విలన్ హస్బెండ్-35
అమర్ జై – ఆద్య ల పొజిషన్ చూసి నోరెళ్ళబెట్టి చూస్తూ 😯😯 వామ్మో వీడి పనే బావుంది బయట ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ ఎంజాయ్ చేస్తాడు నా బతుక్కి ఒక కిస్ లేదు, హగ్ లేదు అని తన మీద తనే జాలి పడుతూ మాన్య వైపు సీరియస్ గా చూస్తూ తన ప్లేట్ లో ఉన్న లెగ్ పీస్ తింటూ ఉంటాడు….
వీడేంటి చచ్చిన దాన్ని చచ్చేలా తింటున్నాడు అని అమర్ వైపు చూస్తూ అది ఆల్రెడీ చచ్చింది రా ఎక్కడికి పారిపోదు కాస్త మెల్లగా తిను అని వెటకారంగా చెప్తున్న మాన్య ను చూసి నీకు బాగా వంట్లో మందం ఎక్కువైందే నన్ను ఆద్య వాళ్ళ ఇంట్లో కొట్టడమే కాకుండా ఇక్కడ అందరి ముందు కౌంటర్ వేస్తావా అని అందరూ తనను చూసి నవ్వడం తో ఉడికిపోతూ నవ్వవే నవ్వు ఆగు నీ పని చెప్తా అంటూ మాన్య వైపు చూస్తూ గట్టిగా మాన్య పాదాన్ని తొక్కుతాడు…..
అమ్మా….. అంటూ తన పాదం వైపు చూసుకున్న మాన్య కి అమర్ తన పాదాన్ని టైర్ కింద పడ్డ నిమ్మకాయి లా పచ్చడి చేస్తూ ఉండడం చూసి తన వైపు కోపంగా చూడ్డం తో అమర్ నవ్వుతూ నాతో పెట్టుకోకు అని యాటిట్యూడ్ గా నవ్వుతూ తన కాలిని వెనక్కి తీసుకున్న మరుక్షణం మాన్య కాలి కింద తన పాదం నలిగిపోతూ బోనస్ గా మాన్య తన కాలికి ఉన్న నైల్స్ తో అమర్ తెల్లటి పాదాన్ని పొడుస్తూ అమర్ కి త్రీడి లో నరకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది….
చంపేసింది రా బాబోయ్ అని పైకి అరవలేక లోపలే ఏడుస్తూ ఒసేయ్ దెయ్యం కాలు తీయవే ఇట్స్ రియల్లీ పెయినింగ్ అంటూ మాన్య వైపు చూస్తూ రిక్వెస్ట్ చేస్తున్న అమర్ ను చూసి ఈ బుద్ధి నన్ను అనవసరంగా గెలకక ముందు ఉండాలి ఇంకోసారి నాతో గొడవ పెట్టుకుంటే నీ పాదం ప్లేస్ లో నీ తల ఉంటుంది అని సీరియస్ గా చెప్తూ తన పాదాన్ని వెనక్కి తీసుకుంటుంది మాన్య…..
( ఇక్కడ వీళ్ల కాన్వర్జేషన్ ఎవరికి వినిపించలేదా అని మీకు డౌబ్ట్ రావచ్చు 🫣 వీళ్ళు కళ్ళతోనే కత్తులు విసురుకుంటూ మొహం లో వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ ఒకరిని ఒకరు నోట్లో తిట్టుకుంటూ ఉంటారు అందుకే వీళ్ళ గొడవ ఎవరు చూడలేదు)
మాన్య ఫేస్ ను చూస్తున్న అమర్ కి అరుంధతి మూవీ లో నువ్వు నన్నేం చేయలేవురా అనే డైలాగ్ చెప్తున్న అనుష్క లా కనిపించడం తో తల విదిలించి మాన్య వైపు చూస్తాడు….. వామ్మో ఇది రోజు రోజుకి ఇంత హారిబుల్ గా కనిపిస్తుంది ఏంటి ?? దీన్ని పెళ్ళి చేసుకోవాలి అంటే నేను కచ్చితంగా ఆ మూవీ లో పశుపతి అగోరా లా మారినట్టి నేను కూడా తాంత్రిక విద్యలు నేర్చుకోవాలా అని ఎర్రగా రుధిర వర్ణం లో మారిన తన పాదాన్ని చూసి దీన్ని మీపనిష్ చేయాలని ప్రతీ సారి నేనే వెధవ లా మిగిలిపోతున్నా అని తనను తానే తిట్టుకుంటూ ఉంటాడు…..
