్తున్న నందన కి మహాన్ చెప్పినట్టు గానే …… !! శ్లోక ను తీసుకుని రావడం చూసి నవ్వుతూ చూస్తూ లోపలికి రాబోతున్న వాళ్ళను గుమ్మం అవతలే ఆపేసీ ఏయ్ భూమి హారతి ప్లేట్ తీసుకుని రా….. !! అని అరవగానే అక్కడ శ్లోక ను రిలీజ్ చేశారో లేదో అని టెన్షన్ తో చచ్చిపోతుంటే నా అత్త ఏంటి హారతి పట్టుకుని రమ్మంటోంది …… ?? అనుకుంటూ హారతి ప్లేట్ తో అక్కడికి వచ్చిన భూమి గుమ్మం ముందు నుంచున్న శ్లోక ను చూసి షాక్ అవుతూ చూస్తుంది…. !!
మహాన్ భూమి ను చూసి నవ్వుతూ కన్ను కొట్టగానే భూమి మొహాన్ని నార్మల్ గా పెట్టుకుని శ్లోక కి హారతి ఇవ్వబోతే….. !! మామ్ నాకు నువ్వే హారతి ఇవ్వు దీని చేత్తో ఇస్తే నాకు కచ్చితంగా బ్యాడ్ జరుగుతుంది అసలే అన్నా చెల్లెలి నన్ను కావాలని టార్గెట్ చేశారు అంటూ కోపంగా చెప్తుంది…. !!
భూమి శ్లోక వైపు సీరియస్ గా చూస్తూ నందన తీసుకోవాలి అని చూసిన హారతి ప్లేట్ ఇవ్వకుండా తనే హారతి ఇచ్చి…. !! మా అన్నయ్య కావాలని టార్గెట్ చేసే టైప్ కాదు తనను గెలకనంత వరకూ మా అన్నయ్య ఎవరి జోలికి వెళ్ళడు ……. !! అన్నయ్య ను వాంటెడ్ గా టచ్ చేస్తే మాత్రం వారికి బుద్ధి చెప్పకుండా వదలడు అని అంతే కోపంగా చెప్పి వాలిపోతుంది….. !!
ఎంత పొగరే నీకు 😬😬 అని భూమి ను కొట్టబోతున్న శ్లోక చెయ్ పట్టుకుని ఆపేస్తూ….. !! అబ్బా దాన్ని వదిలేయ్ రా అదేదో వాగుతూ ఉంటుంది దాని కోసం నీ మూడ్ స్పాయిల్ చేసుకోకు…… !! అని చెప్తున్న కొడుకు వైపు సూటిగా చూసి శ్లోక అంటూ తనను హగ్ చేసుకున్న నందు ను విడిపించుకుని కోపంగా తన రూమ్ కి వెళ్ళిపోతుంది శ్లోక….. !!
శ్లోక కోపంగా ఉన్నట్టుంది మామ్ వెళ్ళి కాసేపు తనతోనే ఉండు అని మెయిడ్ తో శ్లోక కి తినడానికి ఏమైనా తీసుకు వెళ్ళు అని చెప్పి సోఫా లో కూర్చుంటాడు మహాన్….. !! విజయేంద్ర ప్రసాద్ కి వర్క్ ఉందని బయటకు వెళ్లిపోతే మహాన్ ఎదురుగా కూర్చున్న దేవయాని……. !! అదేదో గోల్డ్ మెడల్ సాధించి ఇంటికి వచ్చినట్టు ఈ హారతి లు ఇవ్వడం, నచ్చింది చేసి పెట్టడం ఇవన్నీ చేసి శ్లోక ను ఇంకా పొగరుగా ఎందుకు పనికి రాకుండా చేయండి……. !! అని బుగ్గలు నొక్కుకుంటూ కోపంగా చిరుబురు లాడుతున్న దేవయాని వైపు చూసిన మహాన్ కి భూమి కిచెన్ లోకి వెళ్తూ కనిపించడం తో వాటర్ కావాలి అమ్మమ్మ అంటూ కిచెన్ లోకి వెళతాడు….. !!
