Login with OTP

విలన్ హస్బెండ్ – 44

aashyatech

Author

సడెన్ గా జరిగిన ముద్దు కి ఆద్య కళ్ళు పెద్దవి చేసి జై వైపు చూస్తూ ఉంటే ఆత్రం ఆగని జై మాత్రం దొరికిందే ఛాన్స్ అన్నట్టు చిన్నపిల్లాడు చాక్లెట్ తింటున్నట్టు ఆద్య లిప్స్ ను వదలకుండా లిక్ చేస్తూ ఉండడం చూసిన ఆద్య కోపంగా జై ను నెట్టడం జై వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చి  ఫెవికోల్ లా ఆద్య లిప్స్ ను జుర్రేస్తున్నాడు……

ఆ ఆ ఆ ఆ అని అరుస్తూ పెదాలు బిగపట్టి జై ను కోపంగా దూరంగా నెట్టగానే జై వెళ్ళి కుషన్ లో పడి ఆద్య ను చూసి నవ్వుకుంటూ కళ్ళు ఎగరేస్తాడు….. యూ పాగల్ ఏంట్రా నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావ్ నేనేం అయినా డాల్ అనుకున్నావా అంటూ మండుతున్న లిప్స్ వైపు మిర్రర్ లో చూసుకుని కోపంగా జై జుట్టు పట్టుకుని లాగుతూ కొడుతుంది…..

ఏయ్ కోతి ఆగవే జుట్టు వదులు బాగా నొప్పిగా ఉంది అంటూ ఆద్య రెండు చేతులను తన ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో ఆద్య మెడ వెనుక పట్టుకుని తన మీదకు లాక్కున్న తర్వాత తన ఊపిరికి ఆధ్య ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్న ఆద్య వైపే మైమరచి చూస్తూ ఉంటాడు….. నువ్వంటే నాకు ఎంత కోపం ఉన్నా నీ బ్యూటీ కి మాత్రం నేను అడిక్ట్ అయిపోయాను అంటే నమ్ముతావా యూ నో నాకు ఎవరైనా అమ్మాయి హిప్ పట్టుకుని కిస్ చేస్తేనే ఫీలింగ్స్ వస్తాయి బట్ నీ ఊపిరి తగిలినా నా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి……

ఆంటీ అంకుల్ బ్యూటీ మొత్తం వచ్చేసిందే నీకు అని సైడ్ స్మైల్ తో చెప్తూ నీలో నాకు ఇచ్చేది ఇదిగో ఈ చిన్ని పెదవి మీద ఉన్న బుజ్జి పుట్టు మచ్చ ఇది కనిపించి నన్ను బాగా ప్రవోక్ చేస్తోంది అందుకే నాకే తెలియకుండా ఇలా కిస్ చేస్తుంటా అంటూ మళ్ళీ ఆద్య పై పెదవి ను తన నాలుక తో లిక్ చేస్తూ పుట్టు మచ్చ మీద తన రెడ్ లిప్స్ ను అలాగే ఉంచేస్తాడు……

ఆధ్య అపుడే ఫ్రెష్ అయి వచ్చినట్టు తన వంటిని వీడని షవర్ జెల్ స్మెల్ ను గుండెల నిండా పీలుస్తూ మరో సారి ఆద్య లిప్స్ ను వదలకుండా కిస్ చేసి ఆద్య కి ఊపిరి అందని టైం కి తనను వదిలి దూరం జరిగి ఎమ్ జరగనట్టు నుంచుంటాడు…..

ఆధ్య లోయర్ లిప్ కి బ్లడ్ రావడం చూసిన జై నవ్వుకుంటూ తన రూమ్ లో ఉన్న వెట్ వైప్స్ తీసుకుని క్లీన్ చేయబోతాడు అది చూసిన ఆద్య కోపంగా జై చేతిలో నుండి వాటిని లాక్కుని యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ ఇంతకు ఇంతా నీ మీద రివేంజ్ తీర్చుకోక పోతే నా పేరు ఆద్య నే కాదు అని ఎర్రటి కళ్ళతో జై వైపు చూస్తూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది……