అన్నయ్య ఏమైంది నీకు అప్పటి నుండి చూస్తున్నా తినకుండా నీలో నువ్వే మాట్లాడుతున్నావ్ మొహం ఏంటి అలా ఎర్రగా ఉంది ఆర్ యూ ఆల్రైట్??
మాయ ను చూసి మొహాన్ని నార్మల్ గా పెట్టుకున్న అమర్ నథింగ్ రా ఏదో ఆలోచిస్తూ కర్రీ లో ఉన్న చిల్లీ తినేశాను అందుకే ఫేస్ అలా రెడ్ గా ఉంది అని కవర్ చేసి నొప్పెడుతున్న కాలి వైపు చూసుకుని దీన్ని పెళ్ళి చేసుకుంటే నేను ఫ్యామిలీ డాక్టర్ ను ఇంట్లోనే పెట్టుకోవాలేమో అనుకుని మెల్లగా ప్లేట్ లోని ఫుడ్ తింటూ ఉంటాడు…..
జై ఆద్య నడుము మీద ఉన్న చేతిని తన థైస్ మీదకు తీసుకుని వెళ్తూ ఉండడం గమనించిన ఆద్య వాటర్ గ్లాస్ లోకి వంపుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ తన ముందున్న వేడి వేడి టొమాటో రసం బౌల్ వైపు చూసి నవ్వుకుంటూ అది కావాలని జై మీద పడేలా చేత్తో నెట్టి జై తో కేక పెట్టిస్తుంది…..
వేడి వేడి రసం జై మీద పడ్డం తో నడుము కింద నుండి జై వొళ్ళు మొత్తం వేడి వేడి రసం తో తడిచి పోవడం తో పాటు వంటి నిండి వేడి వేడి పొగలు వస్తాయి….. జై ఫార్మల్స్ వేర్ చేయడం వల్ల చర్మం చీలిపోతున్నట్టు గా ఫీల్ అవుతూ ఆద్య వైపు సీరియస్ గా చూస్తూ ఆద్య అంటూ సీరియస్ గా అరుస్తూ పైకి లేచి నుంచుంటాడు…..
అయ్యో సారి జై నిజంగా చూడలేదు వాటర్ తీసుకుంటూ ఉంటే ఆ బౌల్ టచ్ అయి పడిపోయింది బాగా మండుతుందా అని తన నవ్వును పెదవుల మధ్య దాచేసి కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న ఆద్య ను జై కి మరింత కోపం వస్తుంది…..
జై ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకో అని ప్రతాప్ చెప్పడం తో నాకు దొరక్క పోవు అపుడు నీ సంగతి చెప్తా అని సీరియస్ లుక్స్ ఆద్య కి ఇస్తూ జై ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్తూ అమర్ తో తనకు డ్రెస్ తెప్పించి తీసుకుని రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు….
ఆద్య జై వెళ్ళిన వైపు రెక్లెస్ గా చూస్తూ అందరూ తన వైపు డౌబ్ట్ గా చూస్తూ కనిపించడం చూసి నేను కావాలని చేయలేదు డాడీ అంటూ ఇన్నోసెంట్ గా కను రెప్పలు టపా…. టపా…. కొడుతూ ముద్దుగా చెప్తుంది…..
ఆద్య ఇన్నోసెన్సీ ను చూసిన అందరూ మెల్ట్ అయిపోతూ అయ్యో ఇంత చిన్న దానికి ఎందుకు రా అలా ఫీల్ అవుతావు ఇట్స్ ఒకే అపుడపుడు అలా జరుగుతూ ఉంటాయి ఇట్స్ ఒకే లంచ్ ఫినిష్ చెయ్ అని వినయ్ చెప్పడం తో ఆద్య ఎక్కువ సీన్ చేయకుండా కామ్ గా అందరితో పాటు డిన్నర్ చేస్తుంది……
హరిణి అందరితో పాటు లంచ్ ఫినిష్ చేసి వినయ్ ముందు మార్క్స్ కొట్టేయడానికి నేను బావ కి డిన్నర్ తీసుకుని వెళ్తాను అని అమర్ జై కోసం డ్రెస్ తీసుకుని వెళ్ళడం చూసి తను కూడా డిన్నర్ ప్లేట్ పట్టుకుని వెనుకే వెళ్తుంది ….