వాటర్ కావాలి అంటే మెయిడ్ ని అడిగితే ఇస్తుంది కదా వీడు ఎందుకు కిచెన్ లోకి వెళ్తున్నాడు అని అనుకుంటూ దేవయాని కూడా వెనకే వెళ్తుంది….. !! కిచెన్ లోకి వెళ్ళిన మహాన్ అక్కడున్న కుక్స్, మెయిడ్ ను బయటకు పంపేసి భూమి వైపు చూస్తాడు….. !! భూమి పైన కబోర్డ్ లో ఏదో వెతుకుతూ ఉంటే మహాన్ ఆ ప్రాసెస్ లో క్లియర్ గా కనిపిస్తున్న వంపులు తిరిగిన తన నడుమును చూస్తూ ఉంటాడు ….. !!
మహాన్ అప్పుడే గమనిస్తాడు భూమి బ్యాక్ హుక్స్ రెండు ఊడిపోయి బ్యాక్ క్లియర్ గా షో అవుతూ ఉంటుంది …… !! దాన్ని చూసిన మహాన్ భూమి చెయ్ పట్టుకుని మీదకు లాక్కోగానే 50 కేజీ ల పూలు వచ్చి తనను తాకినట్టు చాలా హాయిగా అనిపిస్తుంది….. !!
భూమి మహాన్ వైపు కళ్ళు తిప్పి చూస్తూ ఉంటే మహాన్ తన రెండు చేతులు భూమి నడుము వైపు తీసుకు వెళ్తూ వెనుక ఊడిపోయిన హుక్స్ పెట్టడం చూసి భూమి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది…… !! నా దగ్గర నువ్వు ఎలా అయినా ఉండు కానీ నలుగురిలో ఉన్నప్పుడు వంటి మీద స్పృహ లేకుండా ఉండకు ఎట్ లీస్ట్ అవి ఊడిపోయాయి అని కూడా తెలియనంతలా ఎమ్ వర్క్ చేస్తున్నావ్….. ??
నేను వర్క్ చేయాలి అనే కదా నన్ను ఇక్కడికి తెచ్చి పడేసావ్….. !! మహాన్ మన బంధం ఇంకా ఇలా ఎన్ని రోజులు ఉంటుంది ఎందుకో అడగాలి అనిపించింది…… ?? మహాన్ భూమి వైపు చూస్తూ మా మామ్ నిన్ను బయటకు పంపే దాకా అది నా చేతుల్లో లేదు…….. !! అని భూమి నడుము దగ్గర నుంచి చేతులు తీయబోతూ ఉంటే భూమి ఆ చేతులను అలాగే ఉంచేస్తూ ……. !! నేను నీ లైఫ్ నుండి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తావా ఇది మాత్రం అబద్దం చెప్పకు ప్లీస్ అంటూ మహాన్ కాలర్ పట్టుకుని కన్నీళ్ళతో అడుగుతుంది….. !!
నా లైఫ్ లో ప్రేమ, పెళ్ళి రెండు నీతోనే మొదలయ్యాయి & నీతోనే ముగిసిపోయాయి……. !! నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది ఎంత నిజమో అంతకు మించి ద్వేషిస్తున్నా అన్నది కూడా అంతే నిజం….. !! నువ్వు లేకపోయినా నీ ప్లేస్ లో కి ఎవరు రారు & రానివ్వను ..!! ఎందుకే నన్ను పిచ్చి వాడ్ని చేసావ్ నిన్ను ప్రేమిస్తున్నా అది నీతో చెప్పలేని స్థితిలో ఉన్నాను ఐ రియల్లీ హేట్ యూ భూమి 💔..!!
