విలన్ హస్బెండ్-54
ఆధ్య రమణ నుండి తప్పించుకుని పరిగెడుతూ రాయి తగిలి కింద పడిపోతుంది తన కాలికి బలంగా రాయి తగలడం తో స్కిన్ కట్ అయ్యి బ్లడ్ వస్తూ ఉన్నా ముందు ఇక్కడి నుండి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఫాస్ట్ గా లేచి నుంచుని తప్పించుకోవడానికి చూస్తున్న ఆద్య కి ఎదురుగా రాక్షసంగా నవ్వుతూ కనిపిస్తారు రమణ అండ్ తన ఫ్రెండ్ సోమేష్….. వాళ్ళను చూసిన ఆద్య కి కాళ్ళల్లో సన్నగా వణుకు మొదలవుతూ ఉంటే నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ ఎవరు మీరు ఎందుకిలా నా వెంట పడ్డారు ప్లీస్ నన్ను వదిలేయండి నాకు మీరు ఎవరో కూడా తెలియదు అని భయంతో ఆద్య కి మాటలు కూడా రావడం లేదు…..
రమణ సోమేష్ ఒకరిని ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుతూ నువ్వు ఇంత అందంగా పుట్టడమేనే నువ్వు చేసిన తప్పు అని ఆద్య ముందుకు వచ్చి నీ అంత అందమైన ఆడపిల్ల ను నేను ఇప్పటి వరకు ఈ ఊరిలో చూడలేదు అని ఆద్య బుగ్గలు నొక్కి పట్టుకుని ఆద్య బుగ్గల మీద నాలుక తో లిక్ చేయబోతాడు……
ఆధ్య రమణ రెండు కాళ్ళ మధ్యలో గట్టిగా తన్ని నా దగ్గరకు వస్తే చంపేస్తాను చెప్తున్నా నాకు కరాటి కూడా వచ్చు అని భయాన్ని లోపలే దాచి పైకి ధైర్యాన్ని నటిస్తు కోపంగా చెప్తుంది…..
ఆధ్య కొట్టిన దెబ్బకు రమణ కోపంగా ఆద్య జుట్టు పట్టుకుని నీ లాంటి పొగరు బలుపు ఉన్న పిల్ల ను సొంతం చేసుకుంటే ఆ కిక్ ఏ వేరు రావే అంటూ ఆద్య నోరు మూసి రారా అంటూ సోమేష్ వైపు చూస్తాడు సోమేష్ ఆద్య కాళ్ళు రమణ ఆద్య చేతులు పట్టుకుని గుబురుగా ఉన్న పొదల వైపుకు లాక్కుని వెళతారు…..
🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍
అందరూ ఇంట్రెస్టింగ్ గా జామ తోట చూస్తూ ఉంటే తనకు అపర్ణ నుండి కాల్ రావడం తో అందరికీ దూరంగా వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అలా పూల తోట వైపు కు వచ్చిన రుద్ర కి రమణ ఫ్రెండ్స్ చేస్తున్న సౌండ్స్ కి ఇరిటేషన్ రావడం తో మామ్ కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి ఏయ్ ఎవరు మీరు ముందు ఆ సౌండ్ చేయడం ఆపు అంటూ వాళ్ళ ముందుకు వెళ్ళి ఇయర్ డ్రమ్స్ పగిలి పోయేలా దేనికి అలా కొడుతున్నారు…..??
రుద్ర ను చూసిన ఇద్దరూ కంగారు పడుతూ అది….. అదీ ఏం లేదు సర్ పక్షులు, జంతువులు తోట లో తిరుగుతున్నాయి ….. ఇలా సౌండ్స్ వస్తే అవి భయం తో పారిపోతాయి అందుకే ఇలా చేస్తూ ఉంటాం…..
