Login with OTP

విలన్ హస్బెండ్-41

aashyatech

Author

సంధ్య ఎపుడు బయటకు వస్తుందా అని టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తున్న జై కి చారి నుండి నాన్ స్టాప్ గా కాల్స్ వస్తూ ఉండడం తో జై సీరియస్ గా కాల్ లిఫ్ట్ చేసి ఇడియట్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నావ్ ఏంటి అంత కొంప మునిగే మ్యాటర్ ఏంటి చెప్పి చావ్ అంటూ గయ్యుమని అరుస్తాడు……

బాబోయ్ ఈయన ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు ఇప్పుడు విషయం చెప్పాలా వద్దా? చెప్తే ఒక బాధ చెప్పక పోతే మరో బాధ 🤦 చెప్తే ఇది కూడా నాకు చెప్పాలా అంటాడు చెప్పకపోతే నాకు తెలియకుండా నీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి నువ్వెవరు అని గంట క్లాస్ పీకుతాడు  🙆 ఇప్పుడేం చెప్పాలి 🙄

 

ఏంటయ్యా కాల్ చేసి మాట్లాడవ్ దేనికి కాల్ చేసావో త్వరగా చెప్పి తగలడు అంటూ ఫ్రాస్ట్రేట్ అవుతూ అరుస్తున్న జై వాయిస్ కి ఉలిక్కిపడి ఈయన దేనికో బాగా కోపంగా ఉన్నాడనీ తెలుస్తుంది ఇప్పుడు దీని గురించి చెప్పకపోవడమే బెటర్ ఎవడైనా తెలిసి తెలిసి సింహం నోట్లో తల పెడతాడా అనుకుంటూ సర్…. సర్…… ఇంకా ఆఫీస్ కి రాలేదు కదా ఏమైందా అని కాల్ చేసాను??

పెట్టవయ్యా ఫోన్ నేను ఆఫీస్ కి ఎపుడు రావాలో కూడా నీకు చెప్పాలా ఆఫీస్ కి వచ్చాక చెప్తా నీ పని అని సీరియస్ అవుతూ కాల్ కట్ చేసిన జై బిహేవియర్ కి నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ జై సర్ కి అనవసరంగా కాల్ చేసాను ఇప్పుడు ఈయన ఎమ్ చేస్తాడో ఏంటో అని టెన్షన్ పడి బీపీ పెరగడం తో టాబ్లెట్ వేసుకుంటూ చైర్ లో చెతికల పడతాడు చారి…..

ఈ దిక్కు మాలినోడు ఏంటీ ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నాడు అని గోర్లు కొరుకుతూ జై వైపు దాక్కుని చూస్తున్న ఆద్య బుజం మీద ఎవరిదో చెయ్ పడగానే ఉలిక్కిపడి ఆఆ…. అంటూ వెనక్కి తిరిగి చూసిన ఆద్య కి నవ్వుతూ అభీర్ కనిపించగానే గాడ్ అభీర్ నువ్వా అని టెన్షన్ తగ్గించుకుని నువ్వేంటి ఇక్కడ? నువ్వింకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావ్?? అని మెల్లగా అడుగుతుంది……

 

నువ్వు కంగారుగా హాస్పిటల్ లోకి పరిగెత్తావ్ కదా సో ఏమైనా ప్రాబ్లెమ్ ఏమో అని నేను కూడా వెనుకే వచ్చాను….. అది సరే ఫ్రెండ్ ను మీట్ అవ్వాలి అని చెప్పావ్ కదా మరి ఇక్కడేం చేస్తున్నావ్ పైగా 10 మినిట్స్ గా ఆ అబ్బాయి వైపే చూస్తున్నావ్ ఎవరు అతను?? నీ బాయ్ ఫ్రెండ్ ఆ?? అడగడం అయితే తన డౌబ్ట్ అడిగాడు కానీ ఆద్య ఎమ్ చెప్తుందా అని గుండెను అర చేత్తో పట్టుకుని టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు……

ఏంటి బాయ్ ఫ్రెండ్ ఆ?? వాడికి అంత సీన్ లేదు వాడు నాకు లైఫ్ టైమ్ ఎనిమీ యూ నో వాట్ వాడు గర్ల్ ఫ్రెండ్స్ ను వంటి మీద డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా చేంజ్ చేస్తాడు…… ఇంట్లో వీడికి మ్యారేజ్ చేయాలని యుద్దాలే జరుగుతున్నాయి అక్కడేమో వీడు మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టు బిల్డప్ ఇచ్చి ఎవరికి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు…….

