Login with OTP

విలన్ హస్బెండ్-40

aashyatech

Author

హరీష్, హరిణి ల వైపు బాధగా చూస్తున్న రేణుక ను చూసిన మాదేష్ కన్నింగ్ గా నవ్వుకుంటూ నిన్ను ఎలా మౌల్డ్ చేయాలో నాకు బాగా తెలుసు రేణుక ……. నువ్వు ఆ జై గాడి మాటలు విని మమ్మల్ని ఎంత దూరం పెట్టాలి అనుకున్నా నేను నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను నీ వీక్నెస్ మాయ తర్వాత నేనే అని నాకు బాగా తెలుసు …….

 

ఎంతో కష్టపడి ఆ అస్థి నా చేతికి రావాలని పాతిక సంవత్సరాల క్రితమే నిన్ను ఎరగా వేసాను అది నా చేతికి వచ్చే టైమ్ కి ఒక్కొక్కరు ఒక్కో గేమ్ ప్లే చేస్తూ నన్ను వెధవని చేయాలని చూస్తూ ఉంటే నేను సైలెంట్ గా ఎలా ఉంటాను అందుకే నా స్టైల్ లో పర్ఫెక్ట్ ప్లాన్ చేశా ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు చూస్తూ ఉండు వీళ్ళ పెళ్ళి వద్దు అని చెప్పిన నీ నోటితోనే వీళ్ళ పెళ్ళి గురించి అడిగేలా చేస్తాను అనుకుంటూ నార్మల్ గా ఫేస్ పెడుతూ రేణుక చెయ్ పట్టుకుంటాడు……

అన్నయ్య వాళ్లు అంటే చిన్న పిల్లలు నువ్వైనా నా మాట విని మాతో రా అన్నయ్య మీ అందరూ ఇలా బాధ పడుతూ ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను చెప్పు……??

రేణు నవ్వు మా గురించి ఆలోచించకు మాకు ఇందులో నుండి బయటకు రావడానికి టైమ్ పడుతుంది….. పాపం హరీష్, హరిణి లకు నేనే అనవసరంగా లేని పోనీ ఆశలు కల్పించి ఇవాళ వాళ్ళు బాధ పడేలా చేస్తున్నాను…..

అన్నయ్య ప్లీస్ నువ్విలా బాధ పడకు హరిణి కి జై కంటే మంచి సంబంధం చూసి నేను పెళ్ళి చేస్తాను దానికి నువ్వైనా జై ను మర్చిపోమని చెప్పు……

నీ కూతురు కూడా ఎవడో ఒకడిని ప్రేమించాక వాడి కంటే బెటర్ పర్సన్ ను తీసుకుని వస్తాను వాడిని వదిలేయమని చెప్పు రేణు…… నీ కూతురు వింటుందా వినదు ప్రేమించిన వాడినే తలచుకుంటూ హరిణి కంటే ఎక్కువ ఏడుస్తుంది ఇది నిన్ను బాధ పెట్టడానికి ఇలా అనడం లేదు రేణు ఒక సారి మనం ప్రేమించాక ఆ వ్యక్తిని మర్చిపోవడం అంత ఈజీ కాదు అని చెప్తున్నా ……

జై వద్దు అని చెప్తున్నా ఇది ఇంకా ప్రేమ….. ప్రేమ…… అనడం లో అర్థం లేదు అన్నయ్య….. జై ను హరిణి ప్రేమించింది కాదు అనట్లేదు బట్ అదే ప్రేమ జై కి కూడా ఉండాలి కదా?? హరిణి లాగా మూర్ఖంగా బిహేవ్ చేయకుండా థింక్ చెయ్ అన్నయ్య నేను మళ్ళీ కలుస్తాను వినయ్ ఆఫ్టర్నూన్ లంచ్ కి వస్తాను అన్నాడు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి అని రేణుక అక్కడి నుండి వెళ్ళడం చూసిన మాదేష్ వెళ్ళు….. వెళ్ళు…… రేణు నిన్ను ఎలా మళ్ళీ వెనక్కి రప్పించాలో నీ అన్న కి బాగా తెలుసు అనుకుని రాక్షసంగా నవ్వుతూ ఎవరికో కాల్ చేస్తాడు……

 

🤍🩶🤍🩶🤍🩶🤍🩶🤍🩶🤍

 

అబ్బా ఈ టెంపుల్ లో తిరిగి తిరిగి కాళ్ళు లాగేస్తున్నాయి మమ్మీ పూజ ఇంకా కంప్లీట్ అవ్వాలేదా అని చిరాగ్గా వాచ్ వైపు చూస్తూ అదే టెంపుల్ లో ఉన్న కోనేరు దగ్గర కూర్చుని చిన్న చిన్న రాళ్ళు ఏరుతూ వాటిని నీళ్లలోకి విసురుతూ టైమ్ పాస్ చేస్తూ ఉంటుంది ఆద్య…..