వాట్….?? అలా కూడా వెళ్తాయా డిస్గస్టింగ్ వాటిని ఇలా సౌండ్స్ పేరుతో అనవసరంగా బయటపెట్టకుండా ఇక్కడి నుండి వెళ్ళి మీ వర్క్ చూసుకోండి అని సీరియస్ గా చెప్పడం తో వాళ్ళు అలాగే సర్ అని ఆ డబ్బా అక్కడే పడేసి ఈ పాటికి వాళ్ళు ఆద్య ను ఎత్తుకుని వెళ్ళుంటారు అని రుద్ర వైపు వెళ్తూ చూస్తూ….చూస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు…..
వీళ్ళేంటి ఇంత తేడాగా కనిపిస్తున్నారు అని మొబైల్ తీసుకుని అపర్ణ కి కాల్ చేయబోతున్న రుద్ర కి అక్కడ ఎవరిదో మొబైల్ రింగ్ అవుతూ కనిపించడం తో ఆ రింగ్ వస్తున్న వైపు కు వెళ్లి చూసిన రుద్ర కి గడ్డి లో రింగ్ అవుతూ కనిపిస్తుంది ఒక మొబైల్…..!!
ఎవరిది ఈ మొబైల్ అని ఆ మొబైల్ చేతిలోకి తీసుకుని చూసిన రుద్ర కి స్క్రీన్ ఆన్ చేయగానే అందంగా నవ్వుతున్న ఆద్య పిక్ కనిపిస్తుంది….!! ఆధ్య…. ఆద్య మొబైల్ ఏంటి ఇక్కడుంది ఆద్య ఎక్కడ….?? తను ఇటే కదా వచ్చింది మరెక్కడా అని చుట్టూ చూస్తూ హెలో…. హలో అంటూ వెళ్తున్న రమణ ఫ్రెండ్స్ ను పిలుస్తాడు….!!
రమణ ఫ్రెండ్స్ వెనక్కి తిరిగి రుద్ర ను చూసి రేయ్ వాడికి డౌబ్ట్ వచ్చినట్టు ఉంది పరిగెత్తు అని అరవగానే రెండవ వాడు మొదటి వాడి వెనుక పరుగు అందుకుంటాడు…. వీళ్ళేంటి నన్ను చూసి పరిగెడుతున్నారు అని డౌబ్ట్ వచ్చిన రుద్ర జింక ను వెంటాడే చిరుత పులిలా మొబైల్ పాకెట్ లో పెట్టుకుని మెరుపు వేగం తో ఇద్దరినీ పట్టుకుని తన్ని ఆధ్య గురించి అడుగుతాడు…..
నోట్లో నుండి కారుతున్నా రక్తాన్ని చూసి బయపడ్డ ఇద్దరూ ఆధ్య ను చూడ్డం రమణ చెప్పిన ప్లాన్ & వాళ్ళు తనను ఎత్తుకుని వెళ్ళడం తో పాటు ఆద్య వాయిస్ ఎవరికి వినిపించకుండా సౌండ్స్ చేయడం దగ్గర వరకూ మొత్తం చెప్తారు…. ఆద్య ను వాళ్ళు ఎమ్ చేయాలి అనుకున్నారో విన్న రుద్ర తన కోపాన్ని మొత్తం పిడికిలి లోకి తెచ్చుకుని ఇద్దరినీ ఒక్క దెబ్బ తో స్పృహ తప్పేలా కొట్టి ఆద్య….. ఆధ్య….. అంటూ కంగారుగా వెతుకుతూ పరిగెడతాడు…..