మాయ ఏంటి ఆ హరీష్ నీ వైపే చూస్తున్నాడు ఏంటి మ్యాటర్ అంటూ నెమ్మదిగా మాయ ను అడుగుతున్న ఆద్య వైపు చూసి ఏంటి హరీష్ ఆ!! అని అడుగుతూ హరీష్ వైపు చూసిన మాయ కి హరీష్ తన వైపు రెప్ప కూడా వేయకుండా చూడ్డం తో మాయ కి చిరాకు పుడుతుంది…..
మాయ కాలి మీద కాలు వేసుకుని తన కాలికి ఉన్న హీల్ హరీష్ కి చూపించడం తో హరీష్ వెంటనే తన చూపు తిప్పేసి నార్మల్ గా మాదేష్ తో మాట్లాడుతూ ఉంటాడు…..
కాసేపటికి అమర్, జై & హరిణి కిందకు వచ్చి అందరితో పాటు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు….. మాదేష్ శ్వేత కి కళ్ళతోనే ఏదో సైగ చేయగానే శ్వేత సరే అని నెమ్మదిగా కళ్ళు ఆర్పి అన్నయ్య మీతో హరీష్ – మాయ ల గురించి మాట్లాడాలి అంటూ నెమ్మదిగా తనే మాటలు స్టార్ట్ చేస్తుంది…..
వినయ్ కి శ్వేత దేని గురించి మాట్లాడాలి అనుకుంటుందో అర్థం అవ్వడం తో చెప్పమ్మా ఎమ్ మాట్లాడాలి అంటూ నార్మల్ గా అడుగుతాడు….
అన్నయ్య మనం ముందుగా అనుకున్నాం కదా హరీష్ మాయ లకు పెళ్ళి చేయాలి అని దాని గురించే నేను అడుగుతున్నా ఎలాగో హరీష్ కూడా వచ్చేసాడు మాయ స్టడీస్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మంచి డేస్ చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం…. అలాగే కుదిరితే అంటూ నీళ్ళు నములుతూ అప్పటికే ఎర్రగా మారిన జై మొహాన్ని చూసి లేని ధైర్యం తెచ్చుకుంటూ హరిణి – జై ల ఎంగేజ్మెంట్ కూడా జరిపించేద్దాం అన్నయ్య….. ఎలాగో ముందు నుంచి ఇద్దరికీ పెళ్ళిళ్లు అనుకున్నదే కదా హరిణి నీకు ప్రాబ్లెమ్ కదా మ్యారేజ్ కి అంటూ కూతురి వైపు చూస్తుంది…..
నాకే ప్రాబ్లెమ్ లేదు మామ్ అని హుషారుగా చెప్తూ జై బుజం మీద తల వాల్చి ఆనందంగా చెప్తున్న హరిణి ను చూసి ఆద్య మాన్య ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకోవడం చూసి ప్రతాప్ విసుగ్గా తల పట్టుకుంటాడు….
హరిణి ను చిరాగ్గా దూరం జరిపి నాకు ప్రాబ్లెమ్ ఉంది అత్త యూ నో మీ అందరికీ ముందే చెప్పాను అది మీ బుర్రకి సరిగ్గా అర్థం కాలేదు అనుకుంటా అందుకే ఇంకో సారి కూడా చెప్తున్నా కళ్ళు వొళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని వినండి నా చెల్లికి హరీష్ అంటే ఇష్టం లేదు ఇది నా ఒపీనియన్ కాదు మాయ ఒపీనియన్ కూడా అంటూ ఏంట్రా నేను చెప్తుంది నిజమే కదా అంటూ మాయ వైపు చూస్తూ అడుగుతాడు….
అవును అన్నయ్య నాకు హరీష్ తో మ్యారేజ్ ఇష్టం లేదు అని చెప్తూ జై పక్కన వెళ్లి నుంచుంటుంది అది చూసిన రేణుక మాయ అంటూ కోపంగా పిలిచి నీకు హరీష్ కి పెళ్లి జరుగుతుంది నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటూ మాదేష్ వైపు చూసి అన్నయ్య అది చిన్న పిల్ల ఎదో తెలియక మాట్లాడింది నువ్వు పురోహితుడిని అడిగి డేట్ ఫిక్స్ చెయ్ అంటూ అప్పటికే కోపంగా కూర్చున్న మాదేష్ ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది…..
