Login with OTP

నీ ఊపిరి సాక్షిగా -35

aashyatech

Author

మను అని పిలిచిన అనసూయ వాయిస్ కి ఆలోచనల ప్రవాహం లో కొట్టుకు పోతున్న మానస ఉలిక్కిపడిన హా ఏంటమ్మా…… ?? అని అనసూయ వైపు చూస్తుంది….. !! మెయిడ్ కాఫీ ఇస్తుంటే ఏంటి అంత పరధ్యానంగా కూర్చున్నావ్…. ?? మార్నింగ్ కూడా అంతే ఏదో ఆలోచిస్తూ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు నువ్వు బానే ఉన్నావా….. ??

మానస మెయిడ్ వైపు చూసి కాఫీ కప్ తీసుకుంటూ …… !! ఎల్లుండే కదా అమ్మా విజయ్ సంవత్రరికం అన్నయ్య ఏమో చాలా కాన్ఫిడెంట్ గా ఎప్పట్లా భూమి చేతి మీదే అన్ని జరుగుతాయి అని చెప్పాడు…… !! వాళ్ళు భూమి ని ఒంటరిగా పంపిస్తారన్న నమ్మకం నాకు లేదు కానీ భూమి లేకుండా సంవత్సరికం చేయాలంటే చాలా బాధగా ఉంది…. !!

రాజ్ ఉన్నా భూమి లేని లోటు క్లియర్ గా కనిపిస్తుంది అమ్మా భూమి రాకపోతే నేనే కాదు విజయ్ ఆత్మ కూడా బాధ పడుతుంది….. !! అని బాధగా చెప్తున్న మానస వైపు చూస్తూ అనసూయ కూడా ఆలోచిస్తూ నువ్వు చెప్తుంది కూడా నిజమే మను కానీ భూమి ని అని అంటూ ఉండగానే….. !! అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ నువ్వు ఆ విషయం గురించి అస్సలు ఫీల్ అవ్వకు మమ్మీ నాకు అడ్డొచ్చిన వాళ్ళ నడ్డి విరగొట్టి అయినా భూమి ని తీసుకుని వస్తాను….. !!

రాజ్ వాయిస్ కి ఇద్దరూ తల తిప్పి చూడగా ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు…. !! భూమి గురించి ఆలోచిస్తూ డల్ అవ్వకు మమ్మీ నేనున్నా కదా నా చెల్లిని ఎలాగైనా ఎల్లుండి తీసుకుని వస్తాను తల పగిలి పోతుంది….. !! నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ చేసి పంపించు తాగేసి 2 ఆర్స్ అలా పడుకుంటాను ….. !!

అదేంట్రా బ్రేక్ఫాస్ట్ చేయవా…… ?? ముందు ఫ్రెష్ అయి రా నీ కోసం బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను….. !! కొంచెం అయినా తిని పడుకో ఇలా తినకుండా పడుకుంటే నిద్రేలా పడుతుంది చెప్పు…. !!

ఆకలిగా లేదు మమ్మీ కాఫీ ఒకటే పంపు చాలు లేచాక డైరెక్ట్ గా లంచ్ తింటాను అని మానస బుగ్గ కి ముద్దు పెట్టి పైకి వెళ్తున్న రాజ్ వైపు చూస్తూ…. !! వీడు ఈ మధ్య సరిగ్గా ఫుడ్ కూడా తినడం లేదు మా ఎప్పుడు వర్క్… వర్క్ అని ఇంటికి కూడా ఒక రోజు వస్తే ఇంకో రోజు రావడం లేదు…. !!

 

నేను వీడ్ని పోలీస్ ట్రైనింగ్ కి పంపిస్తున్నప్పుడే చెప్పా అన్నయ్య తో ఈ జాబ్ కి వద్దు అని వాడు ప్యాషన్ తో ఎంతో కష్టపడి చదివి ఇక్కడి దాకా వచ్చాడు…. !! వాడిని నేను ఆపలేను అని చెప్పి నన్ను కూడా మాట్లాడనివ్వకుండా చేసాడు ఇప్పుడు చూడు రాజ్ కి తినడానికి కూడా టైం ఉండట్లేదు…. !!