అలా పరిగెడుతున్న రుద్ర కి ఆద్య తను వేసుకున్న వైట్ డ్రెస్ మీద రెడ్ కలర్ చున్నీ ఒక చోట కనిపించడం తో రుద్ర గుండె ఆగి కొట్టుకుంటుంది….. ఆధ్య ఎక్కడున్నావ్ రా అని పిచ్చి వాడిలా అరుస్తూ ముందుకు పరిగెత్తిన తనకు ఆద్య కాళ్ళకు ఉన్న ఒక హీల్ కనిపిస్తుంది దాంతో ఆద్య ఇక్కడే ఎక్కడో దగ్గర్లో ఉందని ఫిక్స్ అవుతూ కళ్ళు మూసుకుని టెన్షన్ తగ్గించుకుని డీప్ బ్రీత్ తీసుకుంటున్న రుద్ర కి ఆద్య ఉమ్మ్…. ఉమ్మ్….. అంటూ రమణ తన నోరు గట్టిగా నొక్కేస్తూ ఉండడం తో అరవడానికి ట్రై చేస్తూ ఉంటుంది…..
ఆధ్య టైమ్ బావుండి ఆ రోజూ శైలు బలవంతం మీద ఒక చేతికి మట్టి గాజులు వేసుకోవడం వల్ల ఆ చేతిని కదిలిస్తూ సౌండ్స్ చేస్తూ ఉంటుంది అవి రుద్ర చెవికి చేరగానే బరిలో దిగిన పులిలా ఆద్య ఉన్న ప్లేస్ కనుక్కుని అక్కడికి వెళ్లి చూడగా ఆద్య కాళ్ళు ఒకడు పట్టుకుని ఉంటే ఆద్య నోటిని ఒకడు పట్టుకుని కనిపిస్తాడు..
ఆధ్య ను అలా చూసిన రుద్ర అమ్ములు ♥️🥹అని పిలవగానే అప్పటి వరకు వాళ్ళ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉన్నది కాస్త రుద్ర వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది…… ఈ లోపు తన మీదకు వచ్చిన ఇద్దరినీ తుక్కు తుక్కుగా కొడుతూ ఇద్దరి చేతులు విరుచేస్తూ ఇంకెప్పుడు అమ్మాయి వైపు చూసే సాహసం కూడా చేయకుండా కొట్టి మూలకు విసిరేసి ఆద్య దగ్గరకు వెళ్లి ఆద్య ను నెమ్మదిగా పైకి లేపి నుంచో బెట్టి తనతో తీసుకుని వచ్చిన ఆద్య హీల్ తన కాలికి తొడుగుతూ ఆధ్య చున్నీ తన మీదకు వేసి లైట్ గా బ్లడ్ వస్తున్న ఆద్య పెదవి దగ్గర తన పాకెట్ లో ఉన్న హ్యాండ్ కీ తో తుడుస్తాడు……
నవ్వు బానే ఉన్నావ్ కదా ఆద్య అని ఆద్య మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా అడుగుతున్న రుద్ర కాలర్ పట్టుకుని ఎవరు నువ్వు అంటూ సూటిగా అడుగుతుంది…… నేనెవరు అని అడుగుతావ్ ఏంటి ఆధ్య జై బిజినెస్ పార్టనర్ ను & నేను నీకు తెలుసు కదా అని తన తగ్గించుకుంటూ చెప్తున్న రుద్ర ను దూరంగా తోస్తూ అందరికీ చెప్పిందే నాకు చెప్పకు & నీ పేరు ఆర్య కాదు రుద్ర నువ్వు నా అన్నయ్య రుద్రాన్ష్ అవునా కదా అంటూ కోపంగా అడుగుతుంది…..
ఆధ్య అడిగిన దానికి షాక్ అవుతూ వాట్….. ఏం….. ఎమ్ మాట్లాడుతున్నావ్ ఆద్య నేను మీ అన్నయ్య రుద్ర ఏంటి లేదు నువ్వు పోరాడుతున్నావ్ ఐ ఆమ్ ఆర్యన్ అంటూ చెప్పి మరో వైపు కు తిరిగి తన కళ్ళల్లో తిరుగుతున్న నీటిని తుడుచుకుంటాడు…..