మాట్లాడవేంటి మహాన్ చెప్పు నేను వెళ్ళిపోయాక మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా …… ?? మహాన్ సూటిగా భూమి కళ్ళల్లోకి చూస్తూ భూమి ను మరింత గట్టిగా తనకు అదుముకుని లుక్ ఎట్ టు మై ఐస్ అనగానే భూమి మహాన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది…… !! ఇప్పుడు చెప్పు నా కళ్ళల్లో ఎమ్ కనిపిస్తుంది నా కళ్ళు నీకు ఏమైనా చెప్తున్నాయా అనగానే భూమి మహాన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది…… !! మహాన్ కళ్ళల్లో ఏవేవో బావాలు & తన మీదున్న ప్రేమ అన్ని కనిపిస్తూ ఉంటే భూమి కళ్ళు తనకు తెలియకుండానే వర్షిస్తున్నాయి…… !!
భూమి ను అంత దగ్గరగా & తన కన్నీళ్ళు చూసిన మహాన్ కి ఈ క్షణం తనకు భూమి మాత్రమే కనిపిస్తుంది….. !! ఏడుస్తున్న భూమి కళ్ళ మీద ముద్దు పెట్టగానే భూమి మహాన్ ను మరింత గట్టిగా హగ్ చేసుకుంటూ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్ మహాన్……. !! ఐ రియల్లీ లవ్ యూ బట్ అది నీ మనసుకు ఎందుకు అర్థం కావడం లేదు……. ?? కాలేజ్ లో నన్ను నువ్వు ఎంత పిచ్చిగా ప్రేమించే వాడివో అపుడే మర్చిపోయావా అని ఏడుస్తూ అడుగుతుంది…. !!
మహాన్ కి కూడా తమ కాలేజ్ మెమోరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటే భూమి నడుము పెట్టుకుని పైకి ఎత్తి కిచెన్ కౌంటర్ మీద కూర్చో పెడుతూ ఇద్దరి పెదాలను గాఢంగా ముడి వేస్తాడు….. !! మ్యారేజ్ అయ్యాక మహాన్ ఇస్తున్న మొదటి ముద్దు ఆ ముద్దు లో తన మీద మహాన్ కి ఎంత ప్రేముందో చెప్పకునే చెప్తుంటే…… !! భూమి మహాన్ ను మరింత అల్లుకు పోతూ వెనుక నుండి మహాన్ నడుము కి తన రెండు కాళ్ళతో ముడి వేసి …… !! ముందు నుండి మహాన్ ను తనలోకి అదుముకుంటూ వెచ్చగా ఒకరి ఊపిరి మరొకరు తీసుకుంటూ సర్వం మారుస్తారు ఇద్దరికీ ఆ ఏకాంతం ఎంతో నచ్చింది….. !!
దేవయాని కిచెన్ లోకి వచ్చి మహాన్ & భూమి క్లోజ్ గా ఉన్నప్పుడే చూసి నవ్వుతూ అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోతుంది….. !! వీళ్ళు కిచెన్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు కాబట్టి వీళ్ళు ముద్దు తో మొదలు పెట్టి హద్దులు దాటుతూ ఉంటారు…… !!
( హౌ రొమాంటిక్ మహాన్ ☺️ కిచెన్ రొమాన్స్ చేస్తున్న నా ఫస్ట్ హీరో నువ్వే రా బాబు 😜 ఇది మీ అమ్మ కానీ చూస్తే గుండె ఆగి చచ్చుద్ది 🤭)
💫✨💫✨💫✨💫✨💫✨💫✨
రూమ్ లోకి వచ్చిన శ్లోక కోపంగా బెడ్ మీద బోర్లా పడి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే….. !! వెనుకే వచ్చిన నందన కూతురిని అలా చూసి శ్లోక అంటూ తన తల మీద చెయ్ వేస్తున్న నందు చెట్టుని దూరంగా నెట్టేస్తూ….. !! నన్ను చూడ్డానికి ఒక్క సారి కూడా స్టేషన్ కి రావాలి అనిపించలేదా మామ్ లేక నన్ను చూడ్డానికి నీ ప్రెస్టేజ్ అడ్డొచ్చిందా అని కోపంగా అడుగుతూ లేచి కూర్చుంటుంది….. !!
