Login with OTP

విలన్ హస్బెండ్-53

aashyatech

Author

సింధు చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ తల పట్టుకుని నాకు తెలియని పాస్ట్ నా లైఫ్ లో ఎమ్ జరిగింది….?? ఇంత గొడవ జరిగినా వీళ్ళ గురించి నాకు అన్నయ్య కు ఎందుకు గుర్తు లేదు & తాతయ్య కూడా ఎపుడు ఎందుకని నాతో చెప్పలేదు….. మామ్ తో గొడవ పడతాను అని చెప్పలేదా లేక మామ్ ఏమైనా మాకు తెలియకూడదు అని తాతయ్య తో చెప్పిందా…..?? చందు విషయం లో మామ్ ఎమ్ చేసింది అంటూ తల నిండా అంతు చిక్కని చిక్కు ప్రశ్నలు తిరుగుతూ ఉంటే మాయ తల అంతా బరువుగా అనిపిస్తుంది……

ఇప్పటి వరకూ నా ముందు అన్నయ్య కి మ్యారేజ్ చేయాలి అన్న గోల్ మాత్రమే ఉండేది బట్ నౌ మామ్ ఎమ్ చేసిందో తెలుసుకుని మామ్ తో వీళ్ళకు సారి చెప్పించే ఈ ఊరు నుండి వెళ్ళాలి కానీ నాకు జరిగింది ఎవరు చెప్తారు అని ఆలోచిస్తూ కూర్చున్న మాయ బుజం మీద సడెన్ గా ఎవరిదో చెయ్ పడ్డం తో ఆ…!! అని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన మాయ కు రేణుక కనిపిస్తుంది……

ఉఫ్…..! మామ్ సీరియస్లీ భయపడి చచ్చాను అని పైకి లేస్తూ డెవిల్ లా అలా సడెన్ గా చెయ్ వేస్తే భయం వేయదా అని కోపంగా అడుగుతుంది….. ఏమైంది మాయ ఎందుకలా బయటపడ్డావ్ ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఎమ్ చేస్తున్నావ్ అని అడుగుతూ అయినా ఇంత ఎర్లీ గా లేచావ్ ఏంటి అని వొళ్ళు విరుచుకుంటూ అడుగుతుంది……

నిద్ర పట్టలేదు అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చి రేణుక వైపు చూస్తూ మామ్ మనం ముందు ఇక్కడికి ఏమైనా వచ్చామా…..?? నాకు ఎందుకో ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే అడుగుతున్నా పైగా ఈ ఇల్లు నాకు బాగా తెలిసిన ఇల్లు లా ఉంది అని కావాలని అడిగి రేణుక ఎమ్ చెప్తుందా అని తన వైపు చూస్తుంది……….

మాయ క్వశ్చన్ కి ఇక్కడికా లేదు మాయ మనం విలేజ్ కి రావడం ఇదే ఫస్ట్ టైమ్ అయినా మనకు ఇక్కడ ఎవరు ఉన్నారని వస్తాం చెప్పు అని కంగారుగానే కవర్ చేస్తూ ఉండగా అక్కడికి కాఫీ కప్స్ తో వస్తుంది చందు ……

చందు ను చూసిన మాయ చిన్నగా స్మైల్ ఇస్తే మాయ ను చూసి చందు కూడా నవ్వుతూ బావున్నావా మాయ అని అడుగుతూ కాఫీ కప్ అందిస్తుంది…… మాయ దాన్ని తీసుకుంటూ యాహ్ నువ్వెలా ఉన్నావ్ అని అడుగుతూ ఉంటే  బావున్నా అని చిన్నగా చెప్పి తన వైపు గుడ్లు ఉరిమి చూస్తున్న రేణుక ను చూసి చేతులు వణుకుతూ ఉంటే బా… బావున్నారా అత్త అని అడుగుతూ కాఫీ కప్ ఇస్తుంది…..

