విలన్ హస్బెండ్-49
అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర అసెంబుల్ అయ్యాక వడ్డించడానికి పైకి లేస్తున్న శైలు, రేణుక లను ఆపి కుక్ & మెయిడ్ సర్వ్ చేస్తారు మీరు కూడా మాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయండి అని వినయ్ , మహిదర్ చెప్పగానే వీళ్ళు సరే అని నవ్వుతూ చెప్పి ఎవరి హస్బెండ్స్ పక్కన వాళ్ళు కూర్చోగానే ఇద్దరు మెయిడ్స్ & ఇద్దరు కుక్స్ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు……
నోరూరించే రకరకాల బ్రేక్ఫాస్ట్ లతో డైనింగ్ టేబుల్ చాలా కలర్ఫుల్ గా ఉంది…… ఇడ్లీ, దోస, పోహా, ఆలూ పరాటా & ఉప్మా పెసరట్టు, కారం దోస అంటూ అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ లతో పాటు అల్లం చట్నీ, టొమాటో, పల్లీ చట్నీ , కొబ్బరి చట్నీ అంటూ నాలుగు రకాల చట్నీస్ స్పెషల్ గా చేసుకుంటారు…..
ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు మెయిడ్స్ సర్వ్ చేస్తూ ఉంటే అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు బట్ జై మాత్రం తనకు రోల్డ్ ఓట్స్ విత్ బ్లూ బెర్రీ స్మూతీ & వన్ బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ విత్ పీనట్ బటర్, 2 బాయిల్డ్ ఎగ్స్ కావాలి అని అడుగుతాడు …….
అన్నయ్య ఈ ఒక్క రోజు నీ డైట్ ను పక్కన పెట్టేసి ఈ బ్రేక్ఫాస్ట్ చేయచ్చు కదా కళ్ళ ముందు ఇన్ని వెరైటీస్ కనిపిస్తూ ఉంటే ఇప్పుడు కూడా నీ డైట్ ఫుడ్ నే తింటావేంటి ప్లీస్ అన్నయ్య ఈ గీ దోస ట్రై చెయ్ చాలా యమ్మీ గా ఉంది…..
ఉప్చ్ మాయ…..! యూ నోహ్ ఇట్ కదా నేను మార్నింగ్ అంత హెవీ ఫుడ్ తినలేను అని మెయిడ్ తను చెప్పినవి తీసుకుని రావడం తో వాటినే తింటూ ఉంటాడు……
కళ్ళ ముందు ఇంత టేస్టీ ఫుడ్ పెట్టుకుని గడ్డి తింటున్నాడేంటి వీడు అని ఆద్య వేసిన సెటైర్ కి మాన్య నవ్వుతూ డబ్బు సంపాదించడానికి అడ్డమైన గడ్డి తింటారు అన్న సామెత ఉంది కదా అమ్ము బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఎంత డబ్బు సంపాదించిన తినేది మాత్రం గడ్డే అని మాన్య అనడం తో ఆద్య, మాన్య నవ్వుకుని తమ ప్లేట్ లో ఫుల్ గా అన్ని వెరైటీస్ పెట్టుకుని కుమ్మేస్తారు……
వీళ్ళేంటి తిండికి వాచిపోయినట్టు ఇలా తింటున్నారు భాకసురలతో బొఫే కి వచ్చినట్టు ఉంది 🤦🤷అని తల కొట్టుకుంటూ జై వైపు చూసిన అమర్ కి జై ఏదో సీరియస్ గా థింక్ చేస్తూ కనిపిస్తాడు……
రేయ్ ఏంట్రా అంతలా ఏమ్ ఆలోచిస్తున్నావ్ ఇందాకటి నుండి చూస్తున్నా ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావ్ ఏమైంది నీకు??
అదేం లేదు అమర్ నేను నార్మల్ గానే ఉన్నాను కానీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చెయ్ మనం బయటకు వెళ్ళాలి అని కాస్త సీరియస్ గా చూస్తూ చెప్తాడు……
వాట్ బయటకా?? ఉహు నేను రాను నేను ఆనంద్ బయటకు వెళ్తున్నాం నువ్వు కావాలంటే ఆర్యన్ తో వెళ్ళు ఇవాళ్టికీ నన్ను వదిలేయ్ అని చెప్పి తింటున్న అమర్ ను చూసి నిన్ను రమ్మని అడగడం లేదు వెళ్తున్నాం అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సో అన్ని మూసుకుని పదా అని చెప్తున్న జై ను చూసి పళ్ళు నూరుతూ కూర్చుంటాడు……
రుద్ర మాయ వైపు చూసి తింటూ అనుకోకుండా ఆద్య ను చూసిన తనకు ఆద్య మొబైల్ లో ఎవరికో టెక్స్ట్ చేస్తూ బిజీగా కనిపిస్తుంది…… సమ్థింగ్ ఇస్ ఫిషీ జై ఏమో అమ్ము అంటే ఇష్టం అంటాడు అమ్ము ఏమో జై అంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తుంది ఇప్పుడు కొత్తగా అభీర్ అనే అబ్బాయి అమ్ము కి బొకే పంపించాడు….. అది చూసిన అమ్ము పెద్దగా రియాక్ట్ అవ్వలేదు పైగా ఆ బొకే లో వచ్చిన చిన్న నోట్ కోసం ఇద్దరూ పిచ్చి కుక్కల్లా కొట్టుకున్నారు…..