 

ఆధ్య వెనుకే తనకు కనిపించకుండా నుంచున్న అభీర్ తనకు డౌబ్ట్ రాకుండా పిక్స్ తో పాటు ఆద్య ను వీడియో క్లిప్ కూడా తీస్తూ ఉంటాడు…. సైడ్ నుండి ఆద్య వీడియో తీస్తున్న అభీర్ కి చీర లో కనీ కనిపించకుండా కనిపిస్తున్న తన నడుమును చూసి నువ్వు చీర కడితే ఇంత అందంగా ఉంటావా……

ఆద్య సీరియస్లీ ఈ క్షణం ఇలా ఆగిపోతే ఎంత బావుంటుంది ఆద్య బంగారు బాపు బొమ్మ లా ఉన్నావ్ అని ఆద్య వైపు చిరు నవ్వుతో చూస్తూ ఆద్య ను ఫస్ట్ టైమ్ చూసినప్పటి నుండి ఇప్పటి వరకూ గుర్తు చేసుకుంటూ బ్యాగ్రౌండ్ లో ఒక సాంగ్ కూడా వేసుకుంటాడు…..

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను

మాయవో నువు ఆశవో
నువు వీడనీ తుది శ్వాసవో
రాయని ఓ గేయమో
నువు ఎవరివో హలా…

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

పరిచయమే పరవశమై నిన్ను నాతో కలిపింది
వ్రాసిందే జరిగింది అయినా కలలా ఉంది

ఒకటయ్యాక మీలో ఇక
నీతో ఉంటామరి నేనిక
లేనే లేదిక తీరిక
ఇది మనసులో కలయిక

ఇంతలో ఎన్నెన్ని వింతలో……!!

( ఇక్కడితో సాంగ్ ఆపేద్దాం ఇంతకీ సాంగ్ ఎలా ఉందో చెప్పలేదు 🤭😌)

ఇప్పుడా ఆది కాదే నాకు అర్జంట్ మీటింగ్…. అబ్బా సరే ఇప్పుడే వస్తున్నా సరే…. సరే వస్తా అంటున్నా కదా ఒకే 20 మినిట్స్ లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి ఆద్య శైలు కోసం గర్భ గుడి లోకి వెళ్తుంది…..

ఆద్య కాల్ కి సాంగ్ నుండి బయటకు వచ్చిన అభీర్ తన కాన్వర్జేషన్ విని సో ఆద్య టెంపుల్ నుండి వెళ్లిపోతోంది….. ప్చ్ ఇంకాసేపు ఉండుంటే బావుండేది అని మొహాన్ని నీరసంగా పెట్టుకుని ఆద్య కార్ దగ్గరకు వెళ్ళి తన కార్ కి ఆనుకుని ఆద్య బయటకు ఎపుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు…..

మమ్మీ నీ పూజ అయితే ఇక స్టార్ట్ అవుదాం నాకు అర్జంట్ వర్క్ ఉంది అని గర్భ గుడి లో కూర్చున్న శైలు పక్కకు వచ్చి నుంచుని హడావిడి గా చెప్తుంది ఆద్య…….

నేను ఇపుడే అమ్ము వచ్చాను ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది ఒక 2 అవర్స్ అయ్యాక వెళ్దాం ఇవాళ ఒక్కటే నా కోసం ఆఫీస్ కి వెళ్ళకు ….. కూర్చో రా చూడు స్వామి ఎంత అందంగా ఉన్నారో అని కనిపిస్తున్న దేవుడి వైపు చూస్తూ అంటుంది శైలు……

 

ఓహ్ గాడ్ మామ్ మొన్న 2 డేస్ వినయ్ మామ వాళ్ళు వచ్చారు అని వెళ్లలేదు ఇప్పుడు టెంపుల్ కోసం అని ఆగితే నేను కంపెనీ మూసేసి నీతో పాటు గుళ్ళు, గోపురాలు అంటూ తిరగాల్సి వస్తుంది….. నువ్వు కావాలంటే 2 గంటలు కాకపోతే 2 రోజులు ఇక్కడే ఉండు బట్ నాకు టైమ్ లేదు….