హ్మ్మ్….! నాకేం చాలా బావున్నా నువ్వెలా ఉన్నావ్ పెళ్ళి ఫిక్స్ అయిందట ఎమ్ చేస్తుంటాడు నీ కాబోయే మొగుడు అని వ్యంగ్యంగా అడుగుతున్న రేణుక ను చూసి తల వంచుకుని ఆయనది కూడా ఈ ఊరే అత్త ఫార్మింగ్ చేస్తాడు అని అన్సర్ ఇస్తుంది…… ఓహ్ మీ స్టేటస్ కి తగ్గట్టే చూసుకున్నారు అనమాట అని వెటకారంగా నవ్వుతున్న రేణుక ను చూసి చందు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి దాంతో ఇంకేం మాట్లాడకుండా ఫాస్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది……

మామ్ నువ్విక చేంజ్ అవ్వవా ఎందుకు నీ మాటలతో చందు ను హర్ట్ చేసావ్ పాపం తను ఫిల్ అయినట్టు ఉంది….. ఏయ్ నీకు వాళ్ళ గురించి తెలియదు వాళ్లకు డిస్టెన్స్ మెయింటైన్ చెయ్ వాళ్ళు ఉన్న సరౌండింగ్స్ లో నిన్ను చూసానో చంపేస్తా అని కోపంగా చెప్పి అక్కడికి నిద్ర లేచి వస్తున్న ఆద్య ను చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది…..

గుడ్ మార్నింగ్ అత్త అని ఆవలిస్తూ చెప్తున్న ఆద్య ను చూసి హు 😏 అని మొహం తిప్పుకుని వెళ్తున్న రేణుక ను చూసి 🤦 ఈవిడ గురించి ఈవిడ ఏమనుకుంటుంది పెద్ద హీరోయిన్ లా పోస్ కొడుతుంది ఈవిడ పెంపకం లో పెరిగాడు కాబట్టే ఆ కాట్రాజ్ కూడా అలాగే పెరిగాడు….. చీ మార్నింగ్…. మార్నింగ్ నే నా మూడ్ మొత్తం కరాబ్ అయింది అని విసుగ్గా నడుస్తూ హాయ్ మర్దల్ అంటూ మాయ బుజం చుట్టూ చెయ్ వేస్తూ నవ్వుతూ విష్ చేస్తుంది…..

తను ఎపుడు విష్ చేసినా నవ్వుతూ తనకు తిరిగి విషెస్ చెప్పే మాయ డల్ గా కనిపించడం చూసి మాయ ఏమైంది ఎందుకలా ఉన్నావ్ నిద్ర లేచి మీ మమ్మీ మొహం కానీ చూసావా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది….. ఉప్చ్….. ! వదిన అదేం లేదు నువ్వేంటి అపుడే లేచావ్ అంటూ ఇద్దరూ సరదాగా అలా వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు…..

వాట్ హ్యాపెండ్ చాలా డల్ గా కనిపిస్తున్నావ్….?? ఎప్పుడు హుషారుగా ఉండే నువ్వు ఇలా డల్ గా కనిపిస్తుంటే నాకేం నచ్చట్లేదు అసలేం అయిందో చెప్పు….. ఎమ్ లేదు అని మాత్రం చెప్పకు నన్ను నువ్వు వదిన అని నిజంగా ఫీల్ అయితే ఎందుకంత డల్ గా ఉన్నావో చెప్పు….??

మాయ ఆద్య వైపు చూస్తూ చెప్తాను వదిన బట్ ఇది నువ్వు ఎవరికి చెప్పకూడదు ఈవెన్ మహి మామ కి కూడా అంటూ ప్రామిస్ చేయించుకుని మా మామ్ మీద నీ ఒపీనియన్ ఏంటి వదిన అని అడుగుతుంది….??

టు బీ హానెస్ట్ మీ మామ్ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు మాయ ఎందుకో తెలియదు మీ మామ్ ను చూస్తే నాకు నెగెటివ్ వైబ్స్ వస్తాయి అది ఇప్పుడే కాదు చిన్నప్పుడు కూడా అంతే నాకు గుర్తున్నంత వరకూ మీ మామ్ చాలా సెల్ఫిష్ & యాటిట్యూడ్ పర్సన్ బట్ మామ అలా కాదు అవును సడెన్ గా ఎందుకలా అడిగావ్….?? ఎనీ థింగ్ రాంగ్….!

యాహ్ వదిన చూసావ్ కదా నైట్ జగదీశ్వర్ తాతయ్య ఆయనకు ముగ్గురు మనవరాళ్లే & ముగ్గురుకి కూడా ఇంకా మ్యారేజెస్ అవ్వలేదు….. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మామ్ కి జగదీష్ తాతయ్య ఫ్యామిలీ కి మన చిన్నప్పుడు ఏవో గొడవలు జరిగాయట & మామ్ తాతయ్యా ఫ్యామిలీ ను చాలా ఇన్సల్టంగ్ గా మాట్లాడి గొడవ పడి వచ్చేసింది…… ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే నీ ముగ్గురు కూతుర్లకు పెళ్ళి కావాలి అని మామ్ కండిషన్ పెట్టడం తో జగదీష్ తాతయ్య ముగ్గురికి మ్యారేజ్ ఫిక్స్ చేశాడట ఎల్లుండే ముగ్గురికీ ఎంగేజ్మెంట్ అని సింధు చెప్పింది…..

