నిరీక్షణ పలిచింది – 3
కానీ తమరు అలాంటివి అసలు వదలట్లేదు కదా మీకు రోజు తిండి లేకపోయినా పక్కలోకి ఒక అమ్మాయి కావాలి కదా అని కోపంగా ముఖేష్ మీద అరిచి తన లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని …..నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని చున్ని సరిగా వేసుకొని అపార్ట్మెంట్ బయటికి వచ్చింది…… తను బయటకు వెళ్లేసరికి తన కోసమే క్యాబ్ వెయిట్ చేస్తూ ఉంది……. క్యాబేకి ఆఫీస్ అడ్రస్ చెప్పి తన ఫోన్ ఆన్ చేసింది…… వెంటనే నందిని పంపించిన ఫొటోస్ అన్ని వచ్చాయి అవి చూసి నీలిమ పూజ ఈసారి ఏదో ఒకలా మా మేనేజర తో మాట్లాడి నీకు మా ఆఫీసులో జాబ్ వచ్చేలా చేసానే అని మనసులో అనుకుంది…… తర్వాత సీట్లో సరిగా కూర్చొని కళ్ళు మూసుకొని తన భర్త గురించి ఆలోచించడం మొదలు పెట్టింది ….. ముఖేష్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఎంప్లాయ్… చుట్వాల ద్వారా వచ్చిన సంబంధం ఇది…. తండ్రి చుట్టాల ద్వారా అతని గురించి తెలుసుకొని నీలిమతో మ్యారేజ్ చేశాడు….. కానీ పెళ్లయిన మర్నాడే నీలిమ కి ఒక పచ్చి నిజం తెలిసింది అదే ముఖేష్ ఒక సెక్స్ పిచ్చోడని…… అంతా భయంకరమైన నిజం తెలిసిన తనని మార్చుకుంటా అన్న నమ్మకంతో ముఖేష్ తో కలిసి హైదరాబాద్ కి వచ్చింది……..
ఇక్కడికి వచ్చాక తనకి ఇంకొక పచ్చి నిజం తెలిసింది అదే అమ్మాయిలతోనే కాదు అబ్బాయిలతో కూడా ఎఫెక్ట్ పెట్టుకున్నాడని…….. అంతేకాదు అతనికి సుఖ వ్యాధులు కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయని తెలిసిన ఏం చేయలేని పరిస్థితిలో నీలిమ ఉండిపోయింది……… అలా తన జీవితం నాశనం అయిపోయిన ముఖేష్ తో ఇక్కడికి వచ్చిన తర్వాత నీలిమ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది……. తన కాల మీద తను నిలబడాలి అని సంకల్పంతో కోర్సు నేర్చుకోవడం మొదలుపెట్టింది అలా నేర్చుకునే ప్రక్రియలో తనకు వి.పి ఫ్యాషన్ వరల్డ్ లో తనకి జాబ్ వచ్చింది రెండు సంవత్సరాలుగా అక్కడే తన జాబు కంటిన్యూ చేస్తుంది…….. ఈ రెండు సంవత్సరాల్లో ముఖేష్ చెడు తిరుగుళ్ళు ఎక్కువగా తిరిగి ఆరోగ్యం బాగా దెబ్బతింది…… ఆ విషయం నీలిమకి చెప్పకుండా తనకు తెలిసిన డాక్టర్ ద్వారా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు……. ఆ డాక్టర్ ముఖేష్ తో బయట వాళ్లతో తిరగడం మానేయమని హెచ్చరించాడు……. అప్పటినుంచి ముఖేష్ నీలిమతో కలవడానికి కుక్కలా ఎదురు చూస్తున్నాడు…… నీలిమకి ఆ విషయం మొత్తం తెలిసి చాలా కోపం ఇంకా బాధ కూడా వచ్చాయి కానీ తాను ఏం చేయలేక అతని చెడు అలవాట్లు అన్ని మానేస్తేనే దగ్గరవుతా అని కండిషన్ పెట్టింది…… ఒక నెల రోజులు బుద్ధిగా ఉన్నాడు ముఖేష్ అది చూసి నీలిమ అతను మారిపోతున్నాడని సంబరపడిపోయింది… కానీ కుక్క తోక వంకర అన్నట్టు ముఖేష్ బుద్ధి కూడా అలాంటిదే ఒకరోజు ఆఫీస్ ఆఫ్ డే కావడంతో నీలిమ ఆఫ్టర్నూన్ ఫ్లాట్ కి వచ్చింది…… కానీ ముఖేష్ ఇంట్లో ఉండడని అనుకోండి అనుకుని తన దగ్గర ఉన్న ఇంకో గీత డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లిన తనకి……. తన ఊహలు తారుమారు చేస్తూ ముఖేష్ ఇంకొక అమ్మాయితో ఇంటిమేట్ అవతూ కనిపించాడు అంతే అది చూసి నీలిమ కాలు కింద భూమి కనిపించినట్టు అయింది……
ముఖేష్ మాత్రం తనది తప్పు కాదు అన్నట్టుగా నువ్వు నా దగ్గరికి రావట్లేదు అందుకనే నేను ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఇలా తనతో అని సిగ్గు లేకుండా చెప్పాడు……
అంతే అప్పటినుండి నీలిమా ముఖేష్ అన్న వ్యక్తి తనతో పాటే ఫ్లాట్‌లో ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోయి…… తన లైఫ్ తాను లీడ్ చేస్తుంది…..