ఇదిగో కార్ కీస్ నేను క్యాబ్ లో వెళ్లిపోతా అని శైలు పిలుస్తున్నా మొబైల్ క్యాబ్ బుక్ చేస్తూ అక్కడి నుంచి వెళ్తున్న కూతురుని చూసి నిట్టూర్చి ఆద్య మనసు మార్చి పెళ్లి వైపు అడుగులు వేసేలా చూడమని దేవుడు ముందు అప్లికేషన్ పెడుతుంది శైలు…..

షట్ ఏంటిది ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు అని చిరాకు పడుతూ అటు ఇటు చూస్తున్న ఆద్య కి కాస్త దూరం లో కార్ కి ఆనుకుని కనిపిస్తాడు అభీర్….. తనను చూసిన ఆద్య తన వాలెట్ తీసుకుని అభీర్ వైపు ఒక్కో అడుగు వేస్తూ తన వైపు వెళుతుంది…….

వామ్మో ఏంటిది నా వైపు చూస్తూ వస్తుంది కొంపదీసి నేను చాటుగా పిక్స్ తీసింది చూసేసిందా ఏంటి అని టెన్షన్ పడుతూ తన కార్ బ్యానెట్ ను ఓపెన్ చేసి బాగున్న వైర్స్ ను టెన్షన్ తో అటు ఇటు లాగుతూ చెయ్ కాల్చుకుని కెవ్వున కేక పెట్టి ఆద్య దగ్గరకు రావడం చూసి కావాలని వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు అభీర్……..

హలో ఎక్స్క్యూస్ మీ…..!!

యాహ్ హెలో ఎవరూ….. ?? ఏంటి కాల్ వచ్చింది మాట్లాడుతుంటే వాయిస్ వినిపించడం లేదు హెలో…. హలో……

అభీర్ తిక్కల్ బిహేవియర్ కి తల బాదుకుని నవ్వుకుంటూ హలో అభీర్ అంటూ అభీర్ బుజం మీద తడుతూ పిలిచింది నేనైతే కాల్ లో మాట్లాడుతున్నారు ఏంటి???

ఆధ్య వాయిస్ కి వెనక్కి తిరిగి ఆద్య ను అంత దగ్గరగా చూసిన అభీర్ టెన్షన్ గా రెండు అడుగులు వెనక్కి వేసి నుంచోవడం చూసిన ఆద్య అభీర్ వైపే చూస్తూ ఉంటుంది……

ఆధ్య తన వైపు చూడ్డం చూసిన అభీర్ హి హి అని పిచ్చిగా నవ్వుతూ నువ్వా ఆద్య నేను కాల్ అనుకున్నా అని పిచ్చిగా నవ్వుతాడు…..

అభీర్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్ నీకు గైనోఫోబియా ఉందా ఏంటి?? నన్ను చూడగానే చాలు నేనేదో కోవిడ్ పేషెంట్ అయినట్టు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావ్??

వాట్!! నో నో అలాంటిదేం లేదు ఆద్య నాకు అలాంటి ఫోబియాస్ ఎమ్ లేవు నాకు గర్ల్స్ లో ఫ్రెండ్స్ లేరు సో అందుకే అమ్మాయిలతో మాట్లాడడానికి కొంచెం నెర్వస్ ఫీల్ అవుతాను అంతే డోంట్ టేక్ మీ రాంగ్…..

హహ అలాగ ఒకే…. ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ అచ్ఛా కెన్ యూ డు మీ వన్ ఫేవర్ అభీర్ నేను అర్జంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి నా ఫ్రెండ్ ను మీట్ అవ్వడానికి బట్ క్యాబ్ బుక్ అవ్వడం లేదు….. ఇఫ్ యూ డోంట్ మైన్ ప్లీస్ నన్ను హస్పిటల్ దగ్గర డ్రాప్ చేయగలవా అంటూ రిక్వెస్టింగ్ గా అడుగుతుంది…..

దేవత డైరెక్ట్ గా వచ్చి వరం ఇచ్చినంత హ్యాపీగా ఉంది ఈ గాడ్ నిజంగా పవర్ఫుల్ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒక 200 కొబ్బరి కాయలు కొట్టాలి…..

అభీర్ నీతోనే మాట్లాడుతున్నా నన్ను డ్రాప్ చేస్తావా ప్లీస్ నాకు ఎక్కువ టైం కూడా లేదు ఆఫ్టర్నూన్ మీటింగ్ కూడా ఉంది…..

యాహ్ స్యూర్ ఆద్య జస్ట్ 2 మినిట్స్ అని ఆద్య నుండి 100 మీటర్స్ పక్కకు వచ్చి టెంపుల్ లో ఉన్న తన మదర్ కి కాల్ చేసిన అభీర్ ఆద్య అడిగిన హెల్ప్ కూడా చెప్పగానే ఇంకా లేట్ చేస్తే ఆద్య వెళ్ళిపోవచ్చు నేను డ్రైవర్ కి కాల్ చేసి కార్ తీసుకుని రమ్మని చెప్తాను …….