అమ్ము మనసులో జై ఉంటే ఈ అభీర్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు కదా?? ఇదేదో పజిల్ లా ఉంది అని ఆలోచిస్తూ మాయ అమ్ము కి బాగా క్లోజ్ కదా ఇదేదో మాయ ను మాటల్లో పెట్టి అడిగితే?? యస్ ఈ విషయాన్ని అమ్ము దగ్గర అడిగితే తను నీకు ఎందుకు అని నన్ను క్వశ్చన్ చేయచ్చు మాయ అయితే అమ్ము అంత హైపర్ కాదు కాబట్టి తనే అన్సర్ ఇస్తుంది అనుకుని మాయ తో మాట్లాడాలి అని ఫిక్స్ అవుతాడు……
బ్రేక్ఫాస్ట్ అయ్యాక ప్రతాప్ యంగ్ బ్యాచ్ అందరి వైపు చూస్తూ చూడండి అబ్బాయిలు, అమ్మాయిలు ఇప్పుడు మీకేం వర్క్స్ ఉన్నాయో నాకైతే తెలియదు బట్ మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయా అదేంటంటే మనం వన్ వీక్ విలేజ్ లో స్టే చేయబోతున్నాం అని తెలుసు కదా అక్కడ ఒక జాతర జరగబోతుంది…….
మీరు ఇక్కడ వేసినట్టు ఆ జాతర లో జీన్స్, షార్ట్స్ వేస్తాను అంటే నేను ఒప్పుకోను జాతర 3 రోజులు జరుగుతుంది సో మీరు ఆ 3 డేస్ చచ్చినట్టు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ వేసుకోవాలి….. కాబట్టి మీరు మాల్ కి వెళ్ళి మీకు నచ్చిన ఎత్నిక్ వేర్ షాప్ చేయండి బిల్ నేను పే చేస్తాను జై అందరినీ తీసుకుని నువ్వు మాల్ కి స్టార్ట్ అవ్వు ఎవరికి ఎమ్ కావాలో తీసుకోండి……
తాతయ్య నాకు వేరే వర్క్ ఉంది నేను ఆ వర్క్ మీదే…..??
నథింగ్ డూయింగ్ నువ్వేం చెప్పకు వర్క్స్ ఎప్పుడూ ఉండేవి ఫస్ట్ మీరు స్టార్ట్ అవ్వండి అందరి షాపింగ్ ఫినిష్ అవ్వడానికి టైం పడుతుంది…. అన్ని మాల్ లోనే దొరుకుతాయి సో అన్ని ట్రయల్ చేసి మరీ తీసుకోండి కమాన్ స్టార్ట్ అవ్వండి అని తొందర పెట్టడం తో ప్రతాప్ వర్మ మాటకు ఎవరు నో చెప్పలేక వాళ్ళ ప్రోగ్రామ్స్ నే పోస్ట్ పోన్ చేసుకుని షాపింగ్ కి స్టార్ట్ అవుతారు……
ఏయ్ ఇది నా సీట్ అంటూ మాన్య వెళ్ళి కార్ లో కూర్చోగానే దీనికి నేను డ్రైవర్ డ్యూటీ చేయాలా ఇవాళ అని డ్రైవర్ సీట్ లో కూర్చుంటూ మాన్య వైపు చూస్తాడు…… మాన్య ఇవాళ చూసేకొద్దీ చూడాలి అనిపించేంత అందంగా ఉంది అందుకే మాన్య తో ఇప్పుడు గొడవ పడి మూడ్ స్పాయిల్ చేసుకోలేక ఎఫ్. ఎమ్ ఆన్ చేసి వెనుక సీట్ లో కూర్చున్న ఆనంద్ ను చూసి చిన్న స్మైల్ ఇస్తాడు……
మరో కార్ లో ఆద్య, మాయ వెనుక సీట్ లో సెటిల్ అయితే జై , రుద్ర ఫ్రంట్ కూర్చుంటారు & డ్రైవింగ్ సీట్ జై తీసుకుని మిర్రర్ సెట్ చేసుకుంటూ ముందుగా ఏ మాల్ కి వెళ్దాం రా అంటూ మాయ వైపు చూస్తాడు….. అన్నయ్య ఫస్ట్ మీ అబ్బాయిల షాపింగ్ ఫినిష్ చేద్దాం ఎందుకంటే మాది కాస్త టైం పడుతుంది సో మీది త్వరగా అయిపోద్ది కాబట్టి మీ షాపింగ్ స్టార్ట్ చేద్దాం…..