దీనికి రివేంజ్ తీర్చుకోవడం కూడా వచ్చా అని ఆద్య ఛాలెంజ్ కి నవ్వుకుని లేకపోతే హాస్పిటల్ లో నన్నే ఇన్సల్ట్ చేస్తావా ఇప్పుడు కాదే వస్తావ్ గా విలేజ్ కి అక్కడ నీతో నరకం స్పెల్లింగ్ రాయిస్తాను అని సైడ్ స్మైల్ తో చెప్తూ ఆద్య ఫ్రాగ్రెన్స్ ఫీల్ అవుతూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్న ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి యోగా చేయడానికి వెళతాడు……

న్యాస్టి ఫెలో వీడికి అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు హాస్పిటల్ లో ఏమో ఆ డాక్టర్ పాప వీడి గురించి అంత గొప్పగా చెప్పింది కానీ చేసే పనులు మాత్రం ఇంత చండాలంగా చచ్చాయి….

ఇంకో సారి నా ముందు ఎవరైనా వాడిని పొగడాలి అపుడు చెప్తా వాళ్ళ సంగతి అని పళ్ళు నూరుతూ వెట్ వైప్స్ తో బ్లడ్ రాకుండా నీట్ గా క్లీన్ చేసుకుని అటుగా వెళ్తున్న మెయిడ్ తో మాయ రూమ్ అడిగి కన్ఫర్మ్ చేసుకుని అటుగా వెళ్తుంది…..

ఆధ్య ను అక్కడ చూసిన ఆనంద్ హ్యాపీగా ఫీల్ అవుతూ అరే తను…. తను…..?? ఆధ్య కదా రుద్ర సిస్టర్ తనేంటి ఇక్కడ ముందు ఈ విషయాన్ని రుద్ర కి చెప్పాలి అనుకుంటూ రుద్ర రూమ్ వైపు పరిగెడతాడు…..

రుద్ర….. రుద్ర అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుని రెడీ అవుతున్న రుద్ర ను చూసి ఎక్కడికి రా రెడీ అవుతున్నావ్?? నీకో గుడ్ న్యూస్ చెప్పనా అది వింటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావ్…..

అవన్నీ తీరిగ్గా మళ్ళీ మాట్లాడుకుందాం కానీ అర్జంట్ గా మనం బయటకు వెళ్ళాలి కానీ పదా డిన్నర్ టైం కి వచ్చేద్దాం అసలే నాకు ఎపుడెపుడు మమ్మీ వాళ్ళను చూద్దామా అని చాలా ఎక్స్సైటింగ్ గా ఉంది……

అదే రుద్ర నేను కూడా నీతో చెప్పడానికి వచ్చాను ఇందాక ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా…?? నీ చెల్లి రా అంటూ ఆనంద్ సంతోషంగా చెప్పగానే మిర్రర్ లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటున్న రుద్ర షాక్ అవుతూ వాట్ నిజమా ఎపుడు? ఎక్కడ?? పదా వెళ్ళి చూద్దాం అంటూ ఆనంద్ చెయ్ పట్టుకుని తన రూమ్ బయటకు వచ్చి చూడగా అక్కడ ఆ ఫ్లోర్ మొత్తం సెర్చ్ చేసినా ఆద్య ఎక్కడ కనిపించదు…..

రేయ్ ఎక్కడ రా ఆద్య చూసా అన్నావ్ గా ఎక్కడ కనిపించదు ఏంటి నువ్వు సరిగ్గా చూసావా తను ఆద్య నే కదా?? లేదా మాయ ను వెనుక నుండి చూసి ఆద్య అనుకున్నావా??

డు యూ థింక్ ఆమ్ ఐ బ్లైండ్ ఆర్ వాట్?? నేను సరిగ్గా చూసా తను నీ సిస్టర్ ఆద్య నే నువ్వే అన్నావ్ గా మీ ఫ్యామిలీ కి జై ఫ్యామిలీ కి మంచి రిలేషన్ ఉండేదని సో అందుకే ఇక్కడికి వచ్చి ఉంటది ….. నువ్వు టెన్షన్ అవ్వకు జై లేదా మాయ ను మీట్ అవ్వడానికి వచ్చిందని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది ఇపుడు మనం వాంటెడ్ గా వెళ్ళి చూస్తే లేని పోనీ డౌబ్ట్ మనమే క్రియేట్ చేసినట్టు అవుతుంది…..