మను రాజ్ ఏమైనా నార్మల్ కానిస్టేబుల్ ఆ….?? ఏ. సీ. పీ అన్నాక చాలా పనులు ఉంటాయి అవి మనమే అర్థం చేసుకోవాలి & సపోర్ట్ చేయాలి…. !! రాజ్ హెల్త్ తను చూసుకోగలడు కానీ నువ్వు వర్రీ అవ్వకు తనేం స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లాడు కాదు….. !! రాజ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసి పంపించు లేదా వాడు లేట్ అయితే అలాగే నిద్రపోతాడు…. !!

అది కూడా నిజమే అమ్మా ఆగు ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోకి వెళ్ళబోతూ అవును ఇందాక ఏంటి ఏదో చెప్పబోతూ ఆగావ్….. ?? ఓహ్ అదా నేను దేవయాని తో భూమి గురించి ముందే చెప్పాను కదా మను తను ఎదోటి చేసి భూమి ని తీసుకుని వస్తుంది లే నువ్వు దాని గురించి వదిలేయ్….. !!

అవును కదా మర్చిపోయాను మళ్ళీ ఒక సారి అత్తయ్య కి గుర్తు చెయ్ అమ్మా అని మానస కిచెన్ లోకి వెళ్తే …… !! అనసూయ సోఫా లోనే కూర్చుని తన మొబైల్ లో ఉన్న భూమి పిక్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది….. !!

💫✨💫✨💫✨💫✨💫✨

ఫ్రెష్ అయి వచ్చిన రాజ్ టవల్ తో తల తుడుచుకుంటూ మిర్రర్ ముందు వచ్చి నుంచుని తనను చూసుకుంటాడు ….. !! తను అచ్చం తన ఫాదర్ లాగే ఉంటాడని తనతో చాలా మంది చెప్పారు పోలికలు తన ఫాదర్ వి వచ్చినా కలర్ మాత్రం మానస దే వచ్చింది….. !! 6 ఫీట్ మీద మరో ఇంచ్ పైనే ఉంటాడు & వైట్ స్కిన్ టోన్, కండలు తిరిగిన దేహం, సిల్కీ హెయిర్….. !! ఒక్క సారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత అందంగా ఉంటాడు రాజ్….. !!

అందం లో మహాన్ కి ఏమాత్రం తగ్గకుండా తనకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంటాడు….. !! ఇన్ఫాక్ట్ స్టేషన్ కి సగం మంది కి పైగా అమ్మాయిలు రాజ్ కి సైట్ కొట్టడానికి వస్తారు అంత బావుంటాడు మన రాజ్ ☺️….. !! రాజ్ మిర్రర్ లో చూసుకుంటూ మీసాలు దువ్వుకుని వేళ్ళతో హెయిర్ సెట్ చేసుకుంటూ ఆ శ్లోక ను ఎలా పడేయాలి మనకా ఇందులో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు….. ??

 

ఫ్రెండ్స్ ని అడిగితే మోసేస్తారు పోనీ భూమి ని అడిగితే లేని పోనీ డౌబ్ట్ క్రియేట్ అవుతాయి….. ?? ఎలా అబ్బా అని ఆలోచిస్తున్న రాజ్ కి ఆ..!! దాని గురించి కూడా ఇంతలా ఆలోచించాలా అరటి పండు తొక్క వేసినా చాలు అది జారి పడిపోతుంది అని ఇన్నర్ ఇచ్చిన ఆన్సర్ కి తన వైపు సీరియస్ గా చూస్తూ పడిపోవడం అంటే అలా కాదు నా లవ్ కి పడిపోవాలి & అది అందరి కంటే ఎక్కువ నన్నే నమ్మాలి & ప్రేమించాలి అప్పుడే నేను అనుకున్నది నెరవేరుతుంది ….. !!

