నీ ఊపిరి సాక్షిగా ❣️-47
ఏయ్ కాఫీ తాగమంటే ఏంటీ అలా ఆముదం తాగమన్నట్టు పెట్టావ్ ఫేస్ ఇది కాఫీ నే పాప విషం కాదు కమాన్ హ్యావ్ ఇట్….. !! దేవుడా ఇప్పుడెలా ఎస్కేప్ అవ్వాలి అని గోళ్లు కొరికేస్తూ ఆ… యాక్చువల్లీ రాజ్ నాకు కా…… ఎక్స్ట్రాస్ మాట్లాడకుండా ఈ కాఫీ ఫస్ట్ ఫినిష్ చెయ్…… !! అసలే చేయక చేయక వర్క్ చేసావ్ అది కూడా నా కోసం అలాంటపుడు నీకు ఎట్లిస్ట్ కాఫీ కూడా ఆఫర్ చేయకపోతే నాకు హార్ట్ లేదు అనుకుంటావ్ కదా……. !!
నో లేదు రాజ్ అయినా నీ గురించి నాకు తెలియదా అని పళ్ళు నూరుతూ…… !! నీ హార్ట్ చాలా మంచిది నువ్వు ఇంకా మంచి వాడివి అలాంటి నిన్ను ఎందుకు రాంగ్ గా అనుకుంటాను చెప్పు….. !! యూ ఆర్ ట్రూ జెంటిల్ మ్యాన్ రాజ్ ఐ ఆమ్ రియల్లీ ఇంప్రెస్స్డ్ అంటూ ఇన్నోసెంట్ గా మొహాన్ని పెట్టుకొంటూ కను రెప్పలను టపా టపా కొడుతూ చెప్తుంది….. !!
జెంటిల్ మ్యాన్ ఆ 🙄 భారతీయుడు ఎమ్ కదా 😏 అని వెటకారంగా నవ్వుతూ…… !! చెప్పిన డైలాగ్స్ చాలు కానీ ఈ కాఫీ తాగు అవును చిన్న కాఫీ తాగడానికి ఎందుకింత సీన్ చేస్తున్నావ్……. ?? కొంపదీసి నన్ను లేపేయడానికి దీంట్లో విషం కానీ కలపలేదు కదా……. ?? అసలే నాకు వెళ్ళి కూడా కాలేదు & ఎలాంటి ముచ్చట జరగలేదు అదే కిస్, హగ్ లాంటివి కూడా నా లైఫ్ లో ఎక్స్పీరియెన్స్ చేయలేదు….. !!
అక్కడికి నాకేదో ముగ్గురు మొగుళ్ళు ఆరుగురు పిల్లలు ఉన్నట్టు చెప్తున్నావ్ 😬😬 …… ?? నాకు కూడా ఒక్క సారి కూడా పెళ్లి కాలేదు ఐనా నిన్ను నేను ఎందుకు చంపాలి అనుకుంటాను రాజ్ ☹️ నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా……. ??
హ్మ్మ్ కప్ కాఫీ తాగడానికి ఇన్ని బారీ డైలాగ్స్ చెప్తున్నావ్ చూడు ఇక్కడే ఏదో డౌబ్ట్ కొడుతుంది నాకు…….. !! అనవసరంగా సీన్ లాగ్ చేయకుండా చటుక్కున కాఫీ తాగు అంటూ కోపంగా చూస్తున్న రాజ్ వైపు గుటకలు మింగుతూ చూస్తూ……. !! ఈ ముస్తోడికి డౌబ్ట్ వచ్చినట్టు ఉంది ఏదోలా మ్యానేజ్ చేయాలి అనుకుంటూ అరే దానిదేం ఉంది రాజ్…… !! ఇదిగో ఇప్పుడే నీ కళ్ళ ముందే తాగుతాను చూడు …….. !! అని రాజ్ చేతిలోని కప్ తీసుకుని కావాలనే చెయ్ జారి కింద పడ్డట్టు యాక్ట్ చేస్తూ కప్ ను కింద పడేస్తుంది …… !?
అయ్యో సారి రాజ్ కప్ చెయ్ జారింది అని కంగారు పడుతూ మాప్ స్టిక్ తో వాటర్ స్ప్రింకిల్ చేసి క్లీన్ చేస్తున్న శ్లోక వైపు చూస్తూ…… !! నో డౌబ్ట్ ఇది ఇందులో సాల్ట్/ కారం ఏదో కలిపింది అందుకే కావాలనే కింద పడేసి ఓవర్ యాక్షన్ చేస్తుంది……. !! అనుకుంటూ శ్లోక వైపు చూస్తూ ఉంటాడు……. !!