అందుకే రెడ్ హ్యాండెడ్ గా తన వైఫ్ తో ఉన్నప్పుడు వాడిని పట్టుకుని అంకుల్ కి కాల్ చేసి చెప్తాను అప్పుడు కానీ వీడి తిక్క కుదరదు అంటూ కోపంగా చెప్తుంది ఆద్య…..

ఆధ్య నువ్వు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నావ్ నువ్వు అనుకుంటున్నట్టు ఆ అబ్బాయి బై ది బై తన పేరు ఏంటి అని జై వైపు చూస్తూ తనను ఎక్కడో చూసినట్టు ఉంది బట్ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు…..??

హు 😏 వాడికి వెధవ వేషాలతో పాటు మా మావయ్య పుణ్యమా అని కొన్ని స్వలక్షణాలు కూడా వచ్చాయి అందుకే వాడు అంత పెద్ద కంపెనీ కి సి. ఈ. ఓ. అయ్యాడు….. పేరు వినే ఉంటావ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దానికి వన్ అండ్ ఓన్లీ సి. ఈ. ఓ మిస్టర్ జై ధీర్ వర్మ ఆది వీడే……

యాహ్ గుర్తొచ్చింది ఒక సారి టీ. వి లో కూడా తన ఇంటర్వ్యూ చూసాను ఎంతో మంది కి జై ఒక రోల్ మోడల్ తెలుసా ఇన్ ఫాక్ట్ నేను కూడా జై ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే బిజినెస్ వరల్డ్ లోకి వచ్చాను……

ఎంటెంటి ఆ రోమియో ను చూసి ఇన్స్పైర్ అయ్యావా 🤦😂 ఇంకా నయం నాకు ముందే చెప్పావ్ లేకపోతే చాలా గోరం జరిగిపోయేది…. చూడు అభీర్ నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది దయచేసి వాడ్ని పొగిడి అది పోయేలా చేయకు వాడో వెధవ అని చెప్తున్నా కదా…….

 

ఇక వాడి భజన ఆపు అని చిరాగ్గా మొహాన్ని తిప్పుకుని జై తనకు ఇష్టం లేకుండా కిస్ పెట్టడం గుర్తు చేసుకుంటూ నన్ను ఆ  రోజు ఎంత హర్ట్ చేసావో అంతకు మించిన పెయిన్ నేను ఇస్తాను లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అనుకుంటూ చూస్తూ ఉంటుంది…..

అందరితో ఎంతో ఫ్రెండ్లీ గా మూవ్ అయ్యే ఆద్య కి జై మీద ఎందుకంత ద్వేషం అని ఆలోచిస్తూ అభీర్ కూడా జై ను అబ్జర్వ్ చేస్తూ అక్కడే నుంచుంటాడు…..

 

హాఫ్ ఆన్ అవర్ తర్వాత బయటకు వచ్చిన సంధ్య ను చూసిన జై ఫాస్ట్ గా ముందుకు వచ్చి నుంచుంటూ సంధ్య ఏమైంది?? నాన్సీ ఎందుకలా ఆన్ కాన్షియస్ అయింది?? ఇప్పుడు ఒకే నా అని అడుగుతున్న జై చెయ్ పట్టుకుని తన క్యాబిన్ లోకి లాక్కుని వెళుతుంది సంధ్య…..

వాళ్ళు వెళ్ళే వరకూ కనిపించకుండా దాక్కున్న ఆద్య అభీర్ చెయ్ పట్టుకుని పక్కనే ఉన్న రూమ్ లో నుండి బయటకు వస్తూ కమ్ అభీర్ వాళ్ళు ఎమ్ మాట్లాడుకుంటున్నారో విందాం అంటూ అభీర్ చెప్పేది వినకుండా సంధ్య వాళ్ళను ఫాలో అవుతూ క్యాబిన్ దగ్గరకు వెళతారు…..

సంధ్య తన క్యాబిన్ లోకి జై తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేయగానే ఓహ్ గాడ్ ఏంటిది డోర్ క్లోజ్ చేశారు అని లోపల జరుగుతుంది వినిపించకపోయినా కనిపిస్తున్న విజువల్స్ చూస్తున్న ఆద్య తనే ఓన్ స్క్రిప్ట్ రెడీ చేసి జై కి మరింత ఎనిమీ గా చేంజ్ అవ్వబోతుంది…..