రుద్ర ముందుకు వచ్చి నుంచున్న ఆద్య నీ తడబాటే చెప్తుంది నువ్వెవరో అని అంతే సీరియస్ గా చెప్పి రుద్ర వేసుకున్న షర్ట్ ను కోపంగా చించేస్తూ ఉంటుంది….. అమ్ములు ఎమ్ చేస్తున్నావ్ అంటూ రుద్ర ఆపడానికి చూస్తున్నా ఆధ్య వినకుండా షర్ట్ మొత్తం చించేసి రుద్ర నుండి దూరం చేసి రుద్ర హార్ట్ వైపు చూసి శక్తి లేనట్టు ఏడుస్తూ కిందకు పడిపోవడం చూసి అమ్ములు అంటూ రుద్ర తను పడిపోకుండా పట్టుకుంటాడు…..
ఆద్య ఏడుస్తూ రుద్ర వైపు చూస్తూ ఇది నా అన్న రుద్ర నా చిన్నప్పుడు రోమన్ న్యూమరల్స్ లో నా పేరు, మామ్, డాడ్ పేరు కలిసి వచ్చేలా టాటూ వేసుకున్నాడు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది ఇది వేసుకుని జ్వరం కూడా తెచ్చుకున్నావ్ & నన్ను అమ్ములు అని రుద్ర మాత్రమే పిలిచే వాడు చెప్పు నువ్వే కదా నా అన్న రుద్ర అంటూ రుద్ర చేతిని తన తల మీద పెట్టుకుని నువ్వు ఇప్పుడు అబద్దం చెప్తే నన్ను చంపకు తిన్నట్టే అని ఏడుస్తూ రుద్ర కళ్ళల్లోకి చూస్తుంది…..
ఆధ్య తన కోసం పడుతున్న బాధ & ఇప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు చూసి అబద్దం చెప్పలేక అవును నేనే నీ అన్నయ్య రుద్ర 🥹🥺 అని రుద్ర తల ఊపడం తో ఆద్య ఏడుస్తూ అన్నయ్య అంటూ రుద్ర ను హత్తుకుని ఏమై పోయావ్ రా ఇన్ని ఇయర్స్ ఇడియట్ నీ కోసం నేను మామ్ & డాడ్ ఎంతలా ఏడుస్తున్నామో తెలుసా….. కనీసం నీకు మేము ఉన్నామా చచ్చామా అని కూడా తెలుసుకోవాలి అనిపించలేదా అని అడుగుతున్న ఆద్య మాటలకు రుద్ర కళ్ళు నీళ్ళతో నిండుకుని చంపల మీదకు జారుతూ ఉన్నాయి…..
🤍💖🤍💖🤍💖🤍💖🤍💖🤍
నాన్న టీ తీసుకోండి అని తన తండ్రికి టీ కప్ ఇస్తూ ఎదురుగా సోఫా లో కూర్చున్న మంజూష బ్రేక్ఫాస్ట్ కి ఎమ్ చేయమంటారు నాన్న అని అడుగుతూ తను కూడా టీ సిప్ చేస్తూ ఉంటుంది….. నీ ఇష్టం మంజు అని చెప్పి పేపర్ చదువుతున్న తండ్రి ను చూసి అడగాలా వద్దా అని తనలో తనే అనుకుంటూ ఆఖరికి ధైర్యం చేసి అడగాలి అని ఫిక్స్ అయ్యి నాన్న మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను కొప్పడరు కదా…..!!
నీ మీద నేను ఎందుకు కోప్పడతాను మంజు ఏంటో అడుగు అని పేపర్ చదువుతూనే అన్సర్ ఇచ్చిన తండ్రి వైపు చూస్తూ ఇంకా ఎన్ని రోజులు అని ఇలా అక్క కు దూరంగా ఉంటాం నాన్న….. అక్క మన కోసం చాలా ఏడుస్తుంది తన విషయం లో ఎమ్ జరిగిందో తెలుసుకోకుండా తనను ఇలా అందరికీ ఉంచేవారు పాపం నాన్న అక్క మన కోసం చాలా బాధ పడుతుంది……
మంజు అంటూ కోపంగా పైకి లేచిన తండ్రి ను చూసి టెన్షన్ గా తనూ పైకి లేచి నాన్న నేను చెప్పేది అంటున్న మంజూష వైపు ఆపు అన్నట్టు చేతిని చూపెడుతూ నాకు ఉన్నది ఒక్క కూతురు మాత్రమే ఇంకో కూతురు ఉండేది కానీ అది చచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న తండ్రి ను చూసి మంజూష బాధగా సోఫా లో కూర్చుంటుంది…..