శ్లోక ఈ సారి బుద్దిగా కిచెన్ లోకి వెళ్ళి ఇద్దరికీ టీ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి …… !! ఒక కప్ రాజ్ కి ఇచ్చి మరోటి తను తీసుకుని రాజ్ పక్కనే కాస్త గ్యాప్ ఇచ్చి కూర్చుంటుంది…… !! టీ టేస్ట్ లేకపోయినా ఒక సారి తాగచ్చు అనేలా ఉండడం తో రాజ్ మెల్లగా టీ సిప్ చేస్తూ ఉంటాడు…… !!
ఇద్దరూ క్రైమ్ థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటే సడెన్ గా వినిపించిన కాలింగ్ బెల్ సౌండ్ కి రాజ్ శ్లోక వైపు డోర్ ఓపెన్ చెయ్ అన్నట్టు చూస్తాడు….. !! నేను నీ మెయిడ్ అనుకుంటున్నావా రాజ్ వచ్చినప్పటి నుంచి నన్ను మనిషి లా కూడా ట్రీట్ చేయట్లేదు నువ్వు…… !! నా మిస్టేక్ ఉంది కాబట్టి ఇప్పటి దాకా సైలెంట్ గా ఉన్నాను బట్ నువ్వు టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావ్…… ?? కాళ్ళు బానే ఉన్నాయ్ కదా వెళ్ళి నువ్వే డోర్ ఓపెన్ చెయ్…….. !! నేను మాత్రం చేయను ఎమ్ చేసుకుంటావో చేసుకో అంటూ కాలు మీద కాలు వేసి స్టైల్ గా కూర్చుంటుంది…… !!
నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా & నా మాటకే ఎదురు చెప్తావా వొళ్ళు కొవ్వెక్కిందా అంటూ లాగి పెట్టి కొట్టగానే…… !! ఆ…. అమ్మా అని నొప్పికి బుగ్గన చెయ్ పెట్టుకుని రాజ్ వైపే చూస్తూ ఉంటుంది…. !!
శ్లోక….. ఏయ్ నిన్నే పిలుస్తుంటే పలకకుండా అలా బుగ్గన చెయ్ పెట్టుకుని కూర్చున్నావ్ ఏంటి…… ?? అంటే ఇదంతా కళా ఉఫ్ అని తల కొట్టుకుంటూ అయినా వీడికి ఎదురు చెప్తే కొట్టినా కొడతాడు అవసరమా మళ్ళీ కేస్, కోర్ట్ అంటాడు ☹️🤦……. !! ఈవెనింగ్ వరకూ వీడ్ని బరిస్తే చాలు నా దారిన నేను వెళ్లచ్చు అనుకుంటూ ఆ…. ఎమ్ లేదు రాజ్ ఏదో ఆలోచిస్తున్నా చెప్పు ఏంటి పిలిచావ్……. !!
చించింది చాలు కానీ వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్ ఎవరో చాలా సేపటి నుండి డోర్ నాక్ చేస్తున్నారు అంటూ……. !! తన మొబైల్ రింగ్ అవ్వడం తో దాన్ని లిఫ్ట్ చేస్తూ బెడ్ రూమ్ వైపు నడుస్తాడు…… !! డోర్ ఓపెన్ చేయమని వీడు ఎక్కడికి లోపలికి వెళ్తున్నాడు అయినా డోర్ విరిగేలా ఎవరు డోర్ కొడుతున్నారు అనుకుంటూ విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది శ్లోక……. !!
రెడ్ & గ్రీన్ కలర్ హాఫ్ శారీ లో చేతిలో ఏదో బాక్స్ పట్టుకుని నవ్వుతూ కనిపిస్తుంది ఒక అందమైన అమ్మాయి…… !! తనను చూసిన శ్లోక ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూ ఎవరు కావాలి అంటూ కోపంగా మొహాన్ని పెట్టుకుని అడుగుతుంది…… !! రాజ్ గారు లేరా అక్క అని కాలి వేళ్ళతో ముగ్గులు వేస్తూ తెగ సిగ్గు పడుతున్న అమ్మాయిని చూసి …..!! ఆ ఆ 😬 అక్క లేదు తొక్క లేదు అయినా నేను నీకు అక్క ఏంటి అసలెవరు నువ్వు & నీ పేరు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావ్…. ??
