నిరీక్షణ పలిచింది – 4
అయితే ఓకే ఇప్పుడు మన మేనేజర్ గారికి ఇవి చూపించి తనని తీసుకొద్దాం…….
నువ్వే వెళ్లి చెప్పరా…..
నీలు ఇదిగో ఫోన్ నువ్వే తీసుకెళ్లి చెప్పు…. అమ్మ తల్లి అమ్మాయి నీ బంధువే నా బంధువు కాదు అయినా ఇప్పటికే నా మీద పిచ్చి కోపంతో ఉన్నాడు ఇప్పుడు గాని నేను నీ ఫోన్ తీసుకెళ్తే నీ ఫోన్ పలగడం కంపల్సరీ……. కాబట్టి నోరు మూసుకొని నువ్వు నాతో రా అని బలవంతంగా నీలిమ చేయి పట్టుకుని మేనేజర్ క్యాబిన్ కి లాకెళ్ళాడు……
అబ్బా పొద్దున్నే ఈ రాక్షసుడిని నుంచి కాపాడు తండ్రి అని మనసులో తెగ బాధ పడిపోయింది…….
ఇద్దరూ మేనేజర్ క్యాబిన్ కి వెళ్లి బయట నుంచి మీ ఐ కమింగ్ సర్ అని వినయంగా అడిగారు……..
నవీన్ బేస్ వాయిస్ తో కమాన్ అన్నాడు……..
ఇద్దరూ లోపలికి వెళ్లి సార్ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది తన టైలరింగ్ అండ్ డిజైన్స్ చాలా బాగా వేస్తుంది ఇదిగోండి సార్ అని….. నీలిమ ఫోన్ ని నవీన్ చేతికి ఇచ్చారు……
నవీన్ సీరియస్ గా నీలిమణి చూస్తూ వ విసుగ్గా తన చేతిలో ఉన్న ఫోన్ ని లాక్కొని ఆ డిజైన్స్ అన్ని చూసి ఈ అమ్మాయి ఎక్కడుంది అని అడిగాడు…….
అది సారు మా ఊర్లో ఉంది అని టక్కున సమాధానం చెప్పింది….
అయితే ఈ అమ్మాయిని ఇక్కడికి పిలిపించండి మనం డిజైన్స్ చేసిన డ్రెస్ ని ఆ అమ్మాయి ఒకసారి మన ముందల కుడితే అప్పుడు అమ్మాయి గురించి నేను సార్ తో చెప్తాను…… ఎంత వీలుంటే అంత తొందరగా తనని ఇక్కడికి పిలిపించండి అని ఆర్డర్ పాస్ చేశాడు…..
అంతే నీలిమ సార్ అమ్మాయి ఒక్కతి రావడానికి కుదరదు నేనే వెళ్లి తీసుకురావాలి …..మీరు ఓకే అంటే రేపు మార్నింగ్ వెళ్లి తీసుకొస్తా….
నవీన్ రెండు మూడు రోజులు అంటే కుదరదు నువ్వు ఇంకా ఈ అశోక్ ఇవాళ మన కంపెనీ కారు లో వెళ్లి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తీసుకురండి……
అంటే సార్ అని ఏదో చెప్పబోయిన నీలిమను మధ్యలోనే అడ్డుకొని……
నాకు డిస్కషన్ నచ్చదు కాబట్టి వెళ్లి మీ ప్రయాణం గురించి ఆలోచించండి అని డైరెక్ట్ గా బయటకుపోమని చెప్పాడు…..
ఇద్దరు ఏం చేయలేక బయటికి వచ్చి తల పట్టుకున్నారు….. నేను ఎలాగో సార్ కార్ పంపిస్తున్నారు దా పదా వెళ్దాం అమ్మాయిని తీసుకొని వచ్చేద్దాం……
అదంతా ఈజీ కాదురా పూజ అమ్మ నాన్నకి ఒంట్లో బాలేదు…. వాళ్లని విడిచి అంత తొందరగా రాదు……
అబ్బ నీలు ముందు మీ ఊరు వెళ్దాం ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి పూజని ఒప్పిదం. సరేనా……. సరే అయితే ముందు ఈ విషయం నేను మా అక్కతో చెప్తానని నందిని కి కాల్ చేసింది…..
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
అప్పుడే తన షాప్ కి వెళ్లడానికి రెడీ అవుతున్న నందిని కి చెల్లి నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి…. ఎలా ఉన్నావ్ నీళ్లు బాగున్నావా? అంత ఓకేనా మీ ఆయన బాగా చూసుకుంటున్నారా అని వరుస పెట్టి క్వశ్చన్స్ వేసింది……
అక్క నన్ను మాట్లాడనిస్తావా అని నందిని నీ కసిరింది….
నందిని బుంగమూతి పెట్టుకుని ఎందుకే అలా అరుస్తున్నావ్ నీ గురించేగా అడిగింది…….
అక్క నా గురించి తర్వాత గాని ముందు పూజ ఏం చేస్తుంది….
ఏం చేస్తుంది ఎప్పటిలా అని నాకు బ్లౌజెస్ కుట్టి, ఆ రూప తో మాటలు పడుతూ పిన్ని బాబాయ్ కి సేవ చేసింది అంతే……..