ఐ ఆమ్ సారి అక్క 🥹 నీ గురించి నాన్న దగ్గర ఎన్ని సార్లు మాట్లాడాలి అని చూసిన నాన్న నీ పేరు వింటేనే మండి పడుతున్నారు……. ఎమ్ చేస్తే నాన్న కు నీ మీదున్న కోపం తగ్గుతుంది అని ఏడుస్తున్న తన బుజం మీద చెయ్ పడగానే ఉలిక్కిపడి లేచి నుంచుని చూసిన తనకు తన భర్త భరత్ కనిపించడం తో భరత్ లేచారా ఆగండి టీ తీసుకుని వస్తాను అని వెళ్తున్న మంజూష చెయ్ పట్టుకుని మీ అక్క గుర్తొచ్చిందా అని అడుగుతున్న భరత్ ను చూసి ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది……
గుర్తు రావడానికి అక్క జ్ఞాపకం కాదు భరత్ అక్కంటే నాకు ప్రాణం అలాంటి అక్క దూరం అయ్యి 3 ఇయర్స్ అవుతుంది……. అక్క ఏ పరిస్థితులో అలాంటి వర్క్ చేసిందో మాకు తెలియదు బట్ నాన్న ఎవరో చెప్పింది నమ్మి అక్క ను ఇంటి నుండి పంపించేసాడు అక్క కి జై దీర్ లాంటి ఫ్రెండ్ దొరికాడు కాబట్టి అది సేఫ్ గా ఉంది లేదు అంటే తన లైఫ్ ఏమయ్యేదో కూడా తలచుకుంటే శివరింగ్ వచ్చేస్తుంది……
అందరూ మీ అక్క కు జై దీర్ కి ఎఫైర్ అంటున్నారు అది నీకు కూడా తెలుసు కదా మంజు మే బీ వాళ్ళు రిలేషన్ లో ఉన్నారేమో …..?? లేదు భరత్ జై దీర్ ఒక ప్లే బాయ్ తనకు చాలా మంది గర్ల్స్ తో రిలేషన్ ఉంది అక్క ఫ్రెండ్ నే చెప్పింది నాకు జై దీర్ అక్క బెస్ట్ ఫ్రెండ్స్ అని మా అక్క చాలా మంచిది భరత్ తను ఎప్పుడూ మా సంతోషం గురించే ఆలోచించేది అలా ఆలోచించే కదా తన లైఫ్ ను కూడా మా కోసం వదులుకుంది 🥺……
మీ అక్క గురించి ఇంత మంచిగా చెప్తావ్ మరి తను ఎందుకు అలాంటి దారి చూస్ చేసుకుంది మంజు…….. బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి అవన్నీ కాదని అంత చదువు చదివి కూడా ప్రాస్టిట్యూషన్ చేయడం ఏంటి…..??
మంజూష భరత్ నుండి దూరం జరిగి ప్లీస్ భరత్ అక్క ను అలా అనకు నేను బరించలేను అక్క నిజంగా గోల్డ్ అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తున్న మంజు ను చూసి భరత్ మంజు వెళ్ళిన వైపు చూస్తూ ఉంటే తనకు రాహుల్ నుండి కాల్ వస్తుంది…….