డోంట్ మిస్ ది ఛాన్స్ కన్నా ఆద్య తో కావలసినంత ప్రైవసీ టైం దొరికింది సో ఆద్య తో మంచిగా పరిచయం పెంచుకో అని తన మదర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అభీర్ నవ్వుతూ లవ్ యూ మమ్మా అని నవ్వుతూ కాల్ కట్ చేసి ఆద్య ముందుకు వస్తాడు….

షల్ వి మూవ్ అని కార్ డోర్ ఓపెన్ చేసిన అభీర్ ను చూసి స్మైల్ ఇస్తూ ఆద్య కార్ లో కూర్చోగానే అభీర్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు……..

ఎవరితో అభీర్ ఇందాక అంత చిన్నగా మాట్లాడుతున్నావ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఆ??

అయ్యో అదేం కాదు మా మామ్ టెంపుల్ లో ఉన్నారు సో తనకు ఇన్ఫో ఇస్తున్నాను అంతే అంటూ బుద్దిగా చెప్తున్న అభీర్ ను చూసి నవ్వుకుంటూ అనుకున్నా గర్ల్స్ తో మాట్లాడడానికే షేక్ అయ్యే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంటని ఫైట్స్ బానే చేస్తావ్ బట్ గర్ల్స్ ను చూస్తే పారిపోతావ్ అని నవ్వుతున్న ఆద్య ను చూసి అభీర్ మొహం మాడ్చుకుంటాడు……

 

🤍💗🤍💗🤍💗🤍💗🤍💗🤍

 

అడుగుతుంటే అన్సర్ ఇవ్వవేంటి రాహుల్ నీకు అపాయింట్ చేయడానికి మేల్ పర్సన్స్ ఎవరూ దొరకలేదా అయినా ఆ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ నాకు కొంచెం కూడా నచ్చలేదు అంటూ రాహుల్ కి దగ్గరుండి ఫ్రీగా ఉన్న క్లోత్స్ వేసాక హ్యాండ్ వాష్ చేసుకుంటూ రాహుల్ ఎదురుగా కూర్చుంటుంది……

 

అరే చెప్తుంటే వినవేంటి హరిణి మేల్ పర్సన్స్ అంత కేర్ఫుల్ గా చూసుకోరు ఎట్ ది సేమ్ టైమ్ గర్ల్స్ అయితే చాలా అలెర్ట్ గా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు ….. షి ఇస్ గుడ్ నన్ను బాగా కేర్ చేస్తోంది టైం కి ఫుడ్, మెడిసిన్స్ & నా నీడ్స్ అన్ని చూసుకుంటుంది ….

 

సచ్ ఏ స్వీట్ గర్ల్ ఇక డ్రెస్సింగ్ సెన్స్ అంటావా మనం ఉంటున్న ఈ మోడర్న్ వరల్డ్ లో అందరూ ఇలాగే ఉంటున్నారు ఇంకో 10 ఇయర్స్ కి చూడీస్ వేసే గర్ల్స్ కూడా ఉండరు….. అయినా తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి మనం కామెంట్ చేయకూడదు ఎందుకంటే అది తన ఇష్టం రితిక గురించి వదిలేసి నీ గురించి చెప్పు 2 డేస్ నుండి టచ్ లో లేవు అంతా బానే ఉందా??

అమ్మాయి హాట్ గా ఉంది కదా ఎన్నైనా చెప్తావ్ 😬😬 పోయి పోయి నిన్ను లవ్ చేస్తున్నా చూడు నన్ను అనుకోవాలి గట్టిగా అడుగుదాం అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కూడా తిరుగుతున్నావ్ నేను అడిగానా అంటావ్ అంతా నా కర్మ అని తిట్టుకుంటూ ఎమ్ బావుంది నా బొంద 🤦🤦 అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు ఉంది నా పొజిషన్ 🙆

ఏం అయింది హరిణి ఎందుకంత డిస్టర్బ్డ్ గా ఉన్నావ్ జై తో ఏమైనా ప్రాబ్లెమా ??