జై కోపంగా తన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ను నేల మీదకు వేసి కొడుతూ ఆల్ ఆఫ్ యూ షట్ యువర్ మౌత్స్ మా లైఫ్ పాట్నర్ గురించి మీరెలా డిసైడ్ చేస్తారు మాయ చెప్తుంది కదా తనకు ఇష్టం లేదని ఇట్స్ ఎనఫ్ ఇంకో సారి ఈ టాపిక్ తీస్తే ఎవరికీ మర్యాద దక్కదు అని ఫస్ట్ టైమ్ రేణుక వైపు చూస్తూ సీరియస్ గా చెప్పి మీరేమంటారు తాతయ్య అంటూ ప్రతాప్ వైపు చూస్తాడు……
ఇప్పటికైనా ఇక్కడ నేనొకడ్ని ఉన్నానని గుర్తొచ్చినందుకు సంతోషం అంటూ పైకి లేచి చూడు మాదేష్ పిల్లల అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు ఇప్పుడు నా అభిప్రాయం చెప్తున్నా విను నాకు ఈ సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు అనగానే అక్కడున్న అందరూ పైకి లేచి నుంచుని ఇక్కడేదో గొడవే జరిగేలా ఉందని చూస్తూ ఉంటారు…..
మావయ్య ఎందుకలా మీరు కూడా వీళ్ళ లాగే మొండిగా అంటున్నారు హరీష్, హరిణి లకు ఎమ్ తక్కువ ప్లీస్ మావయ్య మీరైనా పిల్లలకు చెప్పండి ఈ సంబంధం చేసుకుంటే మన రెండు ఫ్యామిలీస్ మరింత దగ్గర అవుతాయి వినయ్ ప్లీస్ మీరైనా మావయ్య కి అర్థం అయ్యేలా చెప్పండి…..
రేణుక నీకు ఈ పెళ్ళిళ్ళ గురించి ముందే చెప్పాను నాకు ఇష్టం లేదు అని అయినా పెళ్లి అంటే ఇద్దరు మనుషుల కలయిక కాదు రెండు కుటుంబాల మధ్య జరిగే సంబరం…… హరీష్, హరిణి లకు ఇష్టం ఉంటే సరిపోదు నీ కొడుకు, కూతురికి కూడా ఇష్టం ఉండాలి నేను ఇంతకు మించి దీని గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు అంటూ అక్కడి నుండి చిరాగ్గా వెళ్ళిపోతాడు…..
నాన్న అభిప్రాయమే నాది కూడా ఇష్టం లేని బంధం లోకి వెళ్ళమని నేను ఎప్పటికీ చెప్పను ఐ ఆమ్ సారి మాదేష్ అంటూ వినయ్ కూడా చెప్పేయడం తో మాదేష్ మరింతగా రగిలిపోతూ ఉంటాడు…. విన్నారు కదా వాళ్ళు ఎమ్ చెప్పారో ఇంకెప్పుడు ఈ పెళ్లి టాపిక్ తీసి యూమన మధ్య ఉన్న ఈ రిలేషన్ ను ఇక్కడితో కట్ అయ్యేలా చేయకండి అని సీరియస్ గా చెప్తూ మాయ , అమర్ లను తీసుకుని జై కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు…..
ఇక మేము కూడా స్టార్ట్ అవుతాం మళ్ళీ కలుద్దాం మాదేష్ అని వినయ్ కి వెళ్తున్నట్టు సైగ చేసి మహీదర్ కూడా తన ఫ్యామిలీ తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…. ఆద్య కార్ ఎక్కుతూ వెళ్తున్న జై కార్ వైపు చూస్తూ ఫస్ట్ టైమ్ వీడు నాకు నచ్చాడు అని నవ్వుతూ జై కార్ వైపు చూస్తూ తను కార్ ఎక్కుతుంది…..
( బాబోయ్ ఇది విన్నారా 😯అయ్యో సారి మీరు వినలేదు కదా 😜 అదే చదివారా ఆద్య పాప జై వైపు చూస్తూ ఫస్ట్ టైమ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయింది ఇట్స్ పార్టీ టైమ్ హుహుహు 🤭🫣 రాజా ది గ్రేట్ లో రవితేజ లా అనాలి ఇప్పుడు మనం 🤣😂)
💜🩷💜🩷💜🩷💜🩷💜🩷💜
తన ఆఫీస్ లో కూర్చుని సీరియస్ & సిన్సియర్ గా వర్క్ చేస్తున్న రుద్రాన్ష్ కి తన వాచ్ వైబ్రేట్ అవ్వడం తో వాచ్ వైపు చూసిన రుద్ర దానికి వచ్చిన నోటిఫికేషన్ చూసి తన కళ్ళు ఎర్రగా మారుతాయి వెంటనే మొబైల్ లోని ఒక యాప్ ఓపెన్ చేసి చూస్తున్న రుద్రాన్ష్ కి శ్రియ, అపర్ణ తన రూమ్ లో ఏదో వెతుకుతూ కనిపించడం చూసి వెంటనే తన లాప్టాబ్ షట్ డౌన్ చేసి కార్ కీస్ తీసుకుని వెంటనే తన విల్లా కి స్టార్ట్ అవుతాడు …..