ఒకే రా అంటూ జై తనకు తెలిసిన మాల్ వైపు వెహికల్ ను మూవ్ చేయగానే వెనుకే ఫాలో అవుతాడు అమర్…… జై రుద్ర తో మాట్లాడుతూ రుద్ర మర్చిపోయిన సిటీ ను తనకు గుర్తు చేస్తూ ఎక్కడ ఎమ్ ఉంటాయా అని చెప్తూ సైడ్ మిర్రర్ వైపు చూసిన జై కి ఇందాక ఆద్య ను డ్యాష్ ఇవ్వడానికి వచ్చిన కార్ తనకు సైడ్ మిర్రర్ లో కనిపిస్తుంది…..
ఆ కార్ ను చూసిన జై సైడ్ స్మైల్ వదులుతూ అమర్ కి కాల్ చేసి మాల్ అడ్రస్ షేర్ చేసి అమర్ ను ముందుకు రమ్మని తను వెనుక ఫాలో అవుతూ ఎవరికో మెసేజెస్ డ్రైవ్ చేస్తూనే పంపిస్తాడు…… మాల్ రీచ్ అవ్వగానే అమ్మాయిలు ముగ్గురూ నవ్వుతూ మాల్ లోకి వెళ్తే వెనుకే అమర్, ఆనంద్ & రుద్ర, జై వెళతారు…..
జై వెళ్తూ వెళ్తూ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న సి. సి. పుటెక్ క్యామ్ వైపు చూస్తూ అందరితో పాటు లోపలికి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న జెంట్స్ షో రూమ్ వైపు వెళ్తున్న అమ్మాయిలను ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న గేమ్స్ జోన్ లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళను గేమ్స్ లోకి ఎంగేజ్ చేసి కాల్ మాట్లాడుతూ పక్కకు వెళతాడు…..
ఆధ్య ను వెతుకుతూ అక్కడికి వచ్చిన ఒక అబ్బాయి మొహానికి మాస్క్ పెట్టుకుని ఆద్య ఎక్కడ ఉందా అని ఫ్లోర్ టు ఫ్లోర్ చూస్తూ ఫిఫ్త్ ఫ్లోర్ కి రీచ్ అవుతాడు….. అక్కడ స్నో వల్డ్ లో ఆడుకుంటున్న ఆద్య ను చూసిన అతను ఆద్య వైపు కోపంగా చూస్తూ తన పాకెట్ లో ఉన్న గన్ ఎయిమ్ చేస్తాడు…..
హేయ్ మాయ అంటూ ఇద్దరితో నవ్వుతూ మాట్లాడుతున్న ఆధ్య ను చూస్తున్న అతనికి కోపం నిమిషం నిమిషానికి పెరిగిపోతూ ఉంటే గన్ మీద తన పాకెట్ లో కర్చీఫ్ అడ్డుపెట్టి ఆద్య ను చూస్తూ ట్రిగ్గర్ మీద నొక్కగానే కరెక్ట్ గా ఎవరో అబ్బాయి అటుగా వెళ్తూ ఆ బులెట్ కి అడ్డు రావడం తో ఆద్య కి తగలాల్సిన బులెట్ ఆ అబ్బాయికి తగిలి స్పాట్ లో చనిపోతాడు…..
బుల్లెట్ సౌండ్ కి బయపడ్డ అందరూ రక్తపు మడుగులో పడున్న అబ్బాయిని చూసి భయపడుతూ గట్టి గట్టిగా కేకలు పెడుతూ అక్కడి నుండి పరుగులు
పెడతారు…….. అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్న ఆ ప్లేస్ ఒక్క సారిగా గోల గోలగా మారడం తో ఆ అరుపులకు బయపడ్డ అమ్మాయిలు కూడా భయం తో అరుస్తారు…..