నా కంటే పెద్ద వాళ్ళను నేను అక్క అని పిలుస్తాను అక్క…. !! పెద్ద వాళ్ళను అయితే ఆంటీ అని ముసలివాళ్ళను అయితే బామ్మ అని పిలవాలని…… !! మా అమ్మ చెప్పింది అందుకే మిమ్మల్ని అక్క అని పిలిచాను ఇది నాకు చిన్నప్పటి నుండి వస్తున్న అలవాటు….. !!
మహా గొప్ప అలవాటు 😏 ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు…… ?? అదీ…. అదీ….. ఆయన వచ్చాడని రాజ్ గారికి ఇష్టమైన హల్వా చేసుకుని వచ్చాను ఆయన ఎక్కడ అక్క…. ??
ఉఫ్ 🤦 ఈ ఆయన ఎవరమ్మా తల్లీ చెప్పేది ఏదో కాస్త అర్థం అయ్యేలా చెప్పు….. !! రాజ్ గారి గురించి అడుగుతున్నా అక్క అని బుగ్గలు ఎరుపెక్కడం తో తెగ సిగ్గు పడుతూ చెప్తుంది ఆ అమ్మాయి….. !!
ఏంటి లవ్ ఆ 😏 …… ??
హ్మ్మ్ ( విత్ సిగ్గు 😌) ……. !!
అబ్బో 🙄 ఎప్పటి నుండి…… ??
2 ఇయర్స్ నుండి అక్కా 🤩……. !!
ఆహా 😏 మరి రాజ్ కి చెప్పావా నీ లవ్ గురించి….. ??
ప్చ్ లేదు అక్క ☹️ ….. !! నేను ఎపుడు మాట్లాడాలి అనుకున్నా రాజ్ గారు అసలు మాట్లాడేవారు కాదు…… !! ఇదిగో ఈ మధ్యే కొంచెం నవ్వుతూ మాట్లాడుతున్నారు తెలుసా….. !!
అచ్ఛా అవునా ఎమ్ మాట్లాడాడు ఏంటి అంతలా…… ??
6 మంత్స్ బ్యాక్ నేను రాజ్ గారు సడెన్ గా ఒకే లిఫ్ట్ లో కిందకు వెళ్ళాం అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నొక్కమని చెప్పాడు…… !! 3 మంత్స్ బ్యాక్ నాకు చూడకుండా డ్యాష్ ఇస్తే సారి చెప్పాడు…… !! 2 మంత్స్ బ్యాక్ నన్ను చూసి నవ్వాడు & 1 మంత్ బ్యాక్ అమ్మ చేసిన స్వీట్ బాక్స్ లో తీసుకుని వచ్చి ఇస్తే థాంక్స్ చెప్పాడు అని నవ్వుతూ చెప్తుంది….. !!
ఆ అమ్మాయి మాటలకు శ్లోక కి బుర్ర గిర్రున తిరుగుతుంది 🙄 ……. !! నీ పేరేంటి అని అడుగుతున్న శ్లోక వైపు చూస్తూ వెన్నెల అక్క బావుంది కదా అంటూ ఇన్నోసెంట్ గా నవ్వుతున్న తనను చూసి…… !! హ్మ్మ్ చాలా బావుంది ఆయన గారు లోపలే ఉన్నాడు వెళ్ళు అని అడ్డు జరుగుతుంది……. !! వెన్నెల నవ్వుతూ వోణి ను చేత్తో చుట్టుకుంటూ కంగారుగా రాజ్ వైపు వెళ్ళడం చూసి వెనుకే శ్లోక కూడా వెళ్ళి చాటుగా దాక్కుని రూమ్ లోకి తొంగి చూస్తూ ఉంటుంది……. !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
ఎక్స్క్యూస్ మీ కార్తికేయ గారు లోపలికి రావచ్చా……. ?? అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తూ పర్మిషన్ అడుగుతున్న అనంత్ వైపు చూసి….. !! హేయ్ అనంత్ నువ్వా ప్లీస్ రారా అయినా ఏదో పరాయి వాడిలా పర్మిషన్ అడిగి రావడం ఏంట్రా స్టుపిడ్ అని నవ్వుతూ….. !! ఫైల్ క్లోజ్ చేసి అనంత్ ను చూసి నవ్వుతూ విష్ చేస్తాడు కార్తికేయ…… !!
ఏదో బిజీగా ఉన్నావ్ కదా కార్తికేయ అందుకే పర్మిషన్ తీసుకుని వచ్చాను…. !! నీ అపాయింట్మెంట్ తీసుకునే టైం కూడా నాకు దొరకలేదు…….. !? అందుకే డైరెక్ట్ గా వచ్చేసా నిన్ను డిస్టర్బ్ అయితే చేయలేదు కదా అంటూ కార్తికేయ ఎదురుగా కూర్చుంటాడు…… !!