వాట్…..!! ఏదో మీ అమ్మ చెప్పిందని ఇస్టమ్ లేని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారా మీ మామ్ ఇక్కడికి రాకపోతే వచ్చే నష్టం ఎమ్ లేదు బట్ వాళ్ళు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి మాయ ఫస్ట్ ఇదంతా వద్దని చెప్దాం పదా…. !!

నోహ్ వదిన వాళ్ళు ఇష్టపడే మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు & దే ఆర్ హ్యాపీ నౌ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటి అంటే మామ్ తో వాళ్లకు గొడవ ఏంటో కనుక్కుని మామ్ తో మనం ఇక్కడి నుండి వెళ్ళే లోపు సారీ చెప్పించాలి…..

జరిగే పనే అంటావా మాయ మీ మామ్ కి అసలే ఈగో ఎక్కువ అలాంటి తను వాళ్లకు ఎందుకు సారి చెప్తుంది చెప్పు ఇట్స్ వేస్ట్ ఆఫ్ అవర్ టైమ్….??

హహ వదిన ఆ విషయం నాకు వదిలేయ్ మామ్ కి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి తను ఎవరు చెప్తే వింటుందో నాకు బాగా తెలుసు అని చిన్నగా నవ్వి ఇప్పుడు నాకు తెలియాల్సింది ఆ గొడవ గురించి కానీ అది ఎవరు చెప్తారు…..??

వర్రీ అవ్వకు మాయ ఇక్కడ మనం వన్ వీక్ ఉండబోతున్నాం ఒక్క ఛాన్స్ అయినా దొరకకుండా పోతుందా ఎలాగోలా తెలుసుకుందాం కానీ పదా బాగా తెల్లారి పోయింది అందరూ హాల్ లో మీటింగ్ పెట్టే ఉంటారు మనం కూడా జాయిన్ అవుదాం అని మాయ మూడ్ డైవర్ట్ చేసి లోపలికి తీసుకుని వెళ్తుంది ఆద్య…………

అప్పటికే అందరూ నిద్ర లేచి హాల్ లో కూర్చోవడం తో సింధు, చందు అందరికీ కాఫీ, టీ సర్వ్ చేస్తూ ఉంటే ఇందు అప్పుడే జై, రుద్ర లకు ఇల్లు మొత్తం చూపెట్టి కిందకు తీసుకుని వస్తూ కనిపిస్తుంది…..

మాయ మీ అన్నయ్య అప్పుడే పులిహోర స్టార్ట్ చేసినట్టు ఉన్నాడు అని నవ్వుతూ వస్తున్న ఇందు, జై లను చూసి మెల్లగా అంటున్న ఆధ్య ను చూసి వదిన అంటూ చిరు కోపంగా తన వైపు చూస్తూ ఇందు ఆల్రెడీ ఎంగేజ్డ్ సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లే అని చెప్పి సోఫా లో కూర్చోగానే ఎంతైనా మీ అన్నయ్య ఓపిక కు మెచ్చుకోవాలి మాయ అంత గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయడం నాట్ ఎట్ ఆల్ ఈసీ కదా……

అబ్బా చాలు ఆపు వదిన నీకు అన్నయ్య గురించి ఫుల్ క్లారిటీ వచ్చిందని నాకు అర్థం అయింది దాన్ని నువ్వు మరీ ఇంత డీటెయిల్డ్ గా చెప్పకు చిరాగ్గా ఉంది అని చెప్పి నవ్వుతూ చందు తో మాటలు మొదలు పెడుతుంది….. అందరూ ఒకే ఏజ్ గ్రూప్ అవ్వడం తో గర్ల్స్ త్వరగానే ఫ్రెండ్స్ అవుతారు & సంధ్య వాళ్ళ పేరెంట్స్ కూడా అందరితో కలిసి పోయి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ సమయాన్ని గడిపేస్తారు……

అరే పిల్లలు ఎంత సేపని ఇంట్లోనే కూర్చుంటారు సరదాగా అలా పొలాలు చూసేసి రండి అని మల్లయ్య అని అక్కడ పని చేసే వాడిని పిలిచి కాసేపు అయ్యాక పిల్లలు అందరినీ తీసుకుని అలా మన పొలాలు చూపించు అని చెప్పగానే సరే బాబు అని చెప్పి అక్కడి నుండి తన వర్క్ చూసుకోవడానికి వెళతాడు మల్లయ్య…..