 

అభీర్ నీకు వాళ్ళ కాన్వర్జేషన్ అర్థం అవుతుందా అని లోపల జరిగేది చూస్తున్న అభీర్ మొహం ముందు చిటికె వేస్తూ క్వశ్చన్ చేస్తుంది…… బయటకు ఎమ్ వినిపించడం లేదు కదా ఆద్య వాళ్లేం మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అంటూ బుజాలు ఎగరేస్తూ అన్సర్ ఇస్తాడు …..

హహ 😅 బట్ నాకు అర్థం అయింది అర్థం కావడమే కాదు వాళ్ళు మాట్లాడేది పిన్ టు పిన్ చెప్తాను కేర్ఫుల్ & క్లారిటీ గా విను…..

వాళ్లేం మాట్లాడుతున్నారో నీకెలా అర్థం అయింది ఆధ్య నువ్వు కూడా నా పక్కనే గా నుంచున్నావ్??

హేయ్ రిలాక్స్ అభీర్ అలాంటివి అర్థం అవ్వాలి అంటే నా లాగ నీకు కూడా ఫేస్ రీడింగ్ వచ్చి ఉండాలి……….

ఏంటి నీకు ఫేస్ రీడింగ్ కూడా వచ్చా??

అరే చెప్పేది విను అభీర్ మధ్యలో ఆపకు నా ఫ్లో మిస్ అవుతుంది అని గ్లాస్ మిర్రర్ నుండి సంధ్య & జై లను చూస్తూ జై తన వైఫ్ ను డౌరీ కోసం టార్చర్ పెట్టడమే కాకుండా ఆ అమ్మాయికి పొట్టి పొట్టి క్లోత్స్ ఇస్తూ మెంటల్ గా హెరాస్ చేయడం వల్ల తన వైఫ్ సూసైడ్ ఎటెంప్ట్ చేసింది……

 

సో ఇప్పుడు తన వైఫ్ చనిపోతే వీడు ఇరుక్కుంటాడు కాబట్టి ఎలా అయినా సేవ్ చేయమని ఎంత అమౌంట్ అయినా ఇస్తానని ఈ మ్యాటర్ బయటకు రాకుండా చూడమని డాక్టర్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు అని చెప్తున్న ఆద్య ను చూసి 🤦 అక్కడేం జరుగుతుందో ఏంటో క్లారిటీ లేదు కానీ నువ్వు మాత్రం చక్కగా స్టోరీ అల్లేసావ్……..

అది స్టోరీ కాదు కళ్ళముందు జరుగుతున్న నిజం దీన్ని వెంటనే మా మావయ్య అదే జై ఫాదర్ కి ఇన్ఫామ్ చేయాలి అంటూ తన మొబైల్ చేతిలోకి తీసుకుంటుంది……..

జరిగింది ఏంటో తెలుసుకోకుండా తొందర పడకు ఆద్య డాక్టర్ ను అడిగి కన్ఫర్మ్ చేసుకుని అపుడు ఇన్ఫామ్ చెయ్ అసలే మీ ఇద్దరికీ పడదు అంటున్నావ్ నువ్వు ఇచ్చేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే అనవసరంగా మీ ఫ్యామిలీ లో డిస్టర్బెన్సెస్ వస్తాయి….

హు 😏 వాడికి భయపడేది ఏంటి తొక్క 🤷 నేను పులి…. ఆడ పులిని మా డాడ్ నన్నలా పెంచారు ( ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా కొంచెం డీప్ గా థింక్ చేస్తే చూసినట్టుగా కూడా గుర్తొస్తుంది 😜)

 

అలాంటిది నేను వాడికి భయపడ్డం ఏంటి అని రెక్లెస్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి వెంటనే వినయ్ వర్మ కి కాల్ చేస్తూ పక్కకు వెళ్తుంది….. ఆఫీస్ లో క్లైంట్స్ తో సీరియస్ కాన్ఫరెన్స్ లో ఉన్న వినయ్ వర్మ నార్మల్ గా అయితే కట్ చేస్తాడు…….