ఆ జై తోనే ప్రాబ్లెమ్ రాహుల్……

అంటే?? కొంచెం అర్థం అయ్యేలా చెప్పు

చెప్పడానికి ఏముంది జై తో నా మ్యారేజ్ గురించి తెలుసు కదా ఇప్పుడు మా మ్యారేజ్ తో పాటు హరీష్ మ్యారేజ్ ను కూడా క్యాన్సల్ చేసి పడేసాడు అని జరిగింది మొత్తం చెప్తూ తన ఫాదర్ ప్లాన్ గురించి కూడా చెప్తూ ఉంటుంది వీళ్ళకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ళకు తెలియకుండా రెండు చెవులు వీళ్ళ ప్లాన్ వింటూ ఉన్నాయి…… ( ఆ పర్సన్ ఎవరో గెస్ చేయగలరా ☺️)

🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍

 

జై సంధ్య కాల్ కట్ చేసి ఇంకేం థింక్ చేయకుండా వెంటనే హస్పిటల్ కి స్టార్ట్ అవ్వబోతాడు బట్ నాన్సీ వంటి మీద దుప్పటి తప్పా ఎమ్ లేకపోవడం గుర్తొచ్చి వెంటనే తనకు డ్రెస్ వేయాలని తన వాడ్రాబ్ నుండి ఫ్రీగా ఉండేలా మాక్సీ వేసి తనను రెండు చేతులతో లిఫ్ట్ చేసి బ్యాక్ సైడ్ కార్ లో పడుకోపెట్టాకా కార్ స్టార్ట్ చేస్తాడు……

 

ట్రాఫిక్ లో కూడా ఆగకుండా వెళ్ళి హస్పిటల్ ముందు కార్ ఆపి వెంటనే వార్డ్ బాయ్స్ ను పిలిచి స్ట్రెచర్ తీసుకుని రమ్మని అరవగానే వాళ్ళు కంగారుగా స్ట్రెచర్ తీసుకుని వచ్చి కార్ పక్కనే నుంచోగానే జై నాన్సీ ను జాగ్రత్తగా స్ట్రెచర్ లో పడుకోపెట్టి వెనుకే పరుగు లాంటి నడకతో వెళ్ళడం అప్పుడే అక్కడికి అభీర్ కార్ లో వచ్చిన ఆద్య చూసి షాక్ అవుతూ జై ఏంటి ఇక్కడ ఆ అమ్మాయి ఎవరు ?? అని ఆలోచిస్తూనే థాంక్స్ ఫర్ ది లిఫ్ట్ అబీర్ మీట్ యూ లేటర్ అని చెప్పి కంగారుగా వెళ్ళడం చూసిన అభీర్ కూడా ఆద్య వెనుకే ఫాలో అవుతాడు…..

 

వీడిని మంచిగా అనుకుని 24 అవర్స్ కూడా అవ్వలేదు 😏 అపుడే వీడి రియల్ క్యారెక్టర్ చూపిస్తాడు ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అనుకుంటూనే జై ను ఫాలో అవుతూ వెళ్తుంది ఆద్య…… నాన్సీ ను రూమ్ లోకి తీసుకుని వెళ్ళిన సంధ్య వెయిట్ చేయ్ జై అంటూ డోర్స్ క్లోజ్ చేయగానే రూమ్ బయటే అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు జై……

 

వీడేంటి లేబర్ రూమ్ ముందు టెన్షన్ తో అటు ఇటు తిరుగుతున్న హస్బెండ్ లా అంత టెన్షన్ పడుతున్నాడు ఆ అమ్మాయి గురించి వీడికి ఏంటి ఇంత కంగారు అని నక్కి నక్కి జై వైపు చూస్తూ అటుగా వచ్చిన సిస్టర్ ను ఆపి జై తీసుకుని వచ్చిన అమ్మాయి జై కి ఎమ్ అవుతుంది అని అడుగుతుంది……

నాకు తెలియదు అని చెప్పాలి అనుకున్న సిస్టర్ ఆద్య ఇస్తున్న 2000 నోట్ చూసి వెంటనే నోరు మూసి ఆ నోట్ వెంటనే తీసుకుని నాన్సీ ను జై వైఫ్ గా ఫిక్స్ అయ్యి అదే విషయం ఆద్య కి చెప్తుంది……

ఏంటి వైఫ్ ఆఆఆ 😱😱 ఓరి దేవుడా 🙆🙆 వీడికి గర్ల్ ఫ్రెండ్స్ నే అనుకున్నా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని సీక్రెట్ గా కాపురం చేస్తున్నాడా 🫢 మళ్ళీ మ్యారేజ్ అంటే ఇష్టం లేనట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడు దిక్కు మాలిన వెధవ చెప్తా వీడి పని అంటూ అక్కడే చాటుగా జై ను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆద్య 😌

నాన్సీ ను జై వైఫ్ అనుకున్న ఆద్య ఇదే విషయం వినయ్ కి చెప్తే జై పరిస్థితి ఏంటంటారు మాస్టరు 😌😁??