వుయ్ విల్ డు వన్ థింగ్ తను ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళాలి అంటే హాల్ లోకి రావాలి కదా సో మనం కింద వెయిట్ చేద్దాం….. సూపర్ రా గుడ్ ఐడియా పదా అంటూ రుద్ర, ఆనంద్ హాల్ లోకి వెళ్లి కూర్చుని ఆద్య ఎపుడు కిందకు వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటారు…..

డోర్ నాక్ చేస్తున్న సౌండ్ కి డ్రెస్సెస్ అన్ని బెడ్ మీద పడేసి ఏది వేద్దాం అని ఆలోచిస్తున్న మాయ ఆ సౌండ్ విని వదిన వచ్చింది అని నవ్వుతూ వెళ్ళి ఆద్య ను హత్తుకుని కమ్ వదిన నీ కోసమే చూస్తున్నా రా అంటూ లోపలికి తీసుకుని వచ్చి డోర్ లాక్ చేస్తుంది…..

వాట్ వదిన ఇంత లేట్ గానా వచ్చేది సరే చెప్పు ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ బావుందా చాక్లెట్ కలర్ డ్రెస్ బావుందా అంటూ రెండు తన వంటి మీద వేసుకుని చూపిస్తూ అడుగుతుంది….

హ్మ్మ్…. రెండు కాదు ఇదిగో ఈ లావిష్ కలర్ ఫ్రాక్ బావుంది ట్రై చెయ్ అని మాయ కి చెప్పగానే దాన్ని ట్రై చేసిన మాయ వావ్ వదిన నీ టెస్ట్ సూపర్ నాకు బలే సెట్ అయ్యింది అని మిర్రర్ లో చూసుకుని నవ్వుతూ చెప్తూ ఆధ్య లిప్స్ వైపు చూసి అయ్యో వాట్ హ్యాపెండ్ వదిన నీ లిప్స్ ఏంటి అలా అయ్యాయి అని లైట్ గా బ్లడ్ స్టెయిన్స్ ను చూసి కంగారుగా అడుగుతుంది…..

ఏం అవ్వలేదు రా ఒక కుక్క కొరికింది అంటూ మాయ తన వైపు డౌబ్ట్ గా చూస్తూ ఉండడం చూసి నవ్వుతూ కవర్ చేస్తుంది…. ఏంటి కుక్క కొరికిందా ఫస్ట్ హస్పిటల్ కి వెళ్దాం పదా వదిన ముందు నువ్వు ఇంజెక్షన్ చేయించుకోవాలి ఇన్ఫెక్షన్ అవ్వకుండా……

దీనికి ఇంజెక్షన్ కాదు మాయ చేయించాల్సింది ఆ కుక్క ను లాగి పెట్టీ కొట్టాలి మన పెద్ద వాళ్ళు చెప్పారు కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సో అది నేను త్వరలోనే చేస్తాను కానీ దేని గురించి వర్రీ అవ్వకుండా ఫాస్ట్ గా రెడీ అవ్వు అని మాయ ను తొందర పెట్టి తను రెడీ అయ్యాక ఇద్దరూ కలిసి కిందకు వెళతారు…..

వీళ్ళ ముందు నడుస్తూ కిందకు దిగుతున్న జై ను చూసిన మాయ కి బుర్ర లో ఏదో ఐడియా రాగానే నాలుక బయట పెట్టుకుని నవ్వుతూ కావాలనే ఆద్య దిగుతూ ఉండగా తన కాలు అడ్డు పెడుతుంది…. జై ను తిట్టుకుంటూ స్టెప్స్ దిగుతున్న ఆద్య వెంటనే స్లిప్ అయి జై మీద పడ్డం తో తనను బ్యాలెన్స్ చేయలేక జై కింద పడిపోతాడు అలా ఇద్దరూ దొర్లుతూ కింద వరకూ వెళ్లి హాల్ లో ఉన్న ఆఖరి మెట్టు దగ్గర ఆగుతారు…..