హు 😏 ఇవన్నీ అయ్యే పనులు కాదు పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ అంటూ వెటకారం ఆడుతూ మాయం అవుతుంది తన ఆత్మ….. !! దాన్ని తిట్టుకుని ఎలా అని ఆలోచిస్తూ మొబైల్ లో తెలుగు మూవీస్ లో వచ్చే లవ్ స్టోరీ సీన్స్ అన్ని చూస్తూ ఉండగా ఆ రూమ్ కి ట్రే పట్టుకుని వచ్చిన మానస ను చూసి మొబైల్ ఆఫ్ చేస్తాడు….. !!

బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పా కదా మమ్మీ అయినా ఎందుకు కుక్ చేసావ్….. ?? చెప్తే వినవు కదా అంటూ ట్రే తీసుకుంటున్న రాజ్ ను చూసి నువ్వు వంద చెప్తావ్ అవన్నీ వింటే నీ హెల్త్ ఎమ్ అవుతుంది….. ?? ఇంకేం మాట్లాడకు నోరు తెరువు అని ముద్దుగా కసురుకుంటూ తనకు తినిపిస్తున్న మానస ను చూసి నవ్వుతూ….. !! నేను ఇంకా నీకు చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నానా మమ్మీ ఇలా గోరు ముద్దలు పెడుతున్నావ్…. ?? పిల్లలు ఎంత పెద్ద వాళ్ళు అయినా మాకు చంటి పిల్లల్లానే కనిపిస్తారు అంటున్న మానస ను చూసి రాజ్ నవ్వుతూ చాలా రోజుల తర్వాత తనతో కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ చేసి, కాఫీ తాగి తన వడిలో హాయిగా చంటి పిల్లాడిలా నిద్రపోతాడు…… !!

💫✨💫✨💫✨💫✨💫✨💫

మహాన్ భారంగా శ్వాస తీసుకుంటున్న భూమి ను వదిలి నున్నగా మెరుస్తున్న తన మెడ వంపుల్లో మొహాన్ని దాచుకుని అక్కడ కిస్ చేస్తూ ఉంటాడు…. !! అప్పటికే మహాన్ వల్ల వొంట్లో వేడి పుట్టడం తో భూమి కూడా మహాన్ ను తమకుండా అల్లుకుపోతూ మత్తుగా మొన్స్ చేస్తూ ఉంటుంది….. !! ఇద్దరికీ ఇంకేదో కావాలి అనిపిస్తుంది అలాగే కొంచెం కొంచెం గా ముందుకు వెళ్తున్న ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తుంది మహాన్ మొబైల్… !!

మొబైల్ రింగ్ తో ఇద్దరూ కూడా తాము ఏ పొజిషన్ లో ఉన్నామో చూసుకుని దూరం జరిగి ఇద్దరూ కూడా డ్రెస్ సర్దుకుని ఒకరిని ఒకరు ఫేస్ చేయడానికి సిగ్గు అడ్డు రావడం తో తలలు తిప్పేస్తారు…. !! మహాన్ అటుగా తిరిగి కాల్ లిఫ్ట్ చేయగా రేయ్ ఎక్కడ ఉన్నావ్ ఇవాళ మీటింగ్ ఉందని గుర్తుందా అందరూ వచ్చేశారు నువ్వెక్కడ ఉన్నావ్….. ?? అటు వైపు నుండి కోపంగా అడుగుతాడు హనీష్…. !!

కమింగ్ అని కాల్ కట్ చేసి కిచెన్ కౌంటర్ నుండి కిందకు దిగిన భూమి వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి ఊపిరి ఆడనంత గట్టిగా హగ్ చేసుకుని వదిలి …… !! ఫాస్ట్ గా వెళ్ళిపోతున్న మహాన్ ను చూసి భూమి తనలో తానే నవ్వుకుంటుంది …. !? మహాన్ ఫాస్ట్ గా ఇంటి నుంచి ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు…. !!