నథింగ్ అలాంటిదేం లేదు అని ప్యూన్ కి కాల్ చేసి కాఫీ తెప్పించి చేరో కప్ తీసుకుని మెల్లగా సిప్ చేస్తూ ఉంటారు….. !! సో ఇంకేంటి కార్తీక్ విశేషాలు ఆ రోజు హాస్పిటల్ లో చెప్పిన దాని గురించి ఎమ్ ఆలోచించావ్…… ?? నందన ను మీట్ అయ్యావా తనతో మనసు విప్పి మాట్లాడావా మీ ప్రాబ్లెమ్ ను సార్ట్ అవుట్ చేసుకున్నావా …… ??
మనసు కాదు కదా గుండె విప్పి చెప్పినా అది వినే స్టేజ్ లో లేదు….. !! తను వినదు అని నాకు తెలుసు కానీ ఎక్కడో చిన్న హోప్ ఉండేది పిల్లల ఫ్యూచర్ గురించైనా చేంజ్ అవుతుందని షి ప్రూవ్డ్ మీ రాంగ్…… !! నందు ఎప్పటికీ మారదు అనంత్ మార్పు అనేది ఇద్దరి సైడ్ నుండి ఉంటేనే బంధం నిలబడుతుంది …… !! ఇక మేము కలుస్తాం అనేది కళ మాత్రమే ఈ లైఫ్ కి ఇంతే లీవ్ ఇట్…….. !! ఇంకేంటి విశేషాలు మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ అయిందని విన్నాను ఇస్ ఇట్ ట్రూ……. ??
యాహ్ ఇంకో 2 మంత్స్ లో ఎంగేజ్మెంట్ కూడా అనుకుంటున్నాం ఇప్పటి నుంచి వర్క్స్ ఒక్కోటి స్టార్ట్ చేస్తే అప్పటికి అవుతాయి….. !! ఒక్కగానొక్క కూతురు కదా సో ప్రతిదీ గ్రాండ్ & తనకు నచ్చినట్టు చేయాలి అని నేనే దగ్గరుండి చూసుకుంటున్నా …… !!
కార్తికేయ చిన్నగా నవ్వుతూ అందరికీ నీ అంత అదృష్టం ఉండదు అనంత్…… !! శ్లోక పెళ్ళైనా నా చేతుల మీదుగా చేయాలి అనుంది బట్ శ్లోక తో మాట్లాడే ఛాన్స్ కూడా దొరకడం లేదు అని బాధగా చెప్తాడు….. !! ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ లేకపోయినా ఫ్యూచర్ లో నీతోనే ఉండబోతుంది కదా కార్తిక్…… !! నీకున్న విషెస్ అన్ని అప్పుడు ఒక్కోటి ఫుల్ ఫిల్ చేసుకో అంటూ చిరు నవ్వుతో చెప్తాడు…… !!
వాట్…… ?? ఫ్యూచర్ లో నాతో ఉండడం ఏంటి అనంత్…… ?? అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు నందన నాతో మాట్లాడడానికే ఇష్టపడ్డం లేదు అలాంటిది నాతో ఎందుకు కలిసి ఉంటుంది…… ??
నేను చెప్పేది నందన నీతో కలిసి ఉండడం గురించి కాదు….. !! నీ కూతురు శ్లోక రాజ్ తో కలిసి ఉండడం గురించి అర్థం అవుతుందా…… ?? నేను ఎమ్ చెప్తున్నానో ఈ విషయం గురించి నాకు చెప్పనే లేదు కదా కార్తీక్ ఈ విషయం తెలిసినప్పటి నుండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా…… !! ఈ విధంగా అయినా నువ్వు మిస్ అయినవి నీ దగ్గరకే వస్తున్నాయి సో హ్యాపీ ఫర్ యూ కార్తీక్….. !!
అనంత్ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు….. !! శ్లోక రాజ్ తో కలిసి ఉండడం ఏంట్రా…… ?? పిచ్చి కానీ పట్టిందా నీకు….. ??
కార్తీక్ ఇంకా నీ దాకా విషయం రాలేదు అనుకుంటా….. !! అసలు విషయం ఏంటో తెలుసా నీ కూతురు శ్లోక నీ మేనల్లుడు రాజ్ లవ్ లో ఉన్నారు అని నవ్వుతూ చెప్పగానే…….. !! ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చైర్ నుండి పైకి లేచి షాక్ అవుతాడు కార్తికేయ…… !!