నేల మీద జై తన మీద ఆద్య వాళ్ళను అలా చూసిన రుద్ర, ఆనంద్ ఒకరిని ఒకరు చూసుకుని పైకి లేచి ఫాస్ట్ గా వీళ్ళ ముందుకు నడుస్తారు….. చచ్చాన్ రా బాబు అని అరుస్తూ ఏయ్ కళ్ళు కాకినాడ లో పెట్టి నడుస్తున్నావా ఎప్పుడు చూసిన వచ్చి నా మీద పడతావ్ ఎంటే నిన్ను సేవ్ చేయడమే నాకో డ్యూటీ అయిపోయింది……??

హు 😏 నువ్వేం తక్కువ 🤷 నువ్వు చూసి నడవచ్చు కదా నేనేదో కావాలని వచ్చి పడ్డట్టు వాగాకు కాలు స్లిప్ అయి పడ్డాను అయినా నీ మీద కావాలని పడడానికి నువ్వేం అయినా మహేష్ బాబు అనుకుంటున్నావా 😬…..

ఓహ్ అయితే నీకు మహేష్ బాబు మీద పడా లి అని ఉందనమాట ఈ విషయం నమ్రత కి తెలిస్తే కత్తి తీసుకుని వచ్చి నీ కడుపులో దించుద్ది జాగ్రత్త 🥱…..

కావాలని నన్ను రెచ్చ కొడ్తున్నావ్ కదా నిన్ను చంపేస్తాను రా అంటూ గట్టిగా జై గొంతు పట్టుకోబోతున్న ఆద్య ను చూసిన మాయ అయ్యో వదిన ప్లీస్ ఆపు ముందు నువ్వు పైకి లే అయినా మీరు నుంచుని కూడా గొడవ పడొచ్చు లేదా మీకు ఇలాగే కంఫర్ట్ గా ఉందంటే చెప్పండి మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాం అని నవ్వు ఆపుకుంటూ చెప్తుంది మాయ…..

మాయ మాట విన్న ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కంగారుగా లేచి నుంచోవాలి అని అనుకుంటున్న ఆధ్య మళ్ళీ స్లిప్ అయి జై కి అతుక్కుపోతుంది…… బియ్యం బస్తా లా పదే పదే మీద పడకు నిన్ను మోయడానికి నేను మనిషిని బర్రె ను కాదు అంటూ జై ఆద్య ను పక్కకు దొర్లించి తనే పైకి లేచి నుంచుంటాడు…..

సచ్చినోడా…..!! అమ్మా నా నడుము అంటూ మాయ చెయ్ పట్టుకుని పైకి లేచిన ఆద్య తన నడుమును అటు ఇటు తిప్పుతూ లెఫ్ట్ సైడ్ చూసిన తనకు కొత్తగా కనిపిస్తున్న ఇద్దరిని చూసి టక్కున స్ట్రెయిట్ గా నుంచుని మాయ ఎవరు వీళ్ళు అంటూ రుద్ర వైపు చూస్తూ అడుగుతుంది…..

అన్నయ్య బిజినెస్ పార్ట్నర్ వదిన పేరు అవును పేరు అడగడం మర్చిపోయా అన్నయ్య వీళ్ళ నేమ్స్ ఏంటీ అంటూ జై వైపు చూస్తూ అడుగుతుంది….. జై నేమ్ చెప్పే లోపు హాయ్ ఐ ఆమ్ ఆర్యన్ అంటూ రుద్ర తనను ఆర్యన్ గా పరిచయం చేసుకుంటూ ఆనంద్ ను మాత్రం ఆనంద్ లానే పరిచయం చేస్తాడు…..

హాయ్ అంటూ ఆద్య రుద్ర వైపు చూస్తూనే తన నేమ్ చెప్పి పరిచయం చేసుకుని పదా మాయ వెళ్దాం అంటూ మీట్ యూ లేటర్ అని రుద్ర వైపు చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది….. వాళ్ళు వెళ్లగానే రుద్ర ఎందుకు నీ ఒరిజినల్ నేమ్ చెప్పకుండా ఫేక్ నేమ్ తో పరిచయం చేసుకున్నావ్ అంటూ డౌబ్ట్ గా అడుగుతాడు…..