మహాన్ లో వస్తున్న చేంజెస్ కి భూమి తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్తూ ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్న శ్లోక ను చూసి…… !! ఏమైంది దీనికి రాగానే ఏదో ఒక గొడవ చేసి ఇంటిని కిష్కిందకాండ చేస్తుంది అనుకుంటే ఇలా సైలెంట్ గా ఉంది అని అనుకుంటూ శ్లోక రూమ్ లోకి వెళ్తుంది……. !!

తను వచ్చింది కూడా చూడకుండా చాలా డీప్ థింకింగ్ లో ఉన్న శ్లోక ను చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ…… !! శ్లోక నువ్వు బానే ఉన్నావా….. ?? వచ్చినప్పటి నుంచి ఎందుకో మూడిగా కనిపిస్తున్నావ్…… ??

నేను ఫారిన్ టూర్ నుండి వచ్చా అనుకున్నావా ఎగిరి గంతులు వేసి అందరితో నవ్వుతూ ముచ్చట్లు పెట్టడానికి 😏…. !! స్టేషన్ నుండి వచ్చాక కోపంగా ఉండకుండ ఇంకెలా ఉంటాను అయినా నాతో నాకు ఎందుకు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో ప్రతీ అడ్డమైన వాళ్ళు నాకు సలహాలు ఇవ్వడమే అని చిరాకు పడుతుంది….. !!

శ్లోక ఫ్రస్ట్రేషన్ లో ఉందని అర్థం చేసుకున్న భూమి తనను లోన్లీ గా వదిలేయడం బెటర్ అనుకుంటూ…… !! అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఏయ్ ఆగు నాకు మీ మావయ్య మొబైల్ నెంబర్ కావాలి ఇవ్వు అని అడుగుతున్న శ్లోక ను ఆశ్చర్యంగా చూస్తూ మావయ్య నంబర్ కావాలా….. ?? ఎందుకు నువ్వు ఏదైనా అనాలి అనుంటే నన్ను అను మావయ్య ని ఏమైనా అంటే నేను సైలెంట్ గా ఉండను….. !!

షట్ అప్ ఆయనను నేను ఎమ్ అనాలి అనుకోవడం లేదు కానీ నోరు మూసి నంబర్ ఇవ్వు అనగానే……. !! భూమి ఆలోచిస్తూనే ఎందుకో శ్లోక మాటల్లో తెలియని బాధ కనిపించడం తో నంబర్ ఇచ్చేసి కామ్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది….. !!

శ్లోక ఆ నంబర్ తీసుకుని మొబైల్ DAD ❤️ అని సేవ్ చేసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది…… !!

💫✨💫✨💫✨💫✨💫✨💫

 

తన రూమ్ కి వెళ్ళిన నందన అసహనంగా బెడ్ మీద కూర్చుంటుంది….. !! ఛా నా పెయిన్ ఇక్కడ ఎవరికి ఒక్కరికీ కూడా ఎందుకని అర్థం కావడం లేదు….. !! కావాలని ఎవరు ఎవరికి దూరం అవ్వరు అందులోనూ ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా…… ?? కార్తీక్ నన్ను అడుగడునా ఎంత హార్ట్ చేశాడో ఎవరికీ తెలియక పోవచ్చు కానీ అది హర్ట్ అయినా నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను….. !! కార్తీక్ దృష్టిలో అవన్నీ తప్పులుగా కనిపించవు అని కళ్లల్లో నుండి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ గతం లోకి వెళ్తుంది….. !!

( హలో కార్తీక్ ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి చాలా ఆకలేస్తుంది…. !! త్వరగా స్టార్ట్ అవ్వమని చెప్పాను కదా నీకు ఇట్స్ టూ లేట్ కార్తీక్

వచ్చేస్తున్నా నందు ఇంకో హాఫ్ ఆన్ ఆర్ అంతే….. !! ఆకలేస్తే తిను అని చెప్పాను కదా అయినా ఎందుకు వెయిట్ చేస్తున్నావ్…. ??