ఆలోచిస్తూ ఉండగానే ఆఫీస్ రావడంతో డ్రైవర్ క్యాబ్ ఆపాడు…. నీలిమ కారు దిగి అతనికి మనీ ఇచ్చి ఆఫీస్‌లోకి వెళ్ళింది….
@@@@@@@@@@@@@@@@@@@@
v.p ఫ్యాషన్ వరల్డ్ అని పెద్ద అంతస్తు బిల్డింగ్ అందులో మాక్సిమం 500 పైగా ఎంప్లాయిస్ పనిచేస్తున్నారు…….
ఈ కంపెనీ విజయ్ గారు స్థాపించారు……. ఇక్కడనే కాదు బెంగళూరులో చెన్నైలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి…..
ప్రస్తుతం విజయ్ గారు తన తన నాయనమ్మ ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకపోవడంతో ముంబై కి వెళ్ళాడు……
ప్రస్తుతానికి ఈ బ్రాంచ్ బాధ్యతలు నవీన్ కి అప్పగించాడు…. నవీన్ ఈ కంపెనీలో మేనేజర్ గా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు……. నవీన్ మేనేజరే కాదు ప్రాణ స్నేహితుడు కూడా విజయ్ గారికి…….
నీలిమ వెళ్లేసరికి ఆఫీస్ అంతా కంగారుగా ఉంది మేనేజర్ నవీన్ అరుపులు ఆఫీస్ బయటకు వినిపిస్తున్నాయి……
సార్ లేకపోతే ఆయనకి పిచ్చి లేస్తుంది అని కొంతమంది స్టాఫ్ నవీన్ గురించి మాట్లాడుకుంటున్నారు….
తనకి ఏమి పట్టనట్టు తన క్యాబిన్లోకి వెళ్లి వర్క్ స్టార్ట్ చేసింది….
నవీన్ తో అమ్మ నా బూతులు తిట్టించుకుని క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు అశోక్……
…… అశోక్ నీలిమ బెస్ట్ ఫ్రెండ్స్ ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడుకుంటారు
…… అశోక్ డైరెక్టుగా నీలిమ క్యాబిన్ కొచ్చి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గడగడ నీళ్లు తాగాడు….. అది చూసిన నీలిమ ఏమైంది అశోక్ మన మేనేజర్ ఎందుకు అంతలా అరుస్తున్నాడు…..
. అశోక్ ఏం చేశానే తల్లి డ్రెస్ స్టిచ్చింగ్ కి అండ్ కొత్త డిజైన్ వేయడానికి కొత్త మనుషుల్ని పెట్టమన్నాడు అలాగే పెట్టా…. నా కర్మ గాలి నేను పెట్టిన వాళ్ళందరూ పని తక్కువ షో ఎక్కువ చేస్తున్నారు…….
వాళ్ళందరూ నా దరిద్రం కొద్ది మేనేజర్ సార్ కళ్ళు పడ్డారు అంతే ఇప్పటికిప్పుడు వాళ్ళని ఆఫీస్ బయటకి పంపించాడు…..
అర్జెంటుగా కొత్త వాళ్ళని పెట్టమని ఆర్డర్ వేశాడు బాస్ లేకుండా ఈ పది రోజులు ప్రశాంతంగా ఉంటాం అనుకున్నా కానీ ఏం లాభం……..
ఈ మేనేజర్ మన బాస్ కన్నా దారుణంగా ఉన్నాడు అని నవీన్ ని తిట్టుకున్నాడు……. నీలిమ ఇందులో అయిన తప్పేముంది చెప్పు బాస్ ఎంతో నమ్మకంగా ఆయనకి ఆఫీస్ బాధ్యతలు అప్పగించి వెళ్లారు కదా…… అవును ఇంతకీ మనుషులు దొరికారా…..
అశోక్ లేదు నీలు ఏ మనుషులు దొరకడమో ఏంటో ఎవరు పర్ఫెక్ట్ గా పని చేసే వాళ్ళు లేరు……
నీలిమకి వెంటనే పూజ గుర్తుకు రావడంతో అశోక్ నా ఫ్రెండు ఉంది కాకపోతే తను ఇంటర్ వరకే చదువుకుంది ….కానీ స్టిచ్చింగ్ మరియు డిజైన్స్ కూడా చాలా బాగా వేస్తుంది….. చెప్పడం కాదు నువ్వే చూడు అని నందిని పంపించిన ఫొటోస్ అన్నీ అశోక్ కి చూపించింది…
వావ్ ఎంతో బాగున్నాయి నీలు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మరి…..అంటే మర్చిపోయానురా…..
మరి తను పేరు ఏంటి అండ్ తను ఎక్కడ ఉంది…..
తన పేరు పూజ , ఊర్లో ఉంది…..
. అయితే ఓకే ఇప్పుడు మనం మేనేజర్ గారికి ఇవి చూపించి తనని తీసుకొద్దాం…..
………………… ఇంకా ఉంది……………..
థాంక్స్ ఫర్ రీడింగ్ బంగారు కొండలు 🫂💞
Swipe left/right or tap the sides to turn pages