రుద్రాన్ష్ ఇవాళ డ్రైవర్ ను వద్దు అని చెప్పి తనే సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్ కి రావడం వల్ల ఇప్పుడు కూడా తనే డ్రైవ్ ఆఫీస్ నుండి తన విల్లా కి రీచ్ అవుతాడు….. ఇంటి ముందు ఆగిన కార్ నుండి ఫాస్ట్ గా దిగుతూ లోపలికి వచ్చిన రుద్ర ఎక్కడా ఆగకుండా నేరుగా స్టెప్స్ ఎక్కి తన రూమ్ వైపు వెళ్ళి క్లోజ్ చేసున్న రూమ్ డోర్ ఓపెన్ చేసి వాట్స్ గోయింగ్ ఆన్ అంటూ ఇద్దరి వైపు చూస్తూ సీరియస్ గా అడుగుతాడు…..
సడెన్ గా వినిపించిన రుద్ర వాయిస్ కి కంగారుగా వెనక్కి తిరిగి చూసిన ఇద్దరికీ డోర్ కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ కనిపిస్తాడు రుద్రాన్ష్….!! ఆఫీస్ లో ఉండాల్సిన రుద్రాన్ష్ తమ ఎదురుగా అది కూడా అంత కోపంగా కనిపించడం తో ఇద్దరూ ఒకరిని ఒకరు టెన్షన్ గా చూసుకుంటూ ఎలా కవర్ చేయాలి అని థింక్ చేస్తూ ఉంటారు…..
తన వాడ్రాబ్ లో ఉండాల్సిన థింగ్స్ ఫ్లోర్ మీద బెడ్ మీద ఉండాల్సిన పిల్లోస్ కౌచ్ లో & తను సేఫ్ గా పెట్టిన ఆఫీస్ ఫైల్స్ టేబుల్ మీద ఇలా రూమ్ ను డంప్ చేసిన ఇద్దరినీ చూసి అన్సర్ టు మీ నా రూమ్ లో మీరేం చేస్తున్నారు?? అండ్ ఏంటిది నీట్ గా ఉన్న రూమ్ ను ఎందుకిలా డంప్ లా చేశారు నా రూమ్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు అని అడుగుతూ అక్కడే ఉన్న సోఫా లో సెటిల్ అవుతాడు రుద్రాన్ష్….!?
నీ రూమ్ ను నీట్ గా నేను ఆంటీ ఆర్గనైజ్ చేస్తున్నాం రుద్ర్ అవును నువ్వేంటి ఆఫీస్ లో ఉండకుండా ఈ టైం లో ఇలా వచ్చావ్ అని వెర్రి నవ్వు నవ్వుతూ క్వశ్చన్ చేస్తున్న శ్రియ వైపు చూస్తూ ఇది నా ఇల్లు ఇక్కడికి నేను ఎప్పుడు రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అని లెఫ్ట్ ఐ బ్రో రైస్ చేస్తూ అడుగుతాడు…..
ఐ డిడ్ న్ట్ మీన్ దట్ రుద్ర్ యాక్చుయల్లీ వాట్ ఐ ఆమ్ టెల్లింగ్ ఇస్……
షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ నేను లేనపుడు నా రూమ్ లో మీరేం సెర్చ్ చేస్తున్నారో తెలియనంత కిడ్ ను కాదు నేను !! ఇంకో సారి నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వస్తే అంటూ వేలు పెట్టి చూపిస్తూ గెట్ అవుట్ అంటూ అరవగానే శ్రియ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…….
శ్రి…… శ్రియ అని పిలుస్తున్న అపర్ణ వైపు చూసి వాట్ మామ్ నేను అంత క్లియర్ గా మార్నింగ్ చెప్పాక కూడా యూ డిడ్ న్ట్ చేంజ్ రైట్???
లేదు రుద్ర నేను రాను అనే అన్నాను బట్ శ్రియ నే బలవంతంగా తీసుకుని వచ్చింది ఐ ఆమ్ సారి అని చెప్పి వెళ్తూ ఆగి అవును మేము రూమ్ చెక్ చేస్తున్నట్టు నీకెలా తెలిసింది రుద్ర అని అప్పటి నుంచి అడగాలి అనుకున్నది తటపటాయిస్తూనే అడిగేస్తుంది అపర్ణ…..