ఈ లోపు అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడం తో అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు జగదీశ్వర్ బార్య, కోడలు ఇంకా ఇద్దరు పని మనుషులు కలిసి వీళ్ళు రెడీ అయ్యి వచ్చే లోపు వేడి వేడి బ్రేక్ఫాస్ట్ కూడా టేబుల్ మీద రెడీగా ఉంటుంది……. వావ్ యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అంటూ రుద్ర నే ఫస్ట్ చైర్ లో కూర్చుంటూ ఆల్రెడీ తన ఎదురుగా కూర్చున్న చందు వైపు చూసి చిన్నగా నవ్వి హాయ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తున్నా చందు ఎట్ లీస్ట్ తల తిప్పి చూడదు అది చూసిన రుద్ర ఓహ్ గాడ్ ఏంటండీ మీరు మార్నింగ్ నుండి చూస్తున్నా పిలిచినా పలకరు మాట్లాడించిన విష్ చేయరు 🤷 మీ సిస్టర్స్ చాలా ఫ్రీ గా ఉంటారు మరి మీరేంటి ఇలా మీకు మాటలు వచ్చు కదా అని డౌబ్ట్ గా చూస్తూ అడుగుతాడు…..

ఆర్య తనను ఏడిపించకు షి ఇస్ రిజర్వడ్ & షై పర్సన్ ఎక్కువ ఎవరితో కలవదు అంతే అని అక్కడికి వచ్చిన మాయ చందు వైపు చూస్తూ చందు తన పేరు ఆర్య అన్నయ్య బిజినెస్ ఫ్రెండ్ అని పరిచయం చేయగానే హలో అని తల వంచుకునే విష్ చేస్తున్న చందు ను చూసి స్ట్రేంజ్ గా అనిపిస్తుంది రుద్ర కి….. తను ఏదో మాట్లాడే లోపు ఒక్కొక్కరిగా అందరూ రావడం తో తన మాటకు ఫుల్ స్టాప్ పెట్టి అందరితో నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు….

జై కూడా తప్పక తన డైట్ ఫుడ్ ప్లేస్ లో ఆయిల్ లెస్ ఇడ్లీ తింటూ అందరితో పాటు గా బ్రేక్ఫాస్ట్ చేసాక పొలాలు చూడ్డానికి వెళతాడు….

వావ్ విలేజ్ బలే ఉంది కదా ఆద్య అంటూ మాన్య ఎటు చూసినా పచ్చగా కనిపిస్తున్న పొలాలను చూసి ఎక్స్సైట్ అరే ఫ్రెష్ ఎయిర్ ఇలా మనల్ని తాకుతూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ కలుగుతుంది నాకు అని చిన్న పిల్లలా రోడ్ మీద వెళ్తున్న ఎడ్ల బండి ను చూసి నవ్వుతూ ఇందు మనం కూడా అలాంటి దాంట్లో వెళ్దాం నేను ఎప్పుడూ ఇలాంటిది ఎక్స్ప్రియన్స్ చేయలేదు

తప్పకుండా మాన్య అంటూ మల్లయ్య మేము పక్కనే ఉన్న తోట లోకి వెళ్ళి జామ తోట చూస్తూ ఉంటాం నువ్వు ఈ లోగా ఇంటికి వెళ్లి మూడు ఎడ్ల బండ్ల ను నీతో పాటు ఇద్దరినీ తీసుకుని మూడు బళ్ల ను తీసుకుని రండి అని పంపేసి అందరూ ముందుగా కనిపించిన తోట లోకి వెళ్ళిపోతారు……

అరే వాహ్ ఎంత పెద్దగా ఉంది ఈ తోట అంటూ అందరూ తలో వైపు వెళ్ళి చూస్తూ ఉంటే ఆద్య మాత్రం వైట్ డ్రెస్ లో ఎంజల్ లా తోట మొత్తం తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది….. అదే తోట లో బంతి పూల చెట్లు కూడా ఒక వైపు ఉండడం తో అన్ని పూలు ఒకే సారి అది కూడా విలేజ్ లో ఇలా తోట లో ఎప్పుడూ చూడని ఆద్య అందరూ ఇక్కడ జామ తోట లో ఉంటే తను ఒక్కటే పూల వైపు వెళ్ళి అంతా తిరిగి చూస్తూ ఫోటోస్ తీసుకుంటూ ఉంటుంది…..