సరే అయితే నేను మన ఊరికి వస్తున్నాను నువ్వు ఇంటి దగ్గరే ఉండు వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుతాను అని కాల్ కట్ చేసింది………..
ఇదేంటి ఉరుము లేని వానల అర్జెంటుగా వస్తా అంటుంది దీనికి మరిది గారికి ఏదైనా గొడవ అయిందా ఏంటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ హాల్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నీలిమ వస్తున్న విషయం చెప్పింది………
పూజ దగ్గరికి వద్దాం……
పూజ కాఫీ గ్లాస్ లో పోసి అందరికీ ఇచ్చి తను కూడా తాగి……. కొంచెం ఉప్మా తండ్రి తల్లికి తినిపించి తను కూడా తిని…..
తర్వాత కొప్పు చుట్టుకున్న బారు జడని విప్పి టైట్ గా అల్లి కింద రబ్బర్ బ్యాండ్ పెట్టింది, మొఖం కూడా కడుక్కొని ముఖానికి బొట్టు కూడా పెట్టుకుని చున్నీ సరి చేసుకుని…
వదిన ఉప్మా చేశాను నువ్వు అన్నయ్య అమ్ము తినేయండి నేను అమ్మానాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను అని రూపతో చెప్పి …ఆటో కోసం బయటికి వెళ్లిది….. దగ్గర లో ఉన్న మెయిన్ రోడ్డు మీద ఉన్న ఆటో నీ ఇంటికి దగ్గరికి తీసుకొచ్చింది…… తండ్రి కాళ్ళకి చెప్పులు వేసి అతని చేతిని భుజం మీద వేసుకొని నెమ్మదిగా నడిపిస్తూ వాకిట్లోకి తీసుకొచ్చే టైం కి……..
అక్కడే దున్నపోతుల నిలబడి రుద్ర వేప పుల్లతో తన పళ్ళు తోముతూ …ఎందుకే ఎప్పుడు చూసినా అతన్ని అలా హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నావ్…… నా మాట విని ఏ పురుగు మందు తీసుకొచ్చి నోట్లో పోసేయ్ దెబ్బకి ఇద్దరు సచ్చి ఊరుకుంటారు……. అలాగే మీకు నచ్చిన వాడితో నువ్వు లేచిపోవచ్చు అని ఏ అన్న చెల్లితో అనని మాటలు అన్నాడు రుద్ర……
సుశీల (తల్లి) బాబు నిన్ను ఏమీ సాయం చేయమని నా కూతురు అడగట్లేదు కదా ఎందుకు ఎప్పుడు చూసినా దాన్ని మీద పడి ఏడుస్తూ ఉంటావు …..తండ్రికి సాయం చేయడం చాత కాదు గాని ఇలా చెల్లెల్ని లేచిపోమని చెప్తున్నావు నీకు సిగ్గు అనిపించడం లేదా……
అటుగా వస్తున్న రూప ఆ మాటలు విని హలో అత్తయ్య గారు… ఆయన తప్పుగా ఏ మాట్లాడలేదు ఇప్పటికే తమరి కూతురికి 22 ఏళ్ళు వచ్చేసాయి…… అందుకనే అన్నగా తనకి మంచి చెప్తున్నాడు అంతే అని మూతి తిప్పుకుంటూ అంది……
సుశీల మంచి చెప్పడం అంటే ఇదేనా…..
రుద్ర మరి మీరు ఆయన కలిసి దానికి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేశారా ఏంటి అని వెటకారంగా అన్నాడు……. ఎలాగో దానికి మీరు పెళ్లి చేయరు కాబట్టే దాన్ని ఎవర్నో ఒకర్ని చూసుకుని వెళ్ళిపోమని నేనే చెప్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు……..
అతని మాటలు విని మనసులోనే మౌనంగా రోదిస్తున్నారు తల్లిదండ్రి…… పూజకి మాత్రం తన అన్నయ్య మాటలకి దుఃఖం పొంగు కొచ్చింది తను ఏడిస్తే ఎక్కడ తన తల్లి తండ్రి ఇంకా ఎక్కువగా బాధపడిపోతారో అని ఆ విషయం అంతటితో వదిలేసింది……..
వాళ్లని ఆటోలో కూర్చోబెట్టి రూప దగ్గరికి వెళ్లి సరుకుల లిస్ట్ తీసుకుని ఆటో ఎక్కి కూర్చొని హాస్పిటల్ పేరు చెప్పింది…… ఆటో డ్రైవర్ హాస్పిటల్ వైపుకు పోనించాడు….
హాస్పిటల్ రాగానే అతని డబ్బులు ఇచ్చి తల్లి తండ్రిని నర్స సాయంతో జాగ్రత్తగా లోపలికితీసుకువెళ్లింది….. ఎప్పుడు తీసుకువెళ్లే డాక్టర్ దగ్గరికి వెళ్లారు ట్రీట్మెంట్ కోసం…..
…………………… ఇంకా ఉంది………..
థాంక్స్ ఫర్ రీడింగ్ బంగారు కొండలు 🫂💞…..
Swipe left/right or tap the sides to turn pages