శ్లోక ఎమ్ మాట్లాడుతున్నావ్ రా నిన్ను చూడ్డానికి నాకు ప్రెస్టేజ్ ఏంటి…..?? కలలో కూడా అనకు ఈ మామ్ భరించలేదు….. !! అయినా నేను బ్రతికేదే మీ కోసం నీ గురించి నేను ఆలోచిస్తానా చెప్పు….. !! నేను స్టేషన్ కి రావాలి అనే అనుకున్నాను బట్ మహాన్ నన్ను వద్దని తనే తీసుకుని వస్తానని చెప్పాడు అందుకే ఆగిపోయాను తప్పా నీ మీద ప్రేమతో కాదు…..!! నిన్ను వాడు తీసుకెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకూ నేను కూడా ఫుడ్ కూడా తినలేదు శ్లోక….. !! నువ్వు అలా స్టేషన్ లో ఉంటే ఇక్కడ నేను ఎలా స్టేబుల్ గా ఉండగలను చెప్పు….. !!
నందన గొంతు లో నుండి బాధగా వచ్చిన మాటలకు శ్లోక ఏడుస్తూ నందు ను హత్తుకుని సారి మామ్ ఏదో కోపంలో అలా అరిచేసాను ఐ నో యూ లవ్స్ మీ సో మచ్….. !! నందన శ్లోక మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఫోర్హెడ్ కిస్ పెడుతూ ఐ మిస్ యూ శ్లోక ఇంకెప్పుడు నిన్ను వాడు టచ్ కూడా చేయకుండా చేతులు కాళ్ళు విరిచెయిస్తాను….. !!
శ్లోక కి ఈ ఐడియా నచ్చడం తో చటుక్కున నందు నుండి దూరంగా జరిగి నో మామ్ ఇది నా రివేంజ్ వాడి మీద నేనే రివేంజ్ తీర్చుకుంటాను ……. !! వాడికి ఈ నందన కూతురు తో పెట్టుకుంటే ఎమ్ జరుగుతుందో లైవ్ లో చూపిస్తాను యూ జస్ట్ రిలాక్స్ అంటూ స్మైల్ ఇస్తుంది….. !!
దట్స్ మై గర్ల్ ☺️…!! ఇప్పుడు నాకు కొంచెం రిలాక్సింగ్ గా ఉంది అంటూ మెయిడ్ తీసుకు వచ్చిన ట్రే తీసుకుని తనే స్వయంగా శ్లోక లో ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది….. !! శ్లోక నందు పెడుతుంది తింటూ నందన వైపు చూస్తూ మామ్ ఇవాళ డాడ్ ను చూసాను అని మెల్లగా చెప్తుంది….. !!
నందన ఫుడ్ తినిపిస్తూ ఏంటి…..?? ఎవరిని చూసావు అని మరో సారి అడగ్గా అదే మామ్ స్టేషన్ లో డాడ్ ను చూసా ఇన్ఫాక్ట్ డాడ్ చెప్పడం వల్లే ఆ రాజ్ నన్ను వదిలేశాడు…… !! డాడ్ ను చూస్తుంటే చాలా గుడ్ పర్సన్ లా అనిపించారు మమ్మీ అంతే కాదు నా వైపు చాలా ప్రేమగా చూసారు….. !! ఆయన దగ్గరగా ఉంటే నాకేం అవ్వదు అని ఎంతో సెక్యూర్డ్ గా అనిపించింది & చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ఏదో ఎంప్టీ ఫీలింగ్ అది కంప్లీట్ అవ్వాలంటే అది డాడ్ నా లైఫ్ లో ఉంటేనే జరుగుతుంది అనిపిస్తుంది….. !?
శ్లోక అని సీరియస్ గా అరిచిన నందన వాయిస్ కి తన ఫ్లో లో తను చెప్పుకుంటూ వెళ్తున్న శ్లోక నందన వైపు చూస్తుంది….. !! మరొక్క సారి ఆ మనిషిని డాడ్ అని పిలిచావో నీకు మామ్ ఉండదు చెప్తున్నా….. ??