బట్ ఆద్య ఆఫీస్ టైమ్ లో చేస్తూ ఉంటే అది ఇంపార్టెంట్ కాల్ అని అర్థం చేసుకుని జెంటిల్ మెన్ టెక్ ఏ బ్రేక్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ ద బ్రేక్ వుయ్ విల్ కంటిన్యూ అంటూ తన పి. ఎ. తో తనను బయటకు తీసుకొని వెళ్ళమని సైగ చేయగానే తన పి. ఏ వినయ్ వీల్ చైర్ మూవ్ చేస్తూ బయటకు తీసుకుని రాగానే ఆద్య కాల్ పిక్ చేస్తాడు…..

హాయ్ మావయ్య ఎక్కడున్నారు?? డిస్టర్బ్ చేశానా మీరు ఫ్రీగా ఉంటే అర్జంట్ గా సంధ్య హస్పిటల్ అడ్రస్ షేర్ చేస్తాను ఇక్కడికి అర్జెంట్ గా రండి……

హస్పిటల్ ఏంట్రా నువ్వు బానే ఉన్నావా?? అసలేం జరిగింది??

టెన్షన్ అవ్వకండి మావయ్య ఐ ఆమ్ ఒకే…. బట్ ఇక్కడ మీ పుత్రరత్నం గురించి మన అందరికీ తెలియాల్సిన నిజం ఒకటి ఉంది అందుకే మిమ్మల్ని రమ్మంటున్నా…… నాకు ఇప్పుడే తెలిసింది అందుకే వెంటనే మీకు కాల్ చేసాను వెంటనే రండి మావయ్య…..

జై గురించా?? వాడి గురించి తెలుసుకోవాల్సింది ఏముంది ఆద్య వాడి గురించి నా టైం వేస్ట్ చేసుకోను నాకు చాలా అర్జంట్ మీటింగ్స్ ఉన్నాయి బై ఆద్య…..

మీ అబ్బాయికి పెళ్ళి జరిగింది అని చెప్పినా కూడా మీరు రారా మావయ్య…..??

కాల్ కట్ చేయబోతున్న వినయ్ ఆ మాట విని టక్కున ఆగిపోయి వాట్?? ఎమ్ మాట్లాడుతున్నావ్ ఆద్య జై కి పెళ్లి అవ్వడం ఏంటి నేను నమ్మను వాడికి మ్యారేజ్ అంటేనే ఇష్టం లేదు అది నీకు కూడా తెలుసు కదా ఆధ్య……..

అయ్యో నా ఇన్నోసెంట్ మావయ్య అది మన అందరికీ తెలిసిన అబద్ధం బట్ నిజం ఏంటంటే జై కి ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది…… ఆ విషయం ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాడు అంతే కాదు తన వైఫ్ కి హెల్త్ బాలేదు అని హస్పిటల్ కి తీసుకుని వచ్చాడు ఇక్కడే ఇంకో భయంకరమైన నిజం కూడా నాకు తెలిసింది జై ఆ అమ్మాయిని ఫిజికల్ & మెంటల్ గా టార్చర్ పెడుతుంటే ఆ అమ్మాయి అది బేర్ చేయలేక సూసైడ్ ఎటెమ్ట్ చేసింది…..

జై గురించి తెలుస్తున్న ఒక్కో నిజానికి వినయ్ మైండ్ బ్లాస్ట్ అవ్వడం తో అడ్రస్ షేర్ చెయ్ ఆద్య ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని ఆద్య కి చెప్పి తన పి. ఏ. తో కాన్ఫరెన్స్ క్యాన్సల్ చేయమని చెప్పి ఆద్య పంపిన అడ్రస్ కి స్టార్ట్ అవుతాడు వినయ్…..

ఇవాళ అయిపోయావ్ రా 😉 ఈ మూమెంట్ లో తాతయ్య, మామ్, డాడ్ , మాయ, మాన్య, అమర్ బ్రో మిస్ అయితే ఎలా అని వరుస పెట్టి అందరికీ కాల్ చేసి పిలిపిస్తుంది …… వాళ్ళందరినీ తీసుకుని సంధ్య క్యాబిన్ దగ్గరకు తీసుకుని వచ్చి జై ఎప్పుడు బయటకు వస్తాడా అని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది……

కాసేపటికి నీరసంగా మొహం పెట్టుకుని క్యాబిన్ బయటకు వచ్చిన జై కి అక్కడ తన ఫ్యామిలీ మొత్తం కనిపించడం తో షాక్ అవుతాడు…. డాడ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతున్న జై మాట కంప్లీట్ అవ్వకముందే ప్రతాప్, వినయ్ ఇద్దరూ చెంపలు వాయిస్తే చీ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అన్నయ్య అంటూ మాయ మొహాన్ని అసహ్యంగా తిప్పుకుంటే నీతోనా ఇన్ని డేస్ ఫ్రెండ్షిప్ చేసింది అని అమర్ కోపంగా చూస్తూ జై ను తిడుతూ ఉంటాడు…..