నా పర్సనల్ వాడ్రాబ్ మీద నేను తప్పా ఇంకెవరు ఫింగర్స్ టచ్ చేసినా నేను సెట్ చేసిన సెన్సార్ నాకు నోటిఫికేషన్ పంపుతుంది ఇప్పుడు కూడా అలాగే పంపింది అనగానే అపర్ణ రుద్ర తెలివికి నోరు తెరిచి చూస్తూ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా నువ్వు ట్రస్ట్ చేయడం లేదా రుద్ర అంటూ కోపంగా అడుగుతుంది…..
ఆ ట్రస్ట్ ఉంది కాబట్టే ఎంటైర్ రూమ్ కి పెట్టలేదు అని చెప్పి తిరిగి ఆఫీస్ కి వెళ్తూ నేను రేపు ఈవెనింగ్ ఆఫీస్ వర్క్ మీద మలేషియా వెళ్తున్నా 2 మంత్స్ రాకపోవచ్చు నేను వచ్చేసరికి లగేజ్ ప్యాక్ చేయించి & రూమ్ ను ముందులా మెయిడ్స్ తో నీట్ గా ఆర్గనైజ్ చేయించు మామ్ అని తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాడు రుద్ర……
సడెన్ గా ఈ ట్రిప్ ఏంటి ఈయన కూడా నాతో రుద్ర బిసినెస్ ట్రిప్ గురించి చెప్పలేదు ఏంటి అని ఆలోచిస్తూ మెయిడ్స్ తో రూమ్ ను నీట్ గా ఆర్గనైజ్ చేయిస్తూ తను లగేజ్ ప్యాక్ చేస్తూ ప్యారలల్ గా శ్రియ కి కాల్ చేసి రుద్ర ట్రిప్ గురించి ఇన్ఫో ఇచ్చి శ్రియ కి రుద్ర తో జరిగిన డిస్కషన్ గురించి చెప్తూ నెక్స్ట్ ఎమ్ చేసినా బాగా ఆలోచించి ప్లాన్ చేయాలి అని ఇద్దరూ ఫిక్స్ అవుతారు…….
రుద్ర 2 డేస్ చాలా బిజీగా వన్ అవర్ కూడా కాళీ లేకుండా చాలా అంటే చాలా బిజీగా & అంతే హెక్టిక్ వర్క్ తో గడుస్తుంది…… ఫ్లయిట్ కి ఇంకో 2 అవర్స్ మాత్రమే టైమ్ ఉండడం తో అపుడే ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసి విల్లా కి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అయి తన లగేజ్ ను మెయిడ్ తో కిందకు పంపి రుద్ర కూడా కిందకు వస్తాడు…..
తన పేరెంట్స్ ను హగ్ చేసుకుంటూ మిస్ యూ బోథ్ అని చెప్పి ఇద్దరి బ్లెస్సింగ్స్ తీసుకుని ఏడుస్తున్న అపర్ణ ను చూసి అబ్బా మామ్ ఏంటిది ఫస్ట్ నవ్వు అని నవ్వించి తను నవ్వుతూ & ఇంకాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి ఆనంద్ రాగానే ఇద్దరూ ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అవుతారు…..
అపర్ణ వస్తే తను ఇండియా వెళ్తున్నట్టు తెలుస్తుందని ఇద్దరినీ వద్దని చెప్పి డ్రైవర్ తో పాటు ఇద్దరూ ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అవుతారు….. ఫ్లయిట్ అనౌన్స్మెంట్ వినగానే టెర్మినల్ లోకి వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి తన సీట్ లో కూర్చుని ఐ ఆమ్ కమింగ్ పొట్టి అని ఆనందంగా అనుకుని ఎప్పుడు ఫ్లయిట్ ఇండియా లో ల్యాండ్ అవుతుందా అని క్షణాలను లెక్క పెడుతూ ఉంటాడు రుద్ర……❤️
నెక్స్ట్ అప్డేట్ నుండి మాయ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవ్వబోతోంది గెట్ రెడీ గాయ్స్ ఆద్య – జై ల స్టోరీ క్యూట్ గా ఉంటే అమర్ – మాన్య ల స్టోరీ హాట్ గా ఉంటుంది మరి వీళ్లది ఎలా ఉంటుంది అంటారు??