మామ్ ఎందుకలా పిచ్చిగా మాట్లాడుతున్నావ్ …… ?? డాడ్ కి మరో ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు చెప్పు నాకు అనిపిస్తుంది మామ్…… !? డాడ్ తో మనం హ్యాపీగా ఉంటాం అని ప్లీస్ మామ్ డాడ్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వు….. !! నీ కోపం నాకు తెలుస్తుంది డాడ్ నీ విషయం లో మిస్టేక్ చేసాడు ఐ అగ్రీ దట్ బట్ అలా అని మనుషులు ఎపుడు ఒకేలా ఉండరు కదా….. !!
స్టాప్ ఇట్ శ్లోక అని కోపంగా బెడ్ మీద నుండి లేచి అసలు నువ్వు నా కూతురివేనా…… !! ఏమైంది నీకు ఎందుకిలా నాకు నచ్చని పర్సన్ గురించి డిస్కస్ చేసి నాకు కోపాన్ని తెప్పిస్తున్నావ్…… ?? ఒక్క రోజు స్టేషన్ లో ఉండేసరికి ఈ మామ్ కి నీకు చేదుగా & మీ డాడ్ తియ్యగా అయిపోయాడా….. ??
మీ డాడ్ నాకు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని అంత ఈజీగా మర్చిపోయే దాన్ని అయ్యుంటే ఇన్ని ఇయర్స్ కార్తీక్ కి దూరంగా ఉండేదాన్ని కాదు….. !! తనను ఎంతలా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు కానీ నేను మాత్రమే ప్రేమించానని తర్వాత తెలిసింది….. !! నా ప్రేమకు విలువ ఇవ్వని వ్యక్తి దగ్గరకు ఇన్ని ఇయర్స్ తర్వాత సిగ్గు లేకుండా వెళ్ళమంటావా…… ??
మామ్ ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు డాడ్ నువ్వు విడిపోయి కొన్ని ఇయర్స్ అవుతుంది కదా మరి ఎందుకు మీరు వేరే మ్యారేజెస్ చేసుకుని లైఫ్ లో మూవ్ అవ్వలేదు…… ??
నందన కోపంగా మొహం తిప్పుకునే సరికి ఏంటీ మామ్ ఆన్సర్ చెప్పవ్….. !! పోనీ నేను చెప్పనా మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది అది మీరు తెలుసుకోలేక పోతున్నారు….. !! నిన్నటి వరకు నేను కూడా నాకు డాడ్ లేడు ఉన్నది మామ్ ఒక్కటే అనే థాట్ లోనే ఉండిపోయాను….. !!
ఎప్పుడైతే డాడ్ ను చూసానో & ఆయనను హగ్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు డాడ్ అంటే ఉన్న నెగెటివ్ ఫీలింగ్ పోయింది మామ్…… !! నేను నిజంగా డాడ్ కళ్ళల్లో నా మీద, అన్నయ్య మీద ప్రేమ చూసాను ఐ స్వేర్ డాడ్ లవ్స్ మీ ఏ లాట్…… !!❤️
షట్ అప్ శ్లోక చంపేస్తాను ఇంకో సారి ఆ మనిషి పేరు నా ముందు తీసావో నీకు అక్కడికి వెళ్ళాక బుర్ర పని చేయడం లేదు అనుకుంటా రెస్ట్ తీసుకో….. !! అంటూ నందన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శ్లోక ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంటుంది…. !!
ఒక్కొక్కరి ఎమోషన్స్ స్లో జై రివీల్ అవుతూ ఉంటాయి….. !! మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి & నందు ఎందుకు అంత పంతంగా కార్తికేయ మీద అంత కోపం పెంచుకుందో కూడా మీ కళ్ళకు క్లియర్ గా చూపిస్తాం….. !! సో ” Don’t judge a book by its cover” !! మేము ఎమ్ చెప్పాలి అనుకుంటున్నామో మీకు అర్థం అయింది అనే అనుకుంటున్నాం ….. !! ☺️