అదే ఊరిలో బేవర్స్ బ్యాచ్ గా పేరున్న రమణ & గ్యాంగ్ పూల తోట లో తిరుగుతున్న ఆద్య ను చూసి ఎవరు చూడకుండా ఆద్య వైపు కు వెళ్తారు….. దూరం నుండి ఆద్య కనిపించక దగ్గరకు వెళ్ళి చూసిన వీళ్ళకు ఆద్య అందాన్ని చూసి పిచ్చెక్కి పోయి ఆ బ్యాచ్ లో ఉన్న నలుగురు కళ్ళతో ఒకరికి ఒకరు సైగలు చేసుకుని ఆద్య ను ఎవరు చూడకుండా ఎత్తుకుని వెళ్ళాలి అని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటారు……
ఈ తోట పక్కనే ఉన్న ఒక పాడు బడ్డ ఇల్లు ఉంది దాన్ని ఎవరూ యూస్ చేయడం లేదు కాబట్టి అందులోకి ఆద్య ను ఎత్తుకుని వెళ్ళాలి అని వీళ్ళ ప్లాన్….. ఇవేమీ తెలియని ఆద్య తోట ను నవ్వుతూ చూస్తూ ఎదురుగా మాసిన గడ్డం తో జుట్టు బాగా పెరిగిపోయి బ్లూ షర్ట్ పీచ్ కలర్ గళ్ళ లుంగీ కట్టుకుని నోట్లో నుండి బీడీ పొగ వదులుతూ చూడ్డానికి అచ్చం రౌడీ లా కనిపిస్తున్న రమణ ను చూసి ముందు బయటపడ్డా తర్వాత సర్దుకుని తోట లో వర్క్ చేసే వర్కర్ అనుకుని తను కూడా జామ తోట వైపు వెళ్ళాలి అని రమణ ను దాటుకుని వెళ్ళబోతున్న ఆధ్య కు అడ్డుగా నుంచుని ఆద్య వైపు చూస్తూ ఉంటాడు…..

ఆధ్య రమణ వైపు చూస్తూ ఏయ్ ఎవరు నువ్వు అడ్డుగా నుంచున్నావ్ ఏంటి తప్పుకో అని కోపంగా అరుస్తున్న ఆధ్య నోరు మూసి భుజాన ఫాస్ట్ గా ఎత్తుకుని పరిగెడుతూ ఉంటే వాడి వెనుకే ఇంకొకడు ఎవరైనా చూస్తున్నారా అని చుట్టు చూస్తూ వెళతాడు…..

ఉమ్మ్….. ఉమ్మ్…… అని రమణ తన నోరు మూయడం తో వాడి చేతుల్లో నుండి గింజుకుంటూ కోపంగా రమణ చేతిని కొరికేయగానే వాడు స్లిప్ అయి ఆధ్య ను వదలగానే హెల్ప్…… మాయ….. మాన్య అని అరుస్తూ ఆద్య అక్కడి నుంచి పరిగెత్తడం చూసి రేయ్ పదా దాన్ని పట్టుకుందాం అంటూ రమణ అరవగానే తన ఫ్రెండ్ కూడా ఆద్య ను పట్టుకోవడానికి ఆధ్య ను ఫాలో అవుతారు…..

మాన్య సేవ్ మీ అని అరుస్తున్న ఆధ్య అరుపులు ఎవరికి వినపడకుండా రమణ ఫ్రెండ్ ఇనుప డబ్బా మీద కర్ర తో కొడుతూ కావాలని సౌండ్స్ చేస్తూ ఉంటాడు దాంతో ఆద్య అరుపులు ఎవరి చెవికి చేరవు….. ఆధ్య కి చాలా భయంగా ఉంది పందుల్లా ఉన్న ఇద్దరూ తన వెంట పడుతున్నారు మరో వైపు తన వాయిస్ కూడా ఎవరికి వినిపించడం లేదు అని తన శక్తి కొద్ది పరిగెడుతున్న తను ఆ గడ్డి లో ఏదో పెద్ద రాయి తన కాలికి తగిలి స్లిప్ అయి కింద పడిపోతుంది అది చూసిన ఇద్దరూ నవ్వుకుంటూ ఆద్య పైకి లేచె లోగా తన ఎదురుగా రాక్షసంగా నవ్వుతూ కనిపిస్తారు…….!!