స్పెసిఫిక్ రీసన్ అంటూ ఎమ్ లేదు జై నా గురించి ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నా నాకు నా ప్రైవసీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదు అంతే అని జై కి డౌబ్ట్ రాకుండా క్యాజువల్ గా అన్సర్ ఇచ్చినా జై లో ఇది అని తెలియని డౌబ్ట్ స్టార్ట్ అయినా దాన్ని టైం వచ్చినప్పుడు రివీల్ చేయాలని రుద్ర అన్సర్ కి నమ్మినట్టే యాక్ట్ చేస్తాడు……

రుద్ర జై వైపు చూస్తూ జై నిన్నో విషయం అడగనా ఏంటి వీడు రాగానే నా పర్సనల్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని నువ్వు ఫీల్ అవ్వకపోతేనే ఆన్సర్ ఇవ్వు నీకు ఆద్య అంటే ఇష్టమా??

రుద్ర క్వశ్చన్ కి జై కళ్ళ ముందు ఆద్య రూపం & తనతో ఆన్ ఎక్స్పెక్టెడ్ గా జరిగిన కిసెస్ గుర్తు రాగానే యాహ్ ఇష్టమే రుద్ర దేనికి అలా అడిగావ్ …. ??

నథింగ్ ఎందుకో అనిపించింది అంటున్న రుద్ర ను చూసి ఓహ్ ఒకే మీరు రెస్ట్ తీసుకోండి నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది డిన్నర్ లో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని జై నాన్సీ ను చూడ్డానికి హస్పిటల్ కి వెళ్తే కార్, బైక్ కొనడానికి రుద్ర, ఆనంద్ షో రూమ్ వైపు బయటకు వెళతారు…..

🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️

 

షాపింగ్ కోసం మాల్ కి వెళ్ళిన ముగ్గురు ఫుల్ గా షాపింగ్ చేస్తూ నచ్చిన ఫుడ్ ను తింటూ నైట్ వరకూ బయటే ఎంజాయ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు రిటర్న్ అవుతారు….. బయటే డిన్నర్ చేయడం తో ముగ్గురు ఎవరి హౌసెస్ కి వాళ్ళు వెళ్ళి మరో సారి డ్రెసెస్ ట్రైల్ చేసి హ్యాపీగా బెడ్ ఎక్కేస్తారు….. ఇలా మరో 4 డేస్ అందరికీ బీసీ బీసీగా క్షణం కూడా తీరిక లేకుండా గడుస్తాయి జై, రుద్ర కి ఆఫీస్ ప్రాజెక్ట్ అంటూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం మిడ్ నైట్ రావడం తో ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు……

 

రుద్ర అపుడపుడు ఎవరికి తెలియకుండా తన పేరెంట్స్ ను చూసుకుంటూ మరో వైపు ఎంత లేట్ అయినా నిద్రపోతున్న మాయ ను ఒక సారి చూసి కానీ రుద్ర నిద్రపోడు….. నెక్స్ట్ డే నే అందరు విలేజ్ కి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 10 డేస్ అన్ని టెన్షన్స్ వదిలేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఆ నైట్ నే అందరూ ఆద్య విల్లా కి స్టార్ట్ అవుతారు….. రుద్ర, ఆనంద్ ను కూడా అమర్, జై బలవంతంగా ఒప్పించడం తో వీళ్ళు కూడా అందరితో పాటు లగేజ్ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అవుతారు…..

అందరినీ నవ్వుతూ ఇంట్లోకి వెల్కమ్ చేస్తున్న మహిదర్ కి ఆఖరున ఇంట్లోకి వస్తున్న రుద్ర ను చూసి ఈ అబ్బాయి అంటూ వినయ్ వర్మ వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తాడు…… జై బిజినెస్ పార్టనర్ అంటూ వినయ్ పరిచయం చేయగానే రుద్ర అప్పటికే తన కన్న తండ్రిని ఇన్ని ఇయర్స్ తర్వాత డైరెక్ట్ గా అది కూడా అంత దగ్గరగా చూస్తూ ఉంటే కళ్లల్లో నీళ్లు తిరగడం తో పాటు హార్ట్ బీట్ కూడా రైస్ అవుతూ ఉంటుంది…….