నాకు నీతో కలిసి నువ్వు తినిపిస్తే తినాలి అని ఉంది కమ్ ఫాస్ట్ కార్తీక్ అని కాల్ కట్ చేసి కార్తికేయ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది….. !!

కాసేపటికి కార్తికేయ రాగానే వినిపించిన డోర్ బెల్ సౌండ్ కి నవ్వుతూ డోర్ ఓపెన్ చేసిన నందన కి ఒక చేత్తో రాజ్ ని ఎత్తుకుని మరో చేత్తో భూమి పక్కనే మానస తో నుంచున్న కార్తికేయ ను చూసి మొహం లోని నవ్వు మాయం అవుతుంది…. !!

హాయ్ వదిన అని నవ్వుతూ విష్ చేస్తూ హగ్ చేసుకున్న మానస ను హగ్ చేసుకుంటూ…… !! మీరేంటి సడెన్ గా అది కూడా ఇంత నైట్ అని అడిగిన నందన క్వశ్చన్స్ కి అన్నయ్య మమ్మల్ని బాగా మిస్ అవుతున్నాడు ఆట వదిన….. !! అందుకే మమ్మల్ని తీసుకుని వచ్చాడు అని చెప్తూ ఒకే అన్నయ్య గుడ్ నైట్ అంటూ పడుకోవడానికి వెళ్ళబోతున్న……. !! మానస ను ఆపి పిల్లల్ని పడుకోబెట్టి ఫ్రెష్ అయి రా కలిసి తిందాం అని మానస ను పంపి తను వచ్చాక ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు….. !!

కార్తికేయ తో కబుర్లు చెప్తూ తినాలి అనుకున్న నందు కి ఇప్పుడు మానస తో కబుర్లు చెప్తూ తింటున్న కార్తికేయ ను చూసి కోపం వస్తుంటే….. !! కస్టంగా కంట్రోల్ చేసుకుంటూ తింటున్న నందు కి కార్తికేయ మాటకు కోపం తో పాటు ఏడుపు కూడా అంతే వస్తుంది…. !!

మను నీ చేతి వంటి ను బాగా మిస్ అవుతున్నా రా…. !! పర్టికులర్ గా చికెన్ రా మీ వదిన ఎంత బాగా చేసినా నువ్వు చేసినంత టేస్ట్ రాదు చూడు ఇందులో కొంచెం కూడా టేస్ట్ లేదు….. !! అన్నయ్యా బానే ఉంది కదా కొంచెం సాల్ట్ వేసుకో అని కెర్రీ కలిపి కార్తికేయ కి మను తినిపిస్తూ ఉంటే…… !! సాల్ట్ వేసినందుకు కాదు కానీ నీ చేత్తో తినిపిస్తే ఏదైనా టేస్ట్ అదిరిపొద్దీ అనగానే మానస నవ్వుతూ కార్తికేయ కి తినిపిస్తూ ఉంటుంది….. !!

అదే కర్రీ చేయడం కోసం నందు చెయ్ కాల్చుకుని మరీ తనకు రాకపోయినా కార్తికేయ కోసం ఎంతో ఇష్టంగా చేసింది…. !! అలాంటిది కార్తీక్ అలా అనేసరికి కాలిన తన లెఫ్ట్ హ్యాండ్ వైపు చూసుకుంటూ నందన ప్లేట్ లో హ్యాండ్ వాష్ చేసుకుంటుంది) …. !!

ఈ మాత్రానికే హర్ట్ అవ్వాలా అని అడగకండి ఇది రియాలిటీ కి దగ్గరగా ఉన్న స్టోరీ…. !! నందు ప్లేస్ లో నిజంగా మీరంటే ఎలా ఫీల్ అవుతారు కోపం/ బాధ/ ఆవేశం ఇలా ఏ ఎమోషన్ చూపిస్తారు……. ?? జెన్యూన్ గా ఆన్సర్ ఇవ్వాలి 😌