🤍💚🤍💚🤍💚🤍💚🤍💚
ఎక్స్క్యూస్ మీ హరీష్ అన్న నేమ్ తో ఉన్న పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నాడో చెప్తారా ఇవాళే జాయిన్ అయ్యాడు అని రిసెప్షనిస్ట్ ను కంగారుగా అడుగుతాడు మాదేష్….. రిసెప్షనిస్ట్ సిస్టమ్ లో చెక్ చేసి యస్ సర్ 2 అవర్స్ బ్యాక్ జాయిన్ అయ్యారు సెకండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ 26 అని చెప్పగానే థాంక్ యూ అంటూ శ్వేత, హరిణి లను తీసుకుని హరీష్ రూమ్ లోకి వెళతాడు……….
వీళ్ళు వెళ్ళేసరికి మొహం నిండా దెబ్బలతో ఒక కాలికి కట్టు కట్టుకుని పడున్న హరీష్ ను చూసి ముగ్గురూ షాక్ అవుతూ హరీష్ అని ఏక కంఠం తో ఒకే సారి పిలుస్తారు….. అప్పుడే స్పృహ లోకి వచ్చిన హరీష్ వీళ్ళను చూసి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే ఏంట్రా ఏమైంది అసలేం జరిగింది అని కోపంగా అడుగుతున్న తండ్రి వైపు చూస్తూ ఆ మాయ నాకు షాపింగ్ మాల్ లో కనిపించింది డాడ్ దాని పక్కన క్లోజ్ గా ఎవడో కనిపించేసరికి వాడెవడు అని దాన్ని నా పెళ్ళాం అన్నా అంతే వాడు నన్ను ఇలా కొట్టి మాయ ను నా ముందే తను నా మనిషి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు…..
వాట్…..?? అసలేం అనుకుంటున్నారు వాళ్ళు మన గురించి హా సైలంట్ గా ఉంటున్నా అని రెచ్చిపోతున్నారు వాళ్ళకు ఎక్కడ ఎలా స్పాట్ పెట్టాలో అలా పెడతా నువ్వేం వర్రీ అవ్వకు నిన్ను ఇలా కొట్టిన వాడ్ని & వినయ్ వర్మ ఫ్యామిలీ ను ప్రశాంతంగా ఉండనివ్వడు ఈ మాదేష్ అని కోపంగా చెప్పి ఎవరికో కాల్ చేసి నాకు 4 డేస్ లో మొత్తం అన్ని ప్రూఫ్స్ కావాలి కేర్ఫుల్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు…..
రేయ్ జై ఇంకొక్క 3 రోజులు రా ఆ తర్వాత నేను చేయబోయే పనికి నీ బాబు కి హార్ట్ ఎటాక్ రావడం అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి చావడం ఒకే సారి జరుగుతాయి….. నువ్వు పెళ్లి చేసుకోవడానికి నా కూతురు తప్పా మరో ఆప్షన్ నీకు కనిపించకుండా చేస్తాను అని నవ్వుకుంటూ ఇప్పుడు నేను చేయబోయే ప్లాన్ తో నీ కుటుంబం రెండు ముక్కలు అవ్వడం కన్ఫర్మ్ గెట్ రెడీ 👿😈 అని నవ్వుకుంటూ ఉంటాడు……
ఈ అప్డేట్ లో నేను చాలా ట్విస్ట్ రివీల్ చేశాను అవేంటో ఎవరికైనా అర్థం అయ్యాయా….?? అయ్యుంటే కామెంట్స్ లో చెప్పండి 🙂 అలాగే మాదేష్ జై ఫ్యామిలీ ను ఎమ్ చేయబోతున్నాడు & దాన్ని జై ఎలా ఎదుర్కుంటాడు……?? నాన్సీ పాస్ట్ ఏంటి తన పాస్ట్ లో ఎమ్ జరిగి ఉంటుందో గెస్ చేయండి 😈 ఇప్పటి నుంచి ఒక్కొక్కటిగా అన్ని బరస్ట్ అవుతూ ఉంటాయి 😈☺️ స్టే ట్యూన్ టు బ్రోకెన్ హార్ట్స్ 💔💔