ఆ అరుపులకు కాల్ మాట్లాడుతున్న జై అక్కడికి వచ్చి చనిపోయినా అబ్బాయిని చూసి గాయ్స్ మూవ్ అంటూ గర్ల్స్ కి ప్రొటెక్షన్ ఇస్తూ అక్కడి నుండి కాస్త పక్కకు తీసుకుని వెళతాడు….. ఆధ్య భయపడుతూ చుట్టూ చూస్తూ ఉండగా తన పక్కనే ఉన్న బెలూన్స్ అన్ని బులెట్ వదలడం వల్ల ఒక్కొక్కటిగా బరస్ట్ అవ్వడం చూసి అమ్మా అంటూ పక్కనే ఉన్న జై ను హత్తుకుంటుంది…….
మాయ రుద్ర ను అమర్ ను మాన్య కూడా అలాగే పట్టుకుని భయపడుతూ ఉంటారు….. జై ఆద్య ను అలాగే పట్టుకుని తన డేగ కళ్ళలో చుట్టూ చూస్తున్న జై కి ఒక అబ్బాయి పిల్లర్ వెనుక దాక్కుంటూ కనిపించగానే ఆద్య కామ్ డౌన్ అంటూ ఆద్య ను రుద్ర చేతిలో పెడుతూ బ్యాక్ సైడ్ నుండి డౌట్ రాకుండా వెళ్ళి పిల్లర్ వెనుక దాక్కున్న వాడి కాలర్ పట్టుకుని ముందుకు లాక్కొచ్చి ఆద్య కాళ్ళ దగ్గర పడేస్తాడు ……. వాడు తల పైకి ఎత్తి ఆద్య వైపు చూడగానే వాడిని చూసిన ఆద్య షాక్ అవుతూ నువ్వా అంటూ అరవడం చూసిన జై ఆద్య వైపు చూస్తూ వీడు నీకు తెలుసా అని అడగ్గానే తెలుసు అన్నట్టు తల ఊపుతుంది……
జై వాడి మెడ వెనుక పట్టుకుని పైకి లేపి ఎవర్రా నువ్వు అమ్ము వైపు ఎందుకలా గన్ ఎయిమ్ చేస్తూ ట్రిగ్గర్ మీద ఫింగర్ పెట్టావ్?? నీకు తన మీదున్న గ్రడ్జ్ ఏంటి అని కోపంగా అడుగుతూ తన మొబైల్ కి వచ్చిన పిక్ వైపు చూస్తూ మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని మార్నింగ్ ఆద్య ను ఎందుకు నీ కార్ తో చంపాలి అనుకున్నావ్ నీ మోటివ్ ఏంటి అని అడుగుతూ పళ్ళు ఊడొచ్చేలా లాగి పెట్టీ కొడతాడు……
వాట్ ఆద్య ను చంపాలి అని ట్రై చేశాడా అని అందరి కంటే ముందు గా రియాక్ట్ అయిన రుద్ర వాడి కాలర్ పట్టుకుని కోపంగా చూస్తూ ఎందుకు తనను చంపాలి అనుకున్నావ్ అంటూ ఎలా పడితే అలా కింద పడేసి కొడుతూ ఉంటాడు…..
అప్పటికే ఆద్య వాడి వైపు కోపంగా చూస్తూ రుద్ర పక్కకు వచ్చి నుంచుని లాగి పెట్టీ కొడుతూ నన్ను చంపాలి అని చూస్తావా నిన్ను చంపేస్తా అంటూ కోపంగా వాడి జుట్టు పట్టుకుని లాగుతూ కొడుతుంది……
అమ్ము కామ్ డౌన్ అంటూ మాన్య, మాయ ఆద్య ను కాస్త పక్కకు జరపగానే అప్పటికే జై, రుద్ర కొట్టిన దెబ్బలకు ఆల్మోస్ట్ స్పృహ తప్పే రేంజ్ లో వాడిని చూసి రేయ్ ఇంకా కొడితే వాడు చచ్చేలా ఉన్నాడు ఆపండ్రా అని ఇద్దరిని కాస్త దూరంగా జరిపి ఆనంద్ వాటర్ తీసుకుని రా అని వాటర్ బాటిల్ తీసుకుని వాడితో తాగించి పైకి లేస్తూ ఉండగా అక్కడికి పోలీసుల వస్తారు….
వాట్స్ గోయింగ్ ఆన్ ఇక్కడేం జరుగుతోంది అని హోటల్ మ్యానేజ్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం తో అక్కడికి వచ్చిన పోలీసులు జై ను చూసి సర్ మీరెంటీ ఇక్కడ ఎనీ ప్రాబ్లెమ్ అని అడుగుతాడు…..