ఏనఫ్ జై ఇన్నాళ్లు నువ్వేం చేసినా భరించాను సహించాను ఇక నా వల్ల కాదు నువ్వేం చెప్పినా నేను వినను మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయికి తాళి కట్టి మన ఇంటికి తీసుకుని రా రేపే సంప్రదాయంగా గుడిలో మీ పెళ్ళి జరిపించి రిసెప్షన్ గ్రాండ్ గా ఎరేంజ్ చేస్తాను అని ప్రతాప్ సీరియస్ గా చెప్పగానే జై ఆద్య వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు……

అయిపోయింది….. అయిపోయిందోచ్…… ఏయ్ జింకచికా…..జింకచికా ….. చికా…..చీకా …… జై పెళ్లి అయిపోయింది అని పిచ్చి దానిలా నవ్వుతూ డ్రీమ్స్ లోనే డాన్స్ వేస్తున్న ఆద్య ను చూసి ఆద్య….. ఆద్య…. అని తన బుజాలు పట్టుకొని ఏమైంది నీకు ఎందుకలా నవ్వుతున్నావ్ పిలుస్తున్నా అలా పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావ్ ??

అభీర్ పిలుపుకు డ్రీమ్స్ నుండి రియాలిటీ లోకి వచ్చిన ఆద్య తనను తాను చూసుకుని చుట్టూ చూస్తుంది తనకు ఎవరు కనిపించరు….. అదేంటి ఎవరు లేరు మావయ్య…. తాతయ్య ఎక్కడ?? జై ను కొట్టి మ్యారేజ్ కి ఒప్పించారు కదా మాయ కూడా వచ్చింది ఎవరు కనిపించరు ఏంటి???

ఆధ్య ఎమ్ మాట్లాడుతున్నావ్ ఇక్కడ ఎవరు లేరు నువ్వు నేను మాత్రమే ఉన్నాం ఏదైనా కళ కన్నావా ఏంటి???

కళ?? బట్ అది నిజం లాగే ఉంది 🤦🤦 ఛా అనవసరంగా నా టైం మొత్తం వేస్ట్ అయిపోయింది….. అయినా ఎలాగో అదేగా జరిగేది ఇదంతా కాదు నేను డైరెక్ట్ గా జై తోనే తేల్చుకుంటా తప్పుకో అంటూ క్యాబిన్ డోర్ దబా ….. దబా బాదేస్తూ సంధ్య క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే బుల్లెట్ లా లోపలికి దూసుకుని వెళ్ళిన ఆద్య ను చూసి అభీర్ తన వెళ్ళాలి అనుకునే లోపే క్యాబిన్ డోర్ లాక్ అవుతుంది……

 

హహ మీరందరూ అదంతా నిజమే అనుకున్నారు కదా 😜😜 అమ్మో అదే నిజం అయితే నన్ను చంపేయరు 😌☹️ జై ఆద్య సీన్స్ కావాలి అన్నారు కదా అందుకే 2 ఎపిసోడ్స్ మొత్తం వీళ్లది ప్లాన్ చేశా నెక్స్ట్ అప్డేట్ లో కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారు…..

 

మీరు ఇప్పుడు హ్యాపీ కదా అప్డేట్ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా చెప్పండి గాయ్స్ మీ కోసం మేము ఎంతో ఎఫెర్ట్స్ పెడుతున్నాం దానికి మీరు ఒక చిన్న కామెంట్ చేసి వీడియో కి హైప్ ఇస్తే వుయ్ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ ☺️ స్టే ట్యూన్ టు బ్రోకెన్ హార్ట్స్ 💔 💔

ఆధ్య కాల్ తో హస్పిటల్ కి వచ్చిన వినయ్ నాన్సీ తో జై పెళ్ళి జరిపించబోతున్నాడా ??