నేనే డాడ్ నీ రుద్ర ని నన్ను ఇంకా గుర్తు పట్టలేదా అని అరిచి చెప్పాలి అనున్నా చెప్పలేని సిచియేషన్ కి తనలో తనే ఒక అగ్నిపర్వతాన్ని మోస్తూ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని మహిదర్ కాళ్ళకు పక్కనే ఉన్న శైలు కాళ్ళకు నమస్కారం చేస్తూ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు…. మహిదర్ వాళ్లకు కూడా రుద్ర ను చూడగానే తెలియని హ్యాపీనెస్ దూరం అయింది దొరికింది అన్న సంతృప్తి వాళ్ళ మొహాల్లో క్లియర్ గా కనిపిస్తూ తెలియని హాయిని ఇస్తోంది అది ఎందుకో వాళ్లకు కూడా అర్థం కావడం లేదు…..

అలా అందరి ముచ్చట్లతో డిన్నర్ టైమ్ కూడా అవ్వడం తో కుక్ చేసిన స్పెషల్ డిషెస్ తో డైనింగ్ టేబుల్ ఫుల్ చేసిన శైలు అందరికీ తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది….. గాడిద లా కూర్చుని తినడానికి రెడీ అయిన రేణుక ను వినయ్ కళ్ళతోనే కంట్రోల్ చేయడం తో చీ….. నా బ్రతుకు ప్రశాంతంగా కూర్చుని తినడానికి కూడా లేదు అని తిట్టుకుంటూ పైకి లేచి నవ్వు నటిస్తూ తను కూడా సర్వ్ చేయడం మొదలు పెడుతుంది…..

అయ్యో మీరు కూర్చోండి వదిన నేను వడ్డిస్తున్నా కదా మళ్ళీ మీరు ఎందుకు లేవడం……?? పర్లేదు శైలు మన ఇంట్లో మనకు మొహమాటం ఎందుకు అందరూ తిన్నాక మనం తిందాం అని ఫేక్ స్మైల్ తో చెప్పి అందరికీ ఇద్దరూ అడిగి మరీ వడ్డిస్తూ ఉంటారు……

అందరి నవ్వుల మధ్య ఎంతో సంతోషంగా డిన్నర్ చేస్తున్న మాయ కి ఈ క్షణం ఇలా ఆగిపోతే చాలు అనిపించేంత బాగా నవ్వుతుంది….. పరాయి వాళ్ళు ఎవరు లేకుండా అందరూ తనకు నచ్చిన & ఇష్టమైన వాళ్ళతో ఇలా జోక్స్ వేసుకుని నవ్వుతూ డిన్నర్ చేయడం తనకు బాగా నచ్చింది హర్ష తన పక్కన లేడు అన్న పెయిన్ తప్పా అన్ని సంతోషాలు తన దగ్గరే ఉన్నాయి అనిపిస్తూ ఉంటే మాయ కి ఆనందం తో కన్నీళ్ళు వస్తుంటే వాటిని తుడుచుకుంటూ సడెన్ గా ఏదో గుర్తొచ్చిన దానిలా మొబైల్ తీసుకుని పక్కన వచ్చి ఎవరికో కాల్ చేస్తుంది…..

మాయ అంత సీక్రెట్ గా పక్కకు వచ్చి కాల్ చేసింది ఎవరికి?? రుద్ర ఆద్య – జై లను కలపబోతున్నాడా లేక జై గురించి తెలిసి ఆద్య కోసం వేరే వ్యక్తిని తీసుకుని వస్తాడా?? మాయ కి తన ప్రేమ గురించి రుద్ర ఎప్పుడు రివీల్ చేయబోతున్నాడు ?? ఈ ప్రయాణం లో అమర్ – మాన్య ల జీవితం ఎలా మలుపు తిరగబోతుంది?? ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా బ్రోకెన్ హార్ట్స్ 💔💔 ను ఫాలో అవుతూ ఉండండి 😌