ఈ కుక్క అని ఆ అబ్బాయిని మళ్ళీ కొడుతూ నాకు కావల్సిన మనిషిని చంపడానికి ట్రై చేశాడు లక్ బావుండి తనకేం కాలేదు…. తనకేమైనా అయ్యుంటే వీడు చచ్చి కూడా అరగంట అయ్యుండేది అని వాడిని పోలీసులకు అప్పగిస్తూ వీడు లైఫ్ లో బయటకు రాకూడదు వస్తే మీరు చేస్తారు అని సీరియస్ గా చెప్తూ వెంటనే వీడి మీద ఎఫ్.ఐ. ఆర్ ఫైల్ చేయండి వీడి వళ్ళ ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది……
షూర్ సర్ అన్ని నేను చేసుకుంటాను అవసరం అయితే మేడం ఒక సారి కోర్ట్ కి రావలసి ఉంటుంది….. వీడిని చూస్తుంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నాడు అందుకే ఎవిడెన్స్ కోసం మేడం రావాలి…..
తను ఎక్కడికి రాదు కావాలంటే నేను వస్తాను నౌ యూ మే లీవ్ అనగానే ఒకే సర్ అంటూ చనిపోయిన అబ్బాయి ను చూసి మిగిలిన ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాక జై ఆద్య వైపు చూస్తాడు జై………..
ఆధ్య వైపు చూసిన జై కి ఆద్య బాగా డిస్టర్బెడ్ గా ఉందని తన ఫేస్ చూస్తేనే అర్థం అవుతుంది….. ఉప్చ్ ఏదో సరదాగా షాపింగ్ అనుకుంటే ఏదేదో అయిపోయింది అని విసుగ్గా ఊపిరి వదిలి ఆద్య చెయ్ పట్టుకుని ఆ ఫ్లోర్ లోనే క్యాఫటేరియా కి తీసుకుని వెళతాడు…… విచిత్రంగా ఆద్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా జై వెనుకే వెళ్ళడం చూసి మిగిలిన వాళ్లు కూడా వెనుకే వెళతారు…..
జై నే అందరి కోసం ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి అది రాగానే ముందున్న ఐస్ క్రీమ్ తినకుండా ఎటో చూస్తున్న ఆద్య వైపు చూసి చిన్నగా దగ్గుతూ వాడెవడు నిన్ను ఎందుకు చంపాలి అనుకున్నాడు వాడికి నీకు గొడవ ఏంటి అంటూ ఆద్య ఎలాగో ఐస్ క్రీమ్ తినే మూడ్ లో లేదు అని డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాడు…..
వాడి పేరు కమల్ నా కాలేజ్ డేస్ లో వాడు నాకు సూపర్ సీనియర్…. వాడంత రోగ్ ను నా లైఫ్ లో చూడలేదు మా కాలేజ్ లో ఒక అమ్మాయిని వాడు వాడి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు దానికి నా ఫ్రెండ్ మెయిన్ విట్నెస్ అది సాక్ష్యం చెప్తే వీడు అరెస్ట్ అవ్వడం కన్ఫర్మ్ అని తెలుసుకుని యాక్సిడెంట్ పేరు తో చంపేశారు……
అది చూస్తూ నేను, మాన్య సైలెంట్ గా ఉండలేక పోయాం అందుకే ప్రూఫ్స్ తో సహా అన్ని కోర్ట్ లో సబ్మిట్ చేసి కమల్ ను జైల్ కి పంపించాం….. ఇది జరిగి కూడా 4 ఇయర్స్ అవుతుంది బట్ వీడు జైల్ నుండి ఎలా రిలీస్ అయ్యాడో నాకు అర్థం కావడం లేదు & నా మీద రివెంజ్ తీర్చుకోవడానికే ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చాడు అని ఇందాక వాడ్ని చూసినప్పుడే తెలిసింది బట్ పాపం నా వల్ల ఒక ప్రాణం పోయింది అని బాధగా చెప్తుంది……
రిలాక్స్ అమ్ము వాడు ఇక నిన్నే కాదు ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి కూడా చూడకుండా నేను చేస్తాను…… నువ్వు దీని గురించి మర్చిపోయి హ్యాపీగా మీ షాపింగ్ కి వెళ్ళండి ఆనంద్ వీళ్ళకు తోడుగా వెళ్ళు అని చెప్పడం తో ఆనంద్ అమ్మాయిలను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు…..
ఆధ్య వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి తనంటేనే చిరాకు పడే జై ఇవాళ తన కోసం తన ముందు నిల్చోవడం షాకింగ్ గా అనిపిస్తూ ఉంటే జై వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది…… వాళ్ళు వెళ్ళాక జై అమర్ , రుద్ర కమల్ ను